జోనాధన్ స్విఫ్ట్ –
గలివర్స్ ట్రావెల్స్ అనే నవల మా తరం చదువరులకు చిర పరిచయమే .ఈ తరం వారి మాట నాకు తెలియదు .అది చదివి కడుపుబ్బా నవ్వుకొనే వాళ్ళం .అయితే ‘’యాహూ ‘’ను ఇవాళ అందరం ఉపయోగిస్తున్నాం .ఆ నవలా రచయిత ఎవరో ఈ యాహూ పదాన్ని సృష్టించిన వారెవరో పెద్ద గా ఎవరికి తెలీదు .ఈ రెంటిని సృష్టించిన రచయిత జోనాధన్ స్విఫ్ట్ .యాహూ లిలీపుట్, ,బ్రాబ్దింగ్ నాగ్ పదాలను డిక్షనరీ లో చేర్చిన్వాడు పద సృష్టి కర్త స్విఫ్ట్ .
1667 లోనవంబర్ ముప్ఫై న ఐర్లాండ్ లోని డబ్లిన్ దగ్గర స్విఫ్ట్ జన్మించాడు .తండ్రి బాల్యం లోనే చని పోయాడు .తల్లి నర్సు గా పని చేసేది .చిన్నప్పటి నుండి బైబుల్ అంటే ఇష్టం .అంకుల్ గాడ్విన్న్ ఇతన్ని తీర్చి దిద్దాడు .ఐర్లాండ్ లో పుట్టినా తాను ఇంగ్లాండ్ వాడినే నంటాడు స్విఫ్ట్ .కవిత్వం ,చరిత్ర నేర్చాడు .1686 లో ట్రినిటి కాలేజి ఇతనికి డిగ్రీ ని ఇస్తూ స్విఫ్ట్ యదార్ధం గా డిగ్రీ ని సాధించలేదని ,కాని స్కూలు దయ వాళ్ళ డిగ్రీ ని ప్రదానం చేస్తున్నామని తెలిపింది .
1688 లో’’a tale of tub ‘’రాశాడు .ఇది బ్రిటన్ లోని మత పరిస్తితులను అల్లిగారికల్ గా ఎత్తి చూపింది .అప్పుడే ఇంగ్లాండ్ లో రాచరిక వ్యవస్తలో మార్పులు ,వచ్చాయి మత ప్రవర్తకుల పెత్తనం పెరిగింది .అంతా ఫ్లూయిడ్ గా ఉన్నాయి పరిస్తితులు .కాధలిక్ ,ప్రోతెస్తంట్ల మధ్య తీవ్ర తగాదాలు ,కుట్రలు ,కుతంత్రాలతో అస్తవ్యస్తం గా ఉంది .లో స్విఫ్ట్ గిడ్డి నేస్అంటే నాసియా వచ్చింది దీని వల్ల తలనెప్పి తో జీవితాంతం బాధ పడే వాడు .మేన్నేరి అనే వ్యాధి కూడా వచ్చింది .దీని వల్ల చెవిలోని ‘’virtigo ‘’విపరీతం గా చలించేది అందువల్ల శబ్దాలు వినిపించక ,అంతా రణ గోణ ధ్వని గా ఉండేది పాపం
1691 లో ‘’ode to the Athenian society ‘’రాశాడు .టెంపుల్ అనే వాడు స్విఫ్ట్ ను బాగా ప్రోత్సహించేవాడు బ్రిటన్ రాజు మూడవ విలియం ను త్వరగా ఎన్నికలు నిర్వహించమని అతని ప్రోద్బలం తో జాబు రాశాడు .స్విఫ్ట్ ను వేరినా ,స్టెల్లా అనే ఇద్దరు ముద్దుగుమ్మలు వలచారు .విపరీత ధోరణలు దేనిలో ఉన్నా ఎడా పెడా వాయించేసే వాడు రచనల్లో .అవగాహన లేని పాఠ
కుల్ని ,ఆ నాటి చదువుల్నీ ఎవర్నీ వదలలేదు .1701 లో రాసిన నాలుగు పుస్తకాలు బాగా అమ్ముడై మంచి ప్రచారం తెచ్చాయి .
