నా దారి తీరు -34 మళ్ళీ బదిలీ వేట ప్రారంభం

 నా దారి తీరు -34

                           మళ్ళీ బదిలీ  వేట ప్రారంభం

            విస్సన్న పెట్ లో మంచి నీరు కొరత ఎక్కువ .నూతి నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ .అందుకని ఊరి సెంటర్ లో చెరువు ఒడ్డున ఒకే ఒక బావి అందరికి ఆధారం .అక్కడి నుండే నీళ్ళు తెచ్చుకొంటారు .లేక పోతే పోయించు కొంటారు బోర్లు దాదాపు మూడు వందల అడుగులు దింపితే కాని మంచి నీరు పడదు .వాతావరణం కూడా ఆరోగ్య కరం గా ఉండదు ఊరిలో ఒకే ఒక సినిమా హాల్ ఉంది నూజి వీడు నుండి పుట్రేలకు, తి.రువూరుకు వెళ్ళే బస్సులు విస్సన్న పేట మీదు గా వెళ్తాయి .

చనుబండ,రమణక్క పేట లు దగ్గరే .చను బండలో మంచి దేవాలయాలున్నాయని చెప్పుకొనే వారు .మైల వరం కూడా ఇరవికిలో మీటర్ల దూరం .అస్వారావు పేట మీదుగా హైదరాబాద్ కు బస్సులు వెళ్తాయి పోలవరం ప్రాజెక్టు రామ పాదసాగార డాం దగ్గరే .రామ పాద సాగర డాం కట్టాలని నా చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు ఆందోళన చేయటం రెండు మూడు సార్లు శంకు స్తాపన చేయటం గుర్తు .సెంటర్ లోనే ఒక మాదిరి హోటల్ ఉంది అక్కడ ఇడ్లి గారే బొండాలు మంచి కాఫీ దొరికేది

              ఒక సారి నా శ్రీమతి నూజి వీడు వాళ్ళ అక్కయ్య ఇంటికి వచ్చి ,వాళ్ళిద్దరూ కలిసి విస్సన్న పేట వచ్చారు రెండు రోజులు ప్రభావతి వండి పెట్టింది అప్పుడు మేము ‘’ధర్మాత్మా ‘’అనే హిందీ సినిమా రెండో ఆట చూశాం .మా పక్కనున్న తూటు పల్లి వారు మా మామ గారి ఇంటి పేరు వారే .వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించింది .వారానికో సారి సంకా పుల్లయ్య గారు విస్సన్న పేట వచ్చేవాడు .కలిసే వాడు .ఇక్కడ ఇండియాన్బాంక్ ఉంది అందులోనే ఖాతాలున్దేవి .లోన్లు ఇచ్చేవారు .

                         అవ్వారు శ్రీనివాస రావు కు చదువు చెప్పటం .

         ‘’ అవ్వారు శ్రీనివాస రావు –నవ్వారు నేత ‘’పదో తరగతి లెక్కలు సైన్సు లలో తప్పాడు నన్ను హెడ్ మాస్టారిని అడిగి నా సై న్సు  క్లాసుల్లో కూర్చుని వినే వాడు .ఆదివారం నాడు లేక పోతే రాత్రి పూట నా గదికి వచ్చి చెప్పించుకొనే వాడు అతనికి ఆ సబ్జెక్టుల మీద అవగాహన కల్గించాను ఏంతో  సంతోషించాడు .పాస్ అవుతాననే ధైర్యం కలిగింది అని చెప్పే వాడు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చే వాడు .

          నా బదిలీ ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను

              తుమ్మల నారాయణ రావు అనే సైన్సు మేష్టారు నూజి వీడు నుంచి వచ్చాడు .ఆయన భార్య నూజివీడులో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. రోజు నూజి వీడు నుంచి వచ్చే వాడు మహా భయస్తుడు కాని మంచి నిజాయితీ పరుడు .ఆయన అన్న చాల మయ్య గారు రెవిన్యు డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ తాసిల్దార్ చేసి రిటైర్ అయి ఉయ్యూరు లో ఇల్లు కట్టుకొన్నాడు నేను రిటైర్ అయిన తర్వాతా బాగా పరిచయం .వెటరన్ పరుగు పందాలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు చలమయ్య గారు మాకూ ఉయ్యూరు కాలేజి గ్రౌండ్ లో నడక పోటీ పెట్టి బహు మతులిప్పించాడు నాకు మొదటి బహుమతి వచ్చింది అప్పటి దాకా నడవటం నాకు తెలియదు .కోటేశ్వర శర్మ గారే ఫాస్ట్ వస్తారని అందరూ అనుకొన్నారు ఆయన సెకండ్ వచ్చారు .అలారం గడియారం నాకు వచ్చిన బహుమతి .అప్పుడే ఇది జరిగి పదేళ్ళు అవుతోంది .

