నా దారి తీరు -44 బందరు స్పాట్

నా దారి తీరు -44

బందరు స్పాట్

ఎట్ట కేలకు బందరు లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వచ్చింది .నేను సర్వీస్ లో చేరిన సుమారు ఏడెనిమి ఏళ్ళకే నాకు  స్పాట్ కు ఆర్డర్లు డి.యి.వో నుండి అందాయి .అదీ నేను బోధిస్తున్న ఫిజికల్ సైన్స్ లో కాదు .నేచురల్ సైన్స్ లోవచ్చింది ..స్పాట్ వస్తే హెడ్ మాస్టర్ వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి పంపిస్తారు .నేను రిలీవ్ అయి అక్కడి కి చేరాను .స్పాట్ కు కొందరు మేస్టార్లు డి.యి.వో.ఆఫీస్ గుమాస్తాలను మేనేజ్ చేసి ఆర్డర్ సంపాదించటం ఉండేది పాతికో పరకో ‘’ఆమ్యామ్యా‘’ముందే సమర్పిస్తే స్పాట్ రావటం ఖాయం .లేక పోతే ఎన్నేళ్ళు గడిచినా చాలా మందికి వచ్చేది కాదు .కాని నాకు ఏ ప్రయత్నం లేకుండా నే స్పాట్ వచ్చింది .నారాయణ రావు అనే గుమాస్తా ఇందులో ప్రసిద్ధి చెందాడు కొందరు మేస్టార్లు మేస్టార్ల వద్ద డబ్బు వసూలు చేసి అక్కడ ‘’కొట్టి ‘’ఆర్డర్లు వచ్చేట్లు చేసే వారు .మా హిందీ మేష్టారు రామారావు దీనిలో ఆరితేరిన వారని చెప్పుకొనే వారు .నన్నూ ఒక సారి ప్రలోభ పెడితే ‘’చెయ్యి జారాను ‘’కూడా అక్కడ ఆ పరిస్తితి చూసి అసహ్యం వేసి ఆ జోలికి మళ్ళీ ఎప్పుడూ వెల్ల లేదు

వరండా అపాయింట్ మెంట్

రెగ్యులర్ గా స్పాట్ అపాయింట్ మెంట్ రాక పోతే స్కూల్ కు సెలవు పెట్టి మొదటి రోజున వెడితే రాని  వారెవ రైనా ఉంటె ఖాళీలు చూసి ‘’స్పాట్ అపాయింట్ మెంట్ ‘’ఇచ్చే వారు .దీన్ని మేము ‘’వరండా అపాయింట్ మెంట్ ‘’అనే వాళ్ళం .అక్కడ క్యూ లో నుంచో వాలి .ఏ సబ్జెక్ట్ లో ఖాళీ ఉంటె అందులో పేపర్లు దిద్దాలి .ఆ రోజుకు డి ఏ.ఉండేది కాదు .అప్పుడు డి.ఏ.పది రూపాయలు రోజుకు .క్రమం గా పదిహేను  ఇరవై అయింది ఎన్ని రోజులు స్పాట్ లో ఉంటె అన్ని రోజులకు డి ఏ,ఇచ్చేవారు రాను ,పోను బస్ కు లేక రైల్ కు ఎక్స్ప్రెస్ చార్జీలు ఇచ్చేవారు దిద్దిన పేపర్ కు ఒకటికి మొదట్లో పావలా అ తర్వాతా నలభై పైసలు ఆ తర్వాతా డెబ్భై అయిదు పైసలు ,చివరగా రూపాయిన్నర కూడా  ఇచ్చారు చీఫ్ కు ఫిక్సెడ్ అమౌంట్ ఉండేది .అందుకని చీఫ్ కంటే అసిస్తంట్లకు ఎక్కువ వచ్చేది  తరువాత దీన్ని మార్చారు .చెక్కర్ కు పది పైసలు చివరికి ముప్పావలాఅయింది ..చీఫ్ ఒక్కో అసిస్టంట్ పేపర్లలో పది హీను శాతం పేపర్లు చెక్ చేయాలి గ్రీన్ ఇంకు పెన్ వాడాలి అసిస్టంట్లు రెడ్ ఇంకు పెన్ వాడాలి ,చెక్కర్లు బ్లూ లేక బ్లాక్ వాడాలి .ఇంకు స్పాట్ వాళ్ళే సరఫరా చేసే వారు బాల్  పాయింట్ పెన్స్  అయితే మనమే తెచ్చుకోవాలి .

