నా దారి తీరు -41 ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం

    నా దారి తీరు -41

ఉయ్యూరు లో కొల్లూరి కి సన్మానం

కొల్లూరి ని గెలిపించిన మేము మంచి ఊపు లో ఉన్నాం .శాసన మండలికి కృష్ణా జిల్లా ఉపాధ్యాయుల నుండి ఎన్నికైన  సభ్యుడు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి ఉయ్యూరు లో ఘన సన్మానం చేయాలని మేము నిర్నయిన్చుకోన్నాం .దానికి ఖర్చు మేమే భరించాలని నిర్నయిన్చుకోన్నాం అందరం ఒకే మాటగా నిర్ణయం తీసుకొని కొల్లూరి కి తెలియ జేసి చైర్మన్ శ్రీ పిన్నమ నేని గారిని కూడా వచ్చేట్లు చేయమని కోరాం .ఆయన అంగీకరించి చైర్మన్ గారిని కూడా తీసుకు వస్తానని చెప్పాడు .ఉయ్యూరు సెంటర్ లో ఊర వారి డాబా మీద సభ ఏర్పాటు చేశాం .సాయంత్రం ఆరు గంటలకు సభ ..రాత్రి డిన్నర్ కూడా హాజరైన వారందరికీ ఏర్పాటు చేశాం .రాగానే అందరికి టిఫిన్ టీ లు అద జేశాం .నాయకుల రాక ఆలస్యం వల్ల రాత్రి ఏడు గంటలకుమీటింగ్  ప్రారంభమైంది .చై ర్మన్ గారి అధ్యక్షత న సభ నిర్వహించాం .వేదిక మీద కు నేనే అందరిని ఆహ్వానించా. కొల్లూరి తన సహజ ధోరణి లో మాట్లాడాడు . ఇంత అభిమానం చూపించి ఉపాధ్యాయులు గెలిపించి నందుకు కొల్లూరి ఇంకా బాధ్యత గా వారి సంక్షేమ కార్య క్రమాలను నిర్వర్తించాలని పిన్నమ నేని హితవు పలికారు .నేను వేదిక మీద నా స్వరం విని పించాను .’’ఒకప్పుడు వాజ్ పేయి ధిల్లీ లోక్ సభ నుంచి ఎన్నికై తమ నియోజక వర్గం లో కనీ పించకుండా విదేశాంగ మంత్రి గా పని చేసి మళ్ళీ ఎలెక్షన్ లో నిలబడెందుకుకార్య కర్తలమీటింగ్ పెడితే ‘’కార్య కర్తలకు   దూరం గా ఉండే నాయకుడు మాకు అక్కర్లేదు మా దగ్గర ఉండే నాయకుడు కావాలి  మాతో ఉండే నాయకుడు కావాలి’’  .అని చెంప చెల్ మనేట్లు చెప్పారు .వాజ్ పేయి  ‘’నేను తప్పు చేశాను మిమ్మల్ని విస్మరిన్చ కూడదు  ఈ సారికి క్షమించండి మళ్ళీ ఈ తప్పు జరక్కుండా జాగ్రత్త పడతాను‘’అని నచ్చ చెప్పిన తర్వాతా కార్య కర్తలు మళ్ళీ రంగం లో దిగారు .కనుక మేమందరం ఎన్నో శ్రమలకు కష్టాలకు  వోర్చి మిమ్మల్ని గెలిపించాం మాకేమైనా సమస్యలు ఉంటె మీ దగ్గరకు వస్తాం వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత మీదే ‘’అని కొల్లూరికి అందరి ఎదుటా చెప్పాను అందరు నన్ను ప్రశంశించారు ఆ నాటి టీచర్స్ గిల్డ్ అధ్యక్ష కార్య  దర్శులు కూడా ఆ వేదిక ను సుసంపన్నం చేశారు .కొల్లూరికి శాలువా ఖద్దరు పాంచల చాపు ,పుష్ప హారాల తో చైర్మన్ గారి చేత సన్మానం జరిపించాం కొల్లూరి మా అందర్నీ పేరు ఏపేరు నా అభి నందించాడు .తాను అందరికి అందు బాటు లోనే ఉంటానని ,ఏ క్షణం లో నైనా మీ సమస్యలు నాకు చెప్పచ్చు మీరు రానక్కర లేదు .ఒక్క ఫోన్ చేస్తే సమస్య పరిష్కారానికి నేను వెంటనే స్పందిస్తాను అని హామీ ఇచ్చారు ..సభ సక్సెస్ అయి నందుకు అందరం ఆనందించాం .అందరు భోజనాలు చేసి వెళ్ళారు .నాయకులతో మరో సారి సాన్ని హిత్యం ఏర్పడి నందుకు  సంతృప్తి  గా ఉంది .

