జెరోం డేవిడ్ సాలినర్-2 రచనల విశేషాలు

  జెరోం డేవిడ్ సాలినర్-2

                   రచనల విశేషాలు

          ‘’ కాచర్ ఇన్ ది రై ‘’నవల లో రెండవ ప్రపంచ యుద్ధపు ‘’అండర్  కరెంట్స్’’ను నిక్షిప్తం చేశాడు .అందుకే దీన్ని‘’కల్ట్ నావెల్ ‘’అన్నారు .మనుష్యులను ‘’ఫోనీలు ‘’గా వర్గీకరించాడు ..ఇంతకీ ఫోనీ అంటే-one who is only out to impress others ,some one  whose opinions are second hand ,some one who is unable to just-be himself ‘’ సాలినర్ మరకలున్న సరిహద్దు ప్రపంచాన్ని సృష్టించాడు .అందులో లోపలి విషయాలను చాలా క్షున్నం గా అధ్యయనం చేసి రాశాడు . అందులో వాస్తవాలను భ్రాంతులు గా చూపిస్తాడు .అదే అతని అసమాన ప్రతిభ .

         మార్క్ ట్వేయిన్  రాసిన ‘’హకల్ బెరిఫిన్’’ ఎలాగో, సాలినర్ రాసిన ‘’రై ‘’కూడా అలాంటిదే .హక్ ను ఇందులోని హాల్డేన్ కాల్ఫీల్ద్ పాత్రతో పోలుస్తారు విమర్శకులు .ఇద్దరు స్వంత అన్నా తమ్ముళ్ళు లాగా తమలోని అంతర్గత భావాలను ,అంతర్ద్రుస్తిని తెలియజేస్తూ అమెరికా జీవితాన్ని విమర్శిస్తారు .మార్క్ ట్వేయిన్ ,సాలినర్ ఇద్దరు చాలా స్పష్టం గా పాత్ర లను చిత్రించారు .ఎక్కడా అసందిగ్ధం కనీ పించదు .హక్ లాగానే ,హాల్డేన్ కూడా ఒక శరణార్దియే .సత్య పరీక్ష ఏ ఇద్దరికీ కోలబద్ద.అందుకే ఈ రెండు నవలలు ‘’deal obliquely and poetically with a major theme in American life past and present ,the right of the non conformamist to assert his own conformity ,even to the point of being handled with chain ‘’అని అభిప్రాయ పడ్డారు తులనాత్మక విమర్శకులు .

        సాలినర్  రచనలో వ్యక్తీ నైజం ప్రతి బిమ్బిస్తుంది .హాల్డేన్ భాష ‘’టీనేజ్ ‘’వాళ్ళ భాష  గా ఉంటుంది .సంభాషణల్లో వ్యాకరణాత్మక తమాషాలు చేసి మాట్లాడిస్తాడు . ‘’it is a secret between he and I ‘’అని పిస్తాడు .ఇందులో టీనేజర్ల గ్రామర్ నిబంధనల ను అతిక్రమించటం స్పష్టం గా ఉంటుంది .మన వాళ్ళు అన్నట్లు’’ఛందస్సుల పరిష్వంగాలను విదిల్చి నట్లు ‘’ఉంటుంది .’’she would give Allie or I a push ‘’I would woke him up ‘’లాంటి యువచిత్రాలను భాషలో చేయించాడు సాలినర్ .దీనిని అందరు అంగీకరించారు .దీనికి’’authentic rendering of a type of informal ,colloquial teenage American spoken speech ‘’అని కితాబు కూడా ఇచ్చి ప్రోత్సహించారు భాషా ప్రేమికులు .ఈ’’ టీనేజి భాష’’కే .వ్యామోహం హెచ్చింది .అంతటి భాష పూర్వక మార్పు తెచ్చిన వాళ్ళు సాలినర్ అంతకు ముందు మార్క్ ట్వేయిన్ .

             ఈ భాష వింత పోకడలను చూసి సంప్రదాయ వాదులు బుర్రలు పగలకోట్టుకొన్నారు జుట్టు పీక్కున్నారు ఈ పుస్తకాలను నిషేధించాలని ప్రభుత్వానికి మొర పెట్టుకొన్నారు ..స్కూళ్ళలో వీటికి ప్రవేశం ఉండరాదని ఉద్యమాలు చేశారు .దీనికంతటికి కారణం గ్రామ రూల్స్ ను అతిక్రమించటమే నని వారి వాదన ..ప్రిపరేటరి స్కూల్ విద్యార్ధులు ఇలా మాట్లాడరనీ అభియోగం తెచ్చారు .అయితే అమెరికన్ వాడుక భాష మీద రిసెర్చ్ చేసిన DONALD p.Costello ‘’అమెరికా లోని ఈశాన్య రాష్ట్ర యువజనులు సాలినర్ రాసినట్లు గానే  మాట్లాడుతారని తేల్చి చెప్పాడు .,సమర్ధించాడు .అందులో హాల్డేన్ అనే వాడు నిజానికి   వయస్సుఎక్కువ ఉన్న వాడుగా కనిపిస్తాడనీ చెప్పాడు .అలాగే P.G.Corbett అనే యూనివెర్సిటి ప్రొఫెసర్ ‘’we can not have a sinless literature about a sinful people ‘’అని గొప్ప గా మద్దతు ప్రకటించాడు .అంతేకాక ‘’Holden is himself phony ‘’అని జడ్జిమెంట్ ప్రకటించాడు .దీనితో బాటు ‘’Rye is a subtle ,sophisticated novel that requires an experience mature reader ‘’అని తీర్పునిచ్చాడు దీనితో భాష సంకరమై పోతోందని నెత్తీ నోరు కొట్టుకొన్న వాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయి .వీటితో మళ్ళీ సాలినర్ పూర్వపు వైభవాన్ని పొందాడు

         2-9-2002 సోమవారం నాటి నా అమెరిక డైరీ నుండి –

         మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –1-7-13 –ఉయ్యూరు

 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.