గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్—10
ప్రసిద్ధ గ్రంధాలకు శ్రీ కారం –డీన్ గా ప్రమోషన్
1770-81 లో ‘’origin of the critiques of pure reason ‘’ను కాంట్ పూర్తీ చేశాడు .1771 లో 47వ ఏట ‘’Moscati ‘’రాసిన ‘’of the essential differences in the structure of the bodies of humans and animals ‘’పుస్తకాన్ని కాంట్ సమీక్షించాడు .1775 లో’’of the different human races ‘’రచించి ప్రచురించాడు .1776 లో 52 ఏళ్ళ వయసులో ఫిలాసఫీ లో ‘’డీన్ ‘’గా పదోన్నతి పొందాడు.’’independence and declaration of human rights ‘’ను డిక్లేర్ చేశాడు .1778 లో ‘’H alle ‘’లో వచ్చిన ప్రోఫెసర్శిప్ ఆఫర్ ను కాంట్ తిరస్కరించాడు డీన్గా పర్మనెంట్ అయాడు .1780-1804 కాలం లో కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి సెనేట్ కు శాశ్వత సభ్యుడై పని చేశాడు .1782 లో ‘’Lambert ‘’తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ముద్రించటానికి కాంట్ అంగీకరించాడు .
ఇదే సమయం లో ‘’information for medical doctors ‘’రచించాడు .59 వ ఏట అంటే 1783 లో స్వంత ఇల్లు కొనుక్కొని అందులో కాపురం ఉన్నాడు .1784 లో ‘’idea for a universal history of man kind ‘’రచన పూర్తీ చేశాడు . 1785 లో ‘’హెర్దర్ ‘’రాసిన ‘’ideas in Allegmenine literature ‘’పై మంచి రివ్యు చేశాడు .మార్చి నెలలో ‘concerning the volconoes in the moon ‘’రచించాడు .తర్వాతా ‘’on the wrongful publication of books ‘’రాశాడు .నవంబర్ లో ‘’on the definition of the concept of a human race ‘’ప్రచురించాడు .1785-86 లో ‘’Mendelssohn and Jacobi dispute ‘’రచన పూర్తీ చేశాడు .దీనినే ‘’Panthian dispute ‘’అని పిలుస్తారు .ఇలా క్షణం తీరిక లేకుండా రచనలు చేస్తూనే ఉన్నాడు అలుపెరుగని కాంట్ .
ఇంత రచనా వ్యాసంగం లోను కాంట్ దిన చర్యలో మార్పున్దేదికాదు .ఉదయం అయిదింటికే సేవకుడు ‘’మార్టిన్ లాంపి ‘’కాంట్ ను నిద్ర లేపేవాడు .ఆలస్యం గా ఎప్పుడూ నిద్ర లేవనే లేదు .లైట్ టీ ని రెండు కప్పులు తాగే వాడు .’’పైప్ ‘’పీల్చేవాడు .అదే తన ధ్యానానికి తోడ్పడుతుంది అని కాంట్ చెప్పే వాడు .వయసు పెరిగిన కొద్దీ ఆ పాత్రల సైజూ పెరిగేది ..ఉదయం ఏడు గంటల వరకు చెప్పాల్సిన లెక్చర్లు, రాసే పుస్తకాలతో కాలం సరి పోయేది ఉదయం ఏడు గంటల నుండి పద కొండు వరకు ఆరోజు లెక్చర్లు బోధించే వాడు .తర్వాత మళ్ళీ రాత పనిలో తల దూర్చే వాడు .ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసే వాడు .కాసేపు షికారు చేసే వాడు మధ్యాహ్నం స్నేహితుడు గ్రీన్ తో పిచ్చాపాటీ కబుర్లు చెప్పేవాడు .కాంట్ జీవితాన్ని ‘’life of the skilled artisan ‘’అనే వాడు .
