గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ –11
1786-87 కాలం లో కాంట్ ఫిలాసఫీ మీద ‘’రీన్ హోల్డ్ ‘’అనే ఆయన సమీక్ష చేశాడు . 1787 లో ‘’critique on pure reason ‘’రెండవ ఎడిషన్ విడుదల అయింది . 1788 లో ‘’critique on practical reason ‘’వచ్చింది .జనవరి లో ‘’ on the use of teleological principles in philosophy ‘’రచించాడు .సమ్మర్ సెమిస్టర్ కు రెండవ సారి రెక్టార్ అయ్యాడు .జూలై లో ‘’the edict on religion ‘’,డిసెంబర్ లో ‘’ new edict on religion ‘’రాసి ప్రచురించాడు .
1789 లో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభ మైంది .సంవత్సరాంతం లో 65 వ ఏట కాంట్ బౌద్ధిక కార్య కలాపాల పై ఎక్కువ సమయం కేటాయించ లేక పోయాడు .1790లో ‘’critique of judgement ‘’వచ్చింది .దానితో బాటు ‘’an enthusiasm and means against it ‘’రాశాడు .1791 లో ‘’on the failure of all attempts at Theodicee ‘’రచించాడు మళ్ళీ సమ్మర్ సెమిస్టర్ కు డీన్ గా పని చేశాడు .1792 లో ‘’new and stricter edict concerning obedience to religious customs ‘’రాశాడు .జూన్ లో కాంట్ రాసిన ‘’concerning the battle of the good against the evil –principle for dominion over the human being ‘’ముద్రణకు యూని వర్సిటి నుండి అనుమతి రాలేదు .వెంటనే ‘’religion within the boundary of mere reason ‘’రాశాడు .సెప్టెంబర్ లో ‘’on the old saw that may be right in theory ut it would not work in practice ‘’పూర్తీ అయింది .అప్పుడే ఫ్రాన్స్ లో పదహారవ లూయీ ని ఉరి తీశారు .
డెబ్భయ్యవ దశకం
1794లో కాంట్ కు డెబ్భై ఏళ్ళు వచ్చాయి .ఇప్పుడే ‘’’’religion within the boundary of mere reason ‘’ముస్తాబై రెండో ముద్రణ పొందింది .’’something on the influence of the moon on the climate ‘’రాశాడు .జూన్ లో ‘’ది ఎండ్ అఫ్ ఆల్ థింగ్స్ ‘’రచించాడు .జూలై లో ‘’పీటర్స్ బర్గ్ యూని వర్సిటి మెంబర్‘’అయాడు కాంట్ ..ప్రష్యా రాజు పరిపాలన లో కొత్త విధానాలను ప్రవేశ పెట్టాడు .అక్టోబర్ లో రాజు ‘’censor ‘’చేస్తే కాంట్ అక్టోబర్ లో దీటుగా సమాధానం ఇచ్చాడు .’’robes Pierre ‘’ని ఉరితీశారు .1794-95 లో కాంట్ సమ్మర్ సెమిస్టర్ కు ఏడవ సారి డీన్ గా వ్యవహరించాడు .
1795 లో 71వ ఏట ‘’on eternal peace ‘’రాశాడు .’’Schiller ‘’తో కరేస్పాన్దేన్స్ చేశాడు .72వ ఏట ‘’ది ఎటర్నల్ పీస్ ‘’పునర్ముద్రణ పొందింది .తర్వాత‘’on the organ of the soul ‘’కు అనుబంధం రాశాడు .మే నెలలో ‘’on a newly raised Noble tone in philosophy ‘’పూర్తీ చేశాడు 1796 .జూలై 23 న కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో కాంట్ డెబ్భై రెండవ ఏట చివరి లెక్చర్ ఇచ్చాడు .అక్టోబర్ లో ‘’solution of a mathematical dispute based on misunderstanding ‘’ప్రచురించాడు .డిసెంబర్ లో ‘’announcement of the soon to be completed tract on eternal peace in philosophy ‘’రాశాడు .1797 లో73వయసులో ‘’meta physical foundations of the doctrine of Right ‘’పూర్తీ చేశాడు .జూన్ 14 న కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి విద్యార్ధులు కాంట్ కుకాంట్ రచనా వ్యాసంగానికి ‘’అర్ధ శతాబ్ది ‘’పూర్తీ అయిన సందర్భం గా ఘన సన్మానం చేశారు ..
దశాబ్ది కాలం లో శతాబ్దాలకు ప్రేరణ కల్గించిన రచనలు
1780-90- దశకం మధ్య కాంట్ అతి గొప్ప గ్రంధాలను రాసి అనేక శతాబ్దాలకు ప్రేరణ కల్గించాడు .ఈ గ్రంధాలన్నీ అత్యున్నత ప్రమాణం లో ఉన్నాయని ‘’noble ‘’అని పేరు గణించాడు .ఈ కాలం లోనే ‘’మూడు క్రిటిక్ ‘’లో రాయటం ఈ ముసలాయన సాధించిన అద్భుత విషయం .అంతే కాదు 18 వ శతాబ్దపు బుద్ధి జీవులలో, మేధావి వర్గం లో ఎక్కువ కాలం జీవించిన ఘనత కూడా ఇమాన్యుయల్ కాంట్ దే..అందుకే రచనలలో అంత పరి పూర్ణత ,అంత అంతస్చేతన దర్శన మిస్తాయి .కాంట్ ను ‘’ద్విజుడు ‘’(twice born )అన వచ్చునని నాకు అని పించింది .దీనికి కారణం కాంట్ లో మతాత్మిక భావాలు ,నైతిక మార్పులు పరి పక్వ దశ కు చేరాయి .ఆయన రాసిన అసలు సిసలు ఫిలాసఫీ అంతా ఈకాలం లోనే వచ్చింది అందుకే అంత పరి పక్వత ఏర్పడింది రచనల్లో .ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు .నిరంతర సాధనా ఫలితమే .అంటే మరో జన్మ ఎత్తా డన్నమాట .అందుకే ద్విజుడు అయ్యాడు
హైపో కాండ్రియా పీడితుడు కాంట్
కాంట్ కున్న హైపోకాన్ద్రియా జీవితాంతం వదిలి పెట్టలేదు .గుండె పల్పెషన్ తో చివరి కాలం లో బాగా ఇబ్బంది పడ్డాడు .ఇప్పుడున్న ‘’బోవేల్స్ స్టేట్ ‘’గురించి ఆదుర్దా ఎక్కువై పోయింది ఈ విషయం హీర్దర్ కు ఉత్తరం లో తెలియ జేశాడు కూడా .1777 లో’’ హెర్జ్ ‘’కు ‘’insufficient exenoration ‘’గురించి రాశాడు .సాఫీ విరేచనం కావటం లేదు ‘’బాంబులు ‘’మొగిస్తున్నాడు ఇది మరీ ఇబ్బంది గా ఉంది పాపం .ఇదంతా మానసిక విషయ మేమో నని ఆదుర్దా .జీర్ణ కోశం లో ఏదో తీరని లోపం ఏర్పడి విపరీతం గా బాధిస్తోంది .ఆయన స్నేహితులు అందరూ జబ్బు తో తీసుకొంటున్నారు ఇది మనో వ్యాకులత ను మరీ పెంచింది .’’క్రిటిక్ ‘’లు ప్రచురించే నాటికి వయసు యాభై ఏడు మాత్రమె కాంట్ కు .ఇంకో ఇరవై మూడేళ్ళు జీవించాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-13-ఉయ్యూరు