మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3
మోత్జు మతం
చైనా దార్శనికుడు కంఫ్యూజియాస్ కంటే తర్వాతి కాలం వాడైన మోత్జు హోవాన్ రాష్ట్రం లో కాని లూ రాష్ట్రం లో కాని పుట్టి ఉంటాడని చరిత్ర చెబుతోంది కాలం క్రీ .పూ. 468-376గా ఊహిస్తున్నారు ఇతని మతాన్ని ‘’ఉపయోగితా వాదం ‘’అంటారు ఉపయోగం లేక లాభం ,నిర్వహణ లను గురించి ఎక్కువ గా చెప్పాడు మంచి చెడులను వాటి ఉపయోగాలను బట్టి వాటి వినియోగాలను బట్టి నిర్ణయించాలి .ప్రాచీన విజ్ఞానులు నడచిన బాటలో నడవటం ‘’ద్యౌన్ ‘’,పితరులు చెప్పిన ఆజ్ఞాలనుపాలించటం చేయాలి ఇవే నాటిక నిర్ణయాలకు ఆధారం .సాధారణ జనం యొక్క ఇంద్రియ జ్ఞానం చేత రుజువైన నిర్ణయమే సరైనదిగా భావించాలి .వీటిని ప్రజా పాలనకు లాభం చేకూరేట్లు అమలు చేయాలి .దేశానికి ,ప్రజలకు లాభం అనేదే ఒరవడి రాయి గా భావించాలి .
ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతాలు విలువ లేనివే .ఇంతకీ లాభం అంటే ఎవరికి దేనికి ?దేశ సంపద ,ప్రజా సంఖ్య ,ధన ధాన్యాలు ప్రజల సంఖ్యను పెంచేదే సరైన నీతి విధానం .ఉపయోగం లేని వాటి పై డబ్బు దుబారా చేయకుండా ఉంటె సంపద పెరుగుతుంది .మగవారు ఇరవై ఏళ్ళకు ఆడవారు పదహారేళ్ళకు పెళ్లి చేసుకొని సంతానం పొందాలి .దీని వల్లనే ప్రజాభి వృద్ధి సాధ్యం .మనిషి ఎప్పుడూ ఫలించే పనే చేయాలి .అన్న వస్స్ట్రా లిచ్చేవి శ్రమ తీర్చే పనులే ఉపయోగామైనవి .పనీ పాట లేకుండా రోజులు గడపటం పుట్టిన రోజులు చావు రోజుల్లో అశౌచం పాటించటం ,గుళ్ళూ గోపురాలు కట్టించటం సంగీతాది కళల వల్ల ఏ ప్రయోజనమూ లేదు .ఇవన్నీ నిరర్ధక కర్మలు .వీటిని వదిలెయ్యాలి .ఉద్రేకం పనికి రాదు .కష్టించి పని చెయ్యాలి .మితం గా ఖర్చు చేయటం ,ప్రజాభివృద్ధి శ్రేష్టం
బలీన రాజ్యాలను బలమైన వారు ఆక్రమించటం దుర్బలుల్ని మంచి వారిని బల వంతులు పీడించ రాదు మోసం అసలు పనికి రాదు .పీడన మోసం ,అనేవి గొప్ప విపత్తులు .పాలించే వారికి దయ ఉండాలి పాలింప బడే వారికి విశ్వాసం ఉండాలి తండ్రికి ప్రేమ ,కొడుకుకు పితృ భక్తీ తప్పని సరి ఇవి లేక పొతే లోకం లో ఘోర విపత్తులే జరుగుతాయి .ద్వేషం హింస ,పక్షపాతం పతన హేతువులు .పక్ష పాతం లేని విశ్వ జనీన ప్రేమ (chien ai )ను అల వరచుకోవాలి .అందరిని తన లాగే భావిస్తే లోకం లో విపత్తులే ఉండవు .అందరూ ఇలా ప్రవర్తిస్తే విశ్వానికి అంతటికి లాభం చేకూరుతుంది మోసం దగా వల్ల తాత్కాలిక ప్రయోజనం కలిగినా అవి అందరికి కష్టం నష్టం కల్గిస్తాయి .
