వ్యాస పూర్ణిమ

 వ్యాస పూర్ణిమ

          విపరీతం గా పెరిగి పోయిన వేద వాగ్మయాన్ని నాలుగు వేదాలుగా చక్కగా విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు రాసి ,భారత భాగవత పురాణేతిహాసాలను రచించి అష్టాదశ మహా పురాణాలను నిర్మించి భారత జాతికి అక్షర భిక్షపెట్టిన మహాత్ముడు వేద వ్యాస మహర్షి . సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారం .కృష్ణ ద్వైపాయణుదు అనిపిలువ బడ్డ వాడు . ఇంతకీ వ్యాస దేవుడు ఎక్కడ జన్మించాడు ?నేపాల్ లోని తనాహు జిల్లాలో ఉన్న ‘’దమౌలి ‘’లో జన్మించి నట్లు తెలుస్తోంది .అక్కడ ఆయన భారతాది మహా గ్రంధాలను రాసిన గుహ ఇప్పటికీ ఉందట .వేలాది మంది నిత్యం దర్స్ధించే పుణ్య క్షేత్రం గా వెలసిందట

           విష్ణు మూర్తి యొక్క కాల అవతారం గా వ్యాసుడిని భావిస్తారు . మనకున్న చిరంజీవులలో వ్యాస భగవానుడూ ఉన్నాడు . అద్వైత రుషి పరంపర లో నాల్గవ వాడు .మొదటి వాడు ఆది శంకరాచార్యులు .వ్యాసుడు రాసిన భారతానికి జయ అని పేరు .

    ప్రతి ద్వాపర యుగం లో ఒక వ్యాసుడు ఉద్భవించి ఆర్ష విద్య ను విస్తరిస్తాడు వ్యాసుడు అనే పేరు ఒక అధికారం .మన కృష్ణ ద్వైపాయనుడికి ముందు ఇరవై ఏడుగురు వ్యాసులున్నారు ఈయన ఇరవై ఎనిమిదవ వాడు . మొదటి ద్వాపర యుగం లో స్వయంభువు వ్యాసుడయ్యాడు .రెండవ దానిలో ప్రజా పతి ,మూడులో శుక్రుడు ,ఆ తర్వాత బృహస్పతి ,వసిస్టుడు,త్రివర్షుడు ,సనద్వాజుడు ఇలా ఇరవై ఏడుగురి తర్వాత ద్వైపాయనుడు వ్యాసుడయ్యాడు .

 

        వ్యాస జననం జరిగిన తీరు ఒక సారి గమనిద్దాం . విష్ణు మూర్తి నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడు .ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయటానికి విష్ణువు మానసికం గా సంకల్పిస్తే ‘’అపాంతర తముడు ‘’ఉద్భవించాడు ఈ విష్ణు మానస పుత్రుడు ఆవిర్భ వించచాగానే విష్ణువు ఆనందం టో ‘’వేద వ్యాసా !రా నాయనా .నాకుమారుడి గా మానస పుత్రునిగా జన్మించి నాకు ఆహ్లాదం కల్గిన్చావు .అన్ని మన్వంతరాలలో ఇలానే చెయ్యి తర్వాత పరాశర మహర్షికి కుమారుడివి గా పుట్ట్టు . కురు రాజులు అధర్మాన్ని పెంచి ,హింసా దౌర్జన్యాలను పోషించి లోక కంటకులని పించుకొంటారు అప్పుడు మళ్ళీ వేద వ్యాపకం చెయ్యి నీఎకు రాగ ద్వేష రహితుడైన కుమారుడు జన్మించి నిన్ను మించిన వాడౌతాడు ‘’అని ఆశీర్వ దిస్తాడు విష్ణువు తన మానస పుత్రుడైన అపాంతర తముడిని .

         .మహా భారతం లో వ్యాసుని పాత్ర గణ నీయమైంది . సత్య వతి పరాశర దంపతులకు ద్వైపాయనుడు గా వ్యాసుడు జన్మించాడు . అంటే వసిష్ట మహర్షి పౌత్రడన్నమాట ..కురు పాండవ జననాలకు వ్యాసుడు  సహకరిస్తాడు ద్రుత రాస్త్రుడు పాండు రాజు విదురుడు ఈయన వల్ల జన్మించిన వారే . .

     .    అర్జునుడు మత్చ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వయం వరం లో దక్కించు కొంటె ,ద్రుపద మహా రాజు అయిదుగురికి తన కూతురు భార్య అవటాన్ని జీర్ణించుకోలేక మధన పడుతుంటే వ్యాస బగ వానుడు ప్రత్యక్ష మై ఆమె కారణ జన్మురాలని యాజ్ఞా సేన అని గుర్తు కు చెప్పి  సందేహించ వద్దని హితవు చెప్పాడు . ద్రుత రాస్త్రుడి వద్దకు స్వయం గా తానె వచ్చి కొడుకు దుర్యోధనుని వికృత చేష్టలు కురువంశ నాశనానికి దారి తీస్తాయని అదుపులో పెట్టమని గట్టిగానే చెప్ప్పాడు . పాండవ వన వాసం లో వారి చెంతకు వచ్చి ధర్మ రాజు కు ఊరట కల్గించి ‘’ప్రతి స్మ్రుతి ‘’అనే విద్యనూ బోధించాడు .అర్జునునికి శివుని మెప్పించి పాశు పతాస్త్రం మొదలైన అస్త్రాలు సాధించుకొని జగదేక వీరుడవు కమ్మని ఆశీర్వ దించాడు .

