గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్- 5
రచనా వ్యాసంగం
భౌగోళికం గా కొనిగ్స్ బర్గ్ చాలా మారు మూల ఉండటం వల్ల ఇక్కడి యూని వర్సిటి లో అన్ని ఫాకల్టీ లను బాగా బోధించే వారు కాదు .కొన్ని అసలు బోధనకే నోచుకో లేదు .ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర బోధనా ఉన్నా సరైన ప్రయోగ శాలలు లేవు .బీద విద్యార్ధులు ఎక్కువగా ఇక్కడ ఉండటమే అసలు కారణం .అంటే తగినంత ఆర్ధిక ననరులు ఉండేవికావు .జర్మనీ లో అన్ని చోట్ల కంటే ఇక్కడ జీవ శాస్త్ర బోధన పరమ నాసి రకం గా ఉండేది .1744లో ఈ వర్సిటి లో 44మంది ప్రోఫెసర్లుండే వారు .జీతాలు చాలా తక్కువగా ఇచ్చేవారు .లెక్చరర్లకు అసలు జీతాలే ఉండేవికావు .విద్యార్ధులు కట్టే ఫీజుల మీదే వారి ఆధారం .అందుకే జీవనానికి వేరే మార్గం లో సంపాదిన్చుకోవాల్సి వచ్చేది .కొంత మందిలెక్చరర్లు విద్యార్ధుల కోసం డార్మిటరీ లు నిర్వహించేవారు కొందరు విద్యార్ధులను తమ ఇళ్ళల్లోనే ఉంచుకొనే వారు .ఫిలాసఫర్ లకు అందరి కంటే అతి తక్కువ జీతాలు ఉండేవి. సాధారణం గా ఫిలాసఫీ కి అంత గిరాకీ ఉండేది కాదు .దియాలజీ కి మంచి క్రేజ్ ఉండేది .దీన్ని బోధించే ప్రొఫెసర్లకు జీతాలు బాగా ఎక్కువ .వీరికి పలుకు బడి కూడా అధికం గా ఉండేది .ఇక్కడి ప్రొటెస్టెంట్ మతం లో అరిస్టాటిల్ సిద్ధాంత బోధనే ఎక్కువ గా ఉండేది .క్రమం గా మతాధి పతుల పెత్తనాన్ని తగ్గించేశారు .ఇమాన్యుల్ కాంట్ చేరే నాటికి దాన్ని ఇంకా బోధిస్తూనే ఉన్నారు .
1726 లో ‘’హాల్లె ‘’సిద్ధాంతాలతో దియాలజి ని బోధించాలని నిర్ణయించారు .కొనిగ్స్ బర్గ్ లోని ప్రీస్ట్ అయిన అబ్రహాం ఉల్ఫ్ వద్ద శుద్ధత్వం (కేరక్టర్ ),విద్యా సర్టిఫికేట్ లు ఉంటేనే మతాధికారి గా నియమించే వారు .పీటిస్ట్ ల ప్రభావం 1740 వరకు ఉచ్చ స్తితి లో ఉండేది .కాంట్ యూని వర్సిటి లో చేరే నాటికి ఫిలాసఫీ లో ఎనిమిది మంది ప్రోఫెసర్లుండే వారు ..ఎంతో మంది అసోసియేట్ ప్రొఫెసర్లు గా ఉండే వారు .వీరికి తోడూ లేక్చరర్లుండే వారు .వీరంతా గ్రీక్ ,హీబ్రు ,ఛందస్సు ,కవిత్వం ,చరిత్ర ,తర్కం ,వేదాంతం ,అనుస్టాన వేదాంతం ,గణితం ,భౌతిక శాస్త్రాలు బోధించే వారు .జర్మనీ లోని మిగిలిన యూని వర్సిటీల కంటే కొనిగ్స్ బర్గ్ లో ‘’మెటా ఫిజిక్స్‘’నేర్చుకొనే వారు ఎక్కువ అని విజిటర్లు సంతోషించేవారు .ఇదే సమయం లో Knewtzen ‘’అనే ఆయన జర్మనీ భాష లో ‘’philosophical proof of Christianity ‘’రాసి ప్రచురించాడు ఆయన పద్దెనిమిదవ శతాబ్దపు గొప్ప ఫిలాసఫర్ .ఈ విశ్వ విద్యాలయం లోనే కాంట్ కు ఫిలాసఫీ ,దియాలజి ,నేచురల్ సైన్స్ లతో గాఢ పరిచయ మేర్పడింది .అప్పటికి ఫిజికల్ సైన్స్ లో ముఖ్యం గా ఖగోళ శాస్త్రం లో గొప్ప పండితులేవరూ లేరు .ధీ రిటి కల్ ,ప్రాక్టికల్ ఫిజిక్స్ లలో కాంట్ సాధించింది ఇక్కడేమీ కనీ పించదు .
