ఎర్నెస్ట్ హెమింగ్వే-1

ఎర్నెస్ట్ హెమింగ్వే-1

          అమెరికా  ప్రఖ్యాత రచయిత ఎర్నస్ట్ హెమింగ్వే ఎందరికో స్పూర్తి ,ప్రేరణ .నోబెల్ బహు మతి గ్రహీత అయిన ఆయన గురించి తెలుసు కొందాం .

              హెమింగ్వే చికాగో లో 1899 జులై  21న జన్మించాడు .తల్లికి కొడుక్కీ మంచి సంబందాలున్దేవికావు .ఇతనికి ఒక అక్క ఉంది తల్లి బాగా చదువుకొన్న స్త్రీ .కూతుర్ని కొడుకును సమానం చూసేది .అది హెమింగ్వే కు నచ్చలేదు 1917 లో స్కూల్ చదువు పూర్తీ చేశాడు .పద్దెనిమిదేళ్ళ వయసులోనే ‘’kansas city star ‘’పత్రికకు రిపోర్టర్ గా పని చేశాడు .తర్వాతా రెడ్ క్రాస్ లో చేరాడు .1918 లో ఇటలీ దేశం వెళ్లి యుద్ధం లో పాల్గొన్నాడు .అక్కడ ఆయుధ కర్మాగారం లో అనుకోకుండా తీవ్ర మైన ప్రేలుడు జరిగింది .జనం భీభత్సం గా చని పోయారు హెమింగ్వే అక్కడ వారికి సహాయ కార్యక్రమాలు సమర్ధ వంతం గా నిర్వహించాడు .ఇక్కడ జరిగిన ఈ దారుణం పై ‘’A  natural history of the dead ‘’అని గుండెలు పిండేసే వ్యాసం రాసి ప్రచురించాడు .ఆ తర్వాతా సైన్యం లో చేరి అసలైన యుద్ధం లో పాల్గొన్నాడు అమెరికా తరఫున ..అప్పుడు పౌర సరఫరాలను అంద జేస్తుంటే  ట్రెంచ్ లోనుంచి ఒక మోటార్ షెల్ల్ వచ్చి తీవ్ర గాయం చేసింది .తలా ,కాళ్ళు దెబ్బతిన్నాయి .అంతే హీరో అయిపోయాడు .అమెరికా చేర గానే బ్రహ్మ రధం పట్టారు ఈ వార్ హీరో హెమింగ్వే కు .

 

  ఆగ్నెస్ అనే నర్సు తో ప్రేమలో పడ్డాడు  ప్రేమ లో పడ్డా

డు ఆమె ఒప్పుకోలేదు .చిన్న కధలు రాసి ప్రచురించి ప్రాచుర్యం పొందాడు .అతను రాసిన యుద్ధ అనుభవాలను మాగజైన్ల లో చదివి జనం విపరీతం గా ఆరాధించారు .క్రేజ్ పెరిగి పోయింది .1920 లో మొదటి ఆర్టికల్ వచ్చింది మరుసటి ఏడు ఎలిజబెత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .’’three stories and ten poems ‘’రాసి ప్రచురించాడు .తర్వాతా ‘’the torrents of spring ‘’రాశాడు పాలిన్  అనే జర్న లిస్టు  మన వార్ హీరో ను వలచింది .ఇద్దరితోనూ ప్రేమాయణం ఒక కృష్ణుడు –ఇద్దరు రాధల్లా సాగించాడు .చివరికి ఒకర్ని వదిలేసి ఎలిజే బెత్ నే పెళ్ళాడాడు

          ‘’ The sun also rises ,’’men without women ‘’రచనలు చేశాడు కొడుకు రాసే వేవీ తలి దండ్రులు మెచ్చుకోలేదు .ఫ్లారిడా రాష్ట్రం వెళ్లి ‘’.A farewell to arms ‘’నవల రాశాడు .ఎలిజ బెత్ కు గూడబై చెప్పి పాలిన్ ను పెళ్లి చేసుకొన్నాడు .హెమింగ్వే తల్లి తండ్రీ ఆత్మా హత్యలు చేసుకొన్నారు .death in the after noon ‘’రాశాడు .పాలిన్ తో జపాన్ కు హనీ మూన్ కు వెళ్ళాడు .అక్కడ ఇతని రాత గొడవ చూసి ఆమె సహించలేక పోయింది ‘’what I want ed was a wife in bed at night not somewhere ever having higher adventures at so many thousand backs the adventure ‘’ అంటూ ఆవిడ జర్నలిజానికి ఇష్టపడ లేదు అందుకని సహాయ నిరాకరణ చేసింది .ఇప్పటికి ముగ్గురయ్యారు .నాల్గవ భార్య గా మేరీ రంగ ప్రవేశం చేసింది .అప్పుడే across the river and into the trees ‘’రాశాడు .ఆఫ్రికా వెళ్లి సఫారీ చేశాడు సముద్రాల పై సుదూర ప్రాంతాలు పర్య టించాడు గుర్రాలను పెంచాడు .

