గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -6
డాక్టర్ కాంట్ –మీజిస్టర్
1754 లో ముప్ఫయ్యవ ఏట కాంట్ .’’whether the earth has changed its revolution ‘’,’’on the question whether the earth aging from physical point of view’’అనే రెండు ప్రఖ్యాత వ్యాసాలు రాశాడు .31 వ ఏట 1755 లో ‘’మీజిస్టర్ ‘’గాఅంటే లెక్చరర్ గా ప్రమోషన్ పొందాడు .దీనికి కారణ మైనది ఆయన దీసిస్స్ ‘’on fire ‘’.దీన్ని succeinet meditation on fire ‘’అన్నాడుప్రొమోషన్ కు కావలసిన ఫీజు ను బాబాయి రిచ్ స్టర్ ‘’కట్టాడు .నాలుగు వారాల తర్వాతా పబ్లిక్ పరిక్ష రాసి జూన్ పన్నెండు న డాక్టరేట్ పొందాడు .’’Hahn ‘’అనే ఆయన కాంట్ పేరు ను రిజిస్టర్ చేశాడు .అప్పుడు కాంట్ ‘’on the essay and through instruction in philosophy ‘’అనే విషయం మీద గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు .దీనితో కాంట్ కు ప్రాముఖ్యం పెరిగింది .ఆయనది ‘’ఎక్సెలెంట్ బ్రెయిన్’’ అన్నారంతా . కాంట్ రాసిన’’ a new exposition of the first principle of meta physics ‘’చూసిన కొనిగ్స్ బర్గ్ వర్సిటి అధికారులు అదేయూని వర్సిటి లో లెక్చర్లు ఇవ్వటానికి అంగీకరించారు .1755 నాటికి కాంట్ ప్రతిభ తెలియని వారే లేక పోయారు .1756 లో లిస్బన్ లో జరిగిన మూడు భూకంపాలపై మూడు వ్యాసాలూ రాశాడు .1756 లో ఏప్రిల్ 25 న రాసిన ‘’new remarks about the explanation on the theory of winds ‘’ను సమ్మర్ సెమిస్టర్ కు విషయం గా ఎంచుకొన్నాడు
లీబ్నిజ్ ,ఉల్ఫ్ ల రెండు ప్రాధమిక సిద్ధాంతాలకు కాంట్ అభ్యంతరం చెప్పాడు .అవే ‘’ప్రిన్సిపిల్ ఆఫ్ కాంట్ర డిక్షన్ ,ప్రిన్సిపిల్ ఆఫ్ సఫీషి ఎంట్ రీజన్’’ .కాంట్ సఫీషి ఎంట్ రీజన్ ను మార్చి కొత్త నిర్వచనమిచ్చాడు కొత్త పద్ధతిని ఆచరణ లోకి తెచ్చాడు .అదే ‘’the system of universal connection of substances ‘’కాంట్ దృష్టిలో దేవుడు ఒక ప్రాధమిక పదార్ధం .అదే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది .మొదట్లో దానికి చలనం లేదు .మొదటి చలనం దేవుడి నుంచి రాలేదు ప్రకృతి శక్తుల ప్రభావం వల్లనే చలనం వచ్చింది ఆ చలనం నిరంతరం అనంతం గా సాగి పోతుంది .మన ఆత్మ ఏదో ఒక గ్రహం లో ఉండే ఉంటుంది అంటాడు కాంట్ .ప్రపంచానికి ప్రారంభం ఉంది కాని అంతం లేదు .’’నాకు పదార్ధాన్ని ఇస్తే ప్రపంచం ఎలా ప్రభవిన్చిందో చూపిస్తాను ‘’అనే వాడు కాంట్ .
1796 లో ‘’లాప్ లేస్ ‘’చెప్పినటు వంటిదే కాంట్ చెప్పిన ‘’జెనరల్ థీరి ‘’ఇదే19 వ శతాబ్దం లో ‘’కాంట్ –లాప్ లేస్ ‘’సిద్ధాంతం అయింది .ఈ సిద్ధాంతం కాంట్ బ్రతికుండగా ప్రాచుర్యం పొందలేదు .దీనికి కారణం పబ్లిషర్ దివాలా తీయటం ఒకటి అయితే రెండో కారణం చాలా కాపీలు పబ్లిషర్ ఇంట్లో నాశనం కావటం .ఇప్పుడు కాంట్ మీజిస్టర్ అయ్యాడు కనుక యూని వర్సిటి లో సబ్జెక్టులు బోధించటానికి అర్హుడు కూడా అయ్యాడు .వర్సిటి మాత్రం దీనికి జీతం ఏమీ ఇవ్వదు .విద్యార్ధుల ఫీజులే ఆధారం .వేరే ఆదాయం లేక పొతే బతకటం కష్టమే .లెక్చరర్లు యూని వర్సిటి రూముల్లో కాకుండా ప్రైవేట్ లెక్చర్ హాల్స్ లో పాఠాలు బోధించాలి .
