గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు -ఇమ్మాన్యుల్ కాంట్ -1
ఈ రచనకు నేపధ్యం
నాకు సుమారు పద్దెనిమిదవ ఏడు వచ్చిన దగ్గర నుంచి ఏ వేదాంత ,తత్వ గ్రంధం చదివినా అందులో ఇమ్మాన్యుల్ కాంట్ ను ఉదాహరించని పుస్తకం లేదు .ఆ తర్వాత ఉద్యోగం లో చేరి అనేక చోట్ల పని చేస్తూ అక్కడ ఉన్న లైబ్రరీల లో ఉన్న పుస్తకాలను చదివి నప్పుడూ తరచుగా కాంట్ గురించి ఉండేది .ఇంతకీ ఎవరీ కాంట్ అన్న జిజ్ఞాస నాలో సుమారు యాభై ఏళ్ళ నుంచీ రగులు తూనే ఉంది.కాని ఆయన పై రచన లేవీ నాకు అందు బాటులో క నిపించలేదు .లేక నేనే శ్రద్ధగా వేదక లేదేమోకూడా .శ్రీ అనుభవానంద స్వాముల ‘’సర్వ మత సిద్ధాంత సౌరభం ‘’సీరియల్ పుస్తకాలను చదివిన కొద్దీ వారూ కాంట్ ను పడదే పదే గుర్తు చేసుకోవటం ఆశ్చర్యం కలిగించింది .అలాగే సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని వేదాంత ధార చదివినప్పుడూ ఆయన కాంట్ ను జ్ఞాపకం చేసుకొన్న సందర్భాలున్నాయి .కనుక కాంట్ నన్ను వదలి పెట్ట లేదు బహుశా నేనే ఆయన రచనలను చదివే స్తితి పొందలేక పోయానేమో నని పిస్తుంది .
మొదటి సారి 2002 లో అమెరికా కు టెక్సాస్ లోని హూస్టన్ లో ఉన్న మా అమ్మాయి వాళ్ళ దగ్గరకు వెళ్లి నప్పుడు అక్కడున్న లైబ్రరీ ని బార్న్స్ అండ్ నోబుల్ వాళ్ళ సంస్థల ను ఉపయోగించుకొన్నా నా ద్రుష్టి ఎక్కువ గా ఆంగ్ల సాహిత్యం ,ప్రపంచ సాహిత్యం మీదకే పోయింది తగి నన్ని పుస్తకాలు వెతుక్కొని చదివి చాలా మంది రచయితల గురించి రచనల గురించి చదివాను .ఇప్పుడు కూడా కాంట్ నా ద్రుష్టి లో పడలేదు .ఆయన పుస్తకాల కోసం నేను వెదక లేదు అంటే బాగుంటుందేమో .రెండో సారి మిచిగాన్ లో డెట్రాయిట్ కు మా విజ్జి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కూడా ఆంగ్ల నాటకాలు వివిధ ప్రక్రియలు .వగైరా సాహిత్యాన్నే చదివాను ఇప్పుడూ కాంట్ నాకు అందు బాటులోకి రాలేదు .రాలేదు అంటే నేనే శ్రద్ధ పెట్టలేదంటే సబబేమో .
