సరస భారతి -50 వ ప్రత్యెక సమావెశం -29-8-13-గురువారం –మధ్యాహ్నం 11 గం కు
ఉయ్యూరు సెంటర్లో నడి రోడ్డు మీద నాలుగు రోడ్ల కూడలి లో సమైక్య ఆంధ్రా ఉద్యమం లో భాగం గా సరస భారతి గ-సాహిత్య సాంస్కృతిక సంస్థ -29-8-13గురువారం 50 వ సమావేశాన్ని శ్రీ గిడుగు రామ మూర్తి గారి 151 వ జయంతిని ‘’తెలుగు భాషా దినోత్సవం ‘’గా జరుపుతూ ,’’సమైక్య శంఖారావం ‘’శీర్షిక తో కవి సమ్మేళనం జరిపింది .సరసభారతి అధ్యక్షులు సరే గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించి కార్య క్రమాన్ని నిర్వహించగా కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,ఉపాధ్యక్షులు డాక్టర్ దీవి చిన్మయ ,కార్య వర్గ సభ్యులు శ్రీ గబ్బిట నామనాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ప్రచార కార్య శ్రీ వి.బి.జి.రావు సహకారం అందించారు .పది మంది స్కూలు విద్యార్ధులు ముగ్గురు కవులు తమ కవితలను శంఖారావం లో విని పించారు .దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యత అవసరాన్ని దేశం లో జరుగుతున్నా ఉద్యమ తీరు తెన్నుల్ని వివరించారు గిడుగు వారి వ్యావహారిక భాషా సేవ ను ప్రస్తుతించారు .కే.సి.పి.సి.యి.వో.శ్రీ కే.వెంకటేశ్వర రావు ,శ్రీనివాసా అక్షరాలయం ప్రిన్సిపాల్ శ్రీ పరుచూరి శ్రీని వాసరావు లు వేదికను సుసంపన్నం చేశారు వందలాది విద్యార్ధులు వందలాది డ్వాక్రా మహిళలు స్వచ్చందం గా పాల్గొన్న ఈ సభలో అందరు ముక్త ఖంఠము తో సమైక్య నినాదాలు చేశారు .చిన్నారుల కవితలు అలరించి ప్రబోదాత్మకం గా ఉన్నాయి వాటిని అన్నిటిని ఇక్కడ అందిస్తున్నాము .
శ్రీ దుర్గా ప్రసాద్ గిడుగు వారి భాషా సేవాను ఇలా అభి వర్ణించారు –ఉత్తరాంధ్ర లో పర్లాకిమిడి మండలం పర్వతాల పేట లో వంశధారా నదీ తీరసం లో శ్రీ గిడుగు రామ మూర్తి 1861-ఆగస్ట్ 29 న జన్మించారు .తండ్రి రెవిన్యు ఇన్స్పెక్టర్ .ప్రైవేట్ గా చదివి మెట్రిక్ పాసయ్యారు .పర్లాకిమిడి గజపతి మహారాజ స్కూల్ లో ఉపాధ్యాయుడి గా చేరి 55 ఏళ్ళు అవిచ్చిన్నం గా ఉద్యోగించారు శాసన భాషను చదవటం స్వయం గా అభ్యసించాడు .వాటిపై సమగ్రం గా రాశారు ,మ గా ఎన్నో భాషలు నేర్చారు .
