కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -1
ఉత్తర అమెరికా లోని మెక్సికో ,హోండూరస్ ,నికారుగ్వా ,కోస్టారికా ,పెనామా ,దక్షిణ అమెరికా లోని వెనిజుల ,కొలంబియ ,ఈక్వెడార్ ,పేరు ,బ్రెజిల్ బొలీవియ ,పరాగ్వే ,అర్జంటీనా ,చిలీ ,ఉరుగ్వే దేశాలను లాటిన్ అమెరికా దేశాలని అంటారు .ఈ దేశాల రచయితలు 1960 నుండి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .ఇందులో స్పానిష్ ,పోర్చుగీస్ ,భాషలు మాట్లాడే వారే ఎక్కువ .వీటిని స్పెయిన్ పోర్చుగీసు దేశాలు ఆక్రమించటం వల్ల నే ఈ భాషలు నిలిచినాయి .క్రీశ.1500ప్రాంతం లో 300 ఏళ్ళు యూరోపియన్ కాలనీలు గా ఉన్న దేశాలివి .19 వ శతాబ్దం లోనే విముక్తి పొందాయి .యూరస్ లోని అన్ని ప్రాంతాల జనాలవారు వలస రావటం తో ఆవాస భూములయ్యాయి .ఎక్కువ మందికి స్పానిష్ మాత్రు భాష . బ్రెజిల్ లో మాత్రం ఇంగ్లీష్ ఫ్రెంచ్ డచ్ భాషలు మాట్లాడుతారు
ఈ దేశాలన్నీ యుద్దాలతో ,అంతర్యుద్ధాలతో అతలా కుతల మై పోయాయి .నిలకడ గా ఏ ప్రభుత్వమూ లేదు .వీళ్ళ రచనల్లో ‘’మాజికల్ రియలిజం ‘’ఎక్కువ గా ఉంటుంది .అంతర్యుద్ధాల వల్ల రచయితలూ ఇతర దేశాలలో తల దాచుకొనే వారు .ఇందులో కొందరు సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ సాధించిన వారు కూడా ఉన్నారు .వారిలో కొందరి గురించి సంక్షిప్తం గా తెలుసు కొందాం
1—జార్జి లూయీస్ బోర్జెస్
బోర్జెస్ అర్జెంటీనా లో బ్యూనస్ ఐర్స్ లో1899 లో జన్మించాడు .చిన్ననాటి నుండి కధలు వినటం చెప్పటం అలవాటు .ఆరవ ఏట మొదటి కద రాశాడు .స్కూల్ లో చదువు సాగలేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో జెనీవా కు వెళ్ళాడు ..ఇరవయ్యవ శతాబ్దపు ఈ రచయిత లందరికి స్కూలు చదువు లేదు స్వంతం గా నే అన్నీ నేర్చుకొన్నారు .1921లో మళ్ళీ స్వదేశం చేరుకొన్నాడు .కళ్ళు సరిగ్గా కానీ పించక ఇబ్బంది పడే వాడు .కొంత కాలం లైబ్రేరియన్ గా పని చేశాడు .1928 లో కళ్ళు అసలు కనీ పించేవికావు .తాను చెబుతూ ఉంటె తల్లి రాసి పెడుతూ ఉండేది .నేషనల్ లైబ్రరి కి డైరెక్టర్ అయ్యాడు .దేశానికి ‘’పీరాన్ ‘’అనే వాడు అధికారం లోకి రాగానేఉద్యోగానికి రాజీనామా చేశాడు .తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యాడు .ఇంగ్లాండ్ రాణి బోర్జెస్ కు ‘’నైట్ హుడ్ ‘’ప్రదానం చేసి గౌరవించింది .అమెరికా కాంగ్రెస్ లో షేక్స్ పియర్ పై1976 లో మహాద్భుత మైన ఉపన్యాసం ఇచ్చాడు .1986 జూన్ 14 న 99 ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా గడిపి మరణించాడు
2– గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్