డబ్బు జాగ్రత్త
డబ్బు గురించి ఆరాటం కాంట్ కు ఉండేది కాదు .పోలాండ్ విభజన వాళ్ళ 47 ఫాంస్ ,కంపెనీలు దివాలా తీశాయి .ఇందువల్ల కాంట్ డబ్బుకేమీ ప్రమాదం రాలేదు .ఆయన డబ్బు నంతా ‘’green ,morterly and company ‘’లో పెట్టేవాడు .ఇది లాభాలనిచ్చిందే కాని నష్టాల నివ్వలేదు కాంట్ సేవకుడు లామ్పీ యజమానిని కంటికి రెప్పలాగా చూసుకొనే వాడు . కనీ పెట్టి ఉండేవాడు .మంచి బట్టలు వేయించటం సమయానికి నిద్ర లేపటం, కావలసినవన్నీ సమ కూర్చటం చేసే వాడు ఈ పని, ఆ పని అనకుండా అన్నీ చేసే వాడు. కాని కాంట్ తో ఉండేవాడు కాదు .స్వంత క్వార్టర్ లో భార్య తో ఉండేవాడు .కాంట్ కు ఇది ఇష్టం లేక పోయినా సర్దుకు పోయేవాడు . అంత నమ్మకస్తుడు దొరడని భావించేవాడు .నౌకరు పెళ్ళాడటం తో అతని కుటుంబ ఖర్చు కూడా కాంట్ మీదే పడింది
కాంట్ ఛాందసుడు కాదు .1768-69 లో రాసినవి గొప్ప గుర్తింపు తెచ్చాయి .1774 లో ‘’on the oldest document of the human race ‘’ప్రచురించాడు .ఇందులో నాలుగు ముఖ్య విషయాలు చర్చించాడు .ప్రపంచ ఆవిర్భావ చరిత్ర ,సాధారణ భౌతిక ప్రయోగం ,అన్ని నాగరకతల అధ్యాయానికి అది ఆధారం అయింది .నాగరకత ,అనాగారకత కున్న భేదాల అధ్యయనం దీన్ని అర్ధం చేసుకోవటానికి ఆధునిక వేదాంతాన్ని దూరం గా ఉంచాలి అని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు .
ప్రకృతిని అర్ధం చేసుకోవాలంటే భగవంతుడు అనే మాట ను నమ్మాలి అంటాడు కాంట్.తాను మొదలు పెట్టి రాస్తున్న ‘’క్రిటిక్’’ను ఈస్తర్ లోపల పూర్తీ చేయాలని సంకల్పించాడు కాని పూర్తీ చెయ్యలేనేమో అని సందేహం వచ్చింది కారణం తన ఆలోచనలు ఇంకా స్పష్టమైన రూపం దాల్చక పోవటమే నని ఆయనే చెప్పాడు . 60ఏళ్ళ వయసులో ఇం త క్లిష్టమైన రచన చేయటం గర్వం గానే భావించాడు .అయితే విషయం జటిలం గా ఉంటుందేమో నని భయ పడ్డాడు .రాసిన దానికి మెరుగులు పెట్ట టానికే ఎక్కువ సమయం తీసుకొనే వాడు .తన భావాలన్నీ ఆనాటికి వాడుక లో లేని కొత్తవి .(unfamiliar concepts ).దానికి కాంట్ వాడిన భాష కూడా కొత్తదే(Unfamiliar language ) .ఆ పదాలు ఆయనే సృస్తిన్చుకొన్నాడు .’’ప్రతిదీ దేని మీద ఆధార పడి ఉంటుంది ?’అన్నదే కాంట్ తీసుకొన్న ముఖ్య విషయం .ఆయనకున్న రీజనింగ్ శక్తికి అది ఒక అద్భుత గ్రంధం .’’’critique ‘’పూర్తీ చేయటానికి 11ఏళ్ళు పట్టింది .అందులో అసలు విషయం అంటే ఎస్సేన్శియల్ పాయింట్ అనేక మార్పులో విస్తరణా పొందింది .ఇంత కస్టపడి ,మేధో మధనం చేసి రాస్తే దీన్ని ‘’హిప్పెల్ ‘’,’’హమాన్న్ ‘’అనే వారు ‘’కృత్రిమ ఫిలాసఫీ ‘’అని లైట్ తీసుకొన్నారు .
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -18-8-13 ఉయ్యూరు