చక్కని కధకుడు చెకోవ్ –1
అరుదైన ప్రపంచ కదా రచయితా లలో అంటోన్ చెకోవ్ ఒకడు . చిన్న కదా రచయితలలో అ త్యధిక ప్రభావం కలిగించిన వాడాయన . ఆయన పద్ధతికి వ్యతిరేకి కాఫ్కా అయితే బోర్గేస్ ఈ విధానాన్ని అభి వృద్ధి పరచాడు . ఆయనది అతి సున్నితమైన సరళ విధానం .నిజాలకు దగ్గరగా ,దాదాపు తనను గురించే ఉన్నట్లు ఉంటుంది .చెకొవ్ ను గురించి రష్యా ప్రముఖ ‘ఆనదర్ హోలీ సోల్ ”అని అంటూ . ప్రముఖ రష్యా రచయితా టాల్ స్టాయ్ ”వచన పుష్కిన్ ”అని కీర్తించాడు .చెకోవ్ చిత్రించిన పాత్ర ”ఒలేంకా ”విశ్వజనీన మైనది అని మెచ్చాడు .
1860 january 17న చెకోవ్ పుట్టాడు అ సలు పేరు అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ ”. .కుతుమ్బమ్ మాస్కో చేరింది .కుతుమ్బ బాంధవ్యం బాగా ఉన్న వాడు చెకోవ్ . ఇరవై నాల్గవ ఏట వైద్య విద్య పూర్తీ చేశాడు . 1884 ,1886 లలో రెండు కదా సంకాఆఆలనాలను వేలువర్చాడు . గ్రిగారో విచ్ అనే రష్యన్ నవలా కారుడు ”the real talent in you sets you far above other writers of the younger generation ”అని చెకోవ్ బుజం తట్టి అభినందించాడు .
1887 లో ”ఇవనోవ్ ”అనే నాటకం రాశాడు . అదే ఏడాది పెద్దకద గా ”ది స్టెప్పీ ” రాసి పేరు పొందాడు .దీనికి పుష్కిన్ అవార్డ్ వచ్చింది . కొంతకాలానికి క్షయ వ్యాధి వచ్చింది జైల్లు అన్నీ తిరిగి చూశాడు . వాటి నిర్వహణ పై తన అభిప్రాయాలను ”sakhalin island 1891 ”గా రాశాడు . కరువు నివారణ పనుల్లో తన వంతు పాత్ర కూడా నిర్వహించాడు . 1894 లో ఎన్నో అత్యద్భుతమైన కధలు రాశాడు .”అంకుల్ వాన్యో ”నాటకం రాశాడు కాని క్లిక్ అవలేదు . 1898 లో ”సీ గల్ ” నాటకం రాసి ప్రదర్శిస్తే బ్రహ్మాన మైన విజయం లభించింది . ఽఅరొగ్యమ్ తగ్గి పోవటం వాళ్ళ ”ఎల్తా హెల్త్ రిసార్ట్ ”లో చేరాడు . అక్కడే టా ల్ స్టాయ్ ,మాక్సిం గోర్క్రీ లతో పరిచయం ఏర్పడింది . ”medicine is my lawful wife and literature is my mistres ” అని చెప్పి రెండిటిని సమర్ధ వంతం గా జీవితాంతం నిర్వహించాడు ”.chekov offers theatre mood and a submerged life in the text ”అతని నాటకాలున్దేవి . సి గల నాటకం పరాజయం పొందిన తర్వాతా దియేటర్ కు సలాం కొట్టేశాడు కాని మాస్కో ఆర్ట్ దియేటర్ లో మళ్ళీ ప్రదర్శించిన తర్వాత ఊపిరి పీల్చుకొని న్ప్లేస్ రాయటం కోన సాగించాడు .
చెకోవ్ మొదట్లో డబ్బు కోసమే కధలు రాసినా క్రమం గాసృజనాత్మక శైలి తో ఆధునిక కదా కు బీజం వేసిన రచయితా అయ్యాడు .” చైతన్య స్రవంతి ” టెక్నిక్ విదాన్నాన్ని ప్రారంభించిన వాడుకూడా చేకోవే . ఆ తర్వతే జేమ్స్ జాయిస్ వగైరాలు కోన సాగించారు . కధకుడు ప్రశ్నించి వదిలి పెట్టాలె కాని సమాధానం చెప్పరాదని చెకోవ్ అంటాడు తన రీడర్స్ తో .
1901 లో ఓల్గా నిప్పర్ ”అనే నటి ని పెళ్లి చేసుకొన్నాడు . తర్వాత ”ది లేడి ఆఫ్ ది డాగ్”, ది డార్లింగ్”కధలు రాశాడు . 1991లో” ది డార్లింగ్ ”అనే నాటకం రాశాడు .నలభాఇ నాలుగు ఏళ్ళు మాత్రమె జీవించి 1904 july 2 న జెర్మని హాస్పిటల్ లో అంటోన్చెకోవ్ ” అస్తమించాడు .
చెకోవ్ చాలా సహజ వాతావరణం లో కధలను చెబుతాడు అంటే నేచురాలిటి ఎక్కువ . ఒకడు ఇంకొకడితో సంభాషిస్తూ చెబుతున్నట్లు గా కదా రాస్తాడు . అదీ ”చేకోవియన్ వె ఆఫ్ స్టోరి టే ల్లింగ్ ”అని పిలుస్తారు . పాత్రలు నిండుగా ఉంటాయి జీవమ్ తో తోనికిస లాడతాయి . ప్రత్యెక మైన నీటి ఏదీ కధలో కానీ పించాడు చెప్పాడు కూడా . ప్రత్యెక మైన సందేశమూ ఉండదు ఽలలలు అలలుగా కదా సంవిధానం జరిగి పోతుంది . మానసిక పరిస్తితి ని బట్టి కదా నడుస్తుంది ఽన్తె మూడ్ ను బట్టి కదా విధానం ఉంటుంది . అంతర్గత హాస్యం తో కవితాత్మకం గా అక్కడక్కడ ప్రాజ్ ను నడిపిస్తాడు . కదా కు నిజమైన ముగింపు నివ్వదు .దీనికి కారణం మానవులు ఉన్నంత వరకు ,వారి కస్టాలు ,ఇబ్బందులు క లలు ,ఆశలుఉన్నంత వరకు స్పష్టమైన ఆఖరు సన్ని వేశం కాని ,ముగింపు కాని ఉండదని చెకోవ్ అభిప్రాయం . ఒకరికొకరు కదా చెప్పే విధానం ఉన్నందు వాళ్ళ ఇద్దరు వ్యక్తుల భిన్న స్వభావాలు నటన మనకు కధలో కానీ పించి బహు తమాషా గా ఉంటుంది .
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-13-ఉయ్యూరు