కథ కంచికి

       కథ కంచికి

పడుతూ లేస్తూ హడావిడిగా ‘’అందాల రాముడు సినిమాలో ‘’రాజ బాబు లాగా మా బావ మరిది బ్రహ్మం ఆపసోపాలతో వచ్చి టి.వి.చూస్తున్న నా పక్కన కూర్చున్నాడు .నేను ‘’కామెడీ చానెల్ ‘’లో మునిగి ఉన్నాను .కాసేపాగి ‘’ఏంటి బావా !దేశం అంతా తగల బడి పోతుంటే ,ఉడికి పోతుంటే ఏమీ పట్టకుండా  కామెడీ ఎంజాయ్ చేస్తున్నావ్ ?ఇది నీ బోటి బోటి వాళ్ళు చేయాల్సిన పననేనా  ఇప్పుడు ?’’అని గొణిగాడు .ఒక సారి తీక్షణంగా వాడి మొహం లోకి తేరి పార చూశాను .నిజం గానే వాడేదో తీవ్ర మామసిక క్షోభ అనుభ విస్తున్నాడని గ్రహించాను .’’ఎన్నాళ్ళ కేన్నాల్లకు ఈ బామ్మర్ది దర్శం ఎల్లరూ సుఖులే కదా ?’’అన్నాను మండి పోయింది వాడికి .ఒక్క ఉదుటున అక్కడి నించి లేచి వంటింట్లోకెళ్ళి వాళ్ళక్క పెట్టిన టిఫిన్ మెక్కి పూరా కాఫీ తాగి బ్రేవ్ మంటూ మళ్ళీ నా పక్కకి చేరాడు .వాడిని ప్రశ్నార్ధకం గా చూశాను .

‘’అదికాదు బా !రూపాయి పాపాయి బక్క చిక్కి శల్యా వసిస్టం అయి కేర్, బేర్ మంటుంటే  చిద్విలాసం చిన్దిస్తున్నావా ?’’అన్నాడు ‘’మనమేం చేస్తాన్రా .అది ప్రధాని ,ఆర్ధిక మంత్రి ఆయన సలహా దారూ ,రిజర్వ్ బాంక్ గవర్నరూ ఆలోచించాల్సిన విషయం  మనకే తెలుస్తుంది ?’’అన్నాను ‘’ ,.’’ఇంతేనా నువ్వేదో చిటికమంత్రం చేబుతావనుకొని వచ్చా ‘’అన్నాడు రూపాయంత కంగారుగా .’’ఒర్ బుజ్జీ !ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో తెలీదు .ఏ క్షణ మైనా రావచ్చని ఊహా గానం .అందుకే మనవాళ్ళు తెలివిగా రూపాయివిలువ తగ్గించేట్లు చేశారు ‘’అన్నాను .’’తెలివిగా తగ్గించటం ఏమిటి తెలివి తక్కువ గా అనాలేమో ?’’అని నన్ను సరిదిద్ద బోయాడు .’’కాదు .నేనన్నది రైటే .ఇప్పుడు దేశం అంతా అస్తవ్యస్తం గా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా విదేశీ సాయం పై అంటే డాలర్ పైన ఆధార పడాల్సిందే మనదగ్గర దమ్ము అయి పోయింది .అంతేకాదు మన రాజకీయులంతా డబ్బు స్విస్ బాంక్ లో దాచుకొన్నారు కదా .ఇది రుజువు చేయలేని నిజమైన విషయమే కదా .అందుకని ఇప్పుడు రూపాయి యెంత పడి పొతే వాళ్లకు అంత  లాభం . ఆ డాలర్లు ఇక్కడికి తెచ్చుకొంటే ఎక్కువ రూపాయలోస్తాయి రేపు ఎలక్షన్ల లో ఇష్టమొచ్చి నంత డబ్బు ఖర్చు పెట్టి వోట్లు కొని గెలవ్వచ్చు ‘’టు బర్డ్స్ యెట్ వాన్ షాట్ ‘’మొదట చెప్పిన దాని వల్ల  అమెరికా వాడికీ, రెండో దాని వల్ల  మన నేత్తి నేక్కే రా బందులకు లాభం .’’

