నా దారి తీరు -43 సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్

  నా దారి తీరు -43

సైన్స్ వర్క్ షాప్ ట్రైనింగ్

అమెరికా నుండి పి.ఎల్.480 కింద ఎన్నో రకాల ఆర్ధిక ,ఆర్దికేతర సాయంమనదేశానికి  అందుతోంది  .దాన్ని అన్ని రంగాలలోను ఖర్చు పెడుతున్నారు .విద్యా వ్యవస్థ లో కూడా ఈ నిధులను విని యోగిస్తున్నారు ..పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సైన్సు బోధన మీద వర్క షాప్ ట్రైనింగ్ కార్యక్రమాలను సెకండరి విద్యాలయాలకోసం ఏర్పాటైంది .ఒక్కొక్క జిల్లా నుండి కొందరు సైన్సు మేస్టార్లను  ఎంపిక చేసి పది రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు .నాకూ ఆ అవకాశం వచ్చింది .ఉండటానికి వసతి ఇస్తారు. భోజనం అదీ మనమే చూసుకోవాలి .నన్ను రిలీవ్ చేసి పంపారు .వెళ్లి చేరాను .

ఆ ట్రైనింగ్ ఆఫీస్ మైన రోడ్ లోనే ఉన్నట్లు జ్ఞాపకం .ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు వరకు అక్కడే ఉండాలి .అనేక మైన ప్రాజెక్టులు చెయ్యాలి ఇమ్ప్రోవైజేడ్ మోడల్స్ తయారు చేయాలి .వాటిని ప్రదర్శించి చూడాలి .అంతేకాక బోధనా సామర్ధ్యాన్ని పెంచే ఎన్నో విషయాల మీద స్పెషలిస్టులు లెక్చర్లు ఇస్తారు .దీని నంతటిని రికార్డ్ చేసుకోవాలి ఆడ వాళ్ళూ వచ్చారు .ఒకే కుటుంబం లా కలిసి పని చేశాం .సరదాగానే ఉంది .

నేను ఉదయం కాఫీ తాగి ,పదింటికి వసంత విహార్ లో నో ,అక్కడ ఉన్న బ్రాహ్మణ మేస్ లోనో భోజనం చేసి వెళ్ళే వాడిని రాత్రికి కూడా అక్కడే చేసే వాడిని .వీలైనప్పుడు దగ్గరలోనే ఉన్న మా అత్తారి వూరు వేల్పు చర్ల కు ఏలూరు –నూజి వీడు వయా ముసునూరు బస్ లో వెళ్లి రాత్రి అక్కడ ఉండి  మర్నాడు ఉదయమే భోజనం చేసి, ఎనిమిది గంటల బస్ ఎక్కి వర్క్ షాప్ కు వచ్చే వాడిని .ఒక సారి ఉయ్యూరు కూడా వెళ్ళే వాడిని .మంచి రిఫరెన్స్ పుస్తకాలు ,బోధనా సామగ్రి పుస్తకాలను స్కూల్ కు అందజేయ టానికి మాకు ఇచ్చారు పది రోజులు యిట్టె గడిచి పోయాయి చివరి రోజున టీ పార్టీ ఏర్పాటు చేశారు .ఎవరి అనుభూతి వాళ్లు  చెప్పారు .ప్రాజెక్ట్ ఆఫీసర్ పేరు గుర్తు లేదు కాని మంచి యువ ఆఫీసర్ .ఎంతో జాగ్రత్త గా మాకు ట్రైనింగ్ ఇప్పించారు . నాకు బాగా నే ఉపయోగ పడిందని పించింది స్కూల్ లో బోధనా మెరుగు పరచుకొనే గొప్ప అవకాశం కల్గింది చిన్న చిన్న పరికరాలు చేసే నేర్పు వచ్చింది పిల్లలతో చేయించే అనుభవమూ వచ్చింది. వాళ్ళు అందజేసిన పుస్తకాలూ ఏంతో  ఉపయోగ పడ్డాయి

