గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

సౌందర్యానికి కొలమానం ఏమిటి అన్న దానికి కాంట్ సంతృప్తి కరం గా సమాధానం చెప్పాడు .అందమైన వస్తువుకు ,కళాఖండానికి నీతి సూత్రాన్ని వర్తింప చేయ రాదు .ఇతర ప్రయోజనాలనూ ఆపాదించరాదు .వస్తువు అందం గా ఉందొ లేదో చెప్పటానికి నైతిక ,భౌతిక శాస్త్రాల కొలమానాలేవీ పని చేయవు .కళ యొక్క రామణీ యకత్వం .అనుభవైక వేద్యమే .దానిని కళా నియమాల ద్రుష్టి లోనే చూడాలి .అప్పుడే ఆనందాన్ని అనుభవించగలం అన్నాడుకాంట్ .

రామణీయకాన్ని ,కళాత్మక వస్తువును దేనికి అదే గమ్యం గా ,లక్ష్యం గా ,నిర్మమం గా ,నిర్లిప్తం గా  పరిగణించాలేతప్ప ,దాన్ని సాంఘిక ,రాజకీయ ,ఆర్ధిక ప్రయోజన ద్రుష్టి తో చూసి ,అందమైనదానిని గా భావించ రాదు .అది నిరపేక్ష రసానందం కలిగిస్తుంది కనుక రామణీ యార్ధాన్ని ప్రతిపాదిస్తోంది .కనుక సుందరమైనది .అవుతుందే తప్ప ,మరో దానికి కాదు .దాన్ని దాని కోసమే మనం ప్రేమిస్తాం .ఆస్వాదిస్తాం అంటాడు సౌన్దర్యాన్వేషి కాంట్ .

విరోదా భాసం

ఇక్కడ కూడా కాంట్ విరోదా భాసాన్ని (యాంటి నమి )ని ప్రతిపాదించాడు .రామణీ యకం వైయక్తికమే అయినా ,దానికి సార్వత్రికత ను ఆపాదించటానికి ప్రయత్నిస్తాం .అన్నికాలాలకు అన్ని దేశాలకు వర్తింప జేయాలని తహ తహ లాడుతాం .అది అందరికి ఆనందం గా ఉండాలని ,ఆనంద దాయకం కావాలని ఆశ పడతాం .మన ఆనందం లో అందరూ భాగస్వాములు కావాలని ఆరాట పడతాం .

సౌందర్యా స్వాదన వల్ల మనకు ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది .ఇది ఇంద్రియ పరమైనది మాత్రమె కాదు .వైజ్ఞానిక సంతృప్తే కాదు అదొక నిర్లిప్త, నిర్మమ సంతృప్తి .సౌందర్యారాధన వల్ల  బాహ్య ప్రయోజన మేదీ నెరవేరదు .ఒకానొక మానసిక సంతృప్తి మాత్రం కలుగుతుంది .ఇది మనలో ఉన్న ఏదో లోపాన్ని పూరించటం వల్ల  కాని ,ఏదో కోరిక నేర వేరటం  వల్ల  కాని కలిగే సంతృప్తి కాదు .అది నిరపేక్ష నిరాసక్త సంతృప్తి .దానికి అదే లక్ష్యం .దీనిలో స్వార్ధం లేదు .ఏ ఇతర బాహ్య ప్రయోజనాలకు లోబడి మలినం కాని మానసిక స్తితి ఇది .కనుకనే ఈ ఆనందం మనకే కాక అందరికీ ఆనందం కలిగిస్తుంది .మన వ్యక్తిగత ఆనందానికి సార్వత్రిక ,విశ్వ జనీనత వర్తిస్తాయి .కార్య కారణ సంబంధం లా ఇది అనుభవ పూర్వం ప్రాప్తించే స్తితి .అందుకని దానికి నిస్చితత్వం ,ఆవశ్యకతా కూడా కలుగుతాయి అంటాడు కాంట్ .

సుందర వస్తువు లిచ్చే ఆనందం ఆ వస్తువులలో లేదు .మన ఆస్వాదన శక్తి లో ఉంది .ఆ శక్తి వల్లనే వస్తువు అందం గా కన్పిస్తుంది .ఆ శక్తి అందరికి ఉంటుంది కనుక అందరికి అందం గా కనీ పిస్తుందని భావిస్తాం .ఒకరికి అందం గా ఉండి  ఇంకొకరికి అందం గా లేక పోవటం ఆ వస్తువు లోపం కాదు .ఆస్వాదించే శక్తి లో తేడా మాత్రమె .అభిరుచిలో భేదం అని కాంట్ చెప్పాడు .

కాంట్ చెప్పిన సౌందర్యం లో రకాలు

సౌందర్యం రెండు రకాలు అన్నాడు కాంట్ .ఒకటి సాపేక్ష సౌందర్యం (డి పెండెంట్ బ్యూటి )-అంటే బాహ్య ప్రయోజనం మీద ఆధార పడి  ఉండేది ప్రయోజనం కలిగించే వరకే  అది సుందరం గా అని పిస్తుంది .

