నా దారి తీరు -35 పెనమకూరు లో ఉద్యోగం

 నా దారి తీరు -35
               పెనమకూరు లో ఉద్యోగం 
        ఉయ్యూరు నుంచి పెనమ కూ రు  ఆరు కిలో మీటర్లు . ఉదయం తోమ్మిదిమ్బావు కు ఒక బస్ ఉండేది దానిఒలొ చిన్న వంతెన దగ్గర ఎక్కి వెళ్ళే వాళ్ళం .నాథొ బాటు ఉయ్యూరు నుంచి డ్రిల్ మాస్టారు యలమంచి జగన్మోహన రావు ,ఆయన భార్య  సోషల్  టీచర్ అయిన భ్రమరాంబ గారు ,హిందీ పండిట్ రామ తారకం గారు ,ఆమె భర్త డ్రిల్ మేష్టారు నరసింహా రావు కలిసి వెళ్ళే వాళ్ళం .ఒక్కొసరి బస్ ఆలస్యమై మొదటి పీరియడ్ ప్రారంభమైన పది నిమిషాలకో ,పావు గంటకో చేరే వాళ్ళం .ఇది మాకే ఇబ్బంది అని పించేది . ఱిక్షా దొరికితే ఎక్కి వెళ్ళే వాళ్ళం . హెడ్ మాస్టారు వేముల పల్లి కృష్ణ మూర్తి గారు .భారీ పర్సనాలిటి తెల్లని గ్లాస్కో పంచ తెల్లని చొక్కా తో గంభీరం గా ఉండే వారు . అయన పెనమకూరు లోనే స్కూలు దగ్గర స్కూల్ ప్రెసిడెంట్ గారు వెంకట నారాయణ గారింట్లో కాపురం ఉండే వారు .ఈ ఇద్దరు అన్న దమ్ముల్లా గా కనీ పించేవారు వేష భాషల్లో .నారాయన గారి రైట్ కమ్యూనిస్ట్ .కృష్ణ  మూర్తి గారివీ వామ పక్ష భావాలే .ఇద్దరికి మంచి సయోధ్యత ఉండేది ..వెంకట  నారాయణ గారు ఆ తర్వాతెప్పుడో కంకిపాడు మండలాధ్యక్షుని గా ఎన్నికై నారు .ఒకసారి జిల్లా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఒడి పోయారు.పెనమ కోరు ప్రెసిడెంట్ గా చాలా కాలం చేశారు . అ స్కూల్ లో ఆయన అనుకొన్న వారే ఉండాలి ఆయనకు అక్కరలేని వారు వెళ్లి పోవాలి . అలా తన పెత్తనం సాగించేవారు అయితే అలా ఉన్నట్లు కనపడే వారు కాదు . . స్కూలు లో ఏది జరిగినా ఏది చేయాలన్నా అయన అనుమతి ఉండాల్సిందే . ఇక్కడ జరిగిన వన్నీ ఆయనకు వెంటనే చేరిపోతాయి . 
                                        ఐరన్ డిసిప్లిన్ 
       హెడ్ మాస్టారు కృష్ణ మూర్తి గారు కస్టపడి ఇంగ్లీష్ లెక్కలు చెప్పేవారు .లెక్కల మాస్టారు గా ఆయనకు మంచి పేరుండేది .స్కూల్  లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు .భార్య కూడా సహకరించేది .  విద్యార్ధులు పాస్ పీరియడ్ లో బయటికి లైన్ లో వెళ్లి పాస్ పోసుకొని రావాలి . మ ధ్యలొ ఎవరూ మాట్లాడే వారు కాదు .యూ నిఫార్మ్ తప్పక వేసుకొని . రావాలి రోజు అసెంబ్లీ ఉండేది ఽన్నీ క్రమ పద్ధతిలో క్రమ శిక్షణ తో జరిగేవి నా బోటి వాడికి ఇది ఐరన్ డిసిప్లిన్ అని పించేది . స్కూల్ అంతా నిశ్శబ్దం తండ వించేది . ఆటలు ఆడాలన్నా ఎక్కడా అరుపులు కేకలు ఉండేవి కావు ఆ డ పిల్లలో బాగానే గేమ్స్ ఆడే వాళ్ళు .చిన్న లాబ్ ఉంది అందులోనే క్లాస్ లు తీసుకొనే వాడిని . సుబ్రహ్మన్యే శ్వర రావు అనే అతను నేచురల్ సైన్స్ చెప్పే వాడు . తెలుగు మాస్టారు వెంపటి శర్మ గారు జూనియర్ తెలుగు  నరసా రెడ్డి ,రంగా వజ్జల మురళీ ధర రావు .ఇథను మంచి కావ్య జ్ఞానం ఉన్న వాడు .కనక వల్లి లో కాపురం . భార్య ఎలిమెంట రితీచర్.    . కొద్దికాలానికి నరసా రెడ్డి బదిలీ అయి ఒక సాయిబు గారుఇస్మాయిల్  వచ్చాడు .ఇప్పుడతను ను తోట్ల  వల్లూర్ హెడ్ మాస్తారయ్యాడు . హిందీకి  కు షరీఫ్ అని అమీనా పురం ఆయన ఉండేవాడు . చిన్న క్లాసులకు చెప్పే వాడు.మం చి  మాటకారి . వాల్లబ్బాయిలు  స్కూల్ లో చదువుతున్నారు .వాల్లకో సమ్ చాలా తాపత్రయం పడే వాడు పరీక్షల్లో మరీ . 