కాంట్ బోధించే హాల్స్ అన్నీ విద్యార్ధులతో నిండి పోయేవి .అంత మాత్రం చేత అందరికీ ఆయన ఇష్టం అని ఏమీ భావిన్చక్కరలేదు .జీవిక కోసం చాలా లేక్చర్లిచ్చాడు 1755-56- మొదటి సెమిస్టర్ లో లాజిక్ ,మెటాఫిజిక్స్ ,గణితం ,ఫిజిక్స్ బోధించాడు .సమ్మర్ సెమిస్టర్ లో జాగ్రఫీ ,ఎథిక్స్ చెప్పాడు దాదాపు 16-24 లెక్చర్లు ఇచ్చేవాడు .ఇంత అరచుకొన్నా ఆదాయం మాత్రం అంతంత మాత్రమె .ఆయన దగ్గర ఖజానా లో 20 బంగారు నాణాలున్దేవి .వాటిని చాలా భద్రం గా దాచుకొనే వాడు ఎప్పుడే అవసరం వస్తుందో నని జాగ్రత్త .కాని వాటి జోలికేప్పుడూ పోలేదు దానిని కాంట్ ‘’ఐరన్ రిజర్వ్ ‘’అని ముద్దుగా పిలుచుకొనే వాడు .చినిగే దాకా ఒకే కోటు వేసే వాడు స్నేహితులు కొత్తది కొనిస్తామన్నా వద్దని వారించే వాడు .మొదటి మూడేళ్ళు ఇబ్బందులతోనే గడిపాడు .తరువాత కొంత నయం .మంచి బోధకుడిగా కాంట్ పేరు మారు మ్రోగింది .కాంట్ ఖచ్చిత మైన ఆహార నియమాలేవీ పాటించి నట్లు కనీ పించదు .కానీ ఆయన ఖచ్చిత మైన దిన చర్య ను మాత్రం పాటించాడు
కాంట్ దిన చర్య
కాంట్ దిన చర్య గురించి చరిత్రకారు లందరూ ప్రస్తావించారు .ఆయన గడియారానికే సమయ పాలన చెప్పి నట్లు గా ప్రవర్తించే వాడు కార్య క్రమాలన్ని సమయ బద్ధం గా ,అన్నికాలాల్లోను జరిగి పోయేవి నియమ ,నిస్ట ఉన్న చింతనా పరుడు కాంట్ .ఉదయం అయిదింటికే నిద్ర లేవటం కాఫీ తాగటం రాసుకోవటం కాలేజికి వెళ్లి పాఠాలు చెప్పటం ,మధ్యాహ్నం ఒంటి గంటకు ఎక్కడ వీలైతే అక్కడే భోజనం చేయటం.సాయంత్రం షికారు అన్నీ సమయాన్ని పాటించి చేసే వాడు వాహ్యాళి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి కిటికీ లోంచి చర్చి గోపురాన్ని చూస్తూ ధ్యాన నిమగ్నడయ్యే వాడు ఖచ్చితం గా రాత్రి పదింటికి నిద్ర పోయే వాడు .
ఖచ్చితం గా మధ్యాహ్నం3-30 కి వీధి గుమ్మం దాటి షికారుకు బయల్దేరే వాడు .ఒక్క సెకను అటూ ఇటూ ఉండేది కాదు .ఆయన్ను చూసి గడియారాల టైం ను సరి చేసుకొనే వారు ‘’.lime tru ‘’ అనే ప్రదేశం లో షికారు చేసి,ఇల్లు చేరే వాడు .ఆయన వాహ్యాళి చేసిన ఆ ప్రదేశాన్ని ‘’ఫిలాసఫర్స్ వాక్ ‘’అనే వారట..వాన వస్తే ,ఆయన దగ్గర పని చేసే ముసలి నౌకరు గొడుగు పట్టి వెనక నడిచే వాడు .30 ఏళ్ళు గా కాంట్ దిన చర్య లో ఏ మాత్రం మార్పు లేదు దటీజ్ కాంట్ ..
ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త గా కాపాడుకొనే వాడు .బజారు లోకి వస్తే నోట్లోంచి గాలి లోపలకు పోకుండా జాగ్రత్త పడే వాడు .రోగ కారక సూక్ష్మ జీవులు నోట్లోంచి శరీరం లోకి వ్యాపిస్తాయనే ఈ జాగ్రత్త .మితం గానే భోజనం చేసే వాడు .దారిలో తెలిసిన వారు నీ పించినా మితం గానే మాట్లాడే వాడు .కాలక్షేపానికి పేక ఆడే వాడు .బిలియర్డ్స్ కూడా ఇష్టం గా ఆడే వాడు .ఆయన చెప్పుకొనే ‘’లక్సరీ ‘’అంటే విలాసం ఒక్కటే అదే పైప్ కాల్చటం
అమోఘ పాండిత్యం
కాంట్ కు ఈస్తటిక్స్ అంటే ఏమిటో తెలియదు .కవిత్వం ,సంగీతం పట్ల మోజు లేదు .తత్వా శాస్త్ర చరిత్రనే ఆయన అభ్య సించ లేదు .ఇది మరీ విడ్డూరం .లీబ్నిజ్ ,వోల్టైర్ ,ఉల్ఫ్ ,రూసో లను కాచి వడబోశాడు కాంట్ .బ్రిటిష్ తత్వ శాస్త్ర ,సాహిత్యాలను అధ్యయనం చేశాడు .న్యూటన్ ఆవిష్కరించిన సిద్ధాంతాలను జీర్ణించుకొన్నాడు .మేధావి కాంట్ తత్వ వేత్త కంటే సైంటిస్ట్ గానే జీవించాడు తనకు తెలిసిన విజ్ఞానాన్ని అందరికి అందించాలన్న తపన తో సులభ శైలిలో ఫిజిక్స్ ,ఖగోళ ,భూగర్భ ,ఆన్త్రో పాలజీ లపై గ్రంధాలు రాశాడు .డార్విన్ చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకొని దాని వ్యాప్తికి మార్గం సుగమం చేశాడు .
సశేషం
67 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –15-8-13 –ఉయ్యూరు