జాన్ స్టెయిన్ బెక్ -1

జాన్ స్టెయిన్ బెక్ -1

      అసలు పేరు జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ .27-2-1902 లో అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం లో సాలినాస్అనే చోట జన్మించాడు .అదొక గొప్ప షిప్పింగ్ కేంద్రం .తండ్రి సంతానం లో మూడవ వాడు బెక్ .చిన్నప్పటి నుండి చాలా తెలివి తేటలున్న కుర్రాడిగా కనిపించే వాడు .అతని ద్రుష్టి వ్యాపారస్తుని లక్షణాల లాగా ఉంటాయని అనే వారు .మాటల శబ్దాలన్నా ,లయ అన్నా బెక్ కు చాలా ఇష్టం . 1906 లో కాలిఫోర్నియా లో భూకంపం వచ్చింది .అందరూ భయ పడ్డారు .1919 లో యూనివెర్సిటి ఆర్ట్స్ లో చేరాడు .డిగ్రీ పూర్తీ కాలేదు .లేబరర్ గా పని చేశాడు .గంటకు ముప్ఫై రెండున్నర సెంట్ల జీతం .ఫామిలి కాటేజ్ అని పిలువ బడే ‘’పసిఫిక్ గ్రోవ్ ‘’లో నివాసం ఉన్నాడు .అప్పుడే ‘’ఏ పాట్ ఆఫ్ గోల్డ్ ‘’రాశాడు .న్యూయార్క్ వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాడు .తర్వాత ‘’అమెరికన్ ‘’అనే పేపర్ కి వారానికి ఇరవై అయిదు డాలర్ల కు పని చేశాడు .1927 లో అంటే పాతికేళ్ళకు ‘’స్మోకర్స్ కంపానియన్ ‘’ప్రచురించాడు .1929 లో సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లి ఎర్నెస్ట్ హెమింగ్ వే ,హెన్రి డేవిడ్ తోరో ,వాల్ట్ విట్మన్ వంటి లబ్ధ ప్రతిసస్టులైన అమెరికన్ రచయితల, కవులపుస్తకాలన్నీ చదివి ప్రభావితుడయ్యాడు . ‘’అయిడియలిజం ‘’అంటే ఊహా లోక ద్రుష్టి మీద మనసు పడ్డాడు .

      కరోల్ అనే ఆమెతో ప్రేమ లో పడి పెళ్ళాడాడు .బెక్ ఏది రాసి పేపర్లకు పంపినా తిరుగు టపాలో తిరిగి వచ్చేవి .ఏ పేపరూ ప్రచురించేది కాదు. చాలా బాధ పడే వాడు ..రికెట్స్ అనే అతని తో మంచి స్నేహం ఏర్పడింది .అతను ‘’మెరైన్ బయాలజిస్ట్ ‘’ సముద్ర జీవుల పై ఎంతో పరిశోధన చేశాడు కొత్త జీవులను కనుగొన్నాడు .1932 లో ఆర్ధిక మాంద్యం ఏర్పడి జీవితాలు దెబ్బతిన్నాయి .అప్పుడే ‘’pastures of Heaven ‘’అనే కధ రాశాడు .తర్వాత ‘’to a god unknown ‘’నవల రాశాడు ..1932 లో గుండె పోటు వచ్చి ఆస్పత్రిలో చేరాడు .’’the red pony ‘’,’’toitella flat ‘’కధలు రాసి ప్రచురించాడు .అతను రాసిన’’ దిమర్డరర్ ‘’ కధకు ప్రఖ్యాత కధకుడైన ‘’వో.హెన్రి ‘’బహుమతి లభించింది .1934 లో తల్లి మరణించింది .

     నేచురలిజం మీద మోజు హెచ్చింది .మరుసటేడు తండ్రీ పోయాడు .1936 లో రాసిన ‘’మైస్ అండ్ మెన్ ‘’పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడయింది .దాన్ని నాటకం గా మార్చి ప్రదర్శించారు .1937 లో ఈ నాటకానికి ‘’drama city award ‘’లభించింది .భార్య తో తగాదా పడ్డాడు .’’ the grapes of wrath’’ అనే సీరియస్ నవల రాశాడు బెక్ రాసిన మిస్ ,రెడ్ పోనీ లను సినిమాలుగా తీశారు .1940 లో మెక్సికో వెళ్ళాడు .అక్కడ ఎన్నో కధలను విని తెలుసుకొని ‘’పెరల్ ‘’నవల రాశాడు .ది.గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘’కు  పులిట్జర్ బహుమతి వచ్చింది .తర్వాత ‘’సి ఆఫ్  కార్టే జ్‘’నవల పూర్తీ చేశాడు .1940 సి నిమాలకు రాశాడు.అందులో ‘’the forgotten village .’’ఒకటి .భయానక సినిమాల సృష్టికర్త ‘’ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్’’ తో ‘’లైఫ్ బోట్’’ సినిమా చేశాడు .భార్య కరోల్ ఈయన్ని వదిలేస్తే గాప్ లేకుండా ‘’గ్వెన్‘’ను జీవితం లోకి ఆహ్వానించి పెళ్లి చేసుకొన్నాడు .ఇదే సమయం లో అతని ముఖ్య స్నేహితుడు బయో శాస్త్ర వేత్త‘’రికెట్స్ ‘’మరణించాడు .అప్పటికే బెక్ రికెట్స్ పై ఎక్కువ గా ఆధార పది ఉండటం రెండో పెళ్ళాం గ్వెన్ కు నచ్చేదికాదు .పెళ్లి పెటాకులే అయింది’’ .the moon is down ‘’కద రచించాడు అందులో నాజీ దండయాత్రను గురించి వివరించాడు .1943లో లండన్ వెళ్ళాడు .తర్వాతా ఉత్తర ఆఫ్రికా వెళ్లి సఫారి చేశాడు . 1945 లో ‘’the cannery row ‘’నవల రాసి ప్రచురించాడు .మరో నాలుగేళ్ళకు’’ the wayward bus ‘’కద రాశాడు .ఎలాన్ స్కాట్ తో మూడో వివాహం . .1951నుండి బెక్ ప్రభావం తగ్గింది .జీవిత కాలం లో మొత్తం పాతిక పుస్తకాలు రాశాడు .అందులో పదహారు నవలలు , తొమ్మిది నాన్ ఫిక్షన్ రచనలు ,ఎన్నో కధలు రాశాడు . అతను ఎన్నో సముద్ర జీవులను కను గోన్నాడు  .కొన్ని అతని పేర పిలువ బడ్డాయి . 

 

 

 

స్టెయిన్ బెక్ భవంతి                        సమాధి 

 

      1962 లో స్టెయిన్ బెక్ కు నోబెల్ సాహితీ పురస్కారం లభించింది .అప్పటికి ఆరుగురు అమెరికన్ రచయితలకు ఈ అవార్డ్ వచ్చింది బెక్ ఏడవ వాడు .రాజకీయాలపై ఆసక్తి పెరిగి అందులో చేరాడు .జాన్ ఎఫ్ కేన్నేడి ,లిండన్ జాన్సన్ లతో గాఢ పరిచయమేర్పడింది .66 ఏళ్ళ వయసులో1968 డిసెంబర్ ఇరవై న మహా రచయిత స్టెయిన్ బెక్ మరణించాడు .

       బెక్ రచనా ప్రాభవం గురించి ఈ సారి

       సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-7-13- ఉయ్యూరు

    

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.