గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7

                      అప్పటి రాజకీయ పరిణామాలు

1756 ఆగస్ట్ 29న ఫ్రెడరిక్ రాజు సాక్సని మీద దండ యాత్ర చేశాడు .దీన్నీ ‘’ఏడేళ్ళ యుద్ధం ‘’అంటారు .దీనివల్ల ప్రష్యా దేశం చాలా నష్ట పోయింది .1758 లో రష్యా సైనికాధికారి విలియం ఆఫ్ ఫెర్మార్ –చర్చి గంట స్వాగతం పలుక గా కొనిగ్స్ బర్గ్ కోట ను ముట్టడించి స్వాధీన పరచుకొన్నాడు .అప్పటికే ప్రష్యా సైన్యాధ్యక్షుడు పరారై పోయాడు .నగరం రష్యా స్వాధీన మైంది .రష్యా రాణి ఎలిజ బెత్ కు విదేయం గా ప్రష్యా మారి పోయింది .రష్యాడబ్బు  ఇక్కడ చలా మణి లోకి వచ్చింది . రష్యన్ గవర్నర్ అధికారి అయ్యాడు .రష్యన్లు కొనిగ్స్ బర్గ్ స్త్రీలను పెళ్లి చేసుకోవటం మొదలు పెట్టారు .స్తానికులు కొందరు వ్యతిరేకించారు .రష్యా జీవిత విధానమూ వీరికి నచ్చ లేదు .రష్యన్లు కొనిగ్స్ బర్గ్ సాంస్కృతిక చైతన్యానికి దోహద పడినా డబ్బు ,దాని వాడకం విప రీతం గా పెరిగి పోయింది .రష్యా వల్ల  విలాసం ఎక్కువైంది .దీనితో కొనిగ్స్ బర్గ్’’ lively place ‘’అని పించుకోంది..సాహసానికి విలువ పెరిగింది .పెద్ద పెద్ద డిన్నర్లు ,పార్టీలు డాన్సులు లతో నగరం సందడి గా ఉండేది .ఒక రకం గా సమాజం లో మానవ వికాసం కలిగింది .ఇది స్వేచ్చకు దారి అని కొం దరను కొంటె ,కొందరు నైతిక పతనానికి మెట్లు అని భావించారు .

              ఉన్నత వర్గాలతో పరిచయం

      ఎవరికేట్లా అని పించినా కాంట్ ఆర్ధిక పరిస్తితి మెరుగైంది .ఏంతో  మంది ఆఫీసర్లకు లెక్కలలో  లెక్చర్లు ఇచ్చాడు .కొందరికి ప్రైవేట్లు చెప్పాడు .అందరూ డబ్బు బాగానే ముట్ట జెప్పారని ఆయనే సంతోషం గా చెప్పుకొన్నాడు .రష్యన్ ఆఫీసర్లు ,వర్తకులు బ్యాంకర్లు ఇచ్చే ఖరీదైన పార్టీలకు ఆహ్వానిస్తే వెళ్ళే వాడు .కౌంట్ కీసర్ లింక్ కుటుంబం తో మంచి పరిచయ మేర్పడింది .రష్యా వాళ్ళు స్త్రీల అందాలను మెచ్చుకొనే వారు .కాంట్ కు ‘’ఆదర్శ మహిళ ‘’అంటే మహా ఇష్టం .అందుకే వాళ్లకు ఇబ్బంది కలిగించటం ఎందుకని దూరం అయ్యాడు .

