జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2 రచనా విశేషాలు

జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2

              రచనా విశేషాలు

 స్టెయిన్ బెక్ పాత్రలన్నీ వ్యక్తీ గతమైనవి .అంతరంగాలలో అవి పూర్తీ స్వేచ్చను పొంది ,విభిన్న స్వభావాలతో కనీ పిస్తాయి హాస్యం తో అందరితో మంచి సంబంధాలను కలిగి ఉంటాయి .అమెరికా లోని నేచరిస్టులు రెండు రకాలు .మొదటి రకం హృదయ వాదం అనేవారు ,రెండోరకం బుద్ధివాదులు .ఇందులో హృదయ వాదులలో బెక్ స్తానం ఉంది .అతని ‘’కానరీ రో ‘’లో విషయాలకున్న డిమాండ్ కు ,హృయానికున్న డిమాండ్ కు ఉన్న స్పర్ధ వ్యతిరేకత చిత్రీకరించాడు .పెరల్ నవల సీరియస్ ‘’పారబుల్ ‘’అన్నారు ఇందులో కినో అనే చేపల వాడికి నాగరక జీవుల విషయం తెలీదు వారు తన లాంటి వారి ఉనికికే ప్రమాదం అనీ గుర్తించలేని వాడు అతని అభిప్రాయం లో జ్ఞానమే శక్తి వంతమైనది ,అంతేకాక ఈ భౌతిక ప్రపంచం పై నియంత్రణ శక్తి కలిగి ఉండటం చాలా మంచిది .

        కానరీ రో లో అమెరికా బాలురను ఉదాహరణ గా తీసుకొని రాశాడు బెక్ .అందులో విషయ వాంచల కున్న డిమాండ్ కు ,ఆత్మ శక్తికి మధ్య ఉన్న సంఘర్షణ కనీ పిస్తుంది . సైన్సు ను పరిష్కారం సూచిక మైనదాని గా  భావించి రాశాడు . .అతడు స్తానికుల చేత బహిష్కరింప బడ్డ వాడు అయినా అతని విజ్ఞాన తృష్ణ కు అంతులేదు దానితో అందరిని ఆకట్టుకొంటాడు ..వ్యక్తీ గతం గా మనిషి  దూర ద్రుస్టాన్ని ,మానవ హృదయం లో ఉన్న దోషాలను అతను కదిలించేట్లు రాశాడు .

     బెక్ రాసిన ఏడు రచనలలో అరవై మంది మెక్సికన్ల పాత్రలను సృష్టించాడు .అతని రెద్ పోనీ  నవల బెక్ యొక్క‘’సెమి ఆటోబయాగ్రఫీ .’’ఇందులో’’సాలినాస్ రాంచ్’వాలీ ’’’ప్రజల జీవన విధానాలను వివరించాడు .ఈ నవలలో కాల ,స్థల ,విషయ ఐక్యతను సాధించాడు .ఇందులో జీవన మరణ చక్ర భ్రమణం చిత్రీక రించాడు ..మానవుడు మరణించినా కొత్త జీవితానికి అది నాంది అవుతుందని తెలిపాడు అన్ని జీవరాసులలో ఒకే విశ్వ చైతన్యం ఉందని తెలియ జేశాడు .మనకు తెలియనిది ఎంతో ఉంది అని కూడా బెక్ అభిప్రాయ పడ్డాడు .

    పెరల్ నవలలో కినో శక్తి వంతమైన సంఘం చేత తిరస్కరింప బడి  అణగ దొక్కబడ్డ వాడు అతన్ని నిమ్న జాతి జంతువుతో సింబాలిక్ గా వర్ణించాడు .కిమో లో  ప్రిమిటివ్ లక్షణాలున్నాయని సాంఘిక శాస్త్ర వేత్తలు అన్నారు .అయితే‘’బెక్ దృష్టిలో కినో అంటే వేరెవరో కాదు నువ్వు నేను ,మనం అందరం ‘’.అందులో ఆత్మ శక్తిని నిద్రలేపి ,ఉద్దీపనం చేయాలనే భావం ఉంది .అతను వర్ణించిన చీకటి ‘’ఆత్మ ‘’కు సింబల్ …మానవుని అసహాయత ,నిస్సహాయత ఈ నవలలో శిఖరాయమానం గా వర్ణించాడు బెక్ .