అమ్మ ఆరోగ్యం

గత అయిదారేళ్ళు గా మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు మామూలుగా ఆవిడ ఆస్తమా పేషెంట్ .ఇప్పుడు అదనం గా బి.పి .కూడా వచ్చింది .ఇప్పటిదాకా మా ఇంటి డాక్టర్ గారు మిక్కిలి నేని సాంబశివ రావు గారు .మా నాన్న గారి మరణం తర్వాత ఆయన్ను పిలవటం తగ్గించాం పిల్లలను  శివరామ క్రిష్నయ్య గారు అనే పిల్లల డాక్టర్ గారికి చూపించేవాళ్ళం .ఆయన చాలా నిదానస్తులు ఏంతో  ఆత్మీయం గా ఉండే వారు .నేను మేస్టర్ ని కనుక పిల్లలను చూడటానికి డబ్బు తీసుకొనే వారు కాదు .వీలైతే తన దగ్గరున్న మందులు కూడా ఇచ్చే వారు అంత సహ్రుదయులాయన .వారు వారి శ్రీమతి మా ఆంజనేయ స్వామి వారి గుడికి వస్తూండే వారు వారి అమ్మాయి కూడా వచ్చేది .ఈ మధ్య మా అమ్మాయి ,పిల్లలు  అమెరికా నుంచి వచ్చినప్పుడు పిల్లలకు కొద్ది సుస్తీ చేస్తే ఆయన దగ్గరకే తీసుకు వెళ్లాం .రూపాయి కూడా ఫీజు లేకుండా ట్రీట్ చేసి మందులిచ్చారు .సరస భారతి పుస్తకాలు వారికి అందజేశాను .వారమ్మాయి కూడా అమెరికా లో ఉంది .నవ్వుతు పలకరించటం వారి ప్రత్యేకత

        డాక్టర్ కుమార స్వామి

ఉయ్యూరు హైస్కూల్ లో మాకు జూనియర్ ,కనక వల్లి వాస్తవ్యుడు వెంపటి కుమార స్వామి డాక్టర్ పాసై ఉయ్యూరు లో ప్రాక్టీస్ పెట్టాడు అయన అన్న సుబ్రహ్మణ్యం నాకు స్కూల్ లో క్లాస్ మేట్ .క్రమంగా  బ్రాహ్మణులు అందరు  కుమార స్వామి దగ్గరకే వెళ్ళటం ప్రారంభించారు .ఈయనా నవ్వు ముఖం తో పలకరించేవాడు మా అమ్మ కు ఆయన్నే డాక్టర్ గా ఏర్పాటు చేశాం .ఆయన చాలా జాగ్రత్త తీసుకొని అమ్మను ట్రీట్ చేశాడు అమ్మకు కూడా అయన మీదే గురి కుదిరింది .ఒక వేళ మేము వేరే  డాక్టర్  దగ్గరకు   తీసుకు వెళ్తామని అన్నా ఒప్పుకొనేది కాదు ..సరే నని మేమూ ఆయన చేతుల్లోనే ఉంచాం .అవసరమైతే అక్కడే ఉంచి వైద్యం చేశాడు .ఆయన అప్పటికి కుర్ర డాక్టరు .వేదాంత గ్రంధాలు కొని చదివే వాడు .వేదాలు ఉపనిషత్తులు తెప్పించి ఖాళీ సమయం లో అధ్యయనం చేసే వాడు మాకు ఎప్పుడైనా సా యంత్రం ఖాళీ గా ఉంటె ఆస్పత్రికి వెళ్లి కాసేపు కూర్చుని మాట్లాడే వాళ్ళం మేము అంటే ఆంజనేయ శాస్త్రి కాంతా రావు .నేను .