            1952 లో the old man and the sea ‘’అనే చిన్న నవల రాశాడు ఇది పెద్ద హిట్ అయింది దీనికే1954లో  నోబెల్ బహుమతి పొందాడు .5,300,000 పుస్తకాలు అమ్ముడు పోయాయి ఇది రికార్డు సృష్టించింది అంతకు ముందు1953 లో  పులిట్జర్ బహు మతి వచ్చింది ఈ నవల మాస్టర్ పీస్ గా పేరొందింది .ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు .తాగుడు విపరీతమయింది .ఇరిటేషన్ పెరిగి పోయింది .క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో హేమింగ్వే రాసిన అన్ని పుస్తకాలను స్వాధీన పరచు కొంది .అప్పుడు హెమింగ్వే కు బ్రేక్ డౌన్ వచ్చింది .’’paranoid delusion ‘’ తో విపరీతం గా బాధ పడ్డాడు బి.పి.బాగా పెరిగి పోయింది కంట్రోల్ కావటం లేదు .’’talking psychiatri therapy ‘’ఏమీ ఫలించలేదు .దీన్ని ఒద్దు అని తిరస్కరించాడు .తర్వాతా ‘’షాక్ థెరపీ ‘’చేశారు .దీనికే ‘’electro convulsive therapy (e.c.t.)అని పేరు .దీని వల్ల జ్ఞాపక శక్తి పూర్తీ గా దెబ్బతిన్నది .ఆస్పత్రి లోనే తుపాకి తో కాల్చుకొని1962 లో  ఆత్మా హత్య చేసుకొన్నాడు .

 హెమింగ్వే చని పోయిన తర్వాతా ముద్రింప బడిన ఆయన  ‘’the big bite ‘’అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ నార్మన్ మైలర్ అనే ప్రముఖ రచయిత ‘’Hemingway ‘s inner landscape was a night mare and he spent his nights wrestles with gods –what he failed accomplished was heroic ‘’ అని కీర్తించాడు .

                 హెమింగ్వే గురించి చదువు తుంటే ఒకటి జ్ఞాపకం వస్తోంది .2002 మార్చి 11,12 తేదీలలో విజయ వాడలో భారతీయ సాహిత్య పరిషద్ శ్రీ బాపట్ల రాజ గోపాల రావు గారి ఆధ్వర్యం లో నిర్వహింప బడింది .నేనూ మా బావమరది ఆనంద్ వెళ్లాం .అక్కడే శ్రీ ప్రోలా ప్రగడ సత్య నారాయణ రావు గారితో పరిచయం అయింది. ఆ సభకు ఎందరో సాహితీ ప్రముఖులు విచ్చేశారు .రెండు రోజులూ కాఫీ టిఫిన్లు భోజనాలతో చాలా హుషారుగా సభా నిర్వహణ జరిగింది ..మంచి కద పై మాట్లాడ మని అందర్నీ కోరారు నేను శ్రీరమణ రాసిన ‘’మిధునం కధ ‘’పై రెండే రెండు నిముషాలు మాట్లాడాను .చాలా గొప్ప కద అని మెచ్చుకోన్నాను .సభ అయిన తర్వాతా ప్రోలా ప్రగడ వారు నా దగ్గరకు వచ్చి ‘’మంచి కధను మీరు గుర్తు చేశారు ‘’అని ఆప్యాయం గా కౌగలించుకొని అభి నందించారు .

          ఆ సాయంత్రం జరిగిన సభలో ప్రోలా ప్రగడ వారు గొప్ప ఉపన్యాసం ఇచ్చారు .అందులో విశ్వనాధ సత్య నారాయణ గారు తనను ‘’ఒరే !1954 లో నోబెల్ ప్రైజ్  హెమింగ్వే కు ఎందుకోచ్చిందో తెలుసా ??’’అని అడిగితే తెలీదని తాను చెప్పానని అప్పుడాయన ‘’ఒర్ సత్యం ! నేను హెమింగ్వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సి’’అమెరికా నుంచి తెప్పించుకొని చదివాను. దానికి ఇచ్చార్రా నోబెల్ .అందులో ఏమీ లేదు .మన భగవద్ గీత లో చెప్పిన దాన్నే వాడు చాలా చక్క గా మనసుకు హత్తుకోనేట్లు చెప్పాడ్రా .మన పని మనం చెయ్యాలి ఫలితం భగవంతునికే వదలాలి అన్న సూక్ష్మాన్ని హెమింగ్వే గొప్పగా డెవలప్ చేసి నవల రాసి నోబెల్ ప్రైజ్ పొందాడ్రా ‘’అని ప్రోలా ప్రగడ వారు గుర్తు చేసుకొన్నారు .

            ఇంకో విశేషం ఏమిటంటే ఈ రోజుకు నాలుగు రోజుల క్రితమే అంటే ఆగస్ట్ చివర్లో ప్రోలా ప్రగడ సత్య నారాయణ గారు మరణించి నట్లు’’ ఆన్ లైన్ టి.వి.న్యూస్ ‘’చూశాను .ఈ విధం గా హెమింగ్వేను , ,ప్రోలా ప్రగడ వారిని స్మరించుకొనే అవకాశం కలిగింది .

   2-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

                         హెమింగ్వే ను గురించి మరిన్ని విశేషాలు మరో సారి

               సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -26-6-13- ఉయ్యూరు 

 
 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to ఎర్నెస్ట్ హెమింగ్వే-1

  1. s.v.subba rao says:

    thank you mastaru. today i got an opportunity to read this article which i never heard.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.