గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -13
1787 లో కాంట్ ఎక్కువగా ‘’రేషనల్ దియాలజి ‘’మీదనే ఎక్కువ ఉపన్యాసాలిచ్చే వాడు .అప్పుడాయన గురించి ‘’kant himself passionate ‘’అన్నారు.‘’హమ్మాన్ ‘’ అనే ఆయన కాంట్ గారి టేలేన్త్స్ గురించి చెబుతూ ‘’కాంట్ టాలేంట్లుఆయన అభిప్రాయాలంత గొప్పవి అయితే ఎవరైనా ఆయన రచనలను విమర్శిస్తే తిరస్కరించడు ..వీలయితే తీసేస్తాడు లేక పొతే వదిలేస్తాడు .అందుకు ఆయనకు సమయం తీసుకొంటాడు .ఆ సమయం లో కాంట్ వాటిపై ప్రతిస్పందిస్తాడు .కాంట్ కు వినటం కంటే మాట్లాడటమే ఇష్టం .మన ఊహలకు అందనంత ఎత్తుకు ఎదిగిన ఉన్నత వ్యక్తీ కాంట్ .ఆయన్ను అర్ధం చేసుకోక పోవటం లో ఆయన తప్పేమీ ఉండదు తప్పంతా సమాజానిదే ‘’అన్నాడు హమ్మాన్ .
1786 లో జూన్ ఇరవై ఏడు న కాంట్ కు అతి ముఖ్య మైన స్నేహితుడు గ్రీన్ చని పోయాడు .ఆయనతో తన జీవితపు ‘’పంక్చుయాలిటి ‘’గా రాత్రి ఏడు గంటల వరకు శని వారాలలో రాత్రి తొమ్మిది వరకు గడిపిన మధుర మైన రోజులను కాంట్ మననం చేసుకొన్నాడు బాధతో ..గ్రీన్ మరణం కాంట్ లో కొంత మార్పు తెచ్చింది .కాంట్ జీవించిన చివరి రోజుల్లోనే ఆయన యువ సమకాలీనులు కాంట్ రచన లను విమర్శిచటం మొదలైంది .
క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ రెండవ ముద్రణ కు 1787 ఏప్రిల్ లో ఉపోద్ఘాతం రాస్తూ కాంట్ ,తాను ఇక మీదట తనపై విమర్శ చేసే వారి పై ప్రతి విమర్శ చేసి ,తగాదా పడే సమయం తనకు లేదని తన పని లో దీనికి సమయమే దొరకదని చెప్పాడు .తానూ రాసినదాన్ని చదవటం ,తులనాత్మక పరిశోధన చేయటం తన విధానాన్ని సమర్ధించు కోవటానికి వాటిని ఉపయోగించటం లో ఆయన మేధస్సు నంతా ఉపయోగించాడు
ఫ్రాన్స్ విప్లవం .
1789 లో జూలై పన్నెండు న కొనిగ్స్ బర్గ్ కు చాలా దూరం లో ఉన్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఏడేళ్ళ యుద్ధం వల్ల ఆర్ధిక స్తితి దిగ జారి పోయింది .అమెరికా కూడా రివల్యూషన్ లో తల దూరటమూ ఒక కారణమైంది .విచ్చల విడి గా డబ్బు దుబారా అయి పోయింది .జాక్వాస్ నేకర్ ను ఫైనాన్స్ సెక్టార్ రి జెనరల్ ను చేసినా మార్పు ఏమీ రాలేదు .జనం ఆకలితో అలమటిస్తున్నారు .చివరి ప్రయత్నం గా పదహారవ లూయీ ఎస్టేట్ జనరల్ ను పిలి పించాడు .ఆర్ధిక సంస్కరణలు చేయమని సాంఘిక సంస్కరణలు చేయమని రాజుపై ప్రజలు విపరీతమైన ఒత్తిడి తెచ్చారు .