పర్లాకిమిడి ప్రాంత మన్యం లో ఉన్న ‘’సవరలు ‘’ అనే గిరిజనులున్నారు వారికి విద్యా గంధం లేదు వారు భాష మాట్లాడుతారు కాని దానికి వర్ణ సమామ్నాయం లిపి లేవు ఈ ఇబ్బంది ని గ్రాహించి పంతులు గారు తానూ స్వయం గా సవర భాష నేర్చుకొని వారితో మాట్లాడుతూ వారికి బాష పై మక్కువ కల్గించారు .సవర లిపి తయారు చేశారు అ భాష లో వారికోసం పుస్తకాలు రాశారు .తనే వారికి స్కూళ్ళు ఏర్పరచి స్వంత డబ్బుతో ఉపాధ్యాయులను పోషిస్తూ సవర బాల బాలికలకు విద్యా భ్యాసం చేయించారు .ఆ ప్రాంతాలన్నీ మలేరియాకు అల్లవాలాలు .అక్కడ తిరగటానికి క్వినైన్ మందు వాడారు ఆ డోసు ఎక్కువై వారికి పాపం వినికిడి శక్తి పోయింది అంటే చెవుడు వచ్చింది .w.b.yets ,శ్రీనివాసయ్యన్గార్ వంటి వారి వలన విద్యా భ్యాస పద్ధతులు గ్రహించాడు ఆంగ్ల విద్యా విధానాని అధ్యయనం చేశారు .అయ్యంగార్ ఏర్పరచిన సమాజం లో చేరి వ్యావహారిక భాషోద్యమానికి గొప్ప కృషి చేశారు .’’memorandum on modreen telugu ,’’minute of dissent ‘’పుస్తకాలు రాశారు
శ్రీ ముఖ లింగం దేవాలయం లోను గుహలలోను ఉన్న శాసనాలను పరిశోధన చేశారు కాలింగ దేశ రాజ దాని కాలింగ పట్నం కాదని శ్రీ ముఖ లింగమే నని అనేక సాక్షాధారాలతో రుజువు చేశారు .సవరల ఆచార వ్యవహారాలను గురించి ఆంగ్లం లో గ్రంధం రాశారు సవర కధలను,పాటలను సేకరించి ముద్రించారు .సవర వాచకం రాశారు .ఇంగ్లీష్ –సవర ,సవర –ఇంగ్లీష్ నిఘంటువు నిర్మించారు .సవర భాషకు గిడుగు వారి చేసిన కృషికి ‘’రావు సాహెబ్ ‘’బిరుదు ను బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది .’’ఖైజర్ యి-హింద్ ‘’బంగారు పతాకాన్ని ప్రదానం చేసింది .ఆ డబ్బును సవర విద్యా వ్యాప్తికే పంతులు గారు వెచ్చించారు .ఆయన 1940 ఫిబ్రవరి 22 న 79వ ఏట తనువూ చాలించారు .గిడుగు వారి ఒంటరి పోరాటం అకుమ్తిత కార్య దీక్ష అలుపెరుగాను ఉద్యమ తీవ్రత అందరికి ఈ సమయం లో స్పూర్తికావాలన్నారు
గురజాడ అప్పా రావు తో కలిసి వ్యావహారిక భాషోద్యమాన్ని నిర్వాహించారు ఆయన జనందినాన్ని ఆంద్ర భాష కు చేసిన సేవాకు గా ‘’తెలుగు భాషా దినోత్సవం గా ‘’మనం చేస్తున్నాం .ఇది వారి151 వ జన్మ దినం వారిని స్మరించి వారి సేవలను గుర్తించి తెలుగు బాషను రాష్ట్రాన్ని సమైక్యతను కాపాడుకొందాం .’’అని ప్రసంగం పూర్తీ చేశారు
సమైక్య శంఖారావం –కవి సమ్మేళనం
1- గబ్బిట దుర్గా ప్రసాద్
సమైక్య శంఖారావం
‘’ఇక్కడ గర్జిస్తే-అక్కడ ధిల్లీ లో గజ గజ వణుకు పుట్టాలి
ఇక్కడ శంఖం ఊదితే –అక్కడ మూసుకు పోయిన చెవులు పగిలి పోవాలి
ఇక్కడ ప్రతిన పూనితే –అక్కడ పడ చెవిన పెట్టిన గళం మూగ పోవాలి
అన్నీవదిలి ,అందరూ కలిసి ఇక్కడ చేయి చేయి కలిపితే -అక్కడ గుండె గుభేల్ మనాలి