             కొడుకు తన మాట వినటం లేదని నక్క వినయాలు చూపిస్తూ పెద్ద రాజు వ్యాసమహర్శిని స్మరిస్తే ప్రత్యక్ష మయ్యాడు ‘’కురు ,పాండవులలో ఎవరి బలం యెంత “”? అని అడిగితె ‘’ధర్మం ఎక్కడ ఉంటె అక్కడ విజయం ఉంటుంది ధర్మ పక్షాన దేవుడుంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు కనుక వారి బలమే ఎక్కువ .యుద్ధం తప్పక పోవచ్చు .ఇప్పటి కైనా నువ్వు పాండవులతో సంధి చేసుకొని కురు వినాశనాన్ని నివారించు ‘’అని గట్టిగా నే చెప్పాడు .కురు క్షేత్ర సంగ్రామానికి గంటలు మోగాయి భయ పడ్డ గుడ్డి రాజు మళ్ళీ వ్యాసుడిని సంస్మరిస్తే వచ్చి నిలిచాడు అప్పుడు నిర్మోహ మాటం గా వ్యాసుడు ‘’రాజా !కాలం వచ్చేసింది .రాజు లందరూ చచ్చే కాలం మీద పడింది .నీకు యుద్ధాన్ని చూడాలని కోరిక ఉంటె ద్రుష్టి ని ఇస్తాను నీకళ్ళ తో ఆ ఘోరాన్ని నువ్వు చేతులారా తెచ్చుకొన్న దురద్రుస్తాన్ని చూడు ‘’అన్నాడు అప్పుడు గుడ్డి రాజు ‘’నేను ఆ భీభత్సం చూడ లేను కాని నాకు అనుక్షణం యుద్ధ వార్తలు వినాలని కోరిక గా ఉంది ‘’అన్నాడు అప్పుడు మహర్షి ‘’సంజయునికి ఆ శక్తినిస్తాను అతను నీ దగ్గరే కూర్చుని ప్రత్యక్షం గా యుద్ధాన్ని చూడ గలిగే మహిమ,శక్తులను  ఇస్తాను అతడు నీకు చూసినదంతా ప్రత్యక్ష ప్రసారం గా విని పిస్తాడు ‘’అని చెప్పి వెళ్లి పోయాడు .  అందరు కలిసి మాయోపాయం తో అభిమన్య కుమారుని  వధించినపుడు పాండవ శిబిరం శోకం తోఅలమటిస్తుంటే వచ్చి ఓదార్చాడు వ్యాసుడు .

          ఒక సారి రెండు చిలకలు సంసారం చేస్తుంటే చూసి తనకూ పిల్లలు పుడితే బాగుండును అని అనుకొన్నాడు వ్యాసుడు . వెంటనే హిమాలయాలకు వెళ్లి ‘’శక్తి ‘’ని గూర్చి తపస్సు చేశాడు ఆమె ప్రత్యక్ష మై కోరిక చెప్పమంటే ‘’పంచ భూతాలతో సమాన మైన కుమారుడిని ప్రసాదించు ‘’అని కోరాడు .అలాగే జన్మిస్తాడని అభయం పొందాడు

               ఒక సరి అగ్ని కార్యం చేస్తూ .ఆరణిని మదిస్తుంటే ఘ్రుతాచి అనే అప్సరాసచిలుక గా మారి వచ్చింది అతన్ని కవ్వించింది మన్మధ చేష్టలతో అంటే ఆ మహర్షి రేతస్సు స్కలనం చెంది ఆరణి లో పడింది శుక మహర్షి జన్మించి లోకోత్తర పురుషడయ్యాడు .భాగవతాన్ని అందరికి ప్రవచనం చేసి తరింప జేశాడు తండ్రికి మించిన తనయడని పించుకొన్నాడు .వ్యాసుడే కుమారుడు శుకునికి సర్వ శాస్త్రాలు నేర్పాడు . ముక్తి మార్గాన్ని బోధించ మని శుకుడు తండ్రిని కోరితే జనక మహర్షి నేర్ప గల సామర్ధ్యం ఉన్న వాడని చెప్పి అక్కడికి పంపాడు .

         రాబోయే సూర్య సావర్ణి కాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు .వ్యాసుడు కాశీ క్షేత్రం లో ఉండేవాడు ఆయనకు శిష్యులకు ఒకసారి ఏడు రోజుల పాటు భిక్ష ను ఎవ్వరూ వెయ్యలేదు ఆకలితో అలమటించి కాశీని శపించాడు . అప్పుడు విశాలాక్షీ దేవి ముత్తైదువు రూపం లో వారిని ఆహ్వానించి మ్రుస్స్టాన్న భోజనం పెట్టింది శివుడు వ్యాసుని దుర్భాషలాడి కాశీ లో ఉండే అర్హత లేదని వెంటనే కాశీ ని వదిలి వెళ్ళమని శపించాడు వ్యాస కాశీ చేరి తర్వాత దక్షిణ దేశం వచ్చాడు వ్యాస మహర్షి గోదావరి తీరం లో బాసర లో త్రిశాక్త్యాత్మక సరస్వతి దేవిని దర్శించి ఆమె విగ్రహాన్ని ఇసుక తోచేసి ప్రతిస్టించాడు వ్యాసుని పేర అది క్రమం గా ‘’బాసర ‘’క్షేత్రమయింది .

       లోకానికి అక్షర సాహిత్యాన్ని అందించిన తోలి గురువు వ్యాసుడే అందకే ఆయన పుట్టిన ఆషాఢపౌర్ణమిని గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ గా జరుపుకొని ఆ మహాను భావుడిని స్మరిస్తాం తరిస్తాం .      

     మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-7-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.