ఆ రోజుల్లో జాన్ పాట్ రిడ్జ్ అనే ఆయన జాతకాలు రాసి ,జ్యోతిష్యం చెప్పేవాడు .వాటిని పేపర్లలో ప్రచురించేవారు .అది చూసి స్విఫ్ట్ సరదాగా ‘’predictions for the year 1708 రాసి ప్రచురించాడు .జనం విపరీతం గా మోజు పడి కొని చదివారు .అందులో పాట్ రిడ్జ్ అనే జ్యోతిష్కుడు ఫలానా రోజు రాత్రి జ్వరం వచ్చి చని పోతాడు అని రాశాడు .జనం నిజమే నని నమ్మి ఆయనకు సానుభూతి సందేశాలు పంపారు .సంతాప సభలు నిర్వహించారు ఈ విషయం తెలుసుకొన్న పాట్ రిడ్జ్ ‘’ఒరే!నేను చావలేదురా బాబూ! బతికే ఉన్నాన్రా నాయనోయ్ ‘’అని పేపర్ ప్రకటన ఇచ్చుకొన్నాడు .అంటే సెటైర్ కు ఎంత ప్రాధాన్యత తెచ్చాడో స్విఫ్ట్ అర్ధమవుతుంది .ప్రెస్ వాళ్ళు కూడా దీనికి సహకరించారని చెవులు కొరుక్కున్నారు .
1711 లో ‘’ది ఎక్సామినర్ ‘’రాశాడు .1711 లో ‘’అన్నే ‘’బ్రిటన్ రాణి అయి మూడేళ్లకే చని పోయింది .స్విఫ్ట్ కు ఆనాటి మేటి కవి ‘’అలేక్సాండర్ పోప్’’ తో మంచి పరిచయం కలిగింది .ప్రియురాలు స్టెల్లా కోసం’’ ది జర్నల్ టు స్టెల్లా ‘’రాశాడు .తన రచనల్లో వ్యంగ్యంపాలేక్కువ ఆవటం వల్ల స్విఫ్ట్ ను చాలా మంది ద్వేషించారు .1716 లో స్టెల్లా ను పెళ్ళాడాడు. అయినా హేస్తేర్ అనే అమ్మాయి తో సల్లాపాలు సాగించాడు .చర్చి ప్రీస్ట్ హోదాను స్విఫ్ట్ పొందాడు
1721 లో ది గలివర్స్ ట్రావెల్స్ రాశాడు .స్విఫ్ట్ .బ్రహ్మాండ మైన విజయం సాధించాడు తెగ బడి చదివి నవ్వుకొన్నారు అందులోని వ్యంగ్యం అర్ధం కాక చాలా మంది బుర్రలు పగల కొట్టుకొన్నారు జుట్టు పీక్కున్నారు .’’ఐరిష్ హీరో ‘’అయి పోయాడు ఒక్క సారిగా .గలివర్స్ ట్రావెల్స్ లో ప్రభుత్వాల అసమర్ధత ,నిస్చేస్టత ,మతాధికారుల కంపు రాజకీయాలు ,రాజకీయ అస్తిరత్వం ,శాస్త్రీయ విపరీత ధోరణులు ,sexual ambiguities ,తో బాటు మిగిలిన మానవ తప్పిదాలనన్నిటి ని దూది ఏకి నట్లు ఏకి పారేశాడు .తాను చూసినవి అనుభవించినవి అన్నీ ప్రతీకాత్మకం గా వ్యంగ్య వైభవం గా తీర్చి దిద్దాడు దాన్ని .1728 లో భార్య స్టెల్లా ,ప్రేమికురాలు వానేస్సా మరణించారు
స్విఫ్ట్ సమకాలికుడైన కవి పోప్ మరణించి స్విఫ్ట్ ను ఒంటరి వాడిని చేశాడు .ఆప్తు లందరూ చని పోవటం తో కృంగిపోయాడు .తాను ఇంకా పదమూడేళ్ళ కు చని పోతాడు డు అనగా ‘’verses on the death of dr.Swift ‘’రాసుకొన్నాడు .అందులో
‘’perhaps I may allow the dean –had too much satyr in his heaven
And seemed determined not to starve it –because no age could more deserve it
Yet malice never was his aim –he lashed the vice ,but spared the name
NO Individual could resent –Where thousands were equally meant ‘’ఒకటి
స్విఫ్ట్ జబ్బు బాగా తిరగ బెట్టింది .తనకు బంధువులు మిత్రులు అందరు పోయారు .విచారం తో కుమిలి పోయాడు అంతటి హాస్య రచయితా .1742 లో మెడికల్ కమిషన్ ‘’Swift was unsound mind and memory ‘’అని ప్రకటించింది .కొంత మంది విమర్శకులు ఈ జబ్బు వల్లే పిచ్చ పిచ్చగా రాసి పారేశాడు స్విఫ్ట్ అన్నారు ‘’mad man ‘’అని ముద్ర వేశారు .1745 అక్టోబర్ 19 న స్విఫ్ట్ ఎనభై అయిదవ ఏట భౌతికం గా మరణించాడు .తనను గురించి ‘’he gave the little wealth he had –to build a house for fools and mad
And showed by one satiric touch –No nation wanted it so much ‘’ అని ముందుగానే రాసుకొన్నాడు .తన వీలు నామాలో తన యావదాస్తిని తన లాంటి జబ్బు తో బాధ పడే వారికి ఆస్పత్రి కట్టించి సేవ చేయటానికి ఉపయోగించాలి అని చని పోవటానికి అయిదేళ్ళ ముందే తన కజిన్ మార్తా వైట్ వేకు ఉత్తరం రాశాడు .స్విఫ్ట్ మరణానికి స్పందించిన ఈట్స్ కవి ‘’Swift sleeps under the greatest epitah of history ‘’అని కితాబిచ్చాడు .స్విఫ్ట్ తన సమాధి మీద ఈ క్రింది వాక్యాలు రాయించమని ముందే ఆదేశం ఇచ్చాడు .