‘’ఇంత చిదంబర రహస్యం ఉందా బా “’అని నోరు వెల్ల బెట్టాడు .’’ఎట్టాగో ఆ పేరు బయ ట పెట్టావు కనుక ‘’ఆ లుంగీ ఆయన ‘’ఆడించే నాటకం లో ఇదో భాగం .ఇప్పటికే రాష్ట్రం లో చిచ్చు రేపాడుకదా ‘’అన్నాను .“’అదేంటి బావా !తిలా పాపం తలా పిడికెడు అని నువ్వే చెప్పావ్ గా .ఇదులో అందరిదీ తప్పే కదా ?’’అని బోల్డు ఆశ్చర్య పోయాడు .’’నిజమేరా .మన ప్రధాని పేరే ‘’మౌన మోహన్ సింగ్ ‘’కనుక ఆయన మాట్లాడడు కదలడు ,ఉలకడు, పలకదు .జేబులో  చెయ్యి పెట్టుకు కూర్చోటం తప్ప పాపం ఆయన ఏమీ చెయ్యలేడు.ఆయనో తోలు బొమ్మ అని అందరూ అంటున్న మాటేగా.మిగతా వాళ్ళలో షిండే గారి రాష్ట్రం లో నా చిన్నప్పటి నుండి విదర్భ ఉద్యమం ఉంది అక్కడే పవర్ లేని పవార్ ఉన్నాడు దాన్ని గురించి మాట్లాడరు మన రాష్ట్రం లో చీల్చటానికి ఆజ్యం పోస్తారు .ఇక డిగ్ సంగతి. రాజులను ఎప్పుడో ఇందిర ‘’డిక్కీ ‘’లోకి తోసింది. కాని ఈ డిగ్గీ రాజా డిక్కీ లో కూర్చోకుండా ఆమె కోడలు పైకి తెచ్చింది .పాపం వెన్నెముక ఉన్న ఆంటోని మాత్రం ఏమీ చెయ్యలేక గిజగిజ లాడుతున్నాడు .’’జాదూ ‘’ అయిన ఆజాద్ మాత్రం’’ గోపి ‘’వేషం వేస్తున్నాడు ‘’అన్నాను ‘’గోపి అంటే గోడ మీది పిల్లి కదా బావా ?’’అన్నాడు మా వాడు’’.బానే ఒంట బట్టింది నీకు ‘’ అని భుజం తట్టాను .’’చిడంబరం రాష్ట్రం కంటే ఆంద్ర ప్రదేశ్ అన్నిటా ముందుంది .అది ఆయనకు నచ్చలేదు కళ్ళు కుట్టాయి కుళ్ళు పెరిగి చీలిస్తే కాని తన రాష్ట్రం పరువు నిల బడదని చేసిన కుతంత్రం ఇది ‘’అన్నాను ‘’కరెక్ట్ గా చెప్పావు బావా ఈ మాటే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి పక్షాలు ఉద్యోగులు అందరూ అంటున్నారు ‘’అన్నాడు ‘’ఇదంతా వాళ్ళు చెప్పగా విన్నదే నీకు చెప్పాన్రా ‘’అన్నాను

మహోద్రుతం గా సాగుతున్న సీమాంధ్ర ఐక్యత గురించి ఎత్తాడు .’’నిజమే .చరిత్ర లో కనీ వినీ ఎరుగని ఉద్యమమే .ప్రజలు అన్ని రకాల వారు ఉద్యోగస్తులు విద్యార్ధులు తమ తడాఖా చూపిస్తున్నారు నిస్వార్ధం గా ముందుకొచ్చి నడుపుతున్నారు నడిపిస్తున్నారు .ఇందులోపాల్గొక పోతే చరిత్ర హీనులు గా మిగిలి పోతారన్నది నిజం .కాని రాచకీయ పక్షులు ఎవరి ఎత్తు  వారు ఎత్తు తున్నారు వీళ్ళను గురించే భయం. ప్రజల్లో ఏ లోపం లేదు .ఈ సమైక్యత ‘’ఏక వాక్య తీర్మానం‘’ముందే ప్రదర్శిస్తే దాన్ని ప్రవేశ పెట్టె దమ్ముండేది కాదు .ఇప్పుడు బొక్కలు వెతుకుతున్నారు నక్క పోయిన తర్వాత బొక్కలు వెదికే చందం గా ఉంది ‘’