      తెలుగు లో రావి శాస్త్రి నవలలు ,కధలు లాగానే జాన్ స్టెయిన్ బెక్ నవలలన్నీ  ‘’ప్రోలిటేరియన్’’మనుషుల కధలే  .గ్రేప్స్ ఆఫ్ రాత్ లో’’ మా ‘’పాత్ర ముందు చూపున్న మహిళ గా పడమటి ప్రాంతానికి మెరుగైన జీవనానికి తన కుటుంబాన్ని తీసుకొని వెడుతుంది .ఇక్కడ మా అంటే ఒక రకం గా ‘’భూ దేవి ‘’.ఆమె తన కుటుంబాన్నే కాక బయటి వారినీ  పెంచి పోషిస్తుంది .ఆమె గౌరవాన్ని పొందుతుంది దానితో బాటు తనను నమ్ముకొని తన నాయకత్వాన్ని అంగీకరించిన వారికి  తన శక్తిసామర్ధ్యాలను రుజువు చేసి చూపిస్తుంది .

        ‘’బన్యన్ ‘’ రాసిన దానిలో లాగా ఆవాసం లేక ,దుర్భర జీవితాలను గడిపే వారి పాలిటి ఆత్మ ప్రబోధ శక్తి గా బెక్ రచనలుంటాయి ..’’the problem of restoring to world’s original and eternal beauty is solved by the redemption of the soul ‘’జాన్ బెక్ రచనలు ఉంటాయి బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాతమాత్రమె మీడియా బాగా గుర్తించి ‘’common man’s every day life ‘’గురించి రాసిన మహా రచయిత అని మెచ్చింది .కొద్ది మంది పత్రికా రచయితలు పెదవి విరిచారు .1935 కు ముందు బెక్ రాసిన రచన లను దృష్టిలో పెట్టుకొనే నోబెల్ ఇచ్చారని ఈసడించారు కూడా .

         నోబెల్ బహుమతి పురస్కార డిన్నర్ లో బెక్ ‘’literature comes out of life .it is as old as speech .a writer who does not passionately believe in the perfectability of man ,hqas no dedication nor any membership in literature ‘’అని చెబుతూనోబెల్ బహుమతి గురించి ప్రస్తావిస్తూ ‘’nobel kept my belief in the human mind and the human spirit .Man’s power for good and evil is so awesome that he has usurped many of the powers we once ascribed to God .now it is in man’s hands to determine the life and death of all living things .The test of his perfeetability is at his hand ‘’అని తనకు మానవుల మీద మానవత్వం మీద ఉన్న అపార గౌరవాన్ని నమ్మకాన్ని ఆవిష్కరించాడు .తనకు నోబెల్ రావటం ఆశ్చర్యకరం అన్నాడుకూడా .న్యు యార్క్ టైం మాగజైన్ మాత్రం బెక్ ను గొప్పగా సమర్ధించింది .’’Beck is a dated writer .His sentimental books about the poor had given him a special place in the hearts of adults growing up in the depression ‘’అని కీర్తించింది ..

          బెక్ చని పోయిన పాతిక ఏళ్ళ తరువాత విమర్శకులు ,పర్యా వరణవేత్తలు బెక్ ఎంతటి ముందు చూపున్న రచయితో ,యెంత పర్యావరణ ప్రేమికుడో ,మానవ తప్పిదాలను ఆనాడే తెలియ జెప్పి జీవ వైవిధ్యానికి భంగం కలిగించ వద్దని మోర పెట్టుకోన్నాడో అతని రచనల్లో వీటన్నిటిని ఎలా ప్రతి ఫలింప జేశాడో తెలుసుకొని చెంప లేసుకొన్నారు ఇప్పుడు అమెరికా అంతా బెక్ అవగాహనా సదస్సులు నిర్వ హిస్తున్నారు అతనిపేర ఒక అధ్యయన సంస్తను నెల కోల్పారు ఆయన పుస్తకాలన్నీ ఇంటింటా చదివే ఏర్పాట్లు చేస్తున్నారు ఫెలోషిప్పులు స్కాలర్షిప్పులు ఆయన పేరు మీద ఇస్తున్నారు .ఒక మాగజైన్ను  కూడా నిర్వహిస్తూ అతన్ని అమరుడిని చేస్తూ తమ అజ్నానాన్ని  పారద్రోలిన జ్ఞాన జ్యోతి గా జాన్ స్టెయిన్ బెక్ ను ఔరవిస్తున్నారు

      ఈ వారం లో ముగ్గురు నోబెల్ బహుమతి పొందిన రచయితల గురించి చదివి తెలుసుకొన్నందుకు మహా సంతోషం గా ఉంది .వీరందరి బాధ ఒక్కటే .’’మెటీరియలిస్టిక్ మైండెడ్ నుంచి దూరం కండి .మనిషి ని మనిషి గా చూడండి ,ప్రజల భాషలో రాయండి ,చెప్పండి ‘’అని అర్ధమవుతుంది .ఇవేవీ ఇజాలకు సంబంధిన మాటలు కావు .నిజాలకు సంబంధించినవి అందరం అనుసరించ దగినవి మాత్రమె .

        3-9-2002 మంగళ వారం నాటి నా అమెరికా డైరీ నుండి –

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -3-7-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.