అంటార్కిటికా
మేరిలిన్ జే.లాందిస్ అనే ఆమె అంటార్కిటికా లేక exploration of the extreme 400 years of adventure ‘’అనే పుస్తకం రాసింది అందులో ఎన్నో అపూర్వ విషయాలను తెలిపింది క్రీ.పూ.600-300 లో గ్రీకు తత్వ వేత్తలు భూమి గుండ్రం గా ఉందని చెప్పారు .దానిపై క్లై మేట్ జోన్ ,నార్త్ జోన్ సౌత్ జోన్ ,పోలార్ జోన్ లున్నాయని తెలిపారు .క్రీ శ.150 లో టాలెమీ శాస్త్ర వేత్త ‘’గైడ్ టు జాగ్రఫీ ‘’పుస్తకం రాశాడు .519-529 (a.d. ) నౌకలో ప్రపంచాన్ని చుట్టి రావటానికి మాజిలాన్ బయల్దేరాడు మాజిలాన్ జల సంధి అతని పేర వచ్చిందే .1768 -71 లో కెప్టెన్ కూక్ ‘’terra del fuezo ‘’చూశాడు .ఇలా అనేక దేశాల వాళ్ళు ,వివిధ పరిశోధకులు సముద్ర జీవులైన సీల్లను వేల్స్ లను వేటాడి సొమ్ము చేసుకొన్నారు .అందుకని వీరి బారి నుండి ఈ జీవుల్ని రక్షించటానికి 1991 లో ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ను ఏర్పాటు చేశారు ఇంతకీ టెర్రా డెల్ ఫ్యూజియా అంటే ఏమిటి ?అగ్ని దేశం లాండ్ ఆఫ్ ఫైర్అని అర్ధం .అప్పుడు ఆస్ట్రేలియా ను న్యు హాలండ్ అనే వారు . అంటార్కిటికా ను గొంద్వానా పీఠ భూమి కి చెందినది గా భావించే వారు .సీళ్లు వేల్సు ,పోలార్ ఎలిఫెంటు లు ,పెంగ్విన్లు ,క్రిల్ పక్షులు ఇక్కడ ఎక్కువ .
వేల్స్ అంటే తిమింగిలాలు అనేక రకాలున్నాయి .అందులో’’ స్పెర్మ్ వేల్స్ ‘’చాలా ప్రసిద్ధ మైనవి వీటి మీదనే హీర్మాన్ మెల్ విల్లీ ‘’మోబీ ‘’ అనే అద్భుత మైన నవల రాశాడని మనకు తెలుసు .దీని శరీరం 30-60 అడుగుల పొడవుంటుంది .అందులో20 అడుగుల’’ తల’’ చతురస్రాకారం గా ఉంటుంది .ఒక్కసారిగా రైల్ ఇంజన్ లో నుంచి స్టీం బయటికి పెద్ద శబ్దం తో వచ్చినట్లు దీని తల పైన ఉన్న పెద్ద బొక్క లో నుండి గాలి బయటికి వస్తుంది .దీన్ని’’ వాట్’’ అంటారు .చర్మం ముడుతలు గా ఉంటుంది .
దీని వంపు తలకాయ అంత పెద్దగా ఉండటానికి కారణం అందులో ‘’స్పెర్మ సెటి ద్రవం’’ నిండి ఉండటమే .అది పార దర్శకం గా ఉండే ద్రవ మైనం లాగా ఉంటుంది .ఇది తీవ్రమైన శబ్ద తరంగాలను సృస్టించటానికి సహక రిస్తుంది .ఎదురైనా జంతువూ ను ఈ భీకర శబ్దం తో(సోనిక్ బ్లాస్ట్) భయ భ్రాంతులను చేస్తుంది .దానితో దీనికి ఆహారంయ్యే జీవి నిస్చేస్టత పొంది కదలలేక పోతుంది .ఎర గా మిగిలి పోతుంది .ఆహారమై పోతుంది .
స్పెర్మసేటి అనే దీని ద్రవం ప్రత్యుత్పత్తికి ఉపయోగ పడుతుంది. అంతే కాదు ఇళ్ళలోనూ సముద్ర నావల్లోను దీపాలు వెలిగించాటానికీ ఉపయోగ పడుతుంది .ఏ ఇతర తిమింగిలానికి లేని ప్రత్యెక లక్షణం ఈ స్పెరం వెల్ కు ఉంది అదీ దీని ప్రత్యేకత .అందుకే సృష్టికి ,స్తితికి సముద్ర జీవులను నౌకలను తోక తో ఒక్క దెబ్బ తో తిరగ బడేట్లు చేసి, అంతులేని వినాశనాన్ని కలిగించటానికి ఈ వేల్స్ ఉపయోగ పడతాయి .వాటిని అందుకే మత్చావతారం గా మెల్ విల్లీ భావించాడు .సృష్టికి నాశనానికి దీన్ని సింబల్ గా భావించాడు మెల్ విల్లీ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13 –కాంప్ –హైదరాబాద్