‘’ఇప్పుడు హీరో కిరణ్ అని పిస్తున్నాడు కదా బా “”అన్నాడు .’’నిజమే పై నున్చిఎత్తు కొచ్చి కూర్చో బెట్టినా మొదట్లో వెన్నెముక వంగి నట్లు కనీ పించినా ఇప్పుడు నిటారుగా నిల బడ్డాడు .అందరి మాట గా తన మాట చెప్పి కెప్టెన్ అని పించాడు .’’అన్నా .’’డిప్యూటీ సంగతేమిటి ?’’“’అన్నాడు ‘’ఆయన ఒక సైడ్ కు చేరి మాట్లాడచ్చ ట .కాని సి.ఏం.మాట్లాడకూడదట .తనకో న్యాయం ఇంకొరికి ఇంకోటా ?అసలు మన రాష్ట్రం లో ప్రభుత్వం అనేది ఉందా “మంత్రులు ప్రాంతానికే మంత్రులా రాస్త్రాని కి అంతటికీనా ?’’అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది ఇది దర దృష్టం .కేంద్ర మంత్రులూ , రాష్ట్ర మంత్రులూ వేరు వేరు కుపట్లు పెట్టుకొని ప్రజా ధనాన్ని జీత భత్యా కింద వాడుకొంటూ మోసం చేయటం ఏ రాజ్యాంగం ప్రకారం న్యాయం ?’’ఇదే ప్రజలు గద్దించి అడుగు తున్నారు ‘’అని చెప్పా .

‘’ఈ విపత్కర పరిస్తితి నుంచి పరిష్కారం ఏమిటి బావా /’’?అడిగాడు బ్రహ్మం .’’ఒరే మనం పరిష్కారం చెప్పే వాళ్ళమా .ఒక రాష్ట్రం విడదీయాలింటే ఎన్ని ప్రాధమిక చర్యలు తీసుకోవాలి ?యెంత మందితో మాట్లాడాలి మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలి పత్రికా ధి పతు లతో ప్రజలతో సంప్రదింపులు జ రపాలి న్యాయ నిపుణల సలహా పొందాలి .రాజకీయ పక్షాలతో మాట్లాడించాలి రెండు ప్రాంతాల వారినీ కూర్చో బెట్టి మాట్లాడాలి .ఉభయుల అంగీకారం తో నిర్ణయం తీసుకోవాలి .ఈ ఎక్సేర్ సైజ్ చేయకుండా ‘’తామ్బూలాలిచ్చేశాం తన్నుకు చావండి అంటే ప్రజలు సాహిస్తారా ?ఇదేమీ కేక్ ను కట్ చేయటం కాదు ,గుండెల్ని చీల్చటం ..అని కనీసం అర్ధం చేసుకోని నాయకుల పాలన లో మన దేశం ఉన్నందుకు,విదేశాలలో మన పరువు భ్రస్టమైనందుకు ఆంధ్రుల ఔన్నత్యం పరువు ప్రతిష్ట అ వమానం పాలై నందుకు అందరు చిన్తిస్తున్నారు జరుగ రాని  ఘోరమే జరిగి పోయిందని గగ్గోలు పెడుతున్నారు .బి.జే.పి.పాలన లో మూడు రాష్ట్రాలను ఏర్పరచి నప్పుడు ఎంత హాయిగా చేశారు /దాన్ని కూడా గమనించరా ?ఇన్నేళ్ళ రాజకీయం మనకు నేర్పింది ఇదేనా? /’’కొట్టుకు చస్తుంటే వినోదం చూస్తున్నారు ఇది క్షమించా రాణి ద్రోహం నేరం కాదా‘’అన్నాను .  ‘’బావా భోవోద్రేకం లో చాలా విషయాలు చెప్పి నా కళ్ళు తెరిపించావు .