‘’ద్యౌన్ ‘’అనేది ఉందని అది విశ్వ ప్రేమ ను ఆచరణ లో పెట్టె వారికి ఉచిత ప్రతి ఫలాన్నిచ్చిబహు మానిస్తుందని మోత్జుచెప్పాడు విశ్వ ప్రేమ కలిగి ఉండాలి అన్నది ‘’ద్యౌన్‘’యొక్క ఇచ్చ ,ఆజ్ఞా కూడా .ద్యౌన్ అందరికి వివేకాన్ని ఇస్తుంది కనుక అది అందర్నీ ప్రేమిస్తుంది,భరిస్తుంది ధరిస్తుంది అదే పూజలని యజ్ఞాలను బలుల ను తీసుకొంటుంది .నాగరకు లంతా దానికి బలుల ను సమర్పించి ఆరాధించాలి .ఈ ద్యౌన్ అంటే ఈశ్వరుడే .ధర్మ రక్షణ అధర్మ శిక్షణ అదే చేస్తుంది ఈశ్వరుడే కాక పితరులు దేవతలు కూడా దుస్ట శిక్షణ శిస్ట రక్షణ చేస్తారు .వీరంతా మానవ కర్మలకు ఫలితాల నిస్తారు అంతే .మానవులనుభవించేది అంతా వాళ్ళు చేసిన దాని ఫలితమే తప్ప వేరే కాదు .అదృష్టం అంటూ విధి అంటూ ఊరికే కూర్చోకుండా ఎవరి పని వారు చేయాల్సిందే .
రాజ్యం ,ప్రభుత్వం లేక పొతే ఎవడి ఇష్టం వచ్చి నట్లు వాడు ప్రవర్తించి విశ్వ శాంతికి భంగం కల్గిస్తాడు .ధర్మాత్ముడు ,సమర్ధుడైన వాడే ప్రభువు గా ఉండాలి .మోత్జు తరువాత క్రీ .పూ.221 కి ముందే అతని అనుయాయులు తర్కాన్ని ఆధారం గా చేసుకొని అతని బోధలను బల పరిచే ప్రయత్నం చేశారు .ఈ విషయాలు ‘’మోచింగ్ ‘’అనే గ్రంధం లో కనీ పిస్తాయి ..ఉపయోగానికి ,లాభానికి విలువను ఎందుకు ఇవ్వాలి అనేదానికి ఇందులో సమాధానం చెప్ప బడింది ఏదైనా లభిస్తే సుఖం ఇచ్చేది లాభ ప్రదమైంది .సంప్రాప్తమైనప్పుడు అప్రియం చేసేది నష్ట ప్రదం .సుఖం ఇచ్చేదే లాభం దానికే విలువ .భవిష్యత్ లో శాశ్వత సుఖాన్నిచ్చేదే లాభ ప్రదం అందరికి లాభం చేయటమే ధర్మము .విశ్వ ప్రేమ ఉన్నప్పుడే అది సాధ్యం
మోత్జు అనుయాయులు విశ్వ ప్రేమ సాధ్యమా అన్న దాని పై కూడా చర్చించారు .అది సాధ్యమే నని నిశ్చయం గా చెప్పారు .ఎంతమంది ఉన్నారో తెలియ కుండా ఎలా ప్రేమిస్తాం /అన్నదానికి ప్రేమించటానికి సంఖ్య తో సంబంధం లేదని చెప్పారు .మానవులంతా ఎక్కడ ఉన్నా వారెవరో తెలియక పోయినా ప్రేమించటం సాధ్యమే .అన్నారు .మానవుల సంఖ్య పరిమితమే కనుక ప్రేమించటం సాధ్యమే మనుష్యులలో చెడ్డ వారు ఉంటారు కదా ఎలా? అన్నదానికి దుష్టుని లోని దౌష్ట్యాన్ని ద్వేషించాలి దాన్ని తొలగించటమే దుస్ట శిక్షణ .ఇది మానవ హింస లోకి రాదు అని నొక్కి చెప్పారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-13- ఉయ్యూరు