గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -12
కాంట్ కీలక భావనలు
కాంట్ మేధో సర్వస్వం ‘’మాగ్నం ఓపస్ ‘’అని పిలువ బడే ‘’క్రిటిక్ ‘’ను నాలుగైదు నెలల్లోనే పూర్తీ చేసి నట్లు కాంట్ చెప్పుకొనే వాడు .ఇందులో ఆయన మూడు ముఖ్య విషయాలు చర్చించాడు .అందులో మొదటిది –‘’నాకేమి తెలుసు ?(what can I know ?),రెండవది నేనేమి చేయాలి ?(what ought I to do ?)మూడవది నేను దేని కోసం ఆశించాలి ?(what may I hope for ?)వీటికి సమాధానాలను ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’లో చెప్పాడు .అయితే ఆ సమాధానాలు సూటిగా ఉండవు .కాంట్ ‘’priori epistemic ‘’ ను ‘’forms ‘’గా గుర్తించాడు .అందులో జ్ఞానం అనేది అతి ముఖ్య మైనది .ఇలాంటి ఫారంస్ ను మూడింటిని కాంట్ గుర్తించాడు .అవే ‘’ the forms of sensibility ,the forms of under standing ,the forms of reason ‘’అన్నాడు . .ఇందులో మొదటిది స్పేస్ అండ్ టైం కు చెందింది .అది ‘ఏమ్పెరికల్లి రియల్ ‘’అంటాడు . ’’transcendidly ideal ‘’ అన్నాడు.స్పేస్ అండ్ టైం అనేవి ఏ అనుభావానికైనా ఉండాల్సిన ముఖ్య షరతులు .వీటి వల్ల ప్రపంచాన్ని గురించిన ‘’ప్రయరి నాలెడ్జి ‘’మనకు లభిస్తుందని కాంట్ ఉవాచ
మనం పొందే జ్ఞానం విషయాన్ని అర్ధం చేసుకోవటం మీద ,లేక అనేక ‘’బేసిక్ ప్రయరి కాన్సెప్ట్స్ ‘’మీద ఆధార పడి ఉంటుందని కాంట్ భావించాడు .ఇందులో పన్నెండు రకాలున్నాయని అన్నాడువాటికే basic concepts -7 ,quantilog ,quality (reality). .negation ,limitation ,modality ,.ఇవే మూల భావనలు .ఇవి సర్వ స్వతంత్రమైనవి .మనకు క-నీ పించే వస్తువులు ,వాటిలో ఏముందో తెలియ లేం .కాని అవి మనకు కనీ పించి నట్లు గానే చూడ గలం .కాంట్ దృష్టిలో ప్రపంచానికి ప్రారంభం ఉంది .అది చాలా మామూలుగా మొదలైంది .స్వేచ్చ ఉంది అత్యవసరమైన ఒక పదార్ధం ఉంది .’’god is the ideal of pure reason ‘’అన్నాడు కాంట్ .దేవుడున్నాడని అందరూ భావించాలి .కాని ఆయన ఉనికిని మాత్రం రుజువు చేయ లేం .కాంట్ కున్న ఈ భావనలను ‘’ a work of skeptic ‘’అన్నారు కొందరు .
కాంట్ స్వంత ఇంటిని కొనుక్కొని అందులో నివాసం ఉన్నాడని చెప్పుకొన్నాం ఆ ఇంటిని ఆయన ‘’quite romantic but close to prison ‘’అని సరదాగా వ్యాఖ్యానించాడు అంటే పెద్ద గా సదుపాయాలూ లేనిదన్న మాట .ఇది ‘’బెకేర్ ‘’అనే పైంటర్ గారి ఇల్లు .క్రిస్మస్ కు ముందు రోజు దీన్ని ఎవరూ కోన లేదని గ్రాహించి కొన్నాడు డిసెంబర్ ముప్ఫై న 1783 లో .అందులో కొంత భాగం లో కొన్ని మార్పులు చేసి, మే ఇరవై రెండున గృహ ప్రవేశం చేశాడు 1783 నాటికి గత ముప్ఫై ఏళ్ళుగా బోధించిన వాటినే లెక్చర్లు గా బోధించానని కాంట్ చెప్పుకొన్నాడు .