              ఒక లెక్కల మేష్టారుఆంజనేయ చౌదరి గారు  రోజూ నూజి వీడు నుంచి వచ్చే వారు కమ్మ వారు .తెల్ల జుట్టు .చాలా మంచి మనిషి ,నిదానస్తులు .నేను అంటే విపరీత మైన అభిమానం తో ఉండేవారు ఆయన భార్య నూజి వీడులో డ్రిల్ మేస్తారని .గుర్తు సాయి బాబా భక్తులు ఇంటి వద్ద సాయి భజనలు చేసే వారు .ఒక సారి వారింటికి వెళ్లాను అలానే గాడేపల్లి దక్షిణా మూర్తి శాస్త్రి అంటే మా హెడ్ మాస్తారింటికి కూడా ఒక సారి వెళ్లాను .భార్యా భర్తలైన డ్రిల్ మేస్టార్లు ఉండేవారు భర్త మంచి ప్లేయర్ .

              ముమ్మరం చేసిన ప్రయత్నాలు –ఫలించిన ప్రయత్నం

               డబ్బులిస్తే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని బాహాటం గానే చెప్పుకొంటున్నారు దీనికి కూడా కొన్ని కారణాలు కావాలి కుటుంబం లో ఎవరో ఒకరు మిలిటరీ లో పని చేస్తున్నా, తలిదండ్రులు తీవ్ర అస్వస్థత తో ఉన్నా ఎక్కువ కన్సిడరేషన్ ఉంది అని చెప్పారు మా తమ్ముడు కృష్ణ మోహన్ పూనా లో డిఫెన్సుఆర్డినెన్స్  ఫాక్టరీ లో పని చేస్తున్నాడు .వాడితో జిల్లా పరిషత్ కు లెటర్ పెట్టించాను ‘’నేను డిఫెన్సు లో ఉన్నందున ఇంటి వద్ద మా అమ్మ గారి ఆరోగ్యం మా కుటుంబ విషయాలు చూడ టానికి మా అన్నయ్య దుర్గా ప్రసాద్ ను ఉయ్యూరు దగ్గరి ఊరికి బదిలీ చేయండి ‘’అని రాయించాను నాకొక కాపీ పంపాడు .దీన్ని తురుఫు ముక్క గా వాడాలి

