మరుగున పడిన మతాలూ మతా చార్యులు -1
సాహితీ బంధువులకు –శుభ కామనలు –పై శీర్షిక తో ఈ రోజు నుంచి ఒక కొత్త సీరియల్ ప్రారంభిస్తున్నాను .లోతుగా చర్చించ కుండా ముఖ్య మైన విషయాలనే ప్రస్తావించి ,మరుగున పడిన మతాలను మాతా చార్యులను గురించి సంక్షిప్తం గా తెలియ జేయటమే నా ముఖ్యం గా భావించి చేస్తున్న ప్రక్రియ .
లోకాయతనం
దీనికే కాపాలిక మతం అని ఇంకోపేరు .దీని లో స్త్రీ ,పురుష విచక్షణ లేదు ఫ్రీ లైంగిక సంపర్కం ఉంటుంది .ఈ విషయం గుణ రత్న మొదలైన వారు చెప్పారు .తాంత్రిక విద్య ఇందులో ప్రధానం .వీరికి ‘’దేహమే సర్వస్వం సంభోగమే పరమార్ధం ‘’ .ఇది ఒక రకం గా బౌద్ధం లో ఒక భాగం అయిన ‘’సహజీవ ‘’సిద్ధాంతం లాంటిది అని అంటారు .ఇందులో ‘’ఉరు’’ భౌతిక వాదమే ఉన్నదని దేవీ ప్రసాద్ రాయ చట్టోపాధ్యాయ తెలిపాడు లోకాయుతులకు’’ మద్యం మాంసం మైదునం’’ అంటే‘’మకార త్రయం’’ మీద మక్కువ ఎక్కువ .ఇది చౌక రకం కాదని ‘’పర లోకాన్ని ,ఆత్మను ,నిరాకరించి ,ఇహలోకం లో సుఖం గా బతకండి ‘’అనేదే ఆదర్శం అని చెప్పారు లోకాయతులు .ప్రతి వాడు తన సుఖాన్ని,తన లాభాన్ని సాధించాలి .ఆదర్శాన్ని గట్టున పెట్టాలి ,కట్టు బాట్లు తెగ గొట్టాలి మర్యాద ను మట్టుబెట్టాలి .వీటన్నిటికి కవరింగ్ గా తాము కాపాలికులమని తాన్త్రికులమని దండన కు భయ పడి చెప్పుకోవటం అలవాటైందని విశ్లేషకుల భావన . గ్రీకు తత్వ వేత్త ఎపిక్యూరస్ సిద్ధాంతాలకూ ఇదే గతి పట్టింది .
లోకాయతనానికి ‘’బృహస్పతి ‘’ప్రవర్తకుడు అంటారు .ఇతను రాసినవే ‘’బృహస్పతి సూత్రాలు’’ అని పిలువ బడినాయి .పతంజలి ,భాస్కరుడు(బ్రహ్మ సూత్రానికి భాష్య కర్త ) లోకం లో లోకాయతనం అనే మతం ఉందని చెప్పారు . ,లోకాయతన భాష్య కర్త ‘’భాగురి ‘’అని పతంజలి చెప్పాడు .భాగురి క్రీ . పూ.150 కి పూర్వపు వాడని అభిప్రాయం .పది హేడవ శతాబ్దం లో జయశ్రీ రాసిన ‘’తత్వోవ ప్లవ ‘’అనే గ్రంధాన్ని రాసి బృహస్పతిని తన గురువు గా చెప్పుకొన్నాడు .అన్ని ప్రమాణాలను యితడు నిరాకరించాడు .
లోకాయతులు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమె అంగీకరించారు .అనుమానం మొదలైన ప్రమాణాలను కాదన్నారు .అన్ని వస్తువులూ నాలుగుభూత సముదాయమే ,ప్రపంచానికి అంతటికి స్వభావం తప్ప ఇంకే కారణం లేదు అన్నారు .’’శరీరం లేక పొతే చైతన్యం లేదు జడ భూతాల వికారం లో చైతన్యం కలుగుతుందని వీళ్ళ మతం .’’రాజు లేకశాసకులు నిర్మించే విధులే ధర్మాలు .అవి అపౌరుషేయాలో ,నిత్యమైనవో కాదు .రాజ నియమ బద్ధ మైన సౌఖ్యం ,అర్ధ కామాలను సాధించటం ‘’అనేది లోకాయతన వాదం .మనకు కనపడని పార లౌకిక సుఖ వాంఛ లతోనో , పుణ్యం ,పాపం అనే భ్రమ తోనో సుఖం రాదు .కనబడే ఇహ సుఖాలను ఉల్లంఘించటం మూర్ఖత్వం ,శాసనాలకు లోబడి అన్ని సుఖాలు పొంది బతకాలి ‘’అన్నదే లోకాయతుల మత సారం .
ఇప్పుడు దీని ప్రభావం లేదు .ఉన్నా ఏ మారు మూల హిమాలయ ప్రాంతాలోనో ఉంది ఆచరణకు అ సాధ్యంఅని , అతి అని ,జుగుప్స , అని పించటం వల్ల కను మరుగైంది లోకాయతనం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-13 ఉయ్యూరు .