సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై
– 51 వ సమావెశం విశేషాలు
‘’అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మ ‘’గారి చరిత్ర
సరసభారతి ఆధ్వర్యం లో 17-9-13 మంగళ వారం సాయంత్రం 6-30 లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ‘’శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితం అన్నదానంకీర్తి ప్రతిష్టలు ‘’అనే విషయం పై సమా వేషం జరిగింది సభక సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా వి.ఆర్.కే.ఏం హైస్కూల్ ప్రదానో పాద్యాయిని శ్రీమతి ఏం విజయ లక్ష్మి ,కాటూరు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ శ్రీమతి జయ ప్రద ,అమరావాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనాగ రాజు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు .చి బిందు ప్రార్ధన తో సభ ప్రారంభం కాగా కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కార్య క్రమ నిర్వహణ చేశారు సభలో సేతమ్మ గారి చిత్ర పటాన్ని ఉంచి అందరికి స్పూర్తి కలిగించారు .ఆమె నివశించిన పెంకు టిల్లు ను కూడా అందరికి చూపించారు
దుర్గా ప్రసాద్ డొక్కా సీతమ్మ గారి గురించి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయం, ప్రేరణ గా నిలిచిందని ఏ వసతులు లేని కాలం లో ఒక గృహిణి కుల మత విచాక్ణత లేకుండా ఎవరు ఏ సమయం లో వచ్చినా అన్నం వండి ఆప్యాయం గా పెట్టి సంతృప్తి పరచే వారని ,అ నాటి బ్రిటిష్ చక్ర వర్తి ఎడ్వర్డ్ జార్జి కలెక్టర్ ద్వారా ఆమె సేవలను తెలుసుకొని ఆమె కు ఒక సర్టిఫికేట్ ను ,బంగారు పతాకాన్ని ,ఆమె ఉంటున్న లంకల గన్నవరం గ్రామానికే పంపి కలెక్టర్ సమక్షం లో అందజేశారని ,ఈ దంపతులు తుప్పలు డొంకలు బాగు చేసి ఆ నాడే మామిడి, కొబ్బరి చెట్లు పెంచిఉద్యాన వన పెంపకానికి దోహదం చేసి ఈ నాటి కోనసీమ అందాలకు శ్రీకారం చుట్టారని ,మినుము ,పెసర వంటి పంటలు పండించారని ఎన్నో బావులు తవ్వించార’’ పేరూరు’’ లో ఆమె తవ్విన్చిన బావి ఇప్పటికి ఉందని ,ఎందరికో వివాహ ఉపనయ నాలకు ధన సాయం చేశారని భర్త జోగన్న గారు గొప్ప పశు వైద్యులని ,పశువులకాళ్లకు వచ్చ్చే‘’గాళ్ళు ‘’వ్యాధిని ఇంటింటికి తిరిగి నయం చేసే వారని ,ఈ వ్యాధి వల్ల పశువులు నీర సించి పోయేవని వాటిని తమ పచ్చిక బయళ్ళలో మేపించి బలం పుంజుకున్న తర్వాతా పంపించే ఉదారం పరోపకారం ఉన్న వారని ,పిఠాపురం మహా రాజు ఆమె ఆన్నదానాన్ని మెచ్చి ఒక అగ్రహారం రాసిస్తానంటే వద్దని వారిన్చారని ,సేవకు ప్రతి ఫలం ఆశిన్చారాదనే అభిప్రాయం ఆమెది అని చెప్పారు .ఈ ఆదర్శాన్ని సాధ్య మైనంత వరకు ప్రతి గృహిణి ఆచరించి అన్న పూర్ణ అని పించుకోవాలని కోరారు .బ్రిటిష్ రాజు విశాఖ కలెక్టర్ ద్వారా సీతమ్మ గారి ఫోటో తీయించి ఇంగ్లాండ్ తెప్పించుకోన్నారని తన పట్టాభి షేకం రోజున దర్బార్ హాల్ లో ఉంచి గౌరవించారని అన్నారు కాశీ లో అన్న పూర్ణ దేవాలయం లో సీతమ్మ గారి చిత్ర పటంఉందని చెప్పారు .వైనతేయ నది పై బ్రిడ్జిని నిర్మించి ఆమె పేరు పెట్టారని దీనికి ఆనాటి లోక సభ స్పీకర్ బాలయోగి కారణం అని ,అన్నారు
తర్వాత జిల్లెల్ల మూడి అమ్మ అలాగే అన్నదానానికి ప్రసిద్ధి చెందిందని సుమారు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఉయ్యూరు లో తమ మేన మామ గుండు గంగయ్య గారింట్లో ఇలాగే అన్న దానం జరిగేదని అది కూడా వేదం చదువు కొనే వారికే నని అర్ధ రాత్రి వచ్చినా మేన మామ భార్య మహా లక్ష్మమ్మ గారు వండి పెట్టెదని ,తమ ఇంట్లో కుల విచక్షణ లేకుండా తమ తండ్రి మృత్యుంజయ శాస్త్రి అమ్మ గారు భవానమ్మ లు భోజనం పెట్టె వారని కమ్మ బ్రాహ్మణులు గౌడ బ్రాహ్మణులు కూడా వచ్చి తినే వారని పాలిటెక్నిక్ విద్యార్ధులకు వారాలిచ్చే వారమని చెప్పారు అలాగే జిల్లా మేజిస్ట్రేట్ గా పని చేసిన వారణాసి సదా శివరావు గారింట్లోను కొల చాల శ్రీ రామ మూర్తి గారింట్లోను బ్రాహ్మణులకు ఎప్పుడొచ్చినా భోజనం పెట్టె వారని అదంతా ఆతిధ్యానికి వారు వేసిన పెద్ద పీట అని అన్నారు .ఇవాళ తిరుమల, శ్రీ శైలం, అన్నవరం,కాశీ,షిర్డీ దేవాలయాలలో ఉచితాన్న దానం జరగటం సీతమ్మ గారి స్పూర్తి అని ,పెదముత్తేవి గ్రామం లో కూడా ఇలానే ఎవరు ఏకులం వారోచ్చినా భోజనం పెడతారని వివరించారు