రెండవది కేవల సౌందర్యం (ఫ్రీ బ్యూటి ).ఇదే అసలు సౌందర్యం అన్నాడు కాంట్ మహాశయుడు .ఇది కళాఖండాలకు వర్తిస్తుంది .కళ  నిజమైన కళ  కావాలంటే అది బాహ్య ప్రయోజన రహితం కావాలి .అంటే కళ  ను కళ  కోసమే ఆస్వాదించాలి ,ఆనందించాలి అదే ‘’ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ ‘’. .దీనినే కాంట్ ‘’ప్రయోజన రహిత ,ప్రయోజనాత్మకత ‘’(పర్పస్ లెస్ ,పర్పసివ్ నెస్ )అన్న పేరుతొ పిలిచాడు .

మరి ప్రయోజనం లేకుండా ఎవరూఎపనీ చేయరని మనకు తెలుసు .కళా ఖండాల కళాత్మకత ( ఆర్టి స్ట్రి)దాని నైతిక భౌతిక , సాంఘికాది ప్రయోజనాల్లో లేదు .దాని కేవల రామణీయకతలోనే ఉంది .అది అనుభవైక వేద్యం మాత్రమె .దానికి కొలమానాలూ సూత్రాలు వేరు గా ఉంటాయి .

కాంట్ ఏ అతీత దృక్పధం తో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడో లోతుగా అధ్యయనం చేస్తే కాని తెలియదు .కళాత్మక వస్తువులకు ,సాహిత్యానికి ప్రయోజనం ఉండదని ,ఉండరాదని కాంట్ ఏమీ చెప్పలేదు .అనైతికం (ఇమ్మొరల్ ),అసత్యం (అన్ ట్రూత్ ఫుల్ )అయినా ,కళా ఖండాలను ఆదరించాలి .,ఆస్వాదించాలి అని కూడా అర్ధం కాదు క ళ లోని సౌందర్యం ,దాని నైతికత (ఎధికాలిటి ) లో కాక సత్య ప్రామాణీ కత (ట్రూత్ ఫుల్ నెస్ )లోకాక ,తనకు తానే ప్రయోజన కరమైన ఆనందం కల్గించే లక్షణం లో ఉంది అది అన్నింటికీ అతీతం (ట్రా న్స్సేన్ డెంట్ ).గా ఉంటుందని అర్ధం చెప్పాడు కాంట్ .

కళ కు ,కళాత్మకత కు ,కళా సౌందర్యానికి సాంఘిక ప్రయోజనాన్ని మించిన అతీత ప్రయోజనం ఉంది .అదే ‘’పర్పస్ లే పర్ప సివ్ ‘’.అప్పుడే అది కళా ఖండం అని పించుకొంటుందని గొప్ప భాష్యం చెప్పాడు భాస్యకారుడు కాంట్ .కళా సౌందర్యానికి కళా సౌందర్యమే లక్ష్యం ,మరియు ప్రయోజనం కూడా .ఈ దృష్టితోనే కావ్యాలను నాటకాలను ,సంగీతాన్ని ఇతర కళలను ,సాహిత్యాన్ని అవగాహన చేసుకోవాలి .అని సౌందర్య చర్చలో కాంట్ చివరి తీర్పు నిచ్చాడు

ఈవిదం గా ఇన్ని రకాలుగా వేదాంత ,తాత్విక విజ్ఞాన గణిత తాలను తన  మేధా సంపత్తి చేత ప్రభావితం చేసిన దార్శనికుడు ,మేధావి, మాననీయుడు ,మహా వ్యక్తీ ఉత్తమ సంస్కారం తో ఎందరికో ప్రేరణ కలిగించిన జర్మన్ రుషి ఇమాన్యుయల్ కాంట్ .ఆ మహాను భావుడి గురించి చదివి తెలుసుకొని నాకు అర్ధం అయిన విషయాలను నాకోసమే నేను రాసుకొన్నా, ఆయన పై ఆసక్తి గల వారికి ఇది ఉపయోగ పడుతుందనే నమ్మకం తో ధారా వాహిక గా రాసి మీ అందరికి అందించాను .ఇందులో దోషాలన్నీ నావి నా అవగాహనా రాహిత్యానివి .మంచి అంతా అ కాంట్ మహాశయుడీది ,ఆయన్ను ఆవిష్కరించిన విశ్లేష కులైన మేదావులదీ .అందరికి వందనాలతో సెలవ్

సంపూర్ణం

ఈ బృహత్ వ్యాసానికి   ఆధార భూత మైన  రచనలు -రచయితలు

1-Kant –Scruton

2-On Kant –Garrelt Thomson –the words worth philosophical series

3-The philosophers –Ted Hand

4-Basic writings of Immanuel Kant

5-Pure reason –Kant

6-Kant a biography –Manfred Kuehin

7- Encyclopaedia Britanica

8-కాంట్ తత్త్వం –వాడ్రేవు చిన వీర భద్రుడు

9-విశ్వ దర్శనం –నండూరి రామ మోహన రావు

10-విజ్ఞాన సర్వస్వం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.