రెండేళ్ళ క్రితం జనం వినిపించిన సమైక్య శంఖారావానికి –కారుడు గట్టిన ఎన్నో దేశాల నియంతలే –దేశం వదిలి పారి పోయారని మరవకండి
ఇప్పుడు కంబోడియా లో జరుగుతున్నది ఇదే నని గుర్తించండి
ఈ చేతులు వదలిన ,గొంతులు కలవక పోయినా ,సంఘీభావం సడలినా
మనకు మిగిలేది తీరని అవమానమే నని మరచి పోకండి
తెలుగు వాడి ఆత్మా గౌరవాన్ని ధిల్లీ లో పణంగా పెట్టి నప్పుడు
తెలుగు వాడే మళ్ళీ ఆగౌరవాన్ని తెచ్చి పెట్టాడని గుర్తించండి
బహు భాషా కోవిదుడు ,అపర చాణక్యుడు తెలుగు వారి తోలి ప్రధాని పి.వి,ని
నది బజార్లో అవమానించిన వంచకుల పాలిటి అంకుశాలై లేవండి
గిడుగు వారి ఆత్మ బలం సాక్షిగా
తెలుగు భాషను తెలుగు రాష్ట్రాన్ని .తెలుగుల ఆత్మా గౌరవాన్ని
కాపాడుకోవటానికి కొదమ సిమ్హాలై గర్జిస్తూ కదలండి
‘’ఏక వాక్యం ‘’శిలా శసనం’’కాదని చెప్పి దాన్ని భూస్తాపితం చేయండి
ప్రజాభీస్టమూ ,ప్రజా వాక్కే శిరోధార్యం అని కళ్ళు తెరిపించండి
ప్రజాబలం ముందు అవినీతి బలం బలగం ఆగలేవని చాటండి
ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించి ,పదవీ త్యాగం చేయించండి
అన్నదమ్ముల మధ్య కావాలని చిచ్చు బెట్టి
మన రాష్ట్ర అభి వృద్ధికి ఓర్వలేని కుళ్ళు కున్న ‘’చిదంబర రహస్యాన్ని ‘’చేదించండి
దిగ్విజం ‘’ఇక్కడి ప్రజలదే కాని –
అక్కడెక్కడో కూర్చున్న వాడిది కాదని రుజువు చేయండి
ప్రజా విజయం సాధించటానికి శ్రమ దమాదు లకోర్చి
సమైక్య శంఖారావం తో సమైక్యం గా ముందుకు సాగండి .
2- శ్రీ టి.కే.వి.ఎల్ నరసింహా చార్యులు ‘’మైక్యాన్ద్రావనీ’’ –గీతం
జయహే –జయహే జయ సమైక్యాన్ద్రావనీ –జయ జయ జయ జయ –లోక పావనీ
1-పరమ పావనము ణీ పద యుగళి-వరదాయకము నీ కర యుగళి
మది తలంచి నిను వేడు కొంటిమి –హృది నుప్పొంగ మము బ్రోవుమా
2- ఆందోలిత మౌ మా హృదయమో –అమృత దారాలే వర్షిన్చుమా
అగణిత శక్తి ధనమ్ముల నొసగుమా –ఆపద బాపుమా అమృత వల్లీ
3- శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి నిజం గా నేడే తెలుగు భాషోత్సవం
నిజానికి నేడు తెలుగు భాషా దినోత్సవం –
వ్యావహారిక భాషకు అడుగులు వేసిన గిడుగు వారు పుట్టిన రోజు
ఇది ఏటేటా వచ్చే పండగే –కాని నేడిది అయింది దండగ
భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మనమే ప్రధమం –
స్వార్ధ రాజకీయాలలోనూ మనమే ముందు
దాని ఫలితమే నేటి విభజన వాత –తెలుగు వాడు భరించ లేని గుండె కోత
4-చి పి.దుర్గా భావాని –తొమ్మిదో క్లాస్ –ఫ్లోర స్కూల్ –‘’సమైక్యాంధ్ర మనది ‘’
తెలుగు భాష మనదిరా –తెలుగురాస్త్రం మనదిరా
తెలంగాణా ఒక భాగం రా –సమైక్యాంధ్ర ముద్దు రా
భాగ్య నగరం అందరిదీ –సోనియమ్మకు చెప్పరా
చెయ్యెత్తి చెప్పరా –సమైక్యాంధ్ర మనదిరా .
