గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -22
మనసు నిర్మాణం లో సహజం గా ఉన్న స్తల కాలాలు ,పన్నెండు అవగాహనా సూత్రాలూ మనకు కనీ పించే ప్రపంచానికే తప్ప ,యదార్ధ ప్రపంచానికి వర్తించవు అని ముందే చెప్పుకొన్నాం .యదార్ధ వస్తువులు స్థల కలాలకు అతీతమైనవనీ మనకు తెలుసు .మన అవగాహనా సూత్రాలకూ లోన్గనివీ అనీ తెలుసుకొన్నాం .కాని మనసు తమాషా అయింది .అది స్తల కాలాలను అవగాహనా సూత్రాలను యదార్ధ ప్రపంచానికి కూడా వర్తింప చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అదీ తమాషా .ఆ ప్రయత్నం లో కొన్ని పరస్పర వైరుధ్యాలు దానికి ఎదురౌతాయి ..వాటిని పరిష్కరించటం ,పరిహరించటం మానవ సాధ్యం కాదు .ఈ పరస్పర విరుద్ధ ప్రతి పాదనలను పాశ్చాత్య భాష లో ‘ ‘’యాంటినమీస్ ‘’అన్నారు .యాంటి నమి లో రెండు విరుద్ధ ప్రతిపాదనలున్నాయి .ఆ రెండు దేనికి అది గా చూస్తె నిజమే నని చూపించ వచ్చు .కాని అందులో ఒకటి నిజమైతే రెండోది నిజం కావటానికి వీలు లేదు .ఇటు వంటి వానినే యాంటి నమీ అంటారు .కాంట్ ఇలాంటి యాంటి నమీ లను నాలుగింటిని ప్రతిపాదించాడు .
1-కాలం దృష్టిలో (టేమ్పోరరిలి )చూస్తె జగత్తుకు ఆద్యన్తాలున్నాయి .స్తల రీత్యా (స్పేషి యల్లీ )చూసినా ప్రపంచానికి మొదలు తుది ఉన్నాయి .ఇది ధీసిస్ అంటే వాదం
కాలికం గా ,స్తాలికం గా ప్రపంచానికి ఆద్యంతాలు లేవు ఇది యాంటి దిసిస్ .అంటే ప్రతి వాదం ఈ వద ,ప్రతి వాదాలు రెండిటికీ రుజువు లున్నాయి .అయితే ఒకటి నిజమైతే రెండోది కాదు ఇదీ యాంటి నమి
2—పదార్ధాన్ని అనంతం గా విభజించ వచ్చు ఇది వాదం .పదార్ధం విభాజించటానికి వీలుకాని అత్యల్ప కణాలతో నిర్మించ బడి ఉంది ఇది ప్రతి వాదం .రెండూ తర్క బద్ధమైనవే .ఒకటి నిజమైతే రెండోది కాదు .
3—కార్య కారణాల గొలుసు (చైన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ )అనంతమైనది .ఇది వాదం .కార్య కారణాల గొలుసు అనంతం కాదు అనేది ప్రతివాదం .’’ఆది కారణం ‘(ఫస్ట్ కాజ్ )’ఒకటి ఉంది ..ఇదే కాంట్ గారి మూడవ యాంటి నమి .
4-ప్రపంచ కారణుడైన దేవుడున్నాడు .ఇది వాదం .దేవుడు లేడు అనేది ప్రతివాదం .ఇదే నాల్గవ యాంటి నమి .
