మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18
ఆల్ కిండీ
ఆల్ కిండీ అరబ్బులకు మొదటి దార్శనికుడు .జ్యోతిష్యం బాగా తెలిసిన వాడు .బాగ్దాద్ నగర కాలిఫ్ మామూన్ ఆస్థాన వైద్యుడు .పