‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4
వ్యాధి గ్రస్త
హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద దగ్గరకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రాంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తున్నారు వెళ్తున్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ తో గులాబి రంగు శరీర చాయతో వచ్చి దగ్గర కూర్చుంది .అతనికి ‘’హిమగిరి తనయ మహా దేవుని గురించి చేస్తున్న తపసు వదిలి తన వ్యాధికి అక్కడ దొరకని మందు కోసం వచ్చిందా /’’?అని పించింది ఆమెను చూస్తూ గడిపాడు కాలం .ఆమెకూడా చూస్తూనే ఉంది ‘’అయితే ఆమె పైకి యెంత రామణీయకం గా గోచరిస్తోందో ,ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు ‘’అని గ్రహించాడు అందమైన కళ్ళ కింద నల్లని గుంటలు ఉన్నాయి ముఖం మీది చర్మం లో మలినం కన్పిస్తోంది .నిటారుగా కూర్చో లేక వొరిగి పోయింది. లోనికి వెళ్లి‘’డూష్’’చేయించుకొని వెళ్లి పోయింది .డాక్టర్ సంజీవ దేవ్ డాక్టర్ కమలా నంద నువిషయం ఏమిటి అని అడిగాడు .ఆమె గనేరియా తో బాధ పడుతోందని డాక్టర్ చెప్పాడు ఆమె వెళ్ళేప్పుడు ఇతన్ని చూసి మరీ వెళ్ళింది .’’ఆమె మీద జాలితో కూడిన గౌరవం’’కలిగింది .అందమైన దేహం లో అవ్యక్త మైన వ్యాధి ఎలా ఉంటుందో దేవ్ గ్రహించాడు .
లాల్ చంద్ తండ్రి భార్యలు
దేవ్ గుర్రం పై ‘’ష త్ నగర్ ‘’చేరాడు .లాల్ చంద్ అనే అతను తోడున్నాడు .అవివాహితుడు .హిమాలయా ప్రాంతాలలో లేత వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి .కాని ఇతని కి పెళ్లి కాలేదు .కారణం ఏమిటని సంజీవ్ అడిగాడు .అతని తండ్రికి ఇద్దరు పెళ్ళాలు .ఇతను పెద్ద భార్య కొడుకు .సవతి తల్లికి పిల్లలు లేరు .పొలం మీద వచ్చే ఆదాయం తో భుక్తి గడవదు .సవతి తల్లి తనను స్వంత పిల్లాడిగా నే చూస్తోంది .తండ్రి ఏ పనీ చేయని సోమరి .జూదం ఆడి డబ్బు తగలేస్తాడు .అప్పుడు సంజీవ దేవ్ కు తనకూ ఇలాంటి సవతి తల్లులున్నారని జ్ఞాపకం వచ్చి ఊరట చెందాడు .
నీరజ
లక్నో లోని లలితా కళల విద్యాలయం లో అసిత్ కుమార్ హాల్దార్ దగ్గర చిత్ర కళ అభ్య సిస్తున్న బెంగాలి అమ్మాయే నీరజ .సంజీవ్ కంటే ఒక ఏడాది పెద్దది .’’స్నేహ పాత్ర ‘’.సుకోమల మైన వేదనలు ,సంవేదనలు కల హృదయం ఆమెది బలహీన మైన శరీరం ఆమె మానసిక సౌందర్యానికి ప్రతి బింబమే ‘’నని భావించాడు .ఆమె తో నామం ,రూపం అనే విషయాల పై చర్చించాడు .’’మన ఉభయుల్లోరూపాల కంటే నామాలు బాగున్నాయి ‘’అన్నాడు సంజీవ్.
ఒక రోజు అందరు కలిసి పిక్నిక్ కు వెళ్ళారు .గోమతీ తీరం .’’నీరజ స్నేహం అతనిలో నూతన ప్రాణాన్ని ,నూతనోత్సాహాన్ని ,జీవితం లో ఆశావాదాన్ని సృష్టించాయి ‘’.ఆమె లో అనురక్తి విరక్తి ఉండేవి .హిమాలయాలలోఆనంద సాధనలో ఉండి పోవాలని నీరజ తాపత్రయం .ఆమెలో ప్రవ్రుత్తి కంటే నివృత్తి ఎక్కువ అని గ్రహించాడు .ఒక పురుషుడు ,వివాహం కాని ఒక స్త్రీ ఒక చోట స్నేహితుల్లాగా నివసించటం సంభవం కాదా ?అని అనుమాన పడ్డాడు .తుమ్మ పూడి వెళ్ళట మా ,మాయా వతి లో ఉండి పోవటమా ఏదీ తేల్చుకోలేక పోతున్నాడు .ఈ ఆలోచన తో ఒక రోజు రాత్రంతా నిద్రే లేదు .మర్నాటి మధ్యాహ్నం నీరజ కన్పించింది .ఇతని అశాంతికి కారణాన్ని అడిగింది .ఆమె కూడా ఏదీ నిర్ణ యించుకోలేక పోతున్నానని చెప్పింది .అయినా ఇతన్ని తుమ్మ పూడి వెళ్లి పొమ్మని సలహా ఇచ్చింది .అతని వేదనకు సమాధానం లభించింది .సమస్య తీరింది .తుమ్మ పూడి వెళ్ళటానికి నిర్ణయించుకొన్నాడు .ఇలా సమస్యల వలయం లో ‘’అతివ నీరజ అతనికి సమాధాన రేఖ’’గా గోచరించింది .’’నీరజ తో కలిసి ఉండటం నివృత్తి అని ,నీరజ కు దూరం గా ఉండటం ప్రవ్రుత్తి ‘’అనీ నిర్ధారించుకొన్నాడు సంజీవ్
ఆ రోజు రాత్రి అతనికి దుస్వప్నం వచ్చింది .నీరజ చని పోయి నట్లు ,అంతా దుఖిస్తున్నట్లు కల .మర్నాడు తెలుసు కొంటె నీరజకు నిజం గానే జ్వరం వచ్చి నట్లు తెలిసింది ఈ సంగతి ఆమె కు చెబితే ఆశ్చర్య పోయింది .’’జ్వరం వస్తుంటేనే అజ్ఞానం కాలి పోయి జ్ఞానోదయం కలుగదు ‘’అన్నాడు తను .దానికి సమాధానం గా ఆమె ‘’నీకు కు జ్వరం రావటం లేదు కనుక నీలో జ్ఞానం అస్తమిస్తోందా?.నేను జ్ఞానం నుంచి జ్ఞానం లోకి ప్ర వేసిస్తుంటే నీవు అజ్ఞానం లోంచి అజ్ఞానం లోకి ప్రవేసిస్తున్నట్లుంది ‘’అన్నది ఆమె .ఇది నిజమే నంటాడు దేవ్ .నీరజ ఇంటి నుంచి హిమాలయాలలోకి అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం లోకి వెళ్తోంది తానేమో హిమాలయాల నుండి ఇంటికి అంటే జ్ఞానం లో నుంచి అజ్ఞానం లోకి వెళ్తున్నాడు .నీరజ జ్వరం తగ్గింది .సంజీవ్ ఆమెతో ‘’మంచం లో ఉండి జ్ఞానం పొందావు .మంచం దిగి అజ్ఞానం లోకి ప్రవేశించావు ‘’అని చమత్కరించాడు .ఆమె జవాబు చెప్ప కుండా తల ప్రక్కకు తిప్పుకోంది.
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-13-ఉయ్యూరు