గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్-2
కాంట్ కుటుంబ నేపధ్యం బాల్యం విద్య
యూరోపియన్ తత్వ శాస్త్రాన్ని ఒక కొత్త సిద్ధాంతం ద్వారా మలుపు తిప్పిన మహా నీయుడు జర్మనీ కి చెందిన మేధావి ,తత్వ వేత్త ఇమాన్యుల్ కాంట్ .ఆయన సిద్ధాంతానికి ఆయన పేరు మీదుగా ‘’కాంటియన్ సిద్ధాంతం ‘’అన్నారు .మానవ మనసుకు అను గుణం గా బాహ్య ప్రపంచం కనీ పిస్తుందని అయన చెప్పిన కొత్త వాదం .జగత్తు ఫలానా విధం గా మన మనసే నిర్దేశిస్తుందని అందులోని భావం
కాంట్ తూర్పు ప్రష్యా దేశం లో ఒక మారు మూల గ్రామం ‘’కొనిగ్స్ బర్గ్ ‘’లో 1724 ఏప్రిల్ 22న జన్మించాడు .అక్కడే80 ఏళ్ళ వయసులో1804 ఫిబ్రవరి 12న తనువు చాలించాడు .పుట్టిన ఊరు నుండి ఎక్కువగా మరెక్కడికీ పెద్ద గా కదల లేదు . కాంట్ .ఒక వేళ వెళ్ళినా 40 మైళ్ళు దాటి వెళ్ళిన దాఖలాలు లేవు .కాంట్ పూర్వీకులు స్కాట్ లాండ్ దేశీయులు .ఇక్కడికి వచ్చి స్తిర పడ్డారు .జర్మని లోని ప్రొటెస్టెంట్ మతం లో ‘’పయటి స్ట్ ‘’శాఖ కు చెందిన కుటుంబం వీరిది .ఇమాన్యుల్ అంటే‘’భగవంతుడు తోడుగా ఉన్న వాడు ‘’అని అర్ధం .ఆ పేరు తనకు తగిన పేరే నంటాడు కాంట్ .ఆ పేరు ను సార్ధకం చేయటం, దాని పై సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయటం తన లక్ష్యం అనీ చెప్పుకొన్నాడు .కాని కాంట్ కు స్వయం వ్యక్తిత్వం ఉంది ఆత్మ బోధి ఆయన .స్వయం సిద్ధుడు కూడా
కాంట్ తండ్రి ‘’జోహాన్ గార్గ్ కాంట్ ‘’.కస్ట పడే బతుకు బండీ ఈడ్చే వాడు .అయన గుర్రాల జీన్లను ,బండ్లను వాటికి అవసరమైన పరికరాలను తయారు చేసే వృత్తి .అంటే చర్మకార వృత్తి .ఇంటి దగ్గరే వర్క్ షాప్ ఉండేది . అంత మాత్రాన ధనిక కుటుంబం మాత్రం కాదు .నాలుగు వేళ్ళు లోపలి వెళ్ళే సంపాదన మాత్రం ఉన్న వాడు .ఈ కుటుంబానికి సంఘం లో మంచి గౌరవం ఉండేది .ఆ వృత్తి చేసే వారందరికీ ‘’గిల్డు ‘’లు ఉండేవి .గిల్డులోని వారంటే సమాజం లో భద్రతా ,గౌరవం ఉండేది .వీరి కుటుంబం ‘’సాడిల్ మేకర్స్ ‘’వీధిలో కాపురం ఉండేది .ఆ కాలం లో ఈ వృత్తి చేసే వారంతా ఇక్కడే ఉండేవారు . 1730-40ప్రాంతం లో ఈ వృత్తి పని వారికి జీవిక దుర్భరమై పోయింది .పోటీ ఎక్కువై మార్కెట్ లేక పోవటమే దీనికి కారణం .పొట్ట గడవటమే కష్టమై పోయిన కాలం అది .కాంట్ కు తల్లి పోలికలెక్కువ గా ఉండేవి .అదే ఆయన పై గొప్ప ప్రభావం చూపించింది . ఇరవయ్యవ శతాబ్దపు మహిళల కంటే కాంట్ తల్లి బాగా చదువు కొన్న స్త్రీయే .గొప్ప సంస్కృతీ ఉన్న మహిళ గా గుర్తింపు పొందింది .కొడుకు కాంట్ నుతల్లి ‘’అన్నా రేజీనా ‘’ తనతో ఎక్కువ గా బయటికి తీసుకు వెళ్ళేది .తల్లి కన్న తొమ్మిది మంది సంతానం లో ఇద్దరు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మాత్రమె మిగిలారు .