డాక్టర్ జయ ప్రద ఇలాంటి వారి పై ఈ విధ మైన కార్య క్రమం చేబట్టటం ఎంతో సంతోషం గా ఉందన్నారు విజయ లక్ష్మి ఇందులో విద్యార్ధులకు భాగస్వామ్యం కలిపించటం గొప్ప గా ఉందన్నారు నాగరాజు ఇలాంటి ప్రత్యెక కార్యక్రమాలను నిర్వాహించటం సరస భారతి ప్రత్యేకత అని తమను కూడా అందులో పాల్గోనేట్లు చేసినందుకు ధన్యా వాదాలని చెప్పారు
ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్ధులకు అమర వాణి హైస్కూల్ లో సీతమ్మ గారి పై వ్యాస రచన పోటీలు ,ఫ్లోరా స్కూల్ లో వక్తృత్వ పోటీలు వి.ఆర్.కే.ఏం స్కూల్ లో కవితల పోటీలు నిర్వహించి ఈ సభలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన వారికి బహుమతులంద జేశారు.అందరికి సరస భారతి ప్రచురించిన దుర్గా ప్రసాద్ రాసిన’’ సిద్ధ యోగి పుంగవులు’’ ‘’,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’రెండు పుస్తకాలు ,ఒక జ్ఞాపిక తో బాటు ప్రధమ బహుమతికి 120.ద్వితీయానికి 60 ,త్రుతీయానికి 30 రూపాయలు పారితోషికం గా సరసభారతి అంద జేసింది ‘
యాభై మందికి పైగా మహిళలు పురుషులు విద్యార్ధులు పాల్గొన్న సభ చాలా నిండుగా ఉత్తేజకరం గా సాగింది .విద్యార్ధులు తమ వ్యాసాలను వాక్త్రుత్వాన్ని కవితలను ఎంతో భావ గర్భితం గా తమదైన భాషలో చాలా స్పష్టం గా ఎంతో స్పూర్తి మంతం గా మాట్లాడి అందరి ప్రశంశలు పొందారు
చివరగా దుర్గా ప్రసాద్ డొక్కా సీతమ్మ గారి మనవడు శ్రీ డొక్కా రామ తీర్ధ రాసి ,మెయిల్ చేసిన ఆమె’’ స్మృతి పద్యాలు’’ చదివి విని పించారు .రాము గారు అమెరికా నుండి ఫోన్ చేసి ఈ కార్యక్రమం చేబట్టి నందుకు అభినందనలు తెలియ జేశారని ,సీతమ్మ గారి పేరఏదైనా స్కాలర్షిప్పులు అందజేయాలని ఉందని చెప్పారని చెప్పారు .’’ఈ విషయాన్ని సభలో ప్రకటిమచనా’’ అని అడగ గానే’’ సంతోషం గా ప్రకటించమని’’ చెప్పారాణి అన్నారు .దుర్గా ప్రసాద్ అక్కడకు వచ్చిన మూడు స్కూళ్ళ హెడ్ మాస్టర్లకు తమ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఈ సంవత్సరం విద్యార్ధులకు ప్రతిభ కలిగి ,బీద తనం లో ఉన్న వారిని ఒక్కొక్క స్కూల్ కు ఒకరి పేరు రికమెండ్ చేసి తమకు పంపితే శ్రీ రాము గారికి పంపిస్తానని తెలియ జేశారు .అందరు రాము గారికి హర్ష ధ్వానాలతో అభినందనలు తెలియ జేశారు ఈ కార్య క్రమం నిర్వహించటానికి బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు టి.వి.లో ఆమె ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ తరం విద్యార్ధులకు యువతకు ఉందని తెలియ జేయతమే నని సభా ముఖం గా కోటేశ్వర రావు గారికి ధన్య వాదాలు తెలిపారు
కార్య దర్శి శివలక్ష్మి పోటీలు నిర్వహించిన స్కూల్ ప్రదానో పాధ్యయులకు అపాల్గొన్న విద్యార్ధులకు ప్రోత్సహించిన తలి దండ్రులకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ వందన సమర్పణ చేశారు
బహుమతులు పొందిన వారి వివరాలు
వ్యాస రచన =అమరావాణి విద్యార్ధులు –మొదటి బహుమతి –వి.యెన్ వరలక్ష్మి
ద్వితీయ బహుమతి –ఏం జాన్ జ్ఞాన్ ప్రకాశ
తృతీయ ————-ఎస్.కే.జుబేర్
వక్తృత్వ పోటీలు –ఫ్లోరా స్కూల్ –మొదటి బహుమతి –టి సౌమ్య
రెండవ ————- ప్రభాత్
మూడవ ———మోహన
కవితల పోటీలు –వి.ఆర్.కే.ఏం స్కూల్ –మొదటి బహుమతి — ఏం జానకి
రెండవ ———–బి .గాయత్రి
మూడవ ———డి.వీరమ్మ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-13- ఉయ్యూరు