మూడవ సారి మళ్ళీ మిచిగాన్ కు వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలలు ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకామే చదివాను కాని కాంట్ నా మనసులో ఉన్నా అక్కడ ఏ విభాగం లో ఆయన రచనలుకాని ఆయన గురించి కాని ఉంటాయో తెలుసుకోలేక పోయాను ఇది నా స్వయంకృత అపరాధమే .అయినా నా మనసులో కాంట్ గారు తిష్ట వేసుకు కూర్చున్నాడు .మూడో నెలలో మా ఉయ్యూరు వాస్తవ్యులు ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లో హాంట్స్ విల్ (వేట పాలెం )లో ఉన్నరితైరేడ్ లైబ్రేరియన్ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో ఒక రోజు ఫోన్ లో సంభాషించటం తో అక్కడ మా ఇద్దరికీ స్నేహం,ఆత్మీయత ,ఆప్యాయత ,చిగురించటం మొదలైంది . అంతకు ముందు 2004 లో వారు ఉయ్యూరు ఏ.సి. లైబ్రరీ కి దాదాపు అయిదు లక్షల భారీ విరాళం ఇచ్చి ఇంకో లక్ష రూపాయల పుస్తకాలు అందజేసి, లైబ్రరి ప్రారంభోత్సవానికి జూలై పద్దేనిమిదిన రాష్ట్ర మంత్రులచే జరిగే ప్రారంభోత్సవానికి ఆయనా ఆయన అక్కగార్లు బావ గారు స్వయం గా వచ్చి ఇంకో లక్ష ఖర్చు చేసి ప్రారంభోత్సవాన్ని ఘనం గా నిర్వహించి నప్పుడు ఆ లైబ్రరీ నిర్మాణ కమిటీ కి కన్వీనర్ గా ఉన్న నాకు వారితో తోలి పరిచయమేర్పడింది .మా ఏం ఎల్ సి.రాజేంద్ర ప్రసాద్ పూనిక తో ఇదంతా జరిగింది .ఆ నాటి కృష్ణా జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ గొర్రెపాటి గోపీ చంద్ అమెరికా లో వారిని కలిసి ఈ విరాళాన్ని అర్ధించి మహోప కారం చేశారు వీరూ తగినట్లు స్పందించారు . అందు వల్ల ఉయ్యూరు లో ‘’దక్షిణ భారతం లో అంత వరకు లేని ’మొదటి ఏ.సి.లైబ్రరి ఉయ్యూరు లో’’ వచ్చింది .ఇదీ మా పూర్వ పరిచయం
సరే మిచిగాన్ లో ఉన్న చివరి మూడు నెలల్లో దాదాపు రోజు విడిచి రోజు వారు ఫోన్ లో సమభా షించటం కాని మెయిల్ ద్వారా పలకరించటం కాని చేసే వారు ..వారి శ్రీమతి శ్రీమతి సత్య వతి గారు కూడా తరచూ నాతొ మా శ్రీమతి తో ,మా అమ్మాయి విజ్జి తో మాట్లాడే వారు వారింట కాసిన కూరలను పోస్ట్ లో పంపే వారు. ఇప్పుడే మా ఉయ్యూరు వారు ప్రస్తుతం అమెరికా లో కాలి ఫోర్నియా లో ఉంటున్న ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారితో నాకు ఫోన్ ద్వారా మైనేని గారు పరిచయం చేశారు అంతేకాదు నవంబర్ లో మేము ఇండియా వచ్చినప్పుడే ప్రేమ చంద్ గారూ ఇండియా వచ్చారు ప్రేమ చంద్ గారికి నా చేత సాహితీ మండలి ఆధ్వర్యం లోస్వంత ఖర్చులతో మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ఘన సన్మానం చేయించారు. ప్రేమ చంద్ అంటే మైనేనికి గురు భావం ఆత్మీయ భావం
అప్పుడప్పుడు మా సంభాషణలలో కాంట్ గురించి వచ్చేది నేను కాంట్ పుస్తకాలు నాకిక్కడ దొరక లేదని చెప్పాను .ఆయన ఫి లాసఫీ పుస్తకాలున్నా చోట వెదక మని సలహా ఇచ్చారు చూశ లాభం లేక పోయింది ఆయన ఎప్పుడూ ‘’ప్రసాద్ గారూ !మీకు ఏ పుస్తకం కావాలన్నా నాకు చెప్పండి నాలుగు రోజుల్లో మీ దగ్గిరకు వచ్చేట్లు చేస్తా‘’ననే వారు ఆబగా మొదట్లో కొన్ని అడిగితే పంపారు కొన్ని ఆయనే నేను తప్పక చదవాల్సిన పుస్తకాలు అని ఎన్నో పంపారు .వాటి ఖరీదు పోస్టల్ ఖర్చు చూసి నేను క్రమం గా అడగటానికి జంకే వాడిని .కాని ఆయనకివేమీ పట్టేవి కాదు ఎన్నోవిలువైన పుస్తకాలు పంపి నాతొ చదివించిన మార్గ దర్శి గోపాల కృష్ణ గారు. మా ఆత్మీయత క్రమం గా పెరిగింది కాంట్ గురించి సరైన పుస్తకాలు లేవని అంటూనే శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు కాంట్ ఫిలాసఫీ మీద రాసిన చిన్న పుస్తకం పంపారు .అది నేను చదివాను కాని ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు .ఆ మాటే చెప్పాను ఫోన్ లో ‘’అంతే నండీ !’’అన్నారు .కాని ఊరుకో లేదు మరో ఇంగ్లీష్ పుస్తకం పంపారు .అదీ నాకు ‘’గ్రీక్ అండ్ లాటిన్ ‘’అని పించింది అయ్యో కాంట్ గారు చేరువ కాలేక పోతున్నారు అని దుగ్ధ మాత్రం వదలలేదు .2008 నవంబర్ లో ఇండియా వచ్చాం .