ఎనిమిదవ ఏట ఒక పయతటిస్ట్ స్కూల్ లో చేరాడు అక్కడి మత బోధ కాని ,చదువు కాని కాంట్ కు నచ్చలేదు .పైగా క్రైస్తవ మతం పై విరక్తి కూడా కలిగించాయి .కాంట్ తన సోదరిలా స్వభావాలకు భిన్నం గా ప్రవర్తించే వాడు .ఎవరి తోను ఎక్కువ చనువు గా ఉండే వాడుకాదు .అయితే కుటుంబానికి చేయాల్సిన పనులు అన్నీ బాధ్యత గా నిర్వర్తించే వాడు .
కాంట్ పద మూడవ ఏట తల్లి రేజీనా మరణించింది .అప్పటి నుండి ఆయన జీవితం దుర్భర మై పోయింది .ఆ కాలం లో కొనిగ్స్ బర్గ్ లోను జర్మనీ లో ను ప్రొటెస్టెంట్ మతం లో ‘’పీటిజం ‘’మహా ఉద్యమం గా ఉండేది .చాందస ప్రొటెస్టెంట్ లకు ఇది వ్యతిరేకం .వీరు బైబిల్ ను ఎవరికి వారు స్వతంత్రం గా చదువు కోవాలని ,ప్రతి వ్యక్తికీ ఆరాధనా స్వేచ్చ ఉండాలని .మాతాదికారుల పెత్తనం ఉండ రాదనీ వీరి ఉద్యమం .దీనినే ‘’ఇవాన్జలిక్ ఉద్యమం ‘’అంటారు .ముక్తి అనేది వ్యక్తీ స్వయం గా సాధించి పొందేది అని ,పస్చాత్తాపమే దానికి మార్గం అని చెప్పింది .బగవంతుని కృప వల్లనే మనిషి మారుతాడు ‘’.భూమి పుత్రుడు భగ వంతుని పుత్రుడు గా మారాలి ‘’అనేది వీరి సిద్ధాంతం .పీటిజం హృదయానికి చెందినది .బుద్ధికి సంబంధించింది కాదు ఇది బాగా వ్యాప్తి కావటానికి ఫ్రెడరిక్ రాజు మొదటి విలియం .తన కోసమే వీరిని ప్రోత్సాహించాడు .సుపరి పాలన ,పటిస్ట ఆర్ధికాభి వృద్ధి ,సుశిక్షిత సైన్యం ,మంచి విద్యా విధానం ఎర్పరటమే విలియం రాజు ధ్యేయం గా ,లక్ష్యం గా పెట్టుకొన్నాడు .అందుకోసమే పీటి స్టులను ప్రోత్స హించాడు .పేద పిల్లలకు విద్య కల్పించట మే రాజు లక్ష్యం గా పెట్టుకొన్నాడు .జర్మనీ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పీటిజానికి,’’హాల్లె’’ లోబోధించే దానికి తేడా ఉంది .ఇక్కడ సాంఘిక చైతన్యం బాగా ఎక్కువ .అనాధలకోసం ఎన్నో విద్యాలయాలేర్పడ్డాయి .వ్యక్తిత్వం నిజాయితీ గల పౌరులను తయారు చేయటమే లక్ష్యం గా సాగింది .
కాంట్ ఎలాంటి స్కూల్ లో విద్య నేర్చాడో తెలుసు కొందాం .కొనిగ్స్ బర్గ్ సిటీ కి బయట ‘’ఏకోపాధ్యాయ ‘’బడిలో కాంట్ చేరాడు .ఆ మేస్టారే వారానికో సారి సిటీ జైలు ను పరిశీలించటానికి న తనిఖీ కి వెళ్ళాలి ..ఈ గురువు పేరు ‘’లుడ్విగ్ బోచెం‘’.3R లు అయన దగ్గరే నేర్చాడుకాంట్ .ఎక్కువ కాలం ఇందులో చదవ లేదు .’’SHULZ ‘’ అనే ఆయన కాంట్ తెలివి తేటలను గురించి విని కొడుకు ను ‘’కొల్లీజియం ‘’లో చేర్చమని తండ్రికి హితవు చెప్పాడు .ఆయన దానికి డైరెక్టర్ కాక పోయినా ఆ కోలీజియం తో మంచి సంబంధాలున్న వాడు .
కోలీజియం లో కాంట్ చదువు ఎలా సాగిందో తర్వాత తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-8-13—ఉయ్యూరు .