నతానియల్ హతార్న్ -1
నతానియాల్ హతార్న్ 1804జులై నాలుగున మేసాచూసేత్స్ లోని సేలం లో జన్మించాడు . తలిదండ్రులు కలోనియల్ తరం వారు . నాలుగేళ్ళకే తండ్రి ఎల్లో ఫీవర్ తో మరణించాడు . ఆయన ఎక్స్ కెప్టెన్ .తల్లి కుటుంబాన్ని తన తండ్రి ఇంటికి మార్చింది . మళ్ళీ మైమ్ కు వెళ్ళారు . అడవుల్లో తిరగటం ,నదుల్లో ఈదటం ,ప్రకృతిని చూసి ఆనందించటం ఇష్టం . లార్డ్ బన్యన్ రాసిన పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్ ,తో బాటు సైన్సు పుస్తకాలూ చదివాడు . ఏడవ ఏటనే రచయిత కావాలని అనుకొన్నాడు . కవి లాంగ్ ఫెలో ,అమెరికా ప్రెసిడెంట్ గా పని చేసిన పియర్స్ ఇతని క్లాస్ మెట్లు . 1825-37మధ్య ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు . దొరికిన పుస్తకాలన్నీ తెగ చదివేశాడు . ప్యూరిటన్ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోన్నాట్లు గా మధించాడు . చిన్న కదలు రాసినా ఎవరూ ప్రచురించటానికి ముందుకు రాలేదు . కోపం వచ్చి దాన్ని తగలేశాడు . 1828 లో ఫాన్ షో నవల రాశాడు . ఎవరూ పట్టించుకోలేదు . ఇవాళ అది ”one of the rarest and valuable titles in American literature ”అయింది . సేలం గజెట్ అనే దానిలో ”ది హాలో ఆఫ్ త్రీ హిల్స్ ”ప్రచురించాడు జనమ్ లో చలనం లేదు . గూద్రియాన్ అనే అతను ఆ కధలను ”టోకెన్ పేపర్ ”లో సీరియల్ గా ప్రచురించాడు . తరువాత హాతరన్ ఎడిటర్ అయ్యాడు . ”ట్వైస్ టోల్డ్ టేల్స్”ప్రచురిస్తే మంచి ప్రోత్సాహమే లభించింది .1838లో ప్రెసిడెంట్ జాక్సన్ ను కలిశాడు . స్పందన కనీ పించలేదు . 

న్యు ఇంగ్లాండ్ వెళ్లి గుర్రాల వ్యాపారం చేశాడు . తరువాత ఒంటరి జీవితం గడిపాడు .ఎంతో చదవటం వల్ల చేయి తిరిగిన రచయిత గా మారాడు . మానవ మనస్తత్వ పరిశీలన అబ్బింది . తన భావిశ్యత్ రొమాన్స్ రచనలకు ఎన్నో వస్తు సామగ్రి దొరికింది. తన కధలను ”రొమాన్సేస్ ”అన్నాడు . వీటిలో ఊహ ,స్వీయ స్వతంత్రం ఉన్నాయి . మాసా చూసేత్స్ కు వెళ్ళాడు . అక్కడ సోఫియా పీ బాడ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు . బోస్టన్ కస్టమ్స్ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది . కొద్దికాలమే చేసి రాజీ నామ చేశాడు . బ్రూక్ ఫాం లో నివాసమున్నాడు . అక్కడి కాపురం వలల శారీరక మానసిక బౌద్ధిక,నైతిక విద్యాభి వృద్ధిదీకోసం వెయ్యి డాలర్లు ఖర్చు చేశాడు . విసుగెత్తింది ” it is my opinion that a man’s soul may be buried under a dung heap or in a furrow of the field just aswell as under a pile of money ”. అని బాధ పడ్డాడు .
1846 లో మోసెస్ ఫ్రం అన్ ఓల్డ్ మాన్సె రాశాడు .ఇవన్నీ కధలే 1838-45 మధ్య ఇరవై రెండు కధలు రాశాడు . మళ్ళీ స్లమ్స్ కస్టమ్స్ లో చేరాడు కొన్ని నెలలకే ఖాళీ 1849 లో ”కస్టమ్స్ హౌస్ ”రాసి ప్రచురించాడు . .1850 అతని ప్రసిద్ధ రచన ”స్కార్లెట్ లెటర్ ”రాశాడు . అప్పుడే లేనాక్స్ లో కాపురమున్నాడు. mobi dick నవలా రచయిత హెర్మన్ మెల్ విల్లీ తో పరిచయమేర్పడింది .ఇద్దరు తరచూ కలుసుకొనే వారు మె ల్విల్లీ మోబీ డిక్ ను హాతార్న్ కు అంకిత మిచ్చాడు మిత్రత్వానికి చిహ్నం గా . తర్వాతా ” .the house of 7 gables ,”a wonder book of girls and boys ” .రాశాడు రెండవది గ్రీకు కధల సంపుటి .
కాపురం కంకార్డ్ కు మార్చాడు . తోరో గారి వాల్దేన్ పాండ్ కు వెళ్ళాడు నచ్చక తిరిగి వచ్చాడు ”the blithedale romances ”. ప్రచురించాడు .ప్రెసిడెంట్ పియర్స్ కు రాజకీయ ఉపన్యాసాలు రాసి అందించేవాడు హాతార్న్ . ”tangle wood tales ” రాశాడు .ఇంగ్లాన్ద్ వెళ్లి అక్కడి విశేషాలు రాశాడు రొం లో విహరించాడు . 1860లో ట్రాన్స్ ఫర్మేషన్ రాసి అచ్చేశాడు. మూడేళ్ళ తరువాత ”అవర్ ఓల్డ్ హొమ్ ”రాశాడు . 1864 జులై నాలుగున అరవయ్యవ ఏట నతానియాల్ హతర్న్ మరణించాడు .
ఆయన రచనా విశేషాలు ఈ సారి
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -.7-7-13- కాంప్-హైదరాబాద్