సాధారణం గా స్పాట్ బందరు హిందూ హైస్కూల్ లోనే జరిగేది .అక్కడ వసతులు పెద్దగా లేక పోయినా అన్నిటికి సెంటర్ .బస్ స్టాండ్ కు కూడా దగ్గరే నడిచి సెంటర్ కు చేర వచ్చు .సెంటర్ రోడ్డు మీద కా కుండా కాంపౌండ్ వాల్ లోపల ఉండటం వల్ల  బయటి వారి ప్రవేశం ఉండదు .స్కూల్ కు కూడా మంచి చరిత్ర ఉంది కనుక అందరికి గొప్ప నమ్మకం .ఒక్కో సబ్జెక్ట్ కు రెండు రూముల్లో స్పాట్ జరిగేది .ఒక్కో చీఫ్ కు కనీసం ఏడు లేక ఎనిమిది మంది అసిస్టంట్ లు ఉండే  వారు .హిందీ కి తక్కువ .స్థానిక సెకండరి మేస్టార్లు లేక గుమాస్తాలు చెక్కర్ లు గా అపాయింట్ ఆయె వారు ఈ పది మంది అసిస్తంట్లు దిద్దిన పేపర్లమార్కులు సరి చూసి మార్కుల లిస్టు లను చెక్ చేసి చీఫ్ కు అందజేయాలి .స్పాట్ సరదాగానే ఉంది ప్రశ్నా పత్రాలకు సంబంధించిన సమాధానాలు పాయింట్లు గా ఎక్స్ పెర్త్స్ చేత హైదరా బాద్ లో తయారు చేయించి స్పాట్ సెంటర్లకు పంపిస్తారు దాని ఆధారం గా వాల్యు చెయ్యాలి .ఒక్కో సారి వాళ్ళు తప్పుడు ఆన్సర్లు ఇవ్వటమో లేక ఒకే ఆప్షన్ ఇవ్వటమో జరిగేది అప్పుడు మేము చీఫ్ కి చెప్పి వాటి ని సరి చేయించి కాంప్ ఆఫీసర్ తో ఒప్పించి పై అధికారులైన డి.యి.వో  అను పతి పొందేట్లు చేసే వాళ్ళం .

హిందూ హైస్కూల్ లో శ్రీ సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది రోజు అక్కడ పూజ నిర్వహించి ప్రసాదం పెడతారు స్పాట్ కు అందరం ఉదయం పది గంటలకే చేరుకోవాలి .అక్కడ అటేన్దేన్స్ రిజి సస్టర్ లో సంతకం చేయాలి .చీఫ్ గారు అసిస్టంట్ కాంప్ ఆఫీసర్ వద్ద దిద్దాల్సిన పేపర్లు తీసుకొని వచ్చి తన రిజి స్తర్ లో నమోదు చేసుకొని డిస్ట్రిబ్యూషన్ రిజి స్తర్ లో ఎవరికి ఎన్ని పేపర్లు ఏ సెంటర్ వి ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఇచ్చారో రాసి మాతో సంతకం పెట్టించే వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక సెషన్ .ఆ తర్వాతా ఒక గంట విశ్రాంతి భోజనం చేసే వాళ్ళు చేసే వారు .టిఫిన్ ,కాఫీ లు చేయచ్చు అక్కడ బయట ‘’చంద్రం ‘’హోటల్ ఉండేది .అక్కడ బజ్జి ,పునుగు తప్ప ఇంకేమీ ఉండేవి కావు. టీ బాగా ఉండేది .చంద్రం పెద్ద వాడే కాని అందరు చంద్రం అనే పిలిచే వారు నవ్వుతూ అసి స్టంట్ లతో   సర్వ్ చేయిస్తూ ఉండేవాడు .లావుగా ఖాకీ పాంట్ తో ఉండే వాడు. నేను ఉయ్యూరు లోనే భోజనం చేసి వీలైతే టిఫిన్ కూడా చేయించి బాక్స్ లో తెచ్చుకొనే వాడిని .