పి.ఎల్.480 నిధులు మొదట్లో బాగానే సద్విని యోగం అయ్యాయి తర్వాత్ నిధుల గోల్ మాల్ ఎక్కు వైంది.ఈ కార్యక్రమం ఇరవై  ఏళ్ళు నడిచిందని జ్ఞాపకం .ఈ నిధుల కింద పాతిక కిలోల పాల పొడి పాకెట్లు పేదలకు అందజేసే వారు దుప్పట్లు ,రగ్గులు శాలువాలు అమెరికా నుంచి తెపించి ఇచ్చే వారు వీటిని క్రిస్టియన్ మత గురువులు పంపిణీ చేసి నట్లు గుర్తు .ఇవి అందరికి పంచకుండా క్కొన్ని స్వాహా చేసే వారు లేక పోతే బయట డబ్బులకు అమ్ముకొనే వారు ..ఆ ఫాదర్ తెలిసిన వాడైతే ఊరికే లేక పోతే డబ్బుకు మా బోటి వాళ్ళకు ఇచ్చేవారు .పాల పొడి రుచి గా ఉండేది .క్రమంగా దాన్ని గేదెలకు కుడితి లో కలిపి పెట్టె వాళ్ళం .మొక్క జొన్న పిండి రవ్వ కూడా వచ్చేది ఇవీ ఇలానే పరుల పాలయ్యేవి రవ్వతో ఉప్మా చేసుకొనే వాళ్ళం .నిలవ ఉండటం వల్ల  కంపు కొట్టేవి .అందుకని వీటి మీద మోజు మాకు తగ్గింది పాల పొడి మాత్రం గేదెల కోసం కొనే వాళ్ళం .ఇదీ’’ పిఎల్  420 ‘’సారీ 480 భాగవతం ..

స్పాట్ వాల్యుయేషన్

మెట్రిక్,ఎస్.యస్.ఎల్.సి. పబ్లిక్ పరీక్ష పేపర్లను ఉపాధ్యాయుల ఇళ్లకే పంపి దిద్దించటం ఉండేది .పార్సేల్లు ఇళ్ళకు వచ్చేవి దిద్ది ముందుగా సాంపిల్  గా కొన్ని పేపర్లు చీఫ్ కు పంపే వారు ఆయన ఒకే అంటే మిగిలినవి దిద్ది పంపాలి చీఫ్ కు ఒక అసిస్టంట్ ఉంటాడు అతను ప్రతి పేపరు చెక్ చేసి మార్కులు కూడి సరి చూడాలి .అతన్నే చెక్కర్ అంటారు .ఆయన ఓకే చేసిన తర్వాత మార్కుల లిస్టు ఫైనల్ అయ్యేది .ఈ విధం గా చాలా కాలం జరిగింది .ఇందులో కొన్ని లోపాలు జరిగేవి ఏ పేపర్ ఎవరికి వెళ్లిందో కనీ పెట్టె వారు .వారింటికి వెళ్లి  ఇంఫ్లుఎన్స్ చేసి మార్కులు వేయించు కొనే వారని అనుకొనే వారు .అలాగే చీఫ్ ను కూడా మైంటైన్ చేసే వారని అంటారు .

