వి ‘’భజన ‘’పరులు
ఇద్దరూ ఒక్క పార్టీ వాళ్ళే
ఏక వాక్యం తో విభ (భు )జించితే కేరింతలతో
‘’వీర భక్తి’’ ప్రదర్శించిన వారు కొందరు
ఒక్క కలం పోటు తో ముక్కలు చేసినందుకు
‘’వైర భక్తి ‘’ ప్రదర్శించారు ఇంకొందరు
మొదటి వారు -ఇచ్చినమ్మ అత్తకు భర్తకూ
హారాలు ఫలహారాలూ పాలాభిషేకాలు చేస్తే
రెండో వారు అవే బొమ్మలకు
చెప్పులదండలేసి చీకొట్టి విరగ్గొట్టారు
పైనున్న గుడ్డి ప్రభుత్వం పార్టీ
ఇద్దరూ తమ వారే నని భుజాలు చరచుకొన్నారు
అత్త కంటే ఏడాకులేక్కువ చదివిందని వారంటే
అత్తకన్నా పోడి చేసినావిడేం కాదని వీరంటారు
అంతా ఆ తాను గుడ్డలే
ఒకరిది వీరభక్తి వేరొకరిది వైర భక్తీ అంతే
ఇద్దరి భజనా ఏక తీరు కాపోయినా ఏక వ్యక్తికే
పాపం అక్కడొక ప్రధాని ఉన్నాడని ఒక ప్రభుత్వం ఉందని
ఇక్కడా ఒక సి.ఏం ఉన్నాడని
ఆయనకో ఆత్మ ఉందని అంతా మర్చిపోయారు
డిప్యూటీ మాత్రం ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకో వచ్చు
అసలు వారు మాత్రం నోరు మూసుకోవాలా ?
అంటున్నారు రహస్యం తెలిసిన వాళ్ళు
అందుకే ప్రజలు అన్ని వర్గాల వారు ఒక్క తాటి పై నిలిచి
అందరికి బుద్ధి చెప్పటం ‘’తొమ్మిదో వింత’’ అయి కూర్చుంది
రాజీ ‘’నామాలు ‘’పెట్టి ఇక మోసం చెయ్యలేని స్తితి కల్పించి
మార్గ దర్శనం చేస్తున్న యువత విద్యార్ధి లోకం ,ఉద్యోగులు
ప్రపంచ ద్రుష్టినే ఆకర్షిస్తున్నారు
పార్టీల కు అతీతం గా ఉద్యమించి సాధిస్తారని
అందరి ప్రగాఢ విశ్వాసం
ఇక ఎవ్వరూ తోక ఝాడించ లేరని
నమ్ముతున్నారు ఆశా వాదులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-13—ఉయ్యూరు
Reblogged this on aksharaalu – Best Collections.