గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -9
పుంఖాను పుంఖం గా రచనలు
కాంట్ కు అంతకు ముందు ఒక సారి పోయిట్రీ లో ప్రొఫెసర్ షిప్ కు ఆహ్వానించింది వర్సిటి .కాని అంగీకరించలేదు .అప్పుడే ‘’essay on the illness of the head ‘’రాశాడు .’’సిల్ బేర్ చ్లాగ్ ‘’రాసిన ‘’theory of the fire ball that appeared on july ,1762 ‘’పై గొప్ప సమీక్ష చేశాడు కాంట్ .బెర్లిన్ ఎకాడమీ కి రాసిన‘’ఎంక్వైరీ ‘’వ్యాసానికి బహుమతి పొందాడని ముందే చెప్పుకొన్నాం .1765 లో41 వ ఏట ‘’announcement of the organization of lectures in winter semister ప్రకటించాడు .న్యూ ఆర్గాన్ లోని ‘’లాబర్ట్ ‘’తో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపాడు .లీబ్నిజ్ లో ‘’సబ్లిటేరియన్’ పదవికి దరఖాస్తు చేశాడు .’’new essay on human understanding ‘’వ్యాసం రాశాడు .1766 లో ‘’dreams of a spirit –seer elucidated by dreams of meta physics ‘’ రాశాడు‘’.Mendelssohn’’తో కరేస్పాన్ డేన్స్ చేశాడు .1768 లో ‘’concerning the ultimate ground of the differentiation of directions in space ‘’రచించాడు1769 లో నలభై అయిదవ ఏట ‘’Erralangen ‘’నుంచి ఆహ్వానం వచ్చింది .1770 లో జేనా నుంచి ‘’స్పేస్ ‘’వ్యాసం రాశాడు ..
కాంట్ ప్రభావం -18 వ శతాబ్దపు జబ్బు
కాంట్ నల భై వ ఏట తన సహచరులను పూర్తిగా మార్చేశాడు .ఆయన నలభయ్యవ పుట్టిన రోజుకు ముందే ముఖ్య స్నేహితుడు ‘’ఫంక్ ‘’అకస్మాత్తుగా చని పోయాడు .అందరు విపరీతం గా బాధ పడ్డారు .దీంతో కాంట్ కు జీవితం మీద ,చదువుల మీద మధనం ప్రారంభ మైంది .దీనినే కాంట్ జీవితం లో ‘’polengenesis ‘’లేక పునర్జన్మ అన్నారు .విస్పోటనం అనీ అన్నారు .నీతి ,ధర్మం కృత్రిమమే కాని సహజం కాదన్నాడు కాంట్ .ఆయన దృష్టిలో మనో వ్యాకులత తార తరాల నుంచి ఉన్నదే .అది 18 వ శతాబ్దపు రోగం గా మారింది .ముఖ్యం గా బుద్ధి జీవుల పాలిటి జాడ్యం అయింది గురు శిష్యులైన ‘’సామ్యుయల్ జాన్సన్ ,జేమ్స్ బాస్వేల్ ‘’లు ఇద్దరూ దీని బారిన పడ్డారు .ఒక రకం గా ఇది ఊహాత్మక మైన జబ్బే .నవ్విస్తే కొంత మారవచ్చు అని కాంట్ భావించాడు .
సంపూర్ణ వేదాంత వికాసం
కాంట్ కు వెన్నెముక కొంచెం వంగింది దీనితో చాలా ఇబ్బంది పడ్డాడు .ఇప్పటి దాకా జబ్బు లంటే ఏమిటో కాంట్ కు తెలియదు .ఈ ఇబ్బంది తర్వాతా నిజమైన ఆరోగ్యం రానే లేదు మళ్ళీ..కాంట్ తన ‘’సెన్సిటివ్ నేర్వ్స్’’గురించి తరచూ మాట్లాడే వాడు .బెర్నార్డ్ షా ఒక సారి ‘’true joy of life was the being used for a purpose recognized by yourself as a mighty one ,the being thoroughly worn out before you thrown on the scrap reap the being a force of nature instead of a feverist ,selfish little cold of ailments and grievances complaining that the world will not devote itself to making you happy ‘’అని గొప్ప విశ్లేషణ చేశాడు .ఇలాంటిదే ప్రవర్తనకు కాంట్ చూపిన కొత్త మార్గ దర్శనం .అదే ఆయన పరి పూర్ణ వికాస వేదాంతానికి అసలైన భూమిక
కాంట్ పై ప్రభావం చూపిన గ్రీన్స్ .