   కీసర్ లింక్ తన కొడుకులకు ట్యూషన్ చెప్పమని కాంట్ ను కోరాడు .రోజూ గుర్రబ్బండి ని పంపిస్తే ఎక్కి వెళ్లి చెప్పి వచ్చే వాడు .1789 లో ‘’డ్యూక్ ఆఫ్ డిలాన్‘’అయిన ‘’ఫ్రాంజ్ ‘’ కాంట్ కు ఒక ఉత్తరం రాశాడు .ఆయన 1762 వరకు యుద్ధ ఖైదీ .దీని వల్ల  ఉన్నత వర్గాల వారితో స్వేచ్చగా సంచరించే అవకాశం కలిగింది .కీసర్ లింక్ కు ఒక ప్రత్యెక తరహా సంస్కృతీ పై మోజుండేది .సంగీతం ఇష్టం ఆయన భార్యకు ఫిలాసఫీ ఇష్టం .ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్ తో ధగ ధగ లాడుతూ ఉండేది .పెయింటింగ్స్ తో క ళ  కళ  లాడేది కాంట్ వీరింట్లో డిన్నర్ గెస్ట్ అయాడు .కౌం టేస్ తో సమాన మైన గౌరవం హక్కులు పొందాడు .ఆమె అంటే కాంట్ కు ఏంతో  గౌరవం .ఆమెను ‘’ an adornament of sex ‘’అన్నాడు .కాంట్ కంటే ఆమె వయసులో చిన్నదే .వీరిద్దరి మధ్యా రోమాన్స్ ఏమీ లేదు .ఆమె వంటి స్త్రీ తన జీవిత భాగస్వామి కావాలన్న ఆలోచనే కాంట్ కుండేది .కాంట్ కు ఉన్న ప్రతిభా, ,తెలివితేటలూ అందరికి నచ్చేవి సమాజం లో ఉన్నత వ్యక్తీ గా కాంట్ ను అందరూ గౌరవించారు .కాంట్ ను మహా గొప్ప లెక్చరర్ అనే వారు ‘’better to be a fool in style than a fool out of style –it is our duty not to make a distasteful or even unusual impression on others ‘’అన్న కాంట్ భావనపై అందరికి గురి కుదిరింది .డేనిష్ కవి ఒకాయన ‘’కాంట్ కు ఆయన ధరించే డ్రస్ కంటే అత్యధిక విలువ ఉంది ‘’అని రాశాడు .కాంట్ దృష్టిలో ‘’the colours of one’s dress should follow the flowers ‘’అందం కానిదేదీ ప్రక్రుతి సృష్టించదని బ్రౌన్ కోట్ కు పసుపు వెల్వెట్ నప్పుతుంది అని కాంట్ చెప్పాడు తరువాత జీఎవితం లో రక రకాల రంగుల డ్రెస్ లు వేసుకొనే వాడు .

   కాంట్ కు గొప్ప ఆకర్షణీయత ఉండేది .మెత్తని జుట్టు ,స్వచ్చమైన ముఖం ,.బుగ్గలు ముసలి తనం లోను ఎర్రగా ఉండేవి .ఆ చూపులు మనుష్యులను యిట్టె ఆకర్షించేవి .’’కాంట్ కళ్ళ ను యేమని వర్ణించను ?అందులో దైవత్వం తో కూడిన ఆయన మేధస్సు ,స్వచ్చమైన మనసు కనీ పించేవి .ఆ కాంతి మిరు మిట్లు గొలిపేది’’ .అని ఒక స్నేహితుడు అన్నాడు ‘’ఆయన ప్రభావం వర్ణించటానికి మాటలు చాలవు ‘’అన్నాడు ఇంకో ఆత్మీయుడు .అయుదు అడుగుల రెందంగుళాల ఎత్తు  తో బలహీనం గా ఉండేవాడు .చాతీ ముడుచు కున్నట్లుండేది .దీని వల్ల  ఆయనకు శ్వాస పీల్చటం కష్టం గా ఉండేది .అందుకే ఎక్కువ శ్రమకు తట్టుకోలేక పోయే వాడు .ఒక్కో సారి ఊపిరి ఆడక చాలా బాధ పడే వాడు .ఇన్ని ఇబ్బందులున్నా ,మాట్లాడటం ప్రారంభిస్తే నవ్వుల పువ్వులు పూయించే వాడు .సెలయేటి ప్రవాహం లా చేల రేగే వాడు .

       కాంట్ కు ఆడవారి పై ఆరాధనా భావం ఎక్కువ గా ఉండేది కాదు .(నో గ్రేట్ డివొటీ  ).అంత  మాత్రం చేత వారంటే చులకన భావం లేదు .’’వివాహం అనేది కోరిక ,అవసరం ‘’అని కాంట్ భావించాడు .ఒక సారి ఒక అమ్మాయిని ఇస్ట  పడ్డాడు కాని ఆమెను తరచూ కలిసి మనసులోని మాట చెప్పేద్దాం అని తన ఆర్ధిక పరిస్తితి వివాహానికి చాలదని ఆ ప్రయత్నమే విర మించుకొన్నాడు .ఆమె దూరం వెళ్లి పోయింది ఇక పెళ్లి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు .1758లో ‘’కిప్కే ‘’అనే లాజిక్ ప్రొఫెసర్ మరణిస్తే ఆ పోస్ట్ కు కాంట్ అప్ప్లై చేశాడు .కాంట్ తో  బాటు బక్ అనే ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది .చివరికి ‘’బక్ కే లక్  దక్కింది’’ .దీనికి కారానం’ఈ ప్రమోషన్ వ్యవహారం చూసే ’షుజ్ ‘’కు కాంట్ పై అంత సదభిప్రాయం ఉండక పోవటమే . .కాంట్ కు ముప్ఫై ఏళ్ళ వయసప్పుడు ‘’హీర్దర్ ‘’స్టూడెంట్ అయాడు .ఆరోజులు చాలా గొప్పవని హీర్దర్ చెప్పే వాడు .

      సశేషం

     శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-13 –ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.