డాస్తోవిస్కి -2
సోదరులిద్దరూ ప్రారంభించిన టైంజర్నల్ ను నిషేధించారు . వ్యాకులం టో పారిస్ వెళ్ళాడు అక్కడ జూదం ఆడి డబ్బంతా పోగొట్టుకొన్నాడు . అన్న దమ్ములిద్దరు ‘’ఈపోక్ జర్నల్ ‘’ను ప్రారంభించారు . ఇంతలో మైకేల్ చని పోయాడు . పత్రిక మూత పడింది . ఆ నాడు ‘’chirnovisky ‘’అనే రైటిస్ట్ భావాలున్నవాడు ఇతని భాసవాలను మనవాడు ఎండ గట్టె వాడు . 1865 లో క్రైం అండ్ పనిష్మెంట్ ‘’పూర్తీ చేశాడు . జర్మనీ వెళ్లి గాంబ్లింగ్ లో తిరు క్షౌరవం చేయించు కొచ్చాడు . ‘’the drunkard ‘’రాశాడు . తర్వాత గాంబ్లింగ్ జోలికి వెళ్లనని శపథం చేశాడు . ఈ స్పూర్తితో ‘’the gambler ‘’రాసి పారేశాడు .
అన్నా అనే అమ్మాయి ని రెండో పెళ్లి చేసుకొన్నాడు .కొత్త జంట జర్మనీ వెళ్ళింది .అక్కడ మళ్ళీ జూడ వ్యసనం లో చిక్కుకొని పూర్తిగా దివాలా తీశాడు . అప్పుడే ‘’ the idiot ‘’నవల రాశాడు . ఇటలి వెళ్ళాడు . అక్కడి స్పిరిత్యువాలిటి ,వైవిధ్యం బాగా నచ్చాయి . ‘’the eternal husband ‘’ను 1870 లో రాశాడు . ‘’రోల్ ఆఫ్ సీక్రెట్ పోలీస్‘’ను ‘’డైరీ ఆఫ్ ఎరైటర్ ‘’లో రాశాడు . కొడుకు పుట్టాడు ఎపిలేప్సి జబ్బు వచ్చింది . ‘’the brothers karamazov‘’ను కొడుకు చావు పై రాశాడు .
ఖైదీ గా బహూక రింప బడిన న్యు టెస్ట్ మెంట్
1880లో పుష్కిన్ స్మ్రుతి చిహ్నాన్ని ఆవిశాక్రిస్తూ గొప్ప ప్రేరణ కలిగించే ఉపన్యాసం ఇచ్చాడు దాస్‌తో విస్కీ . ఆ సమయం లోనే ‘’emphysema ‘’అని వింత జబ్బు వచ్చింది .1881 లో సెప్టెంబర్ రెండు న 59 ఏళ్ళ వయసులో దాన్తో విస్కీ మహా రచయిత మరణించాడు .
ఉత్తర అమెరికా లో ”ఇంటర్నేషనల్ దాస్తోవిస్కి సొసైటి ”ఏర్పడింది అక్కడ అయన పై గొప్ప అధ్యయనం సాగుతోంది .ఆయన రచనలను 170 భాషల్లోకి అనువదింప బడ్డాయి . ఆయన రచనలు 15 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి . దాస్తోవిస్కి ప్రభావం టో రచనలు చేసిన ప్రసిద్ధ రచయితా లెందరో ఉన్నారు వారిలో అంటోన్ చెకోవ్ ,జేమ్స్ జాయిస్ ,ఎర్నెస్ట్ హెమింగ్ వే ,జీన్ పాల్ సాత్రే లు ముఖ్యులు 1862లో దాస్‌తో విస్కీ లండన్ కు వెళ్లి నప్పుడు ప్రముఖ రచయితా చార్లెస్ డికెన్స్ ను కలిసి మాట్లాడాడు ఆ మహా నవలా రచయితల సమా వేషం చారిత్రాత్మక మైనది గా భావిస్తారు .
“By the time Dostoyevsky met Dickens, the latter’s father was dead, his wife had been abandoned, his older children were adults, and all but two of his novels had been written and published to great acclaim, but Dostoyevsky’s reminiscence of Dickens’s words indicates that, even after two decades, some sort of conflict of feeling regarding family obligations was still vivid in Dickens’s memory.”
.1881 జనవరి ఇరవై అయిదు న రష్యా రెండవ జార్ చక్ర వర్తిని హత్య చేసిన టెర్ర రిస్ట్ ళ కోసం రష్యా సీక్రెట్ సర్విస్ పోలీసులు వెతుకుతున్నారు . దాస్‌తో విస్కీ అనుచరుడు ,పక్క ఇంటి వాడిపై సెర్చ్ వారంట్ జారీ అయింది గాలిస్తున్నారు . ఆ మర్నాడే దాస్‌తో విస్కీ కి pulmonary haemorrhrage వచ్చ్చింది వెంటనే రెందొడి మూడోది స్ట్రోక్‌లు కూడా వచ్చాయి .చని పోయేటప్పుడు ఆయన నోట బైబిల్ లోని మాథ్యూ అన్న వాక్యాలు బయటికి వచ్చాయి .అంటే మరణించాడు రష్యా పధ్ధతి ప్రకారం శవాన్ని ఒక టేబుల్ మీద ఉంచారు . ఆయన శవ యాత్రలో లక్షకు పైగా అభిమానులు హాజ రాయి నట్లు అంచనా . తిక్విన్ సేమేతరి లో ఖననం చేసి అశ్రుతర్పణం చేశారందరూ . ” .Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.
నార్త్ అమెరికా లోని ఇంటర్నశానల్ దాస్‌తో విస్కీ సొసైటీ భవనం శవ యాత్ర
16-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-13-ఉయ్యూరు
సాహితీ బంధువులకు నేడు ‘’తోలి ఏకాదశి ‘’శుభా కాంక్షలు .