మెటా ఫిజిక్స్ కు మూలం
‘’గ్రౌండ్ వర్క్ అఫ్ ది మెటా ఫిజిక్స్ అఫ్ మోరల్స్ ‘’ను కాంట్ 1784 లో పబ్లిషర్ కు ఇస్తే అది 1785 ఏప్రిల్ లో ప్రింట్ అయి వెలుగు చూసింది .అప్పటికే ‘’గ్రేవ్‘’అనే ఆయన కాంట్ రాస్సిన క్రిటిక్ ను ఘాటుగా విమర్శిస్తే కాంట్ దీటుగా సమాధానం చెప్పాడని మనకు తెలుసు .కాంట్ కు గ్రీక్ ఫిలాసఫర్ ‘’సిసిరో ‘’అంటే మహా ఇష్టం .మనం చేసే ప్రతి పనిలో మోరల్ కనీ పించాలని చెప్పాడు .ఒత్తి డి లో చేసింది ‘’ఇమ్మొరల్ ‘’అన్నాడు .అందుకే ‘’duty based theory of morality ‘’కావాలని గట్టిగా చెప్పాడు .మనం చేసే డ్యూటీ అంటే విధి అనేది ప్రక్రుతి నుంచి సహజం గా రావాలి (duty like all things derive from nature )
డ్యూటి రీజన్ మీద ఆధార పడి ఉంటుంది రీజన్ కున్న శక్తి వల్లనే మనుష్యుల ఆలోచనల్లో మార్పులోస్తాయి .’’మనం సాంఘిక జీవులమ (సోషల్ యానిమల్స్ )మనం బతకటానికి ఇతరులు అవసరం .వాళ్ళ సమ్మతి కూడా కావాలి .నైతిక ప్రవర్తన వారి సమ్మతి వల్లనే రుజువవుతుంది .మనం మంచి వాళ్ళం గా ,గౌరవస్తులం గా కనీ పింట మే కాదు ,మంచి వారంగా ,గౌరవ నీయులం గా ఉండాలి .,అలా జీవించాలి కూడా .సిసిరో వేదాంతి 1-perception of truth 2-preserving fellowship among men 3-greatness and strength of loyalty and un concerned spiriti 4-order and limit in every thing that is said or done ‘’.అవసరం అని చెప్పాడు .ఇవన్నీ ఒకదానితో కటి కలిసి పోయి సంబంధం కలిగి ఉంటాయి అన్నాడు సిసిరో .’’ఎథిక్స్ ‘’అనేది ‘’the study of ourselves within society ‘’మన ప్రవర్తన సంఘం లో మనం నిర్వహించే పాత్ర మీద ఆధార పడి ఉంటుంది .socialibility or communicability నుంచే డ్యూటీ అనేది ఎర్పడుతున్దన్నాడు కాంట్ .18 వ శతాబ్దం లో ‘’గౌరవం ‘’అనే మాట చాలా ప్రాచుర్యం పొందిన్దన్నాడు .’’without honour a member of a guild was nothing ‘’అనే భావన పెరిగి పోయింది అని చెప్పాడు.
కాంట్ దృష్టిలో నిజాయితీ అన్నది నిజం గా మనం ఎవరమో ,నిజం గా మనం ఎలా ఉండాలో అన్నది మాత్రమె నన్నాడు కాంట్ .ఇది సంఘం లో మనకున్న గౌరవం తో సంబంధం లేనిది .కనుక గౌరవానికి కాంట్ పెద్ద పీట .వెయ్యలేదు .నైతిక భావనలు అనుభవం నుండి యేర్పడ తగినవి కాదు పొమ్మన్నాడు .అవి ప్రయరీలేక ప్యూర్ రీజన్ నుంచే పుడతాయి .