మధ్యాహ్నం రెండు గంటలకు రెండో సెషన్ .మధ్యాహ్నం  కూడా అదే విధానం ఉదయం 18 పేర్లు ,సాయంత్రం 18 పేపర్లు మాత్రమె దిద్దాలి .అంతకు మించి ఇచ్చే వారు కాదు ఇది మొదట్లో ఉన్న విధానం క్రమంగా మారి పోయింది .పొద్దున సాయంత్రం కలిపి 45 పేపర్లు దిద్దటం .చివరికి యాభై ఆపైన దిద్దే వాళ్ళం ఒక్కోసారి ఎక్కువ విద్యార్ధులు పరీక్ష రాసిన సెంటర్ల నుండి పేపర్లు వస్తే కనీసం  అరవై కూడా దిద్దాం .ఒక సారి నేను 85 పేర్లు దిద్దిన సంఘటన కూడా ఉంది .ఫిజకల్ సైన్స్ పేపర్లు ఇవి .నాకు క్రమం గా ఫిజికల్ సైన్స్ పేపర్లు దిద్దే అవకాశాలు వచ్చాయి తర్వాతా ఇంగ్లీష్ పేపర్ రెండు ఆ తర్వాతా ఇంగీష్ ఒకటి పేపర్లు దిద్దాను .ఇది మరీ హెడ్ మాస్టర్ అయిన తర్వాతా ఇంకా ఎక్కు వైంది

తెనాలి –మచిలీ పట్నం ఎక్స్ ప్రెస్

సాధారణం గా నేను ఉయ్యూరు నుండే స్పాట్ కు వెళ్లి దిద్దిసాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వాడిని నాతో పాటు గుడివాడ బేజ వాడ నుండి కూడా డైలీ సర్వీస్ చేసే వారు చాలా మందే ఉండే వారు అలాగే అవనిగడ్డ నాగాయ లంక ,కైక లూరు ,నుండీ వచ్చేవారు ..మా కు ఉయ్యూరు లో తెనాలి ననుండి బందరు వెళ్ళే ఎక్స్ ప్రెస్ బస్ సరిగ్గా తెనాలి నుంచి ఉయ్యూరు కుఉదయం ఎనిమిదిమ్బావు కు ఖచ్చితం గా  వచ్చేది .ఒక నిమిషం అటూ ఇటూ అయ్యేది  కాదు దాని డ్రైవర్ ఒక ముస్లిం యువకుడు .ఆ బస్ కే మేము అందుకొనే వాళ్ళం ఖాళీ లేక పోయినా నుంచొని అయినా వెళ్ళే వాళ్ళం ఖచ్చితం గా తొమ్మిదిం బావు కు బందరు చేరేది స్పాట్ కు నడిచి పది నిమిషాలలో చేరే వారం .సాయంత్రం అయిదు గంటలకు బందరు లో బయల్దేరేది .ఈ బస్  అందరికి ఎంతో ఉపయోగకరం గా ఉండేది .ఈ బస్ ఎక్కటంమాకప్పుడు ఒక క్రేజ్ ఒక క్రేజ్  .ఈ బస్ ఏడెనిమిదేళ్ళు మాత్రమె నడిచింది తర్వాత ఆపేసి నట్లు జ్ఞాపకం ..

    బందరులో ఉండటం

మా చిన్న అక్కయ్య దుర్గా వాళ్ళు బందరు లో కాపురం ఉండే వారు మా మేనల్లుళ్ళఅశోక్ ,శాస్త్రి  మేన కోడలు పద్మ  చదువు కోసం .అప్పుడు మా బావ గారు ఇతర రాష్ట్రాలలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో సర్వేయర్ గా జూనియర్ ఇంజినీర్ గా పని చేసే వారు .అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉడి స్పాట్ కు వెళ్ళే వాడిని .ఆర్.ఎస్.కే గారింటి ప్రక్క దాబాలో అద్దె కుండే వారు .ఆ తర్వాతా రెంత చింతల దీక్షితులు గారింట్లోను ఆ తర్వాతా  వాళ్ళ ఇంటికి ఎదురుగా  ఉన్న దాబాలోను ఉండే వారు ఈ  డాబాలోనే ఒక పోర్షన్ లో ‘’భక్త జయ దేవా ‘’సినిమా డైరెక్టర్ పమిడి ముక్కల రామా రావు గారి కుటుంబం ఉండేది .ఆయన స్ట్రాంగ్ ఆర్ .ఎస్.ఎస్ వారు .నాకు బాగా పరిచయం కూడా ..చాలా ఆప్యాయం గా మాట్లాడే వారు ఆయన ఫామిలి ఇక్కడ ఆయన హైదరా బాద్ లో ఉండి అప్పుడప్పుడు వచ్చే వారు జాగృతి పత్రిక ను చూసే వారు జనసంఘ్  లో చురుకైన కార్య కర్త కూడా .దీక్షితులు గారిని బాగా సన్నగా పీలగా ఉండటం వల్ల  ‘’పీచు గారు ‘’అనే వారు అందరికి ఆ పేరే తెలుసు దీక్షితులు గారంటే తెలియదు .భార్య బాలమ్మ గారు చాలా ఆదరం గా ,అప్యాయం గా ఉండే వారు .మా వాళ్ళు బందరు వదిలేసినప్పుడు నేను రోజూ తిరగ లేక బాలమ్మ గారింట్లో ఉండే వాడిని కాఫీ టిఫిన్ లు పెట్టె వారు భోజనం హోటల్ చేసే వాడిని నాలుగు రోజులకు లేక మూడు రోజులకు ఉయ్యూరు వచ్చి వెళ్ళే వాడిని .తర్వాత చాలా కాలం ఉయ్యూరు నుండే రోజు వెళ్లి వచ్చే వాడిని ఖర్చు ఎక్కువే అయినా ఇంటి భోజనం రాత్రి సుఖ నిద్ర లేక పోతే చాలా కష్టమని అలా చేసే వాడిని