మా తోడల్లుడు చతుర్వేదుల శ్రీ రామ మూర్తి బెజవాడ స్టేట్ బాంక్ లో పని చేస్తున్నాడు లబ్బి పెట్ స్టేట్ బాంక్ కాలని లో ఇల్లు ఉంది .ఆయనకు అకస్మాత్తుగా పక్ష వాతం వచ్చింది ఫిజికల్ తెరపి వగైరాలు చేయించినా కాలు చేయి స్వాధీనం లోకి రాలేదు .అప్పుడు కుమారాస్వామికి చూపించమని చెబితే  తీసు కొక్చారు దాదాపు నెల రోజులున్నారు క్రమం గా నయమై  ఆయన పనులు ఆయన చేసుకొనే స్తితికి వచ్చి వాళ్లకు సంతృప్తి కలిగింది ..

అలానే కొండూరి రాదా కృష్ణ మూర్తి అనే పా మర్రు దగ్గర కొండి పర్రు  వాస్తవ్యులు ,జిల్లా పరిషద్ హెడ్ మాస్టారు ఆయన తండ్రికి ఇలా నే పక్షవాతం వస్తే  కుమార స్వామి దగ్గరే ట్రీట్ చేయించారు మూర్తి గారు మా అన్నయ్య జి.ఏల్. శర్మ కుతాడంకి లో  క్లాస్ మేట్ ..మా అన్నయ్య కున్న అపార ఇంగ్లీష్ పాండిత్యాన్ని ,ఆయన రచనా పాటవాన్ని ,ఉపన్యాస నేర్పరితనాన్ని అయన నాకు కనీ పించి నప్పుడల్లా చెప్పి మెచ్చు కొనే వారు .అలాంటి సహాధ్యాయి తనకున్నందుకు గర్వ పడే వారు మా నాన్న గారన్నా మూర్తి గారికి మహా గౌరవం .మూర్తి తెలుగు పండిట్ .అయన కుటుంబం లోని అడా  మగా అందరు ఉపాధ్యాయులే .అదీ ఆ కుటుంబం గొప్పదనం .ఆయన సోదరి కుసుమ కుమారి నేను  ఆడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి నప్పుడు నా దగ్గర హిందీ పండిట్ గా పని చేసింది .మంటాడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర స్వంత డాబా ఉంది భర్త ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టార్ .పిల్లలు లేరు ఆస్తి బాగా ఉంది .

ఇలా మాకు కుమార స్వామి కుటుంబ డాక్టర్ అయ్యాడు నాకు చంకలో కురుపు లేస్తే  ఆపరేషన్ చేసి నయం చేశాడు అలాగే వీపు మీద కూడా .మా చిన్న మేనల్లుడు శాస్త్రి రోజు రోజుకూ చిక్కి పోతే ఆయన దగ్గర చేర్చాం నయం చేశాడు మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి కూడా ఆయనే డాక్టర్ అయన సలహా మీద ఆమెను మద్రాస్ కు తీసుకొని వెళ్లి స్పెషలిస్ట్ కు కూడా చూపించాం .ఎందుకో అందరికి ఆయన మీద నమ్మకం కలిగింది .

కుమార స్వామి కుమార్తెవల్లి  ,కుమారుడు కృష్ణ యాజీ అప్పుడు ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నారు .యాజీ ఇప్పుడు హైదర బాద్ లో డాక్టర్ .అతనే మాకు ఇప్పుడు కుటుంబ డాక్టర్ మా పెద్దబ్బాయి శాస్త్రి టెన్త్ క్లాస్ పాసై నాడు స్కూల్ ఫాస్ట్ మాత్రమె కాదు మండలం లో ఫాస్ట్ వచ్చాడు .నగదు బహుమతి పొందాడు రండో వాడు శర్మ టెన్త్ కు వచ్చాడు .మూడవ వాడుమూర్తి  కూడా టెన్త్ పూర్తీ చేశాడు నాల్గవ వాడు రమణ రెండు మూడు సార్లు డింకీ కొట్టి టెన్త్ డేకాడు అమ్మాయి తొమ్మిది  వరకు ఉయ్యూరు స్కూల్ లో చదివి టెన్త్ వి.ఆర్ కేం.స్కూల్ లో చ దివింది దీనికి కారణం నాకు బదిలీ అవటం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.