                  లెక్కలకు సుంకర రాధాకృష్ణ  ఉండేవాడు పదవ తరగతి నుండి అన్ని తరగతుల వాళ్ళు అతని దగ్గరే ట్యూషన్ . పెన్నులు న్నోటు బుక్కుల వ్యాపారం కూడా చేసే వాడు డబ్బు బాగానే సంపాదించాడు మేస్తర్లకు అప్పు కావాలంటే అతని దగ్గరే దొరికేది.  జతమ్ రాగానే బదులు తీర్చే వారు . సహాయ కారి . నన్ను ”గురూ ”అని పిలిచే వాడు .వాల్లబ్బాయిలు స్కూల్ లో చదివే వారు . వెంకటప్పయ్య ,సౌదామిని అనే దంపతులు సెకండరి గ్రేడ్ టీచర్లు మంచి దంపతులు నాకు వెంకటప్పయ్య మంచి మిత్రడయ్యాడు .తరచుగా ఇంటి దగ్గర పార్టీలు మాకు ఇచ్చేవాడు . వెంకతప్పయ్యా ,సౌదామిని భార్యా భార్తస్లు సెకండరి టీచర్లు . అతను  ఇంగ్లిష్ లో ధారాళం గా మాట్లాడే వాడు రాసే వాడు.ఆ నాడు మేస్తార్లలో అంత ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వారు అరుదు ఏడవ తరగతికి ట్యూషన్ చెప్పేవాడు . బాగా బోధించి మంచి పేరు పొందాడు .వాల్ల అబ్బాయిలిద్దరూ మావిద్యార్ధులే . అందులో హర్ష నే వాడు అమాయకం గా ఉండే వాడు . . 
                     భద్రాచారి అని డ్రాయింగ్ మేష్టారు గన్నవరం నుండి వచ్చాడు ఈయనా ఉయ్యూరులో కాపురం . సాంబశివరావు అనే గుమాస్తా ఉయ్యూరు నుండి వచ్చేవాడు అక్కడ మాతో పని చేసిన సెకండరి టీచర్ నాగమణి గారి భర్త . .వెంకటే శ్వర రావు అనే క్రాఫ్ట్ మాస్టారు తాడంకి నుండి వచ్చేవాడు . భలే సరదా అయిన వాడు అతన్ని బాగా ఉడికించే వాళ్ళం .ఏ మీ అనుకొనే వాడు కాదు . రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాని ఎన్నికకు పోటీ చెయ్యమని రెచ్చగొట్టే వాళ్ళం .నిజమె నను క్లోని రెచ్చి పోయేవాడు తాను ఎన్నిక అయితే దేశాన్ని బ్రహ్మాండం గా బాగుచేస్తానని దస్ప్పాలు కొట్టే వాడు . ఇక్కడ క్రాఫ్ట్ అంటే గార్డెన్ పని . అరఎకరం పొలం లో చెరుకు సాగు చేసే వారు స్కూలు ఆవరణ చుట్టూ కొబ్బరి చేట్లున్దేవి మంచి ఫలసాయం స్కూల్ కు వచ్చేది . పూజార్లాయన ఒకాయన కపిలేశ్వరపురం నుండి వచ్చేవాడు సెకండరి టీచర్ . మురళీ ధర రావు బోధనా సామర్ధ్యం బాగా ఉండేది మాం చి రచయిత కూడా ఽఅ తర్వాతా బెజవాడ మునిసిపల్ స్కూల్ లో తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు ఇప్పటికి ఇద్దరం ఫోన్లు చేసుకొంటూ మాట్లాడుకుంటాం అతను రాసిన పుస్తకాలు నాకు పంపుతాడు మన సరస్భారతి పుస్తకాలన్నీ అతనికి పంపాను అలా  ఆ స్నేహం కోన సాగుతోంది . 
                 రామా రావు గారు అనే సెకండరి మాస్టారు ఆస్కోల్ లోనే ఉద్యోగం ప్రారంభించి అక్కడే కోన సాగుతున్నారు మంచి మనిషి భార్య కూడా ఎలిమెంటరి టీచర్ .పద్ధతి ఉన్న టీ చర్.యెక్కువ తక్కువలు మాట్లాడారు నాకు చాల ఇష్టమైన వ్యక్తీ అయ్యారాయన .లెఫ్త్ భావాలున్న వారు ఽయినా మా మధ్య గొప్ప స్నేహమే ఉండేది జగన్మొహన రావు మేడూరు నుండి వచ్చాడు . భార్య సోషల్ . ఈయన మంచి వాలీబాల్ బాడ్ మింటన్ ప్లేయర్ మాతో సాయంత్రాలు ఆడించేవాడు మంచి తర్ఫీదు ను పిల్లలకు ఇచ్చేవాడు . గ్రిగ్ లో వాళ్ళు మేము గెలిచేట్లు ఆడించేవాడు నరసింహా రావు ఈయన కు గొప్ప తోడ్పాటు . నేను బాద్ మింటన్ వాలీ బాలాడే వాణ్ని ..ద్రాయింగ్ మాస్టారు మంచి కారంస్ ప్లేయర్ మేమందరం ఇంటర్వల్ లో బయటికి వెళ్లి అక్కడున్న చిన్న హోటల్ లో ఏదో చెత్త తిని తీ తాగి వచ్చే వాళ్ళం . వచ్చి మొదటి గంట కొట్టే దాకా కారంస్ ఆడే వాళ్ళం . పందాలేసుకొని ఆడటం సరదాగా ఉండేది . పెనమకూరు కు రావాలంటే ఉయ్యూరు  నుంచి , గరిక పర్రు ,కనక వల్లి మీద నుంచి లేక కుమ్మమూరు ,కనక వల్లి నుండి వెళ్ళాలి తారు రోడ్డు గథుకుల మాయం వర్షం వస్తే బు రద . మి గిలిన కాలం లో దుమ్ము రేగేది . .
                    పెనమ కూ రు ఊరు ముందు ఒక చిన్న ఎత్తైన వంతెన ఉండేది .  ఎక్కటం కష్టం .ఊ ర్లొ బ్రాహ్మణ కుటుంబాలు రెండో మూడో ఉన్నాయి .దీనికి దగ్గరే దేవర పల్లి లో బ్రాహ్మన్ కుటుంబాలు కనక వల్లి లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి కనక వల్లి అగ్రహారం . అక్కడ మా మామయ్యా వాళ్ళు కట్టించిన శివాలయం ఉంది దాన్ని దాటుకుంటూ పెనమ కోరు చేరాలి ఇక్కడ అంతా బి.సి.లు ఎక్కువ .చదువు కూడా స్కూల్ లో తక్కువ గా ఉండేది . పదవతరగతి ఉత్తీర్ణతా శాతం కూడా తక్కువే .కాని కృష్ణ మూర్తి గారి స్పూన్ ఫీడింగ్ వాళ్ళ మంచి ఫలితాలోచ్చాయి . సుమారు మూడొందల మంది విద్యార్దులుందే వారు . పి.విజి.క్రిష్ణ  మూర్తి అని సోషల్ మాస్టారు పునాదిపాడు నుండి వచ్చేవాడు భలే సరదా అయిన మనిషి వ్యంగ్యం చతురత ఆయన మాటల్లో గోచరించేవి నాకు ఆత్మీయుడే అయ్యాడు ఆయన అన్న హెడ్ మాస్టారు జిల్లా లో పేరున్న వాడు . పి. శ్రీరామ మూర్తి గారి మన్సుష్యులిద్దరు ..కొన్థ కాలానికి పి.వెంకటే శ్వర రావు అనే లెక్కల మాస్టారు గిరిరెడ్డి  అనే సైన్సు మేష్టారు ఇక్కడికి చేరారు .  
              సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ – 8-7-13-  ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.