పదవ తరగతి అనే ఎస్.ఎస్.సి వచ్చిన తర్వాత విద్యార్ధుల సంఖ్య విపరీతం గా పెరిగి పోవటం వల్ల ఇళ్ళకు పంపే ఏర్పాటు విరమించి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో టీచర్లను రప్పించి దిద్దించే  పధ్ధతి మొదలైంది .కర్నూలు ,విశాఖ పట్నం ,రాజ మండ్రి మొదలైన చోట్ల స్పాట్ ఉండేది..మేస్టార్లు  ను .అక్కడికి  అపాయింట్ చేసి పంపేవారు అక్కడే సుమారు పది హీను రోజులు పట్టేది స్పాట్ పూర్తీ అవటానికి అని చేపగా విన్నాను అక్కడా చెక్కర్స్ చీఫ్ లు కాంప్ ఆఫీసర్లు ఉండే వారు .ఇదంతా జిలా విద్యా శాక్షాది కారి ఆధ్వర్యం లో జరిగేది .మేము సర్వీస్ లోకి వచ్చేసరికి గుంటూర్ ,ఎలూర్  సెంటర్లు వచ్చాయి ఒక సారి నన్ను గుంటూర్ సెంటర్ లో ఫిజికల్ సైన్స్ పేపర్లు దిడటానికి వేశారు .లేడీస్ కాలేజి లో సెంటర్ అని జ్ఞాపకం .మాకు వసతి హిందూ కాలేజి లో ఇచ్చారు .అక్కడే ఉన్నాం పది హీను రోజులు .హోటల్ భోజనం .టిఫిన్ కాఫీ అన్నీ హోటల్ లోనే .హిందూ కాలేజి లో ఆఫీస్  ఆఫీస్ సూపరింటేన్దేంట్  మా రేపల్లె బాబాయి శివరామ దీక్షి తులు గారి రెండో అమ్మాయి బాల భర్త ఒక్కో సరి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గరున్న అమ్మ వారి గుడి దగ్గర ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని ఏంతో  ఆప్యాయం గా చూసే వారు భోజనం అక్కడ చేస్తే కాని వదిలే వారు కాదు బాబాయి మూడో కూతురు సీత కూడా వారింటి దగ్గరే ఉండేది .అన్నయ్యా అన్నయ్యా అంటూ వాళ్ళు ఎంతో ఆప్యాయం గా పిలుస్తుంటే ఒళ్ళు పులకరించేది వీరిద్దరి పెళ్లిళ్లకు మా కుటుంబం హాజరయింది .

ఒక సారి మాతో పేపర్లు దిద్దుతున్న మా చీఫ్ గారు అస్వస్తులయ్యారు ఆయన సెలవు పెట్టి వెళ్లి పోతానన్నారు చాలా మంచి వాడు.అందుకని ఆయన కింద అసిస్తంట్లు గా పని చేస్తున్న నేను, వీరా రెడ్డి అనే మా జిల్లా సైన్సు మేష్టారు ఆయన్ను ఒప్పించి ఇంటికి  వెళ్ళ కుండా ఆపి, కాంప్ ఆఫీసర్ గారికి చెప్పి మా పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత ఆయన చేసే చీఫ్ పని కూడా మేము చేసి ఆయనకు ఏంతో  సహకరించాం  హాయిగా కుర్చీలో తాపీగా ఉండమని చెప్పాం .ఆయన ఏంతో  ఆనందించారు .మాకు ఏంటో కృతజ్ఞత చెప్పారు ఒకరికొకరు సాయం చేసుకోవటం అంతే  కాని ఇందులో మేమేమీ ఇబ్బంది పడలేదు ఏంతో  ఓర్పుగా ఆ పని సంతృప్తి గా చేశాం .ఆయనకు రావాల్సిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఇప్పించ గలిగి నందుకు సంతోషం గా ఉంది .