 

‘’ప్రధానిని దొంగ  అని ప్రతి పక్షాలు అన్నందుకు ఆయన బాధ పడుతున్నాడు’’ అన్నాడు ‘’దొంగ తనం చెయ్యక్కర్లేదు .చేస్తున్నా చూస్తూ ఊరుకొంటే నేరం కాదా దీని మీదే ఆంద్ర జ్యోతి ‘’లోకం తీరు ‘’లో ఒక అద్భుత మైన కార్టూన్ వచ్చింది .చూడలేదా ?’’అన్నాను ‘’లేదు .విషయం చెప్పు అన్నాడు ‘’.ప్రధాని కాష్ ఉన్న గదిలో ఒంగొని ఉంటాడు .కిటికీ చువ్వలు వంచి అయన వీపు మీద కాళ్ళు పెట్టి దొంగ గదిలోకి నెమ్మదిగా దిగుతుంటాడు ఆయన ‘’ప్రతి పక్షాలు నన్ను దొంగ  అంటున్నారు  నేను దొంగనా ‘’అని అనుకుంటుంటాడు .’’అదిరింది బావా కార్టూన్ ‘’అన్నాడు మురుస్తూ .

సరి హద్దు  లో ఉన్న మన వీర జవాన్లు ఎంత అప్రమత్తం గా ఉంటారు పొరబాటున విదేశీయులు బార్డర్ దాటితే ‘’నేను ఇరవై  నాలుగు గంటలూ కాపలా కాస్తూ కూర్చుం టానా  “’అని సైనికాధికారి లేక డిఫెన్స్ మినిస్టర్  అంటాడా ?ఫైళ్ళు గల్లంతు అయితే తనది బాధ్యత కానప్పుడు ఎవరు ఏ తప్పుకు బాధ్య్లవుతారు? /ఎవరి  పై నేరం మోపాలి >?అన్నాను .

తక్షణ కర్తవ్యమ్ ఏమిటి “’?అని మాయాబజార్ లో ఆర్  నాగేశ్వర రావు లాగా అడిగాడు .’’ముందుగా కాంగెస్ వారిని సంతృప్తి పరచటమే .”’అన్నాను ‘’అర్ధం కాలా “’అన్నాడు ఏదో యాడ్ లో రైతు భార్య లా ‘’ఏం లేదు రా .కాంగ్రెస్ వాళ్ళు ఏ గూటి పక్షులైనా ఇందిరా, సోనియా, రాజీవ్ రాహుల్ ,అంటే ప్రాణం కనుక తెలంగాణా ఏర్పరచి ‘’సోనియా తెలంగాణా ‘’అని ,సీమాంధ్ర ను వేరు చేసి ‘’రాజీవ్ సీమాంధ్ర’’అని హైదరాబాద్ ను ‘’రాహుల్ హైదరా బాద్ ‘’అని ప్రత్యెక రాష్ట్రం చేస్తే కాంగ్రెస్ వారు అందరూ సంతృప్తి పడతారు అప్పుడు సమస్యలే ఉండవు ‘’అని చిట్కా చెప్పా ..’’నోరెళ్ళ బెట్టి మరి ప్రజల సంగతి ?’’అన్నాడు ‘’ప్రజల్ని  వాళ్లెప్పుడో మరిచి పోయారు ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ నే మర్చి పోతారు .కిరణ్ చెబుతూనే ఉన్నాడుకదా చెవిలో ఇల్లు కట్టుకొని ‘’ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాదనీ ‘’.ప్రజలు అదే నిజం చేస్తారు .. కాంగ్రెస్ కధ  ఇక కంచికే ‘’అన్నాను .బుద్ధ బోధన విన్నకొత్త శిష్యుడు లా మా వాడు మారి పోయి పరుగు లంకించుకొన్నాడు .

మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.