ఇంతకీ ఈ వైరుధ్యాలకు కారణం ఏమిటి ?అని ప్రశ్నించు కొని సమాధానాలు చెప్పాడు మేధావి కాంట్ .దృశ్య మానవ ప్రపంచానికి వర్తించే కార్య కారణ సూత్రాలు ,అవగాహనా సూత్రాలను అనుభవ గోచరం కాని యదార్ధ జగత్తుకు వర్తింప జేయాలని ప్రయత్నించటం అత్యాశే అవుతుంది అందుకే ఈ వైరుధ్యాలేర్పడ్డాయి .అంటాడు కాంట్ .యదార్ధ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు .తెలుసుకొనే వీలు లేదు .మనకు వస్తువు తెలిసింది అంటే అది ఇంద్రియాల వల్ల అనుభూతమైందికనుక .అంటే యదార్ధ వస్తువు కాదన్న మాట .ఇంద్రియ గోచర వస్తువులను మాత్రమె మనసు గణిత ,భౌతిక సూత్రాలల ప్రకారం అవగాహన చేసుకోగలం .యదార్ధ వస్తువులు యెంత గిన్జుకొన్నా అనుభవం లోకి రానే రావు
మెటా ఫిజిక్స్ అంటే ‘’పరా భౌతిక శాస్త్రం ‘’భౌతిక వస్తువులకు ఆధారం గా ,వాటికి అతీతం గా శాశ్వత సత్యాన్ని కనుక్కోవ టానికి ఈ శాస్త్రంసహకరిస్తుంది .అలాంటి శాశ్వత సత్యం మానవ మేధస్సు ,మనసులతో అందని అతి గహన విషయం .అందుకని పార భౌతిక శాస్త్రం వృధా .మనసు ద్వారా తెలుసుకోగలిగింది భౌతిక సత్యాలను మాత్రమె .దేవుడు ఆత్మా ,అమరత్వం మానవ అవగాహనకు అందవు .ఇంత మాత్రం చేత దేవుడు ,ఆత్మా ,దాని నిత్య సత్యత్వం లేవు అని కాంట్ అననూ లేదు .అవి వివేచనకు అందాకా పోవచ్చు .కాని విశ్వాసానికి నిశ్చయం గా పట్టు బడతాయి .అని కాంట్ ద్రుఢం గానే చెప్పాడు .
కాంట్ నైతిక సిద్ధాంతం ..
కాంట్ నైతిక సిద్ధాంతం పార భౌతిక సిద్ధాంతం మీద ఆధార పాడిందే .’’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’లో కాంట్ పార భౌతిక సిద్ధాంతాన్ని గురించి చర్చించి చెప్పాడు .పార భౌతిక సత్యాన్ని మనసు కనుగొన లేదు అని ముందే చెప్పాడు .అది అజ్నేయం అని కాంట్ చెప్పిన విషయం మనకు తెలిసిందే .కాని ఆలోచించిన కొద్దీ అతనికి ఆ సిద్ధాంతం సంతృప్తి నివ్వలేదు .అందుకే ‘’క్రిటిక్ ఆఫ్ ప్రాక్టికల్ రీజన్ ‘’లో కాంట్ తన ఆజ్ఞేయ వాదాన్ని బాగా విపులీకరించాడు .అజ్నేయాన్ని జ్ఞేయం ఎలా చేసుకో వచ్చో తెలియ జెప్పాడు .ఈ బాహ్య ఇంద్రియ గోచర ప్రపంచానికి వెనుక ,దానికి ఆధార భూతం గా ఏదో ఒక ‘’యదార్ధం ‘’(రియాలిటి ) మనసుకు అననుభూతం గా అజ్నేయం గా ఉన్నది .దానిని మన తర్కం ద్వారా ,వివేచన ద్వారా ,మనసు ద్వారా తెలుసుకో లేము .మన ఉపనిషత్తు కూడా దీనినే చెప్పింది ‘’యతో వాచో నివర్తన్తే ,అప్రాప్య మన సా సహా –ఆనందం బ్రాహ్మణో విద్వాన్ నబిభేతి కదా చనా ‘’
కాంట్ నైతిక సంకల్పం
నైతిక సంకల్పాన్ని మన నైతిక ప్రవర్తన ద్వారా తెలుసుకొనే వీలు ఉంది .ప్రపంచ యదార్ధ స్తితి ,లేదా దైవం ,మన నైతిక ప్రవర్తన (కర్మ యోగం )ద్వారా ,నైతిక సంకల్పం ద్వారా గోచరించే అవకాశం ఉందంటాడు కాంట్ .కారణం నైతిక సంకల్పం ,ఇంద్రియ గోచరం ప్రపంచం నుండి రావటం లేదు .మనసు దాన్ని సంకల్పించ నూ లేదు .అంటే ఇంద్రియానుభవం ద్వారా కాని ,మనో వ్యాపారం ద్వారా కాని ,వివేచన ద్వారా కాని నైతిక సంకల్పం మనలో కలగటం లేదన్నాడు కాంట్ ..మరి ఎలా వస్తుంది ప్ర పంచానికి ఆధారం గా ,భూమిక గా ఉన్న అవాజ్మానస గోచరమైన పరమ సత్యమే భౌతిక సంకల్పాన్ని మనలో ఉద్బుద్ధం చేస్తోంది .కనుక ,ఆ నైతిక సంకల్పం ద్వారానే మనకు పారభౌతిక సత్యం గురించిన ప్రత్యక్ష జ్ఞానం చూచాయగా లభిస్తుంది .ఇప్పుడు నైతిక సంకల్పం అంటే ,ఏమిటో తెలుసుకోవాలి .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-13- ఉయ్యూరు