మా ‘’నాసా’’ సందర్శనం
17-9-2002 మంగళ వారం మధ్యాహ్నం హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దరిని ,మా మనవడు ఆరు నెలల శ్రీకేత్ ను కారు లో నాసా కేంద్రానికి మా అమ్మాయి విజ్జి తీసుకొని వెళ్ళింది .మా అల్లుడు అవధాని రెండు వారాల క్రితం తమ్ముడి పెళ్ళికోసం ఇండియా వెళ్ళాడు .విజ్జికి జ్వరం దగ్గు ఉన్నా బయల్దేర దీసింది .కితం రాత్రి సుజాత అనే ఒక తెలిసిన ఆవిడ ఇంటి నుండి ‘’నాసా ‘’కు వెళ్ళటానికి కన్సెషన్ కూపన్లు తీసుకొన్నాం .ఈ సుజాత కూతురికే నేను అన్నప్రాసన చేయించాను .బెజవాడ అమ్మాయి,వైశ్యులు .భర్త మంచి వాడు .అతనే ఆఫీస్ నుండి కూపన్లు తెచ్చి ఫోన్ చేసి చెప్పాడు .
మధ్యాహ్నం 12-30 అయింది బయల్దేరే సరికి .వీళ్ళ ఇంటి నుండి 40 మైళ్ళు .హైవే మీద ఒక గంట ప్రయాణం .ఇంతకూ మునుపు ఎప్పుడూ విజ్జి హైవే మీద కారు నడప లేదు .ఇదే మొదలు .అయినా హాయిగా ధైర్యం గా డ్రైవ్ చేసింది .కంగారు అసలు పడలేదు .టికెట్ ఖరీదు మామూలుగా అయితే 20 డాలర్లు ఒక్కొక్కరికి .అంటే మా ఇద్దరం సీనియర్లు కనుక 18 డాలర్లు ఒక్కోరికి .మాకు ఇచ్చినవి ‘’హాఫ్ చార్జి కూపన్స్ ‘’అంటే మా ముగ్గురికి కలిపి 20డాలర్లే అయింది .ఇదే మామూలుగా కొంటె 60 డాలర్లు అయ్యేది .
నాసాకు మధ్యాహ్నం ఒంటి గంటన్నర కు చేరాం .సెక్యూరిటి చెకప్ బానే స్ట్రిక్ట్ గా చేశారు అందర్నీ .లోపల బిల్డింగ్ లో వ్యోమ గాముల దుస్తులు ,మోడల్స్ ప్రదర్శన గా ఉంచారు .అక్కడున్న యంత్రాల దగ్గర కూర్చుని ఆపరేట్ చేసి ఎదురుగా ఉన్న టి.వి స్క్రీన్ మీద చూస్తె మనం నిజం గానే స్పేస్ లోకి వెళ్ళిన అనుభూతి కనీ పిస్తుంది .భలేగా ఉంటుంది .అక్కడి నుండి మొత్తం సైట్ చూడటానికి నాలుగు కంపార్ట్ మెంట్స్ ఉన్న’’ ట్రెయిన్ కార్’’ ఉంది .టైర్ చక్రాలమీద రోడ్డుపై నడుస్తుంది .అందులో ఎక్కే ముందు అందరికి కూపన్లు ఇస్తారు .వాటిని తిరిగి వచ్చిన తర్వాతా రిటర్న్ చేయాలి .ట్రైన్ ఎక్కేటప్పుడు మెటల్ డిటెక్టర్ర్ తో తనిఖీ చేశారు .ఎక్కేముందు మనకు కావాలంటే ఫోటో తీస్తారు .తిరిగి వచ్చిన తర్వాతా దాన్ని మనం కలెక్ట్ చేసుకో వచ్చు .మూడు ఫోటోలలో రెండు పెద్దవి ,ఒకటి లామినేషన్ తో రెండు వైపులా కనీ పించేట్లు ఫోటో పెట్టి ,ఒక కీ చైన్న్ తో సహా అంద జేస్తారు .దీనికి కొంత డబ్బు తీసుకొంటారు . .వీటికి వెనకాల ఆస్ట్రో నాట్ బొమ్మ , స్పేస్ షిప్ ఉంటాయి .