రాజుకు వ్యతి రేకం గా జూన్ పది హేడున ప్రజలే ..నేషనల్ అసెంబ్లీ ‘’ని ఏర్పాటు చేసుకొన్నారు .రాజు చేసేది లేక నేకర్ ను తొలగించాడు .దీనితో ప్రజల్లో అంతర్యుద్ధం ప్రారంభ మైంది .’’గార్డె ఫ్రాంచైస్ ‘’సైన్యం ప్రజల పక్షం వహించింది అందరు ‘’బాష్టిల్లి ‘’దగ్గర కు చేరారు .లూయీ రాజు అధికారాలను తొలగించేసి ఉత్తుత్తి రాజు గా ఉంచారు .జూలై పదహారున రాజు నేకేర్ కు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ప్రజల్ని కొంత కట్టడి చేశాడు .దీనితో ఫ్రాన్స్ దేశమంతా విప్లవం చేల రేగింది .1787 ఆగస్ట్ నాలుగు న అసెంబ్లీ ఫ్యూడల్ అధికారాలకు మంగళం పాడారు .ఇదంతా జర్మనీ దేశం జాగ్రత్త గా గమనిస్తోంది .జర్మనీ మేదావులైన గోధే ,మోజర్ లు రివల్యూషన్ ను మొదటి నుంచి వ్యతిరేకించారు .మన మేధావి కాంట్ కు ఈ విషయాలేమీపెద్దగా తెలియవు.
కాని రివల్యూషన్ రాజకీయాల గురించి ఆసక్తిగా కాంట్ సంభాషించే వాడు .మైళ్ళ దూరం నడిచి వెళ్లి ‘’టపా ‘’అందుకొనే వాడు .చివరకు ‘’ప్రాతినిధ్య అధికారమే మిన్న ‘’అని కాంట్ నిర్ధారించాడు .కాంట్ నిజం గానే ప్రజా స్వామికుడు .(రిపబ్లికన్ ).కృతి రెండో పుస్తకం రాసిన తర్వాత 1787 లో’’foundations of the critique of taste ‘’రాయటం ప్రారంభించాడు .1790 లో అది వెలుగు చూసింది .చివరికి ‘’క్రిటిక్ ‘’గా రూపు దాల్చింది .క్రిటిక్ ఫైనల్ భాగం ప్రచురించే ముందు ‘’on the use of teleological principles in philosophy ‘’రాశాడు .’’రేస్ ‘’అనే కీలక భావన గురించి కాంట్ చర్చించాడు .ప్రక్రుతి లోని టేలేలోజికల్ ప్రిన్సిపల్ ను ‘’ఏమ్పెరికల్ ‘’గా నిర్ణయించాలి అన్నాడు .
టేలలా లజి
‘’ Beautiful అనేది కనీ పించే ఆకర్షణ (the beautiful is what pleases in the mere estimate formed of it ‘’.he sublime is what pleases immediately because of its opposition to sense’’ .
టేలేలాజికల్ చర్చ లో .కాంట్ –ప్రక్రుతి లోని’’ మెకానికల్ అక్కౌంట్ కన్ నాట్ మేక్’సెన్స్ ఆఫ్ ఒరిజినల్ ఫారం’’ ‘’అవి వాటి మూలాలను తెలియ బర్చలేవు .ప్రకృతిలో ప్రతిదీ గడ్డి రేకులతో సహా మంచిదే .ఏదీ వ్యర్ధమైంది కాదు .’’all productions in nature is possible on mere mechanical law ‘’.టేలేలాజి’’అనేది నేచురల్ సైన్స్ లో భాగం ఏమీ కాదు .దియాలజి లో భాగమూ కాదు .వీట న్నటి వల్ల కొత్త ఫిలాసఫీ పుట్టింది .అదే ‘’the founding of all knowledge against skepticism or fundamental philosophy ‘’ ఇందులో కాంట్ పాత్ర గణ నీయం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-13 ఉయ్యూరు