వేయి పడగలు-రేడియో నాటకం

వేయి పడగలు-రేడియో నాటకం

 

హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రాసార మైంది .నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు .’’తనకేమీ సాహిత్య పరిజ్ఞానం లేదని విశ్వనాధ పై మాట్లాడే సత్తా కాని ప్రతిభ కాని తనకు లేదని సహజం గా చెబుతూనే దాని  విశిష్టతను మెచ్చాడు .ఇలా రేడియో ద్వారా ఆ నవల ప్రసారం అవటం ఉత్తమ అభిరుచికి సకేతం అన్నాడు .ఈ ధారావాహిక నాటకం ప్రారంభమైన నాటి నుంచి తాను రెగ్యులర్ గా   వింటున్నానని  అద్భుత రీతిలో దీనిని శ్రోతలకు అంద జేస్తున్నారని మెచ్చుకొన్నాడు చెప్పాడు .

ఈ రోజు భాగం లో ధర్మా రావు భార్య అరుంధతి పుట్టినింటికి వెళ్లి, భర్త ఆమె తల్లి గుడ్లప్పగించి చూస్తుండగానే తీసుకొచ్చిన వైనం బాగుంది అమ్మ నాన్న అత్త పై భర్త పై మామ గారిపై చెప్పిన అభూత కల్పనలన్నీ మొదట్లో నమ్మిన ఆమె ఇప్పుడు వ్యక్తురాలై వాటిలో నిజం  ఏమిటోగ్రహించి భర్తకు పూస గుచ్చినట్లు తెలిపింది ఆమె లోని పరివర్తన మనకు విభ్రాంతి కలిగిస్తుంది .వారిద్దరూ  గట్ల వెంట ,చెట్ల వెంట  డొంకలంబడి నడిచి వస్తుంటే ‘’ప్రణయ సమాధి ‘’లో ఉండిపోయామని ధర్మా రావు తో విశ్వనాధ అని పించిన మాట అతి విలువైనది ,సందర్భోచితమైనది .గంగావతరణం గురించి వారిద్దరి మధ్య వచ్చిన చర్చలో తాము ‘’ప్రణయావతరణం ‘’లో ఉన్నామని అని పించటం విశ్వనాధకే చెల్లింది .తల్లి పెట్టిన ఆరడులు తన డబ్బు, నగలు లాక్కోవటం ఆమె దాని పై ఎంత మానసిక క్షోభ అనుభావిన్చిందో నీళ్ళు కారే కన్నుల తో ఆమె చెప్పిన తీరు కు హాట్స్ ఆఫ్ .తనకు రక్షణ ,ఏడుగడ భర్త మాత్రమె నని తన ఇల్లు అత్తారిల్లే నని ఆమె గ్రహించి మ సలిన విధం అర్ధాంగికి ఉండాల్సిన లక్షణాలను తెలియ జేసింది .ఎంతైనా భర్త దగ్గర అంతకు ముందు ‘’మూడు రాత్రులు ‘’గడిపింది కనుక ఆతని స్వభావం, శీలం అత్తగారి మంచితనం,ఆ కుటుంబ గౌరవం సంఘం లో వారికి ఉన్న ఉన్నత స్తానం  అర్ధమై తల్లి తన దగ్గరున్న నగ ను లాక్కోవటానికి చేస్తున్న ప్రయత్నం తెలిసి దాన్ని బంధువుల ఇంట్లో జాగ్రత్త చేసి ,అప్పుడే ‘’ఆరిందా ‘’అయి పోయింది అరుంధతి . ధర్మా రావు కు తగిన అర్ధాంగి అని పించుకోంది .  ఆ నాడు వియ్యపు రాళ్ళు ,వియ్యంకులు కొందరు ఎలా కూతుళ్ళ కాపురం లో చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజనాలు సాధించుకొనే వారో అరుంధతి అమ్మా నాన్న దానికి సాక్షీ భూతులుగా నిలిచారు .మిగిలిన వారు ఎంత గుట్టుగా ,సమాజ హితం గా కుటుంబ ఉన్నతికి మార్గ దర్శులు గా ఉన్నారో ధర్మా రావు తల్లి తండ్రీ ఉదాహరణ లుగా కనీ పిస్తారు .

రంగా జమ్మ’’ధర్ము’’గుంటూరు విద్య కోసం  ,,చేస్తున్న సాయం ,ఆమె కొడుకును ‘’అన్నా ‘’అని ఇతను పిలవటం ఆత్మీయతకు అద్దం పట్టింది .అతని పిల్లాడిని ప్రేమ తో పలకరించిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది .వారి సంభాషణలన్నీ ఒకప్పటి ఉమ్మడి కుటుంబ భావనలకు ఆనవాలు .అలాగే ధర్మా రావు తల్లి మాట్లాడే ప్రతి మాట లోను ప్రేమ, చనువు గౌరవం ,అంకిత భావం కనిపిస్తాయి .ఎంత చక్కని వ్యవస్థ ,ఈ నాడు భ్రస్టు పట్టి పోయిందో తెలుస్తుంది .గిరిక ,ధర్మా రావు సంభాషణలలో ఒక దైవీ భావం సమర్పణా భావం జ్యోతక మవుతాయి .వీరి సంభాషణ ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలని పిస్తాయి .

ఆరవ ఎపిసోడ్ లో కొత్త దంపతుల ప్రణయం ఆ నాటి భార్యలు చూపని చొరవ అప్పటికింకా పుట్టింటి పై మమ కారం ,అత్తిన్టిపై నూరిపోయ బడ్డ కోపం ద్వేషం ప్రస్పుట మయ్యాయి అయినా ధర్మా రావు సంస్కారి కనుక ఆమె చెప్పిన వన్నీ విని చాలా ఓపిక గా భార్య మనసులో ప్రేమ బీజాలు నాటి ద్వేష పు కలుపు మొక్కల్ని పెకలించి ఆమె లో అర్ధాంగికి కావలసిన లక్షణాలకు దోహదం చేశాడు .ఆమె తో సాహిత్య చర్చ ఆమె పరిణతికి కారణం కూడా అయింది .

అరగంట సేపు ప్రసారమయ్యే ఈ నాటకం లో ఒక్క క్షణం కూడా వ్యర్ధం అని పించదు .ఒక్క నిమిషం కూడా ‘’పలచన ‘’అని తోచదు  సాంద్రం గా ,మనసుకు హత్తుకోనేట్లు ఉండటం ప్రత్యేకత .ప్రారంభ గీతమూ కమనీయం గా ఉండి వెంటనే కధలోకి ప్రవేశింప జేస్తుంది .ఇంత మంచి నాటకీ కరణ చేసిన డాక్టర్ దిట్ట కవి శ్యామలా దేవి గారికి ,ఇంత మహోజ్వలం గా తీర్చి దిద్దుతున్న శైలజా నిర్మల గారికి ,ప్రసారం చేస్తున్న సంగీత సాహిత్య సవ్య సాచి ,స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి నాటకం లో పాత్రలలో ఒదిగి పోయి జీవిస్తూ విశ్వనాధ కు చిర యశస్సు సాధిస్తూ తాము కీర్తి పొందుతున్న నటీ నటులకు అందరికి హార్దిక శుభాభి నందనలు .తెలుగు జాతి మరువ లేని చారిత్రిక ఘట్టం ఇది

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.