ట్రైన్ లో విషయాలు వివ రించి చెప్పే కామేన్టేటర్ ఉంటాడు .ట్రైన్ రెండు గంటలకు బయల్దేరింది .మొత్తం 1600ఎకరాల సువిశాల మైన స్తలం .ఈ సెంటర్ లో 14000 మంది ఉద్యోగులు పని చేస్తూంటారు .ఇదే national aeronautical space administration అంటే N.A.S.A.ఇక్కడ దీని పేరు లిండన్ బి.జాన్సన్ స్పేస్ సెంటర్ .ఇలాంటిదే ఫ్లారిడా రాష్ట్రం లో ఇంకోటి ఉంది దాన్ని జాన్ ఎఫ్ కేన్నేడిస్పేస్ సెంటర్ అంటారు .ఇక్కడ వ్యోమగాములకు శిక్షణ నిస్తారు .అక్కడ నుండి అంత రిక్షం లోకి స్పేస్ షిప్ ను పంపుతారు .అదీ తేడా .కేనేడీ ప్రెసిడెంట్ అయినప్పుడు జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ .కేన్నేడి మరణం తర్వాత జాన్సన్ ప్రెసిడెంట్ అయాడు .టెక్సాస్ వాడు కూడా .గురు శిష్య సంబంధం వీరిద్దరిది .
లిక్విడ్ నైట్రోజెన్ ను -320 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద నిలువ ఉంచే టాంకులను ,వీటిని కంట్రోల్ చేసే బిల్దిన్గులను చూపించారు .కామేన్ టేటార్ అనుభవం ఉన్న వాడేకాని ముసలాయన .దమ్ము చాలలేదు అని పించింది .పదిహేడో నంబర్ బిల్డింగ్ అంతా పూర్వం కంట్రోల్ బిల్డింగే నట .అక్కడ సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంది .ముందు మెషీన్లుదాని తరువాత గ్లాస్ వెనక సీట్లు .ముందు వరుసలో రిసేర్వేడ్ సీట్లున్తాయి .అందులోనే ప్రెసిడెంట్ జాన్సన్ ,జిమ్మీ కార్టర్ ,క్లింటన్లు కూర్చుని కంట్రోలింగ్ ను చూసే వారట .ఇప్పుడు మేము వాళ్ళు కూర్చున్న సీట్లలో కూర్చుని చూశాము .అదొక గొప్ప అనుభూతి గా ఫీల్ అయ్యాం .
ఇక్కడి నుండి స్పేస్ షిప్ ను నిర్మించే బిల్డింగ్లో వ్యోమ గాములకు శిక్షణ నివ్వటం అంతా జరుగుతుంది .కొంతమంది ఆస్ట్రో నాట్స్ ట్రైనింగ్ పొందుతూ కనీ పించారు .ఫోటోలు తీశాము .మమ్మల్ని చూసి వాళ్ళూ చేతులూపారు ఆనందం గా .వాళ్ళు కింద చేంబర్ లో ఉంటారు .మనం పైన బాల్కని లో ఉండి వాళ్ళను గ్లాస్ లో నుంచి చూస్తాం. మధ్యలో అంతా ఫైబర్ గ్లాస్ తేర.ఎవరికి ఇబ్బంది ఉండదు .ఎవరి పని వాళ్ళు చేసుకో వచ్చు .ఇక్కడి నుండి తిరిగి వచ్చేసరికి 3-45 అయింది .దారిలో పూర్వం అంత రిక్షం లోకి పంపిన స్పేస్ షిప్ ల మోడల్స్ చూశాం .వీటినీ ఫోటోలు తీశాం .
మాతో చూసిన వాళ్ళలోహైదరాబాద్ కు చెందిన ఒక తెలుగు బావా ,బామ్మర్దీ కనీ పించారు .బావ మెడికల్ ఆఫీసర్ .కొడుకులు డల్లాస్ లో ఉన్నారట .బామ్మర్ది హూస్టన్ లో సాఫ్ట్ వేర్ లో ఉద్యోగి . ఆయన భద్రాచలం వాడు .విజయవాడ కు తరచూ వస్తూ ఉంటాడట.ఇద్దరం ఒకరికొకరం ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళం అని పించింది .అదీ తమాషా .పరాయి దేశం లో మనోళ్ళు కన్పిస్తే అంత పరవశం అన్న మాట .4-45 కు ఒక పెద్ద హాల్ లో పెద్ద స్క్రీన్ మీద‘’to be an astronaut ‘’అనే సినిమా చూపించారు .ఇందులో ట్రెయినింగ్ ,కంట్రోల్ వగైరా విశేషాలన్నీ తెలియ జేశారు .అందులో ఉత్సాహం ఉన్న వారికి స్పూర్తి దాయకం గా ఉంది .పూర్వం మేము గుజరాత్ లో స్వామి నారాయణ టెంపుల్ లో కూడా ఆయన జీవిత చరిత్ర ను ఇలానే చూశాం అని జ్ఞాపకం వచ్చింది .
సాయంత్రం 5-45 కి బయల్దేరి 6-45 కు ఇంటికి చేరాం .
15-9-2002 ఆదివారం అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13- కాంప్ –హైదరాబాద్