కాంట్ లోని అసమాన వేదావితనం వల్ల యూని వర్సిటి లో చేరిన నాలుగేళ్ళకే ‘’thoughts on the true estimation living forces ‘’ అనే గొప్ప వ్యాసాన్ని రాశాడు అంటే ఇరవై ఏళ్ళ వయసులో రాశాడన్న మాట .. ఈ రచనకు తనను ప్రేరేపించిన్దేమితో కాంట్ ముందు మాటల్లో ఏమీ చెప్ప లేదు .ఆయన చేసిన ‘’the great masters of knowledge ‘’అనేది లీబ్నిజ్ ,న్యూటన్ లను ఉద్దేశించికాదుకూడా . జర్మని పబ్లిక్ కంటే కొనిగ్స్ బర్గ్ ఎకాడమిక్ కమ్యూనిటీ ని ఉద్దేశించే రాసినట్లున్తుంది . కాంట్ ‘’మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ ‘’ప్రవేశ పెట్టటం ప్రారంభించాడు .’’కదిలే వస్తువులు లోపల ఉన్న ఫ్రీ మోషన్ వల్ల కదుల్తాయి ‘’అని చెప్పాడు .అందుకే వేగం ఎప్పుడూ సమానం గా నే ఉంటుందని వివరించాడు .వస్తువుల స్వేచ్చ ,అనంత వేగం లను కొలవటానికి ‘’లివింగ్ ఫోర్స్ ‘’మాత్రమె కారణం అన్నాడు .దీన్ని లీబ్నిజ్ సిద్ధాంతాల నాధారం గానే అర్ధం చేసుకోవాలి .’’ఫ్రీ మోషన్ ఉన్నప్పుడే లివింగ్ ఫోర్స్ ‘’ఉంటుందని తేల్చాడు .ఈ లివింగ్ ఫోర్స్ ‘’monad ‘’తో సంబంధం కలిగి ఉంటుందని చెప్పాడు .’’ప్రపంచ స్తితి ముందే ఏర్పాటు చేయ బడి ఉంటుంది’’ అన్నది కాంట్ భావన .వస్తువుల లోని అంతరిక సిద్ధాంతాలు బయటి వాటితో ఏక స్వరం తో అంటే ‘’హార్మని’’తో ఉంటాయి అంటే లోపలి వాటికి బయటి వాటికి వ్యతిరేకత ఉండదు .’’ఆత్మకు దాని చలనం దానికి ఉంటుంది .ఇది ఇతర మైన వాటిని కదిలించనూ గల శక్తి కలిగి ఉంటుంది ‘’అని సిద్ధాంతీకరించాడు
1744 లో అంటే కాంట్ కు ఇరవయ్యి ఏళ్ళు వచ్చే తండ్రి చని పోయాడు .కుటుంబ బాధ్యత అంతా పేద్ద వాడైన కాంట్ మీదే పడింది .కాంట్’’ మెటా ఫిజిక్స్ ఆఫ్ మోరల్స్ ‘’రాసి నట్లే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించి వారి ఆలనా పాలనా చూశాడు .1748 లో ప్రైవేట్ ట్యూటర్ గా ‘’Judschen ,Arnsdorf ,Rauten burg లలో పని చేశాడు తండ్రి ఎస్టేట్ వ్యవహారాలూ చూశాడు .కాంట్ విద్యార్ధి జీవితం అంత ఆనందమయం గా గడవ లేదు .ఆర్ధిక సమస్యలే కాదు అయన స్వేచ్చ బౌద్ధిక ఎదుగుదలకు అడ్డంకు లేర్పడ్డాయి .ఇరవైనాలుగు ఏళ్ళకే స్వంత కాళ్ళ మీద నిల బడి తన సత్తాను చాటుకొన్నాడు . సమూలం గా జీవితాన్ని మార్చుకో గలిగాడు .
ఫాస్టర్ ఆన్ ద్డ్రీచ్చ్ ,బెర్న్ హార్డ్ ఫ్రీడ్రిచ్ వాన్ హోల్సన్ ,కీసర్లిన్గ్స్ అనే వారు తమ పిల్లలకు కాంట్ తో చదువు చెప్పించుకొన్నారు .అది ఆ విద్యార్ధులకు పట్టిన అరుదైన అదృష్టమే ఆన్డ్రిచ్ కున్న అయిదుగురు కొడుకులలో ముగ్గురికి కాంట్ చదువు చెప్పాడు .అందులో ఒకడు ‘’వైన్ మర్చంట్ ‘’అయ్యాడు .కాంట్ కు ఆ తర్వాతా మంచి దోస్త్ గా ఉన్నాడు కూడా .కొనిగ్స్ బర్గ్ కు అరవై మైళ్ళ దూరం లో ‘’హల్సన్ ‘’గారి ఎస్టేట్ ఉంది .ఈ కుటుంబం తో కాంట్ కు మంచి అను బంధమేర్పడింది .ఆయన అక్కడి నుండి వెళ్లి పోయిన తర్వాతా కూడా కాంట్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాడు .ఆ రోజుల్లో ప్రైవేట్ ట్యూటర్ ను ‘’hofmeister ‘’అనే వారు కాంట్ తనను గూర్చి చెప్పుకొంటూ .’’ I am worsr private teacher or hofmeister ‘’అని అనుకొన్నాడు .అదొక బాదర బందీ వ్యవహారం అని పించేది ఆయనకు .కాని తనకు తెలియ కుండానే గొప్ప టీచర్ అని పించుకొన్నాడు కాంట్ .ఈ ‘హాఫ్ మీస్టర్ ‘’’గా ఉన్నకాలం లో తన విధానాలకు ,నైపుణ్యానికి మెరుగులు దిద్దు కొన్నాడు .ఇలా జీవితాన్ని గడుపుతూనే ‘’general natural history and theory of the Heavens or An essay on the constitution and mechanical origin of the whole Universe Treated in accordance with Newtonian principles ‘’రాయటం పై ద్రుష్టి సారించాడు
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –14-8-13- ఉయ్యూరు