ఖాదర్ మేష్టారు

ఇక్కడ కాంప్ లో ఒక సారి డిప్యూటి దియి వో గారిని చూశాను ఆఫీసర్ మేము ఉయ్యూరు లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మాకు క్లాస్ టీచర్ గా ఇంగ్లీష్, సోషల్ బోధించిన ఏం డి.ఖాదర్ మేష్టారుఅని గుర్తించి అవునా అని అడిగితే ఆయన అవునన్నారు . .ఆయనంటే మాకు ప్రాణం ఏంతో  గొప్పగా బోధించారు ఆయన ఉన్నది ఒక్క ఏడాది మాత్రమె కాని ఆ అనుబంధాన్ని మరచి పోలేం ఆయన ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి ఉయ్యూరు హైస్కూల్ నుంచి బదిలీ అయినప్పుడు ఆయనకు ఘనమైన వీడ్కోలు విందు ఇచ్చాం .స్కూలు స్కూలు అంతా తరలి వెళ్లి కన్నీళ్ళతో ఆయన్ను బస్ ఎక్కించింది అంత  ప్రభావం చూపించారు ఖాదర్ మేష్టారు .నల్లగా ఉన్నా తెల్లని పాంట్ షార్ట్ ర్ట్ వేసే వారు .ఇవన్నీ వారికి నేను జ్ఞాపకం చేసి ఆయన శిష్యుడిని అని చెప్పాను అయన ఏంతో సంతోషించారు .అప్యాయం గా కౌగలిన్చుకొన్నారు .నాకు కళ్ళంబడి ఆనంద బాష్పాలు విపరీతం గా కా రిపోయాయి ఆపుకోలేక పోయాను .ఒక రకం గా చలించి పోయాను .ఇప్పుడు అయన గుంటూరు జిల్లలో గేజేటెడ్  ఇన్స్పెక్టర్ గాడిప్యూటి డి.యి వో గా ఉన్నారట . స్పాట్ ను విజిట్ చేయటానికి వచ్చారట . ఇన్నేళ్ళకు వారిని మళ్ళీ చూసి నందుకు మహదానందం గా ఉంది నాకు కాని మేష్టారు ఎందుకో డల్ గా ఉన్నట్లని పించారు రెండో రోజున ఈ మాటే ఆయన తో అన్నాను నిజమే నన్నారు ఏదో స్దాధించాలని ఇందులోకి వచ్చానని ఏమీ చేయ లేక పోతున్నందుకు దిగులుగా ఉన్నందు వల్ల  అలా కనీ పిస్తున్నానని అన్నారు మేష్టారు కాదుకాదు  డిప్యూటీ విద్యాశాఖాధి కారి గారు

వీలైనప్పుడల్లా రాత్రుళ్ళు సినిమాలకు వెళ్ళే వాళ్ళం .అక్కడ ఏవైనా సభలు జరిగితే వెళ్లి చూసే వాళ్ళం .సిల్వెస్టర్ మిమిక్రి ని అక్కడే మొదటి సారి చూశాను అయన చెప్పిన ఒక జోక్ ఎప్పుడు గుర్తుకు వచ్చినా విపరీతం గా నవ్వు వచ్చేది .ఒక సారి ఒక పెద్ద మనిషి ఒకరింటికి వెళ్లి ఇంటి ఆయన ఉన్నాడా అని అక్కడ ఒక కుర్రాడు కనిపిస్తే అడిగాడు .’’నాన్న గారు ఇంట్లో లేరండి బయటికి వెళ్ళారు .కాసేపట్లో వస్తారు ఉండండి ‘’అన్నాడు ఆయన కాలక్షేపానికి ‘’మీరు ఎంతమంది అన్న దమ్ములు ?’’అని అడిగాడు ‘’నాతో నలుగురు ‘’అన్నాడుకుర్రాడు ‘’అక్క చెల్లెల్లో ?/’’మళ్ళీ అడిగాడు ‘’నలుగురు అక్కలు ఒక చెల్లెలు ‘’అన్నాడు పిల్లాడు .’’మీ నాన్న గారు ఏం పని చేస్తారు /’’అని అడిగాడు పెద్దాయన ‘’’ఇదే పని చేస్తారు ఇంకేపనీ చేయరు ‘’అన్నాడు ఆ కుర్ర కుంక ..అంటే సంతానం పెంచటం తప్ప తండ్రికి ఏ పనీ లేదని దేప్పాడన్న మాట .ఆ జోకు విని పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వాను .అప్పటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా అంతే . ఏంతో  మందికి దీన్ని చెప్పి నవ్వించాను

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-13-ఉయ్యూరు  .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.