5-శ్రీ ఏం.శ్రీనివాస శర్మ –‘’విడగొతట్ట వద్దు ‘’
నా రాష్ట్రాన్ని విడగొట్ట వద్దు –తెలుగుతల్లిని ముక్కలు చేయొద్దు
కలిసి ఉంటె కాదు సుఖం అన్న పెద్దల మాటల్ని పేద చెవి పెట్టొద్దు
కార్మిక శ్రామిక కర్షకులు –విద్యార్ధులు అధ్యాపకులు
సమైక్య వాదం వినిపించ రండి –
దాయాదుల దుస్తి షోకి –విల పిస్తోంది తెలుగుతల్లి
నా రాష్ట్రాన్ని చిన్నది చేస్తే –మీ రాష్ట్రాలు పెద్దవి కాబోవు
ముక్కలై పోతున్న మా మనో గతాన్ని –దయతో రక్షించు ధిల్లీ తల్లీ
6-చి వి.రాజ కుమార్ –తొమ్మిదో తరగతి –ఐ.ఐ.టి.-‘’మన మహా వృక్షం ‘’
మన తెలుగు జాతి మహా వృక్షం –దాన్ని ముక్కలు చేయకుండా ఉంచి నప్పుడే
దాని గొప్ప తనం తెలుస్తుంది –వృక్షం ఇచ్చ్చే సకల సదుపాయాలూ లభిస్తాయి
అలాంటి వృక్షమే మన తెలుగు రాష్ట్రం –మనకు గర్వ కారణం
దాన్ని ముక్కలు చేసి గుండె కొత్త కోయోద్దు
తెలుగు భాషా తెలుగు వెలుగూ అందరిదీ –కాపాడుకొందాం దాన్ని
7-బి.దివ్య –తొమ్మిది –ఫ్లోరా ‘’మనం తెలుగు తల్లి బిడ్డలం ‘
మనమంతా తెలుగు తల్లి బిడ్డలం –భావిశ్యత్తులో అవాల్సిన బంగారు గడ్డలం
విభజనతో ముక్కలు చెక్కలు చేయద్దు –తీపి తెలుగు గడ్డ లో చేదును నశింప జేద్దాం
ఉప్పెనలా కడలి రండి- సమైక్య శంఖారావం పూరించండి
జై సమైక్యాంధ్ర –జై జై సమైక్యాన్ద్రా
8-చి ఎస్ పి.వి .ప్రభాత –తొమ్మిది –ఫ్లోర ‘’గుండె కోత ‘’
మన పొట్ట కొత్త టానికే –ఈ విభజన
తినటానికి తిండి తాగటానికి నీరు
సేద్యానికి జలం దొరకని పరిస్తితి వస్తుంది
చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండవ్
మిగిలిన వారికి పనులు ఉండవ్
అమరజీవి త్యాగం తో వచ్చిన రాష్ట్రం
రక్త కన్నీరై విలపిస్తోంది
ఈ నేలా నీరు గాలి జాతి మనవే మనవే మనవే .
9-యం .నితీష్ కుమార్ –తొమ్మిది –ఫ్లోర –‘’వెలుగు జాతి ‘’
తెలుగు జాతి అంటేనే వెలుగు జాతి
మనది తేనెల తెలుగు –సమైక్యత మన ఊపిరి
తెలుగు తల్లి గుండె చీల్చొద్దు –
అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టొద్దు
వెలుగు ఉంటె ఛీకటి రాదు –వెలుగు మన ధ్యేయం
10- చి ఏం దేపిక –తొమ్మిది –ఫ్లోర ‘’కలిసి జీవిద్దాం
సమైక్యం కోసం అంతా కదలి రండి
కలిసి జీవిద్దాం కలిసి అడుగేద్దాం
సమైక్యాంధ్ర సాధనకు నడుం బిగిద్దాం
మనం కోల్పోయే బంగారు భవిష్యతును తెలియ జేద్దాం
అభివృద్ధి పధం లో నడిచే మనల్ని
వెనక్కి మళ్ళించే యోచనకు స్వస్తి పలికిద్దాం
– 11-చి శ్రేయదత్త –తొమ్మిది –ఫ్లోర ‘’భజన ‘’
– తెలంగాణా వాదులు విభజన కోసం చేశారు భజన
– వారి భజనకు మెచ్చి పైవాళ్ళు చేశారు విభజన
– ఈ విభజనను వ్యతిరేకిస్తూ
– సీమాన్ధ్రులు పడుతున్నారు తర్జన భర్జన
– మేము సైతం అంటూ విద్యార్ధి లోకం చేస్తోంది సింహ గర్జన
– జై సమైక్యాంధ్ర –జై జై సమైక్యాంధ్ర
– చూడ ముచ్చటగా రెండు గంటలు సాగిన ఈ ‘’సమైక్య శంఖారావం ‘’ అందరినీ ఆకర్షించింది .అన్ని చానళ్ళూ వీడియోలు తీసి తమ చానళ్ళకు అండ జేశారు .దీన్ని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి సరసభారతి కృతజ్ఞతలు తెలియ జేసింది
– మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-13- ఉయ్యూరు
vupanyasalu uttejakaram;photolu nayanaanandakaram,jai smykyandhra.-vijayasaradhi pedaprolu