‘’here lies the body of Jonathan swift doctor of divinity ,dean of the cathedral church ,where savage indignation can not longer lacerate his heart
Go traveler and imitate if you can –one who with all his mighty championed human liberty ‘’
అదీ చరిత్రను రచనను ట్విస్ట్ చేసి షిఫ్ట్ చేసి,ఆ మలుపులో మహోన్నతం గా నిలిచిన వ్యంగ్య రచనా దురంధరుడు జోనాధన్ స్విఫ్ట్ కద .ఒక చెవిటి వాడి అరణ్య రోదన .నాటి రాజకీయ ,మత నాయకులను వెర్రి వేషాలేసే ప్రతి వెంగలప్పను సటైర్ తో ఫెడీ మని కొట్టి బుద్ధి చెప్పిన రచయిత స్విఫ్ట్ వ్యంగ్యాత్మకత కు పెద్ద పీట వేశాడు .
నిజం గా స్విఫ్ట్ ఐర్లాండు ,ఇంగ్లాండ్ లను దాటి ఎక్కడికి వెల్ల లేదు .అయినా ఊహాత్మకం గా ,వ్యూహాత్మకం గా త్రావేలోగ్ రాశాడు .అందులో ప్రజలు ఎలా జీవిన్చారో చెబుతూ ఎలా జీవించాలో ఎరుక పరచాడు .యాత్రా రచన లో వ్యంగ్యాత్మకత ను ప్రవేశ పెట్టిన వాడు స్విఫ్ట్ .ఆయనకు మాస్ మనిషి అంటే అయిష్టం .ప్రత్యెక వ్యక్తులంటే వీరాభిమానం .అందుకే అన్ని రకాల ప్రత్యేకతలు గల పాత్రలను సృష్టించాడు పొట్టి మనుషులు ,పొడుగాటి వారు ,రాజుకు సలహాల నిచ్చే పనికి రాని వెధవాయిలు అందరు ఆ నవలలో ప్రాణం పోసుకొన్నారు .ఎవరి ప్రత్యేకత వారిదే .ఈ పుస్తకం రాసి ‘’I have finished my travels .they are admirable things will wonderfully mend the world ‘’అని విశ్వసించాడు స్విఫ్ట్ .
జార్జి ఆర్వెల్ అనే మహా రచయిత ‘’ప్రపంచం అంతా నాశనం అయి పోతే’’ ఆరు ‘’పుస్తకాలు నేను దాచుకొంటాను .అందులో గలివర్స్ ట్రావెల్స్ ఒకటి ‘’అని మహా గొప్ప గా మెచ్చుకొన్నాడు ..స్విఫ్ట్ ,విమర్శకుడు ,రాజకీయ దురంధరుడు ,ప్రచార సాధకుడు ,మతాదికారి , వ్యంగ్యాత్మక రచయిత .ఈట్స్ కవి ‘’swift haunts me ‘’అని పొగిడాడు .అంతే కాదు ‘’the greatest writer of English prose ,and the greatest man who has ever written great English prose ‘’అని ఎస్టిమేట్ చేశాడు .
స్విఫ్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్ ను తెలుగు లోకి అనువాదం చేసింది జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి ‘’గారుఅని నాకు జ్ఞాపకం .కరెక్ట్ అని నేను చెప్పలేను .
ఇది నా అమెరిక డైరీ 8-9-2002 నాటిది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13- కాంప్ –హైదరా బాద్