కాంట్ కోరింది మహోన్నత మానవత్వం
‘’ డిగ్నిటి ఆఫ్ హుమానిటి’’ని ప్రష్యా దేశం ,ప్రజలు సాధించితే అదొక విస్ఫోటనా శక్తి గా యూరప్ మీదా, ప్రపంచం మీద ప్రభావాన్ని చూపుతుంది అని కాంట్ భావించాడు .తన రచనా విధానం తో ఇంత గొప్ప మార్పు జరిగితే తానెంతో ధన్యుడ నౌతానని కాంట్ విశ్వషించాడు .దీనికోసం ప్రజలకు ఆయన సూచిన్చిన్దేమిటంటే–1–ఆ సూత్రాన్ని అమలు చేస్తూ ఏపని అయినా చేయాలి ,అప్పుడది విశ్వ సూత్రం గా మార్చిన ఘనత వారికి లభిస్తుంది .2-అలా చేస్తూ ఉంటె మానవులంతా అంటే మనమే కాక ఎవరైనా అదే అంతిమమని భావిస్తారు 3-అఆలోచించే ప్రతి జీవి తానూ అనుసరిస్తున్న సూత్రం తన మనసు చెప్పింది మాత్రమె కాదని ,విశ్వ జనీన మైనదని భావిస్తాడు మనం అవలంబించే సూత్రం విశ్వ సూత్రం గా పరిణమించాలి ‘.అయితే కొందరు కాంట్ ‘’precarious state ‘’లో అంటే అస్తిర స్తితి లో ఉన్చేశాడని అన్నారు .
కాంట్ కోరింది స్వేచ్చ ..ఇదే తక్కువ చెడు చేసే స్వేచ్చ (least harmful )ఇదే వ్యక్తీ రీజన్ ను అన్నిటిలోనూ ఉపయోగించే స్వేచ్చ 1785 లో ‘’ideas in alla allegemine literature Zeituring ‘’ను సమీక్షించాడు .ప్రతి వ్యక్తీ ముందుగా తన పూర్వీకులు నడచిన బాట లోనే నడవాలని .వాటిని సక్రమం గా అమలు చెయ్యక పోవటం వల్ల వచ్చే అనర్ధాలకు తానే బాధ్యతా వహించాలని కాంట్ బోధించాడు .
1786 లోకాంట్ ‘’metaphysical foundations of natural science ‘’రాయటానికి కారణం ‘’సైన్స్ కు ఆడాప్తిక్ సర్టేనిటి ‘’అవసరం అనినమ్మకం గా భావించటమే .పదార్ధం విశ్వం లో నిండి ఉంటుంది .అంటే కారణం దాని ఉనికి మాత్రమె కాదని ఒక ప్రత్యెక కదలిక శక్తి వల్లనే అలా ఉంటుందని కాంట్ చెప్పాడు .(by a special moving force ).న్యూటన్ చెప్పిన సిద్ధాంతాలలోని లోపాలను సవరించి వాటిని జాగ్రత్త గా కాపాడాడు కాంట్ .రీజన్ అనేది కావలసిన రిసోర్సెస్ కలిగి విశ్వాన్ని కదలిస్తుందని ,రీజన్ వల్ల దేవుడి దర్శనం కాదు అని ,అంటే దేవుని ఉనికిని ఖచ్చితం గా చెప్పలేమని కాంట్ భావించాడు .రీజన్ నమ్మకాన్ని జస్టిఫై చేస్తుంది అంతే .మనకు మనం స్వేచ్చగా ఉన్నామని సెప్పుకోలేమన్నాడు .మన నైతిక అనుభవం లేక మానవ నైతిక అనుభవం మాత్రమె మనం స్వేచ్చగా ఉన్నామని చెప్పగలిగేవి అంటాడు కాంట్ .
ఇప్పటి వరకు కాంట్ ప్రతి రోజూ లెక్చర్లు ఇచ్చాడు .1787 అంటే63ఏళ్ళ తరువాత వారానికి నాలుగు గంటలే పబ్లిక్ లేక్చర్లిచ్చే వాడు .నాలుగు గంటలు ప్రైవేట్ లెక్చర్లు ఇచ్చే వాడు .అవి అం త ఉత్తేజకరం గా లేక పోయినా కాంట్ కే ఎక్కువ మంది శిష్యులున్డటం విశేషం .కాంట్ లెక్చర్ విన టానికి గంట ముందే వచ్చి సీట్లు రిజర్వ్ చేసుకొనే వారు అదీ కాంట్ కున్న క్రేజ్ .
సశేషం
శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పండుగ శుభా కాంక్షలతో
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-13- ఉయ్యూరు