ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కని పించిన దోషాలు –గుణాలు

సాహితీ బంధువులకు శుభ కామనలు కృష్ణా జిల్లా పేద ముత్తేవి శ్రీ లక్ష్మీ నృసింహ ఆశ్రమ పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీంద్రుల వారు వారి చే పేద ముత్తేవి లో నిర్వ హింప బడుతున్నఓరి యంటల్ హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ సెక్రెటరి అయిన శ్రీ కోసూరు ఆది నారాయణ గారి ద్వారా నెల క్రితం ఒక సందేశం పంపించారు .రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలం లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రచురించిన హైస్కూల్ సాంఘిక శాస్త్ర పుస్తకాలలో కొన్ని దోషాలు, కొన్నిజాతిని కించ పరచే విషయాలున్నట్లు తమ దృష్టికి కొందరు తెచ్చారని ,వాటిని నేను అధ్యయనం చేసి ,ఒక సమగ్ర నివేదిక ను తమకు అంద జేయవలసినదని ,దాని ఆధారం గా తాము రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి ఆ లోపాలను తొలగించే ఏర్పాటు చేస్తామని తెలియ జేశారు .శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీన్ద్రులతో నాకున్న సుదీర్ఘ  పరిచయం,వారు నాపై ఉంచిన విశ్వాసం వల్ల ,వారి ఆజ్న ను శిరసా వహించి ,ఆ సోషల్ పుస్తకాలను తెప్పించి చదివాను .నాకు కని  పించిన దోషాలను తెలియ జేస్తూ వాటి లోని గుణాలను కూడా వారి దృష్టికి తెచ్చాను .వారు తదుపరి చర్య చేబడ తారని ఆశిస్తున్నాను .ఈ విషయాలను మీ దృష్టికి కూడా తీసుకు వస్తున్నాను .మీలో అభిరుచి ఉన్న వారు ఆ పుస్తకాలను పరి శీలించి గుణ దోష చర్చ చేసి స్పందించవలసినదిగా మనవి మీ దుర్గా ప్రసాద్

ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు కని  పించిన దోషాలు గుణాలు

 

ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం

సామాజిక జీవనం లో విభిన్న పార్శ్వాలను అధ్యయనం చేయటానికిee  పుస్తకం దోహద పడుతుందని భూస్వరూపాలు ,ప్రజల భిన్నత్వం ,ప్రజా జీవన ఆధారాలు ,సామూహిక అవసరాలు వాటి నిర్వహణ ,అసమానత్వ సమాజం లో సమానత్వ సాధన వివిధ దేవుళ్ళు ,వివిధ పూజా విధానాలు ,ఒకరితో ఒకరు సంబంధ  బాంధవ్యాలు  ఫలితం గా పంచుకొనే సంస్కృతిని ఆకళింపు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తోంది .అందుకోసం భూమి పీఠ భూములు ,మైదానాలు నదులు సముద్రాలు మొదలైన వాటిని అధ్యయనం చేయాలని విభిన్న రకాల ప్రజల వద్దకు చేరి సంభాషిస్తే కాని సామాజిక జీవనం అర్ధం కాదని పుస్తక కర్తలు పేర్కొన్నారు .చెప్పిన విషయాల నన్నిటిని దాదాపు పుస్తకం లో ఆ తరగతి స్తాయికి సరి పడ విషయాలను అందించారు .

కృష్ణా  డెల్టా లోని పెనమకూరు గ్రామం గురించి సమగ్ర అధ్యయ నాన్ని చేశారు పీఠభూమి లో శకలం చెరువు గ్రామం ,గిరిజన గ్రామం కూనవరం ,గురించి మంచి వివరాలిచ్చారు భాష ,లిపి గురించి తెలియ జేస్తూ గొప్ప గ్రంధాలైన వేదాలు ఇతిహాసాలు ,వైద్య ,శాస్త్ర రంగాలలో గ్రంధాలను ఖగోళ గణిత శాస్త్ర గ్రందాల గురించి చక్కని వివరణ ఉంది ఆర్య భటీయం ,దశాంశ విధానం పై అవగాహన కలిపించారు శిల్పాలు కట్టడాలలో సింధులోయ నుంచి అమరావతి సాంచీ స్తూపాలు వరకు చ రచనా చిత్రాలు బాగున్నాయి .

ఈపుస్తకం లో నాకు దోషాలేమీ కనీ పించలేదు .పుస్తక రచయితలను,అందం గా ఆకర్షణీయం గా ముద్రించిన వారికి ,అపురూప మైన అంశాలను అందం గా  అందించినందుకు అందులో విద్యార్ధులకు ఉచితం గా అందజేస్తున్నందుకు అందరిని అభినందిస్తున్నాను .మేము సర్వీస్ లో ఉండగా ‘’కృష్ణా  జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ‘’తరఫున వాచాకాలన్ని ఆకర్శ నీయం గా ముచ్చటగా చూడగానే ఆకర్షణ కలిగేట్లు ముద్రించాలని ప్రాభుత్వాన్ని అనేక సార్లు కోరాం  విజ్ఞప్తులు చేశాం మా కల ఇన్నాళ్ళకు సాకారం అయిందని ఆనందం గా ఉంది .అమెరికా లో పుస్తకాలు ఇంత బాగా ఉంటాయి .అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చినందుకు మరో సారి వారిని మనసారా అభి నందిస్తున్నాను .

అరుదైన నాణాలను సేకరించి ముద్రించటం ,,సాంచీ సమావెశం లాంటి చిత్రాల ముద్రణ కన్నుల పండువుగా ఉన్నాయి పుస్తకాలు చూస్తె మనసు నిండిపోవాలి అప్పుడే విద్యార్ధి అందులోని సారాంశాన్ని గ్రహించ టానికి ఉత్సాహం చూపిస్తాడు అది నేర వేరిందనే చెబుతున్నాను

అయితే ప్రతి పాఠంలోను అనేక ‘’ప్రాజెక్ట్ వర్క్ ‘’లు ఇచ్చి చేయించమని చెప్పి సూచన లిచ్చారు నిజం గా వీటిని విద్యార్ధుల చేత చేయించ గలిగితే ,వారి జ్ఞానం విస్తృత మవుతుంది .ఇది కార్పోరేట్ స్కూల్స్ కు సాధ్యమేమో కాని ప్రభుత్వ ,జిల్లా పరిషత్ స్కూల్లలోని విద్యార్ధులకు చెప్పి చేయించటం అసాధ్యమనే నా అభిప్రాయం .చేయిస్తే మంచిదే .చేయించాలనే  అందరికి ఉంటుంది  ఆచరణ సాధ్యమా అనేది సమస్యం ..ఇన్నేళ్ళకు ఇంత మంచి వాచకాలు వచ్చి నందుకు బహు తృప్తిగా ఉంది .

ఏడవ తరగతి సాంఘికం

ఈ పుస్తకం లో భూమి వైవిధ్యం ,ఉత్పత్తి వినిమయం –జీవనాధారం ,రాజకీయ వ్యవస్థా –పాలన ,సామాజిక వ్యవస్థ –అసమానతలు ,మతం –సమాజం ,సంస్కృతీ-సమాచారం విషయాలను ఆ తరగతి స్తాయిని బట్టే అందించారు

భారత దేశం లో బ్రిటీష్ సామ్రాజ్య స్తాపన అనే 17 వ పాఠంలో 156 వ పేజీ లో ‘’తిరుగు బాటు అణచి వేత ‘’లో మనం ఏంతో గౌరవం గా ,ఆరాధ్యం గా ‘’విప్లవ వీరులు‘’అని ‘’త్యాగ దనులు’’అని పిలుచుకొనే భగత్ సింగ్ ,సుఖ దేవ్ రాజ గురు లను ‘’కొందరు తిరుగు బాటు దార్లు ‘’అని పొడి మాటలతో చెప్పటం తీవ్ర అభ్యంతకరం .కనీసం ఆ ముగ్గురు మహా నీయుల పేర్ల ను కూడా స్మరించక పోవటం చారిత్రాత్మక తప్పిదం .దీన్ని వెంటనే సరి దిద్దాలి .’’కొందరు తిరుగు బాటుదారు లను మర ఫిరంగుల ముందు కట్టి ,ఆ ఫిరంగులను పేల్చి ,వారి శరీరాలను ముక్కలు ,ముక్కలు గా చేసే వారు ..శరీరం తునకలై గాలిలో వెద జల్ల బడేది .చాలా మంది తిరుగు బాటు దార్లు ఆంగ్లేయులకు దొరక కుండా ఒక ప్రాంతం నుండి ,మరొక ప్రాంతానికి పారి పోయి దాక్కునే వారు .కొందరు నేపాల్ వంటి ప్రదేశాలకు పారి పోయి దాక్కున్నారు ‘’అని వారి జీవితాలను అతి హీనం గా రాయటం క్షమించరానిది .వారందరిని  ‘’అమర వీరులు’’ గా మనం ఆరాదిస్తున్నాం  .ఈ భావం విద్యార్ధులలో వ్యాపించ నీయ కుండా వా రిని దోపిడీదార్లుగా తిరుగు బాటు దార్లు గా పేర్కొనటం వారిని త్యాగాలను తీవ్రం గా అవమానిన్చటమే సందేహం .ప్రతి వాడూ  దీని పై అందరూ ఉద్యమిన్చాల్సిందే .ఆ రాతలను తిప్పి కొట్టాల్సిందే మార్చి తీరాల్సిందే ..’’తిరుగు బాటు దార్లను ఉరితీయటం ‘’ అనే చిత్రం వేశారు కాని వారి పేర్లు రాయ లేక పోవటం అభ్యంతకరం .

179 పేజీలో ‘’సమానత్వం కోసం కృషి చేసిన వారి ‘’గురించిన విషయం లో శ్రీ వివేకానంద్ ను గురించి రాయక పోవటం లో ఉద్దేశ్యం ఏమిటో తెలియదు .వీరేశ లింగం గారిని గురించి కూడా ఉంటె బాగుండేది .

పుస్తకం లో హిందూ మహా సముద్రం లో నిమ్నోన్నతాల చిత్రం ,పై నుడి కనిపించే భావన పాడు గ్రామం ,ఫ్రాన్స్ ,పారిశ్రామిక విప్లవ ము .కాగిత పరిశ్రమ ,విశాఖ వొడఎల్లోరా గుహ , తొమ్మిదో శతాబ్దపు భూదాన ,తామర పాత్ర గుచ్చం ఎల్లోరా గుహ ,చోళ దేవాలయం శిల్పాలు ,తొమ్మిదో శతాబ్దపు నీటి నియంత్రణ తూము ,కాకతీయ నాణెం ,మోటుపల్లి శాసనం ,హజారా రామాలయ గోడ చిత్రం ,అక్బర్ మత పెద్దల సమావెశం ,1676 నాటి మచిలీ పట్నం ఓడ రేవు ,1857 ప్రధమ స్వాతంత్ర్య సమరం లో యమునా నదిని దాటే సిపాయిలు ,భారత చివరి చక్ర వర్తి బహదూర్ శా అరెస్ట్ ,మేడారం జాతర ,మొదలైన రంగుల చిత్రాలు అరుదైనవి ,విలువైనవి ముద్రించి విద్యార్ధుల మనసులను దోచారు .

ఎనిమీదవ  తరగతి సాంఘికం

పటాల అధ్యయనం ,సూర్యుడు శక్తి వనరులు ,భూచలనాలు ఋతువులు ,ధ్రువ ప్రాంతాలు ,అడవులు వినియోగం ,రక్షణ ,ఖనిజాలు తవ్వకం ,ద్రవ్యం బాంకింగ్ ,ఈవానో పదులు –సాంకేతిక విజ్ఞాన ప్రభావం ,ప్రజారోగ్యం –ప్రభుత్వం ,బ్రిటిష్ ,నిజాం పాలన లోభూస్వాములు –కౌలు దార్లు ,జాతీయోద్యమం తోలి దశ ,మలిదశ ,హైదరాబాద్ లో స్వాతన్త్రోద్యమామ ,భారత రాజ్యాంగం ,,పారల్ మెంట్ కేంద్ర ప్రభుత్వం ,చట్టం న్యాయం –ఒక సన్నీ వేష అధ్యయనం,జమీందారి వ్యవస్థ రద్దు ,పేదరికం అవగాహన ,హక్కులు అభి వృద్ధి సాంఘిక మత సంస్కరణలు ,లౌకికత్వం అవగాహన ,ఆధునిక కళలు కళా కారులు ,సినిమా ముద్రణా మాధ్యమాలు ,క్రీడలు జాతీయత వాణిజ్యం ,విపత్తులు నిర్వాహణ మొదలైన పాఠాలతో పుస్తకం ఆధునిక అవసరాలను తీర్చింది

జాతీయోద్యమం తోలి దశ పాఠం లో  లో 127వ పేజి లో లో కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణా రావు గారి ఫోటో వెయ్య టానికి బదులు ఆంద్ర పత్రిక భారతి సంపాదకులు కాశీ నాధుని నాగేశ్వర రావు గారి ఫోటో వేశారు .అంత  చూడ కుండా ఎలా వేశారో అర్ధం కాదు .అది మార్చి ముట్నూరు వారి ఫోటో అర్జంట్ గా అక్కడ ముద్రించాలి .

జాతీయోద్యమం మలి దశ పాఠం లో ప్రకాశం  పంతులు గారి ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి ,ఉద్యమ నాయకుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు కాని గాని ,చిత్రం కాని లేక పోవటం పెద్ద పోర బాటు ఆంగ్లేయుల కు గుండె అప్ప గించి ‘’కాల్చు కొండిరా  ‘’అని గర్జించిన ఆంద్ర కేసరి గురించి కనీసం ఒక్క మాట కూడా లేక పోవటం విచారకరం అభ్యంతర కరం .అలాగే చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్యగారి గురించి కూడా లేదు .బార్డోలి వీరుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్ గురించీ లేక పోవటం రుచించలేదు .హైదరా బాద్ విలీనం లో మాత్రం పటేల్ గురించి రాశారు నిజాం తో  ఆయన ఫోటో కూడా పెట్టారు .క్రీడలు లో మన కబాడీ ,ఖో ఖోల గురించి లేవు .మత  సంస్కరణలు లో ‘’రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి గురించి కూడాలేదు .

తొమ్మిదవ తరగతి సాంఘికం

ఇందులో భూమి –మనం ఆవరణలు ,జల వాతావరణ జీవావరణ ,విషయాలు మన దేశం లో వ్యవసాయ పద్ధతులు ,పరిశ్రమలు ,సేవా కార్య క్రమాలు ,ద్రవ్య వ్యవస్థ ,ఋణం ,ధరలు జీవనవ్యయం ,ప్రాభుత్వ బడ్జెట్ పన్నులు ,యూరప్ లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు ,పది హేడు పద్దెనిమిద వ శతాబ్దపు జాతీయ విప్లవాలు ,పందొమ్మిదో శతాబ్దం లో ప్రజాస్వామిక జాతీయ విప్ల వాలు ,పారిశ్రామికీ కరణ ,సామాజిక మార్పు ,సామాజిక నిరశనోద్యమాలు ,లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలలో వలస వాదం భారత్ పై వలస వా ద ప్రభావం ,విస్తరిస్తున్న ప్రజా స్వామ్యం ,ప్రజాస్వామ్యం రూపు దిద్దుకొనే భావన ,మానవ హక్కులు ,ప్రాధమిక హక్కులు ,మహిళా రక్షణ చట్టాలు , విపత్తుల నిర్వహణ ,రోడ్డు భద్రతా చర్య మొదలైన విషయాలు ఇందులో బోధిస్తున్నారు ,

క్యోటో నగరం లో జరిగిన హరిత వాయు ప్రభావం పై’’ప్రోటోకాల్’’ విషయం తెలియ జెప్పటం బాగుంది .సేంద్రియ ఎరువు లలో ఒరిస్సా రైతు సాధించిన విజయం  స్పూర్తి నిస్తుంది .సేవా రంగం లో వచ్చిన ఆధునికత ,’’అవుట్ సోర్సింగ్ ‘’గురించి చెప్పటం ,రిసేర్వ్ బాంక్ లో ఆర్ధిక అక్షరాస్యత,పన్నుల ఎగవేత పై హెచ్చరిక వంటి నవీన భావనలు నేటి విద్యార్ధులకు అందించాల్సిన అవసరం ఉంది అన్నిటిని సంతృప్తిగా సంక్షిప్తం గా చెప్పారు .భేష్

యూరప్ లో కళా రంగం లో వచ్చిన మార్పులు మైఖేల్ ఆన్జేలో శిల్పాలు చిత్రాల విశేషాలు ,బాల కార్మికులు వారి హక్కులు ,పెట్టు బడి దారీ విధానం పై కార్మికులకు అవగాహన కల్గించిన పత్రిక లోని ‘’పిరమిడ్ ‘’,,వివిధ దేశాల దోపిడీ విధానాలు ,పేరు దేశం లో ‘’ఇన్ కా ‘’తెగ ప్రజలు ఆరాధించే ‘’మాచు పిచ్ ‘’పర్వతం ,చైనా ఓడ రేవు మకావో పై నీటి రంగులలో కాగితం పై వేసిన చిత్రం ,ఈజిప్ట్ లో వీధి చిత్రకళా ,ప్రజాస్వామ్యానికి పౌరుల క్రియా షీలా భాగ స్వామ్యం,విద్యా హక్కు , పౌర విధులు,మహిళా రక్షణ చట్టాలు బాల్య వివాహ అనర్ధాలు వరకట్న నిషేధం అవసరం ,గృహ హింస ,విపత్తుల నివారణ ,’’ డ్రంక్ డ్రైవింగ్ ‘’ వంటి కీలక భావన లతో అంశాలన్నీ స్పూర్తి వంతం గా ప్రేరకం గా ప్రోత్సాహకం  గా ఉండటం అభినంద నీయం .ఈ కాలం లో ఇవాన్నీ ప్రతి విద్యార్ధి తప్పక  తెలుసుకోవాల్సిన విషయాలే

ఇక లోపాల విషయానికి వస్తే –సంఘ సంస్కరణ తో ప్రజల లో మార్పు తెచ్చిన రాజా రామ మోహన రాయ్ పేరు లేక  పోవటం నచ్చలేదు ..

ఈ నాలుగు పుస్తకాలలో ఎక్కడా ఆసియా జ్యోతి ,అహింసా ధర్మాన్ని ప్రేమ కరుణ లను బోధించిన బుద్ధుని గూర్చి విషయాలు లేవు .అలాగే మానవీయ విలువ లైన దయా, సాను భూతి ,ప్రేమ ,సహకారం ,సాను భూతి ,పరస్పర అవగాహన ,చట్ట నిబద్ధత ,అవినీతి పై పోరాటం ,విశ్వ కుటుంబ భావన మొదలైన అంశాలను తప్పక పొందు పరచాలి

మొత్తం మీద ఈ చిన్న లోపాలను సవరిస్తే ఈ సాంఘిక పుస్తకాలన్నీ అద్భుతమనే అని పిస్తాయి ముచ్చటైన ముద్రణా ,ఆధునిక అంశాల చేర్పు ,గొప్ప వర్ణ చిత్రాలు ,తప్పులు లేని ముద్రణా అన్నీ’’ ప్లస్ పాయింట్లే ‘’.ఇంత మంచి పుస్తకాలను ముద్రించి  ఉచితం గా అంద జేస్తున్న  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే .

గబ్బిట దుర్గా ప్రసాద్ –విశ్రాంత ప్రదానో పాద్యాయుడు -2-9-13- ఉయ్యూరు -9989066375

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.