1775 లో కాంట్ కు యాభై ఒక్క ఏళ్ళు వచ్చాయి .తాను చెప్పగలిగింది అంతా బతికి ఉండగా ఈవయసులో చెప్పగలనా అని బాధ పడే వాడు .ఆయన జీవితం లో వచ్చిన మార్పులు కూడా ఈ నిరాశకు కారణ మైనాయి .’’జోసెఫ్ గ్రీన్ ‘’తో కొత్త పరిచయ మేర్పడింది .ఒక సారి ఇద్దరూ గుర్రబ్బండీ లో ఉదయం ఎనిమిది గంటలకు ఒక గ్రామానికి వెళ్దామని అనుకొన్నారు .గ్రీన్ 7-45 కే బండీ తో వచ్చేశాడు .ఆయనకు కాంట్ కనీ పించలేదు .సరిగ్గా ఎనిమిదింటికి ఆయన ఒంటరిగా బయల్దేరి వెళ్లి పోయాడు .దారిలో కాంట్ నడుస్తూ కనిపించాడు .ఆపమని కాంట్ సౌజ్ఞా చేశాడు గ్రీన్ ఆపలేదు .అలా చేయటం గ్రీన్ కు ఇష్టం మైన విషయం అంటే మాక్సిం కాదు .తను ఎప్పుడైనా నిద్ర లేస్తానని ,కాఫీ యో టీ యో తాగటానికి ఒక అరగంట ముందే తనకు తెలుస్తుందని ,ఆరు అయితే లేచి పోతానని ,పన్నెండు గంటలకు ఆకలి ఉన్నా లేక పోయినా భోజనం చేస్తానని ,రాత్రి పది అవగానే నిద్ర వచ్చినా రాక పోయినా మంచం ఎక్కుతానని గ్రీన్ ఆ తర్వాతా తన షెడ్యూల్ ప్రకటించాడట .గ్రీన్ ప్రభావం కాంట్ మీద బాగా ఉండేదని అంటారు .ఇద్దరికీ హ్యూమ్ ,రూసో లు అంటే ఇష్టం .ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువ .ఇప్పటి దాకా కాంట్ రాసిన వాటి పై మంచి రివ్యూలే వచ్చాయి ఆయనకు ప్రోత్సాహాన్ని కలిగించాయి .
ఇల్లు మారిన కాంట్
1766 లోనే జీతం పెరగ్గానే కొత్త ఇంటికి మకాం మార్చాడు కాంట్ .Konter ‘’అనే పబ్లిషర్ ఇంట్లో ఉన్నాడు .’’ఎవరూ పెళ్లి చేసుకో కూడదు (one must not get married )అన్నది కాంట్ సిద్ధాంతం .ప్రక్రుతి మనకు ఏమి బోధిస్తుందో ,మన వివేకం కూడా ఏది చెబుతుందో అదే నిజం అవుతుంది అన్నాడు .తర్వాతా కాంట్ ఆలోచన లో మార్పు వచ్చింది . కారణం ,ఇంద్రియ విజ్ఞానం అంటే రీజన్ అండ్ సెన్సేషన్ లు నిరంతరం కోన సాగేవి కావు అన్నాడు .కంటిన్యుయిటి సిద్ధాంతానిని కొన్నిటికి అన్వయింప జేశాడు .1771 లో కాంటర్ గారి ఇంట్లోంచి మకాం మార్చాడు కారణం ‘’కోడి తగాదా ‘’అని ఆయనే చెప్పాడు ఇంటి ప్రక్కాయన కోడి కాంట్ ధ్యానానికి భంగం కలిగించేదట .ఎన్ని సార్లు పక్కిన్తాయనకు మొర బెట్టినా అయన విని పించుకో లేదట .ఆ ప్రక్క ఇల్లు అమ్మితే తాను కొంటానని కూడా చెప్పాడు కాంట్ .ససేమిరా అన్నాడాయన .కోడి గోల భరించలేక ఖాళీ చేశాడు అయినా కొత్త క్వార్టర్ అంత వసతి గాలేదు అద్దె ఇంట్లో ఉండటమే తప్ప స్వంత ఇంటి ఆలోచనేఇప్పటికి రాలేదు కాంట్ మహాను భావుడికి .కాంట్ మాట్లాడే భాష ‘’తూర్పు ప్రష్యన్ల మాండలికం ‘’గా ఉంటుంది .ఇది’’ ఉన్నత జర్మన్ భాష ‘’కాదు .కాంట్ రోజు వారీ ఆహారం బాగా వండిన మాంసం ,మంచి రొట్టె ,మంచి వైన్ .మొదట్లో రెడ్ వైన్ మాత్రమె తాగే వాడు .తర్వాత‘’వైట్ వైన్ ‘’సేవించాడు .చాలా నెమ్మదిగా కాంట్ భోజనం చేసే వాడు .
సశేషం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -18-8-13- ఉయ్యూరు