బందరు లడ్డు –మొగలి పొత్తులు

బందర్ అంటే బందర్ లడ్డు కు ప్రసిద్ధి అలాగే మొగలి పువ్వులకు పేరు బందరు పర్రల్లో సముద్ర తీరం  లో గూడూరు నుంచి బందరు వరకు మొగలి పదలు ఉండేవి  .ఆ వాసనే అదురు .ఇంటికి వచ్చినప్పుడల్లా లడ్డూలు ,మొగలి పొత్తులు తీసుకొచ్చే వాడిని .మొగలి రేకుల్ని ఆడ వాళ్ళు జడలో భలే అందం గా అలంకరించుకోవటం, కుట్టటం ఉండేది మా అమ్మకు మా శ్రీమతికి ఆ విద్య బాగా తెలుసు .మొగలి పోత్తుల్లో ఉన్న గుత్తుల్ని బట్టల పెట్టేల్ల్లో వేసే వాళ్ళం ఆ వాసన చాలా కాలం ఉండేది బందరు కోనేరు సెంటర్ లో అత్తరు పన్నీరు ,అగరు వత్తులు సెంట్లు బాగా అమ్మే వారు ..బందరు అంటే బంతి పూలకు ,చేమంతి పూలకు ,మల్లె పూలకు ప్రసిద్ధి .బందరు కూర గాయల మార్కెట్ లో బెండ ,బజ్జీ మిర్చి,చామ దుంప పూసా సవాని వంకాయ  ఆకుకూరలు బాగా తాజా గా ఉండేవి వీలుని బట్టి కొనుక్కు వస్తుందే వాడిని .

సినిమాలు

బందరులో ఉండి పోయినప్పుడు సినిమాలు ఎక్కువ గా చూసే వాడిని .ఎన్నో మంచి సినిమాలు చూసిన అనుభవం నాది .మా మేనమామ గంగయ్య గారి అబ్బాయి మోహనాయ్ బందర్లో  ఏం కాం .చదివే వాడు నేను పీచు గారింట్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను బాపు రమణ లు సోమయాజులు తో తీసిన ‘’త్యాగయ్య ‘’కు  తీసుకొని వెళ్ళాడు .నా దృష్టిలో ఆ సినిమా ఒక’’ క్లాసిక్ ‘’.బాలు చాలా గొప్పగా కీర్తనలను గానం చేశాడు.కీర్తనల తో కధ నడి పించారు బాపు రమణ ద్వయం మామ మహా దేవన్ ,పుహళేందిసంగీత సహకారం అద్వితీయం .

పాండురంగ ని దర్శనం

వీలైనప్పుడు సాయంత్రాలలో చిలకల పూడి వెళ్లి పాండు రంగ స్వామిని దర్శించి అక్కడి ‘’పటిక బెల్లం ‘’ప్రసాదం తెచ్చేవాడిని .చిలకల పూడి రోల్ గోల్డ్ నగలకు ప్రసిద్ధి గుడి దగ్గరే ఆ దుకాణాలున్నాయి విపరీతం గా ఆ వ్యాపారం జరిగేది .స్పాట్ సెంటర్లు క్రమం గా హిందూ కాలేజి నుండి ,జిల్లా పరిషద్ ఆఫీస్ దగ్గర ఉన్న ‘’హైనీ హైస్కూల్ ‘’లోను పరాసు పేట లో శ్రీ సువర్చలాన్జనేయ  స్వామి దేవాయం దగ్గరున్న ఒక క్రిస్టియన్ హై స్కూల్ లోను జరిగాయి పేరు జ్ఞాపకం లేదు .వీటిలో  గాలి వెలుతురూ బాగా వచ్చేవి .

స్పాట్ కు సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకో సారి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-13 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.