మా ఇద్దరి మధ్యా ఆత్మీయత పెరిగుగుతూనే ఉంది .కాంట్ గారిపై ‘’kant ,a biography –by Manfred kuechinరాసిన జీవిత చరిత్ర ను నాకు పోస్ట్ లో పంపారు .అది అందగానే చదివేశాను బాగా రాశాడు రచయిత .ఆ మాటే వారికి చెప్పి కృతజ్ఞతలు జేశాను .కాని అందులో ఆయన ఫిలాసఫీ మాత్రం నాకు ఇంకా అర్ధం కాలేదు ఎలా ఎలా అని ఎదురు చూస్తున్నాను తెలుగు విజ్ఞాన సర్వస్వం తిరగేశాను .ఎన్సైక్లో పెడియా బ్రిటానికా చూశాను.కాని దారి దొరక లేదు .అయినా కాంట్ గురించి నాకు తెలిసింది రాద్దాం అనుకోని 2012 లో నాలుగో సారి అమెరికాలోని నార్త్ కెరొలినా కు వెళ్ళే ముందు కొంత రాశాను .’ఇండియా వచ్చిన తర్వాత వెదికితే అది నాకు కనీ పించలేదు నిరుత్సాహ పడ్డాను .కాని అనుకో కుండా మా బావ మరిది ఆనంద్ ఇంట్లో హైదరాబాద్ లో నండూరి రామ మోహన రావు గారు రాసిన‘’విశ్వ దర్శనం ‘’పుస్తకం కనీ పించింది ఆబగా చదివేశాను ఆయన కాంట్ ఫిలాసఫీ ని అద్భుతం గా అర్ధం చేసుకొని విశ్లేషించి సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు రాశారు అది నా పాలిటి చింతామణి అని పించింది. అది అడిగి తెచ్చుకొన్నాను ఇంకఆలస్యం చెయ్య కుండా కాంట్ గారి పై బృహత్ వ్యాసం రాయాలని సంకల్పించాను ఎన్నో ఏళ్ళ నా కోరిక తీర్చుకోవాలని తహ తహ లాడాను 21-5-2013 న ప్రారంభించి,24-5- 13 తో 46 పేజీల బృహత్ వ్యాసం తయారు చేశాను . .దీనినే ఇప్పుడు ధారా వాహిక గా అందజేస్తున్నాను .ఎన్నో పేర్లు ఆలోచించి చివరికి ‘’గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు ఇ మ్మాన్యుల్ కాంట్ ‘’అని శీర్షిక గా ఎంచుకొన్నాను .ఈ రచనకు బాగా తోడ్పడిన పుస్తకాలు ఆంగ్లం లో మాన్ ఫ్రెద్ రాసిన కాంట్ జీవిత చరిత్ర మరియు నండూరి వారు రాసిన విశ్వ దర్శనం .
నాలుగో సారి లో అమెరికా కు వెళ్లి నప్పుడు మైనేని వారింటికి వెళ్లి వారిని సందర్శించాను ఆకుటుంబం నాపై చూపిన ఆదరాభి మానాలు మరువ లేనివి ..నన్ను బస్ ఎక్కిస్తూ,నా జేబులో 500 డాలర్ల చెక్ పెట్టిసరస భారతికి కాని ఏదైనా సత్కార్యానికి కాని వినియోగించామన్నారు .నా నోట మాట రాలేదు దాదాపు పాతిక వేల రూపాయలు , అక్కడ వారి మిత్రు లందరికి పరిచయం చేహారు అందుకే వారిచ్చిన డబ్బు తో నేను రాసిన ‘’సిద్ధ యోగి పుంగవులు‘’పుస్తకాన్ని ‘’సరస భారతి’’ తరఫున ప్రచురించి వారి కోరిక పై వారి తల్లి గారికి అంకిత మిచ్చాను .ఇలా వారి సొమ్మును సద్వినియోగం చేశానని తృప్తి చెందాను . నాకు కాంట్ పై గ్రంధాలను పంపి ,ఈ రచన కు తోడ్పడి ప్రోత్సహించిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఆత్మీయం గా ఈ ‘’గణిత విజ్ఞాన వేదాంత ,తత్వ శాస్త్ర కోవిదుడు ఇమ్మాన్యుల్ కాంట్ ‘’ బృహత్ వ్యాసాన్ని అంకిత మిస్తున్నాను .అసలు కద రేపటి నుంచి –
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-8-13- ఉయ్యూరు