1982 లో నోబెల్ బహుమతి పొందిన ఈ సాహితీ మూర్తి .కొలంబియా లో 1946 లో పుట్టాడు .1956 లో పారిస్ లో ఉన్నాడు ఫిడేల్ కాస్ట్రో క్యూబా ను స్వాధీన పరచుకొనటాన్ని గేబ్రియల్ సమర్ధించాడు . 1965 లో ఒక సారి మెక్సికో లో రోడ్డు మీద వెడుతుంటే ‘’one hundred years of solitude ‘’అనే నవల ప్లాట్ అంతా మదిలో మెదిలింది .వెంటనే ఇంటికి వచ్చి రాయటం ప్రారంభించాడు .ఇది అత్యంత జనామోదం పొందింది ప్రపంచం లో 50 భాషల్లోకి అనువాదం పొంది విశేష మైన కీర్తిని ఆర్జించి పెట్టింది .ఇందులో తమ దేశ చరిత్ర ,ఫిక్షన్ రెండు కలిసే ఉంటాయి .1982 లో దీనికే నోబెల్ బహుమతినిచ్చారు ‘’love in the time of cholera ‘’నవల బెస్ట్ సెల్లర్ అయింది .ఊహాత్మక రచయితగా మంచి పేరుంది
3-.రోసారియో కాస్టెల నాస్
ఈమె 1925 లో జన్మించి 1974 లో మరణించింది .మెక్సికో లో సంపన్నుల ఇంట పుట్టింది .ఆ కాలం లో ఆ దేశాలలో ఆడవాళ్ళకు చదువు చెప్పించే వారు కాదు .1933 లో ఒక స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో ఒక చిన్నారి మరణం త్వరలో జరుగుతుందని జోస్యం చెప్పింది .తమ్ముడు చని పొతే బాగుండునని ఈ పిల్ల అనుకొంటే ఈపిల్ల చస్తే బాగుండు నని తల్లి భావించింది .చివరకు తమ్ముడే చచ్చి పోయాడు .ఆ తర్వాత కుటుంబ ఆస్తి అంతా హారతి కర్పూరం లాగా హరించుకు పోయింది .ప్రభుత్వం వీరి భూములను స్వాధీనం చేసుకొని నేటివ్ ఇండియన్ లకు పంచి పెట్టింది .ఈ విషయాలన్నిటిని ‘’the three knots in the net ‘’నవల లో రాసింది .1948 తలిదంద్డ్రులిద్దరు చని పోయారు ..అప్పటిదాకా గారాబు బిడ్డగా పెరిగింది .1950 డిగ్రీ పూర్తీ చేసింది .స్పెయిన్ లో చదువు కోవటానికి అనుమతి సాధించింది యూరప్ అంతా పర్య టింన్చింది .ఆమె రాసిన ‘’the nine guardians ‘’నవలకు బహుమతి వచ్చింది .భర్త రికార్డో ఫిసాసఫీ ప్రొఫెసర్ .పెళ్లి అయిన కొన్నేళ్ళకు విడి పోయారు
.
రోసారియో చిన్న పిల్లల కోసం చాలా కధలు రాసింది .1966 లో’’ professor for comparative literature ‘’ అయింది .తర్వాతా విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .’’one must laugh ,then since laughter ,as we know is the first manifestation of freedom ‘’అని నవ్వుకు గొప్ప అర్ధం చెప్పిందామె .1971 లో ‘’ఫామిలి ఆల్బం ‘’ విడుదల చేసింది .ఆ ఏడే రాయబారి గా ఆమె ను ప్రభుత్వం నియమించి గొప్ప అరుదైన అవకాశాన్ని కల్గించింది .ఆడవాళ్ళలో ఇంత గౌరవాన్ని పొందిన వారెవ్వరూ అప్పటి దాకా ఎవరూ లేరు ఆమెకే ఆ మొదటి అదృష్టం దక్కింది .49 వ ఏటఇస్రాయిల్ లోని టెల్ అవైవ్ లో1974 august 7 న ఇంట్లో ఎలెక్ట్రిక్ లాంప్ ను అమరుస్తూ షాక్ కొట్టి మరణించింది .ఇక్కడ మన తెలుగు నవలా రచయిత్రి మాది రెడ్డి సులోచనా దేవి గాస్ స్టవ్ ప్రమాదం లో మరణించిన విషయం మనకు గుర్తుకొస్తుంది విధి వంచితలిద్దరూ ‘’రోసారియో కా స్టేల నాస్ ‘’ను ప్రభుత్వ లాంచనాలతో ‘’national heroes ‘’ఉంచే చోట సమాధి చేసి అత్యున్నత గౌరవాన్ని కల్గించారు
26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీ నుండి
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -6-8-13- ఉయ్యూరు
.