              ఒక ఆదివారం నేను అవని గడ్డ వెళ్లి మండలి కృష్ణా రావు గారికి విషయం చెబుదామని వెళ్ళా .తీరా వెళ్తే ఆయన హైదరా బాద్ వెళ్ళారని తెలిసింది .నెత్తిన చెంగేసుకొని అవని గడ్డ గుడి వాడ బస్ ఎక్కి పామర్రు లో దిగా .అక్కడ ఉయ్యూరుకు బందరు బెజవాడ  బస్ ఎక్కాను రాత్రి ఏడు అవుతుంది .ఆ బస్సులోనే నా మిత్రుడు శ్రేయోభిలాషి నన్ను మళ్ళీ ఉయ్యూరు దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయించాలని తీవ్ర ప్రయత్నం లో ఉన్న లెక్కల మేష్టారు పి.ఆంజనేయ శాస్త్రి గారు ఎక్కారు .ఒకరి కొకరం ఆశ్చర్యం గా చూసుకొన్నాం .నా ప్రయత్నాలు అవనిగడ్డ నుంచి వచ్చిన వైనం ఆయనతో చెప్పాను ఆయన ‘’ప్రసా ద్ గారూ ! నేనూ అదే ప్రయత్నం లో ఉన్నాను .ఇప్పుడే బందరు నుంచి వస్తున్నాను జిల్లా పరిషత్ లో ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారు అనే ఆయన ఉన్నాడు ఆయన మన మహంకాళి సుబ్బరామయ్య మేస్తారికి మేన ల్లుడు . ..ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నీ ఆయన చేతి మీదుగానే జరుగుతున్నాయి సుబ్బరామయ్య గారిని పట్టు కొంటె పని అవుతుంది ‘’అన్నాడు సరేనన్నా …..మర్నాడు ఇద్దరం పొద్దున్నే సుబ్బరామయ్య గారి ని కలవాలనిఅనుకోని ఆయన ఇంటికి వెళ్లాం .ఇంట పొద్దున్నే ఎవరూ వస్తారని ఆయన ఊహించలేదు సుబ్బరామయ్య గారు నాకు ఎనిమిదో తరగతిలో తెలుగు చెప్పిన మేష్టారు .తర్వాతా ఇద్దరం ఉయ్యూరు స్కూల్ లో కలిసి పని చేశాం కూడా .ఆయన వంగల శివరామయ్య గారింట్లో  గారింట్లో  అద్దేకున్నారు వాకిట్లో హాయిగా చుట్ట కాలుస్తున్నారు .ఆయన చుట్ట కాలుస్తారని నాకు అప్పటిదాకా తెలీదు.గబుక్కున ఆర్పేశారు మమ్మల్ని చూసి ఆశ్చర్యోఅపోయారు .లోపలి తీసుకొని వెళ్లి విషయం చెప్పి నా బదిలీకి సహాయం చేయమన్నాం .ఆయన ముందుగా తనకేమీ తెలీదని దబాయించారు. కాని మేము శాస్త్రి గారనే ప్రాపర్టీ ఆఫీసరు పేరు చెప్పగానే మెత్త పడ్డారు .కాదనలేక పోయారు పైగా నేను ఆయన శిష్యుడిని .అప్పుడు సరే ప్రయత్నం చేద్దాం అంటూ వెంపటి లక్ష్మీ నరసింహ శర్మ అనే కనక వల్లి వాస్తవ్యులు మాతో పాటు పని చేసిన  తెలుగు పండిట్ గా కోన కంచి లో ఉన్నాడని  ఆయన కూడా  ప్రయత్నిస్తున్నాడని అందరం కలిసి మర్నాడు ఉదయం బందరు వెళ్దామని చెప్పారు.హమ్మయ్య అనుకొన్నాం

                 మర్నాడే ఆంజనేయ శాస్త్రి నేను వెంపటి శర్మ గారు  సుబ్బా రామయ్య మేస్తార్ని వెంబడి పెట్టుకొని బందరు ఈడేపల్లి లో ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారింటికి వెళ్లాం .ఆయన మమ్మల్ని ఆదరం గా చూశారు .దీనికి ఎంత ఖర్చు అయినా ఇస్తామని చెప్పాం మనిషికి అయిదు వందలు అవుతుందని అడ్వాన్సు గా రెండొందలు ఇవ్వమని బదిలీ అయిన తర్వాతా మిగతాది ఇవ్వ వచ్చునని ,ట్రావెలింగ్ అలవెన్సు కూడా వచ్చేట్లు చేస్తానని మాట ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్ప కుండా రహస్యం గా ఉంచాలని కోరారు ..అని ఊరట చెందాం .ఇది ఆంజనేయ శాస్త్రి గారి సహృదయం మా గురువు గారి పూనిక .నేను వెంపటి శర్మ గారు చెరో రెండొందలు శాస్త్రి గారి చేతులో పెట్టాం ‘’ఇక నిర్భయం గా ఉండండి పని పూర్తీ చేసే బాధ్యత నాది ‘’అన్నారు ప్రాపర్టీ శాస్త్రి గారు.నాకు మా తమ్ముడు జిల్లా పరిషత్ కు రాసిన డిఫెన్సు కాగితం బ్రహ్మాస్త్రం గా ఉపయోగ పడుతుందని శాస్త్రి గారు చెప్పారు .శాస్త్రి గారికి కొంత నత్తి ఉంది .జిల్లా పరిషత్ హైస్కూల్స్ లో అన్యా క్రాంత మైన భూముల్ని కాపాడి శిస్తులూ వసూలు  చేసే బాధ్యతే ప్రాపర్తి ఆఫీసర్ పని   ఈయనే మా అందరికి తన ఇంట్లో టిఫిన్లు కాఫీలు చేయించి పెట్టించారు .ఇంతకీ ఈ శాస్త్రి గారు మా క్లాస్ మట్ కనకవల్లి వాడు మారేపల్లి చలపతి కి కూడా బంధువు ఈయన కూతుర్నే చలపతికోడుక్కిచ్చారట ఆ చుట్టరికమూ తెలిసింది అందరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేశాం

                  నాకు తొమ్మిదో బదిలీ జరిగి నాలుగో సారి ఉయ్యూరు కు మళ్ళీ వచ్చాను .శాస్త్రి గారు అనుకొన్న విధం గానే పని పూర్తీ చేశారు .ఉయ్యూరు మండలం లో పని చేయ రాదుకనుక  వల్లూరు మండలం లోని పెనమకూరు హైస్కూల్ కు  నన్ను విస్సన్న పేట నుంచి , వెంపటి శర్మ గారిని కోన కంచి నుండి బదిలీ చేశారు .ఆర్డర్లు వచ్చేదాకా అంతా టాప్ సెక్రెట్ మైంటైన్ చేశాం .విస్సన్న పేట స్కూల్ వాళ్ళూ హెడ్ మాస్ద్తారు దిమ్మెర పోయారు .పెనమ కూరు స్కూల్ వాళ్ళూ అక్కడి కమిటీ ప్రెసిడెంట్ షాక్ తిన్నారు నేను వల్లూరు నేటివ్ అయిన పిచ్చయ్య గారి స్తానం లో వచ్చాను .ఆయన్ను దూరం గా వేశారు .శర్మ గారు రామేశ్వర శర్మ అనే ఆయన్ను బదిలీ చేసి వేసి నట్లు జ్ఞాపకం .మొత్తం మీద ‘’ఆపరేషన్ సక్సెస్’’ -‘’.పేషేంట్ట్ సేవేడ్’’ సుబ్బరామయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం ఆయనా తన వల్ల  పని అయి నందుకు సంతోషించారు .పామర్రు నుండి ఉయ్యూరు వచ్చిన నాలుగు నేలకే విస్సన్న పేట బదిలీ అయితే, విస్సన్న పేట నుండి మళ్ళీ నాలుగు నెలలకే పెనమకూరు రాగలిగాను . 

            8-10-76 సాయంత్రం విస్సన్న పేట నుండి విడుదల అయ్యాను .మంచి పార్టీ ఇచ్చారు స్టాఫ్ అందులో నేను బోధించిన తీరు దవ తరగతి ఇంగ్లీష్ ను మొద్దు పిల్లలున్న సెక్షన్ కు చెప్పిన  విధానాన్ని డిసిప్లిన్ మైంటైన్ చేసిన తీరును హెడ్ మాస్టారు చాలా మెచ్చుకొన్నారు ఇంత త్వరలో ఇక్కడి నుండి వెలి పోతారని అనుకోలేదన్నారు .ఇది చాలు .పని చేసిన చోట శక్తి వంచన లేకుండా శ్రమింటమే మన పని .అదే అన్ని విజయాలకు సోపానం .రెండు రోజులు మాత్రమె ట్రాన్సిట్ వాడుకొని 11-1076  సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో చేరాను  .హెడ్మాస్టారు వేముల పల్లి కృష్ణ మూర్తి గారు .విస్సన్న పేట లో నా బదులు సాంబశివ రావు అనే అతన్ని అతని భార్యను వేశారు .

                           విందు భోజనం 

                పెనమకూరు లో చేరిన నాలుగు రోజులకే ఒక ఆదివారం ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారిని ఉయ్యూరు లో మా ఇంటికి విందుకు ఆహ్వానించాము వెంపటి శర్మ గారు ,ఆంజనేయ శాస్త్రి గారు ,సుబ్బరామయ్య మేష్టారు లను కూడా ఆహ్వానించాను .మా అమ్మ ,మా ఆవిడా మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు .శాస్త్రి గారు మంచి భోజన ప్రియుడు. బాగా లాగించారు .కిళ్ళీ లు తెప్పించాను .చాల తృప్తి చెందారు. నేను మూడు వందల రూపాయలు ,వెంపటి శర్మ గారు మూడొందల రూపాయలు తాంబూలాలలో పెట్టి ప్రాపర్టీ శర్మ గారి చేతిలో పెట్టి నమస్కరించాం .ఇక నుండి మనం స్నేహితులం అన్నారు శాస్త్రి గారు .కొంతత కాలం ఆ స్నేహాన్ని కోన సాగించాం . మాకు ఇద్దరికీ ట్రావెలింగ్ అలవెన్సులు కూడా సాంక్షన్ చేయించారు శాస్త్రి గారు. మేము పెట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చాయన్న మాట .ఇంత మాత్రం సహాయం ఎవరు చేస్తారు ?

             సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -25-6-13- ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.