గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16
మహా మేధావి , మహా మహుడు కాంట్ మహా ప్రస్థానం
1802 వింటర్ లో కాంట్ ఆరోగ్యం బాగా క్షీణించింది .ఆహారం తీసుకొన్న ప్రతి సారికడుపు ఉబ్బి పోయేది .అది డోలు మోత మొగేంత గట్టి పడేది .చొక్కా విప్పెయ్యాల్సి వచ్చేది .1803 లో ఆయనకు 79 ఏళ్ళ వయసులో స్ప్రింగ్ నాటికి కాంట్ కు వ్యాయామం అవసర మని వాసియాంకి భావించాడు .కాంట్ అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయేవాడు .గార్డెన్ లోకి తీసుకొని వెళ్లి కూర్చో బెట్టె వాడు .తాను‘’deserted island ‘’లో ఉన్నట్లు కాంట్ ఫీల్ అయ్యాడు
1803 ఏప్రిల్ ఇరవై మూడున తన నోట్ బుక్ లో కాంట్ ‘’బైబిల్ చెప్పిన ప్రకారం మన జీవితకాలం 70 ఏళ్ళు .అది 80 అయితే మంచిదే .అయితే శ్రమా ,కష్టమూ పడాలి ‘’అని రాసుకొన్నాడు .ఇతర దేశాల నుంచి వచ్చిన సందర్శకులను చూడటానికి కాంట్ ఇష్టపడటం లేదు .వారోచ్చినా వారితో భాషించే స్తితి లో కాంట్ లేడు.’’ఫాల్ ‘’వచ్చేసరికి మరీ బలహీన పడ్డాడు .కాంట్ సోదరికి అన్న గారి ఆరోగ్యం గురించి తెలియ జేశాడు వాసియాన్స్కి .ఆమె కాంట్ కన్నా ఆరేళ్ళు చిన్నది .ఆరోగ్యం గానే ఉందామె .ఆమె అన్న సంరక్షణ బాధ్యతలన్నీ తీసుకోంది.
1803 అక్టోబర్ ఎనిమిది న కాంట్ ‘’జీవన్ మరణ సమస్య ‘’లో ఉన్నాడు .అక్టోబర్ ఏడున వాసియాన్స్కి మాట విన కుండా అతిగా భోజనం చేశాడు .మర్నాడు ఉదయం సోదరి చేయి పట్టుకొని కొంత దూరం నడిచాడు .స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు .లోపలి తీసుకొని వెళ్లి పక్క మీద పడుకో బెట్టారు .గదికి వెచ్దదనాన్ని కల్పించారు .డాక్టర్ వచ్చాడు. కాంట్ స్పష్టం గా పలక లేక పోయాడు .సాయంత్రానికి కొంచెం మాట్లడగలిగాడు .గుండె పోటూ వచ్చింది కాంట్ కు .అక్టోబర్27 కు పొంతన ఉన్న మూడు మాటలు కూడా మాట్లాడలేక పోయాడు .’’Kant seemed to lost the rational soul entirely ‘’అని తేల్చారు .డెబ్భై తొమ్మిది దాటి ఎనభై లోకి అడుగు పెట్ట బోతున్నాడు .
1804 మొదట్లో అసలేదీ తిన లేక పోయేవాడు .ఏదీ రుచించేది కాదు .డిన్నర్ టేబుల్ దగ్గర ఏదో గోణిగే వాడు .నిద్ర పట్ట్టేది కాదు .డాక్టర్ని కూడా ఆశ్చర్య పరుస్తూ అపస్మారక స్తితి లో లేచి ‘’the feeling of humanity has not yet left me ‘’అన్నాడు .ఫిబ్రవరి పదకొండున చివరి మాటలు మాట్లాడాడు .వాసియాన్స్కి మంచి వైన్ కలిపిచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పాడు కాంట్ ..’’it is good ‘’(Esist gut )అన్నాడు .దీని అర్ధం ‘’it is enough ‘’అని అర్ధం అంటే ‘’ఈజీవితం ఇక చాలు ‘’అని భావం ..కావలసి నంత వైన్ తాగాడు మన వాళ్ళు చెప్పినట్లు ‘’దారి బత్తెం ‘’కోసం తాగాడన్న మాట .
1804 ఫిబ్రవరి 12ఉదయం పదకొండు గంటలకు ఇంకో రెండు నెలలకు 80 వ పుట్టిన రోజు అనగా ‘’కాలాతీత వ్యక్తి ‘’ కాంట్ మరణించాడు .’’the mechanism halted and the machine stopped moving .His death was the cessation of life ,not a violent act of nature ‘’అన్నాడు అప్పటి దాకా కంటికి రెప్ప లాగా కాంట్ ను కాపాడిన వాసియాన్స్కి .గడియారాలకే టైం సూచించిన కాంట్ గుండె గడియారం ఒక్క సారిగా ఆగిపోయింది .కాంట్ శ్వాస అనంత వాయువులలో కలిసి పోయింది . కాంట్ ను ‘’ఫిలాసఫర్ కింగ్ ఆఫ్ ప్రష్యా ‘’అని శ్లాఘించారు .కొనిగ్స్ బర్గ్ ను ‘’ఇంట లేక్త్యువల్ కాపిటల్ ‘’అనీ అన్నారు.కాంట్ కు వ్యక్తీ గత దేవుడేవరూ లేరు .చిన్న వయస్సులో ఎప్పుడో కవిత్వమూ గిలికాడు కాంట్ .కాంట్ లో విశ్వస నీయత, ,దయా ,మర్యాదా ,న్యాయ ,నీతి, ధర్మ బుద్ధి,ఉదారత్వము అందరిని ముగ్ధులను చేశాయి .ఆ మహోన్నత మానవతా మూర్తికి ,ఆ మేధో సంపన్నుని -మాన వాళి కలకాలం గుర్తుంచుకొంటుంది. కాంట్ నిజం గానే చిరంజీవి .
కాంట్ కు ‘’పోప్ ‘’కవి రాసిన ‘’An essay on man ‘’చాలా ఇష్టం .దానినే ఉదాహరిస్తున్నాను ‘’placed on the isthmas of a middle state –a being darly wise and ruled great with too much knowledge for the sceptic side –with toomuch weakness for the stoic ‘s pride .He hangs between in double act or rest .-in doubt to deem himself a god or beast .in doubt his mind or body to prefer .born out to die and reasoning but to alike in ignorance his reason such-whether he thinks too little or too much chaos of thought and passion ,all confused –still by himself absurd or disabuse create half to raise and half to fall .Great Lord of things ,yet pray to all sole judge of truth in endless error hurled –the glory jest and riddle of the world ‘’
ఇప్పటికి కాంట్ జీవిత ఘట్టాలలోని అనేక విషయాలను తెలుసుకొన్నాం .ఇక ఆయన రచనలలోని లోతులను తరచి తెలుసుకొందాం ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-13- ఉయ్యూరు