నా దారి తీరు – 37
పెనమకూరు స్కూలు అభి వృద్ధి లో పాత్ర
పెనమ కూ రు హైస్కూల్ లో మంచి నీటి సరఫరా సరిగ్గా లేదు విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు సరైన లెట్రిన్ వసతి కూడా లేదు . దీని మీద ఒక సారి హెడ్ మాస్టారు ఏర్పాటు చేసిన స్టాఫ్ మీటింగ్ లో విషయం చర్చించాము .యెమి చెయ్యాలి అని ఆలోచించాము. కొందరుఊ ళ్లోకి వెళ్లి చందాలు వసూలు చేద్దామన్నారు . నేను అప్పుడు ఊ ళ్లోకి వెడితే వాళ్ళు ”మీ స్కూలు వాళ్ళు యెంత ఇచ్చారు ?”అని అడుగుతారు అ ప్పుదు మనం తల దిన్చుకోవాల్సి వస్తుంది కనుక బోర్ వేసి ,షెడ్ కట్టించటా నికి యెంత అవుతుందో ముందుగా ఒక అంచనా వేయిద్దాం. మనం స్టాఫ్ మేమ్బర్లం ఎవరికి తోచింది వారు చందాలు వేసుకొందాం .ఇన్దులొ బలవంతం ఉండరాదు . అందరు యదా శక్తి గా సహకరిస్తారని అనుకొంటాను .. ఆ డబ్బు ఏంతో తెలిసిన తర్వాత ఊరి లోని పెద్దలను కలుద్దాం అవసరమైతే మన స్కూల్ కు ఏయే ఊళ్ళ నుండి విద్యార్ధులు వస్తారో ఆ ఊళ్లకు కూడా వెళ్లి అడుగుదాం .దాన్ని సేకరించి ఉంచుదాం .మ నకు రక్షిత మంచి నీటి సరఫరా అవసరం .టాంకు కట్టి నీళ్ళు నిలవచేసి పంపుల ద్వారా నీటిని విద్యార్ధులకు అందిద్దాం . ఆ నీటినే వ్యవసాయానికీ వాడుకొందాం .చెరుకు పండించవచ్చు మంచి ఆదాయం వస్తుంది .ఫైవ్ హెచ్.పి. మొటారు బిగిద్దాం .ఇవి నా సూచనలు మాత్రమె .దీని పై అందరం కలిసి నిర్ణయిద్దాం ”అన్నాను . ఒ.కె. అన్నారు హెడ్ మాస్టారు తో సహా అందరం ఎవరికి తోచిన చందా వారు వేశారు . . యెంత వచ్చిందో జ్ఞాపకం లేదు . జీతాలలో ఆ డబ్బు వసూలు చేయమని హెడ్ గారికి చెప్పాం . అలానే చేశారు ..
తరువాత ఊరిలో ఏయే పెద్దలను కలవాలో హెడ్ మాస్టారు ఆలోచించి లిస్టు తయారు చేయమని చెప్పాం . అయనా ,స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారు కలిసి స్తోమత గల వారి పేర్లను రాశారు . రోజూ స్కూల్ అవగానే కొంతమంది టీచర్లు హెడ్ మాస్తారితో కలిసి ఊరి పెద్దల ఇళ్ళకు వెళ్లి విషయం తెలిపాం .ఇన్త మంచి పని జరుగుతున్నందుకు అందరు సంతోషించారు తోచింది ఇచ్చి ప్రోత్సహించారు .తరువాత పొరుగూరికి కూడా సైకిళ్ళ మీద వెళ్లి అడిగాం .యెవ్వరూ ఎదురు చెప్పలేదు అందరూ ఉత్సాహం గా చందాలు ఇచ్చి సహకరించారు . విద్యార్ధులు కూడా యదా శక్తి డబ్బులిచ్చారు . మాతో కలిసి తిరిగారు . ఈ లోపే వెంకట నారాయణ రావు గారు ,హెడ్ మాస్టారు కలిసి కె.సి.పి.వారి ని కలిసి విషయం వివరించారు .వాళ్ళు కూడా ముందుకు వచ్చారు .వాల్ల కున్న యంత్ర్తాలతో బోరు వేసి మోటారు బిగించి పైపులు ,కులాయిలు బిగించి షెడ్ కట్టి ఇస్తామన్న్నారు అందరికి మంచి ఊపు వచ్చింది . కెసీపి వాళ్ళు మేమిచ్చిన డబ్బు కు ఎన్నో రెట్లు డబ్బు వేసి స్వచ్చందం గా స్కూల్ లో రక్షిత మంచి నీటి సరఫరా ను ఏర్పాటు చేసి విద్యార్ధులకు మే లు చేశారు . ఆడ పిల్లలకు మరుగు దొడ్డి సదుపాయమూ ఏర్పాటైంది . ఇదంతా స్టాఫ్ సహకారం గ్రామస్తుల ,పొరుగూరి వాళ్ళ వదాన్యత వల్లనే సాధ్యమయింది .ఒక అయిడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కాని ఇక్కడ అందరికి ఉపయోగ పడే పని జరిగింది .
స్కూలు వార్షికోత్సవం
హెడ్ గారు చాలా రిసేర్వేడ్ గా ఉంటారు .మ నసు విప్పి మాట్లాడే స్వభావం లేదు . వార్షి కొత్సవస్సం భారీగా జరపాలని అనుకొన్నారు .దానికి కూడా సంప్రదించలేదు మళ్ళీ స్టాఫ్ మీటింగ్ లో ఇవన్నీ చర్చించాం .స్కూల్ గోడలు బోసిగా ఉన్నాయని ఎవరైనా వచ్చి చూస్తె స్కూల్ అప్పియరెన్స్ బాగా లేదని తెల్ల సున్నం వేయించి దాని పై డ్రాయింగ్ మాస్టారు భాద్రాచారి గారితో కొన్ని ఆకర్షణీయ మైన బొమ్మలు వేయిస్తే బాగుంటుంది అని సలహా చెప్పాను సరే నన్నారు ఆయనకు క్కొంత డబ్బు కేటాయించి పని మొదలు పెట్టించారు . అయనా తన కళా ప్రావీణ్యాన్ని చూపించే అవకాశం వచ్చిందని రెచ్చి పోయి చక్కని చిత్రాలు వేసి అట్రాక్షన్ తెచ్చారు స్కూల్ కి .
వార్షికోత్సవానికి ఏమేమి నాటికలు వేయాలో అంతా హెడ్గారి హెడ్ మాత్రమె నిర్ణయించటం ,తానె ప్రాక్టీస్ ఇవ్వటం చేశారు ఽఅయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికి ఉండేది కాదు .నెను ఒక నాటిక ను విద్యార్ధులతో నా సైన్సు రూం లో ఆయనకు తెలియ కుండా ప్రాక్టీస్ చేయించాను .యెదైనా అయన ఒప్పుకుంటేనే స్టేజి మీద ప్రదర్శన ఉంటుంది లేక పొతే లేదు . వార్షికోత్సవం దగ్గర పడుతుండగా పిల్లల ద్వారా నా నాటకం బాగుందని పూర్తిగా నవ్వు పుట్టిన్చేదని ఆయనకు తెలిసింది ఒక రోజు ఆయనే వచ్చి చూశారు ముసి ముసి నవ్వులతో బాగుందని మెచ్చారు .బహుశా ఆ నాటిక బి.వి రమణా రావు రాసిన ”భర్త మార్కండేయ ”అని జ్ఞాపకం . వార్షి కొత్సవం రోజున నాగమణి గారు మొదలైన్ వారు వచ్చి లంబాడి డాన్సు ,దేశ భక్తీ గీతాలు చేయించారు ప్రసాద రావు అనే కుర్రాడితో శ్రీ కృష్ణ రాయ బారం పద్యాలు పాదించాను. సాయన్త్రమ్ ఆరింటికి మొదలైన కార్యక్రమం రాత్రి పదిన్నరకు ముగిసింది అందరూ బాగా చేశారు . హెడ్ మాస్టారు మేము ఇంటికి ఉయ్యూరు వెల్ల బోతుంటే అందరికి తన ఇంటి వద్ద భోజనం ఏర్పాటు చేసి నట్లు చెప్పారు సరే నని అక్కడే భోజనం చేశాం ఽఅయన భార్య గారు దగ్గర ఉండి మాకు అందరికి వడ్డించారు మొత్తం మీద వార్షికోత్సవం గ్రాండ్ సక్సెస్ . అందరికి తృప్తిని సంతోషాన్ని ఇచ్చింది . మా కృషికి హెడ్ గారు ఏంతో సంతోషించారు . అప్పుడు ఆయన ముఖం మీద పెద్ద నవ్వును చూశాం . స్టేజి మీద కార్య క్రమం నిర్వహణ అంటా నాకే అప్పగించారు . నా నిర్వహణ బాగుందన్నారు .
ప్యూన్ బదిలీ -టీపార్టీ- వీడ్కోలు
అర్జును డు అనే ప్యూన్ ఇప్పటి భాషలో అటెండర్ ఉండేవాడు ఆతను పంచ కట్టి తెల్ల చొక్కా వేసి బొట్టు పెట్టుకొని వచ్చేవాడు చాలా నిదానస్తుడు మంచి పలుకు బడి ఉన్న వాడు నాల్గవ తరగతి ఉద్యోగస్తులకు ఆ మండలం లో ప్రెసిడెంట్ కూడా . చాలా శ్రద్ధగా విధి నిర్వహణ చేసే వాడు . తలలో నాలుక లాగా ఉండే వాడు .కాని హెడ్ గారికేందుకో అతని మీద చిన్న చూపు .వంగి వంగి దండాలు పెట్టె రకం కాదు . డ్యూటీ మైండెడ్ . కమ్యూనిస్ట్ భావాలున్న హెడ్ మాస్టారు ఇత సంకుచితం గా ఆలోచిస్తాడని నేను ఊహించలేదు .అతను మాతో అందరితో చాలా బాగా ఉండేవాడు అతని పధ్ధతి ఆదర్శ ప్రాయం గా ఉండేది . అతనికి వల్లూరు ట్రాన్స్ ఫర్ అయింది . హెడ్ మాస్టారు అతనికి వీడ్కోలు పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు లేదు మళ్ళీ నేనూ, జగన్మోహన రావు అనే డ్రిల్ మాస్టారు వెళ్లి హెడ్ తో మాట్లాడాం .నెను ఆయన తో ”అర్జునుడు మనలో ఒక్కడు ప్యూన్ అయి నంత మాత్రం చేత అతనికి వీడ్కోలు సభ ఏర్పాటు చేయకుండా ,టీ పార్టీ ఇవ్వకుండా పంపటం మంచిది కాదు స్టాఫ్ అంటా దీ ని పై చాలా పట్టుదల గా ఉన్నారు అతనికి వీడ్కోలు సభ పెట్టి సత్కరించి పంపించాల్సిందే ”అని ఖచ్చితం గా చెప్పాను . చాలా సేపు వాద న తర్వాత ఆయన ఒప్పుకొన్నారు ప్యూన్ అర్జునుడికి వీడ్కోలు సన్మానం చేయాలని నిర్ణయించారు . ఆ సభలో నేను అర్జునుడి మంచితనాని డ్యూటీ చేసే విధానాన్ని ,అందరికి ఇష్టమైన వాడుగా ప్రవర్తించిన తీరు ను గురించి మాట్లాడాను . అతనూ ఏంతో కృతజ్ఞత తెలియ జేశాడు ఇలా సన్మానం పొందుతానని తానూ ఊహించలేదని ఇదంతా దుర్గా ప్రసాద్ గారి చొరవతో జరిగిందే నని సంతోషం గా చెప్పాడు ప్యూను కూడా స్టాఫ్ లో భాగమే నని మిగతా స్టాఫ్ కూడా చెప్పారు హెడ్ గారు యేవో నాలుగు పొడి మాటలు మాట్లాడిన గుర్తు .
అప్పటి నుంచి అర్జును డు ఎక్కడ కనీ పించినా సైకిల్ దిగి నమస్కరించి ఏంతో ఆప్యాయం గా మాట్లాడి వెళ్ళే వాడు తన వీడ్కోలు సభను గురించి జ్ఞాపకం చేసుకొనే వాడు దాన్ని జీవితం లో మరిచి పోలేనని అనే వాడు . మా శ్రీ సువర్చలన్జనేయ స్వామి వారల స్వామి ప్రతిష్టకు కూడా వచ్చాడుఽఆ ర్జునుని ఎపిసోడ్ అందరికి ఒక హెచ్చరికే అయింది . ఆ తర్వాత అతను త ను కృష్ణా జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల ప్రెసిడెంట్ అయ్యాడు అవగానే మా ఇంటికి వచ్చి సంతోషం గా ఆ వార్త చెప్పాడు అభినందించాను మనస్పూర్తిగా . మానికొండలో రాఘవరావు ,పెనమకూరు లో అర్జను డు నా మనస్సు లో ఎప్పుడూ మెదుల్తూనే ఉంటారు . అర్జుంది చిరు నవ్వు ఎప్పుడూ గుర్తు ఉంటుంది. అ తను అయిదారేళ్ళ కిందట చని పోయాడని తెలిసి విచారించాను .
సశేషం
మీ–గబ్బిటదుర్గా ప్రసాద్ — 12-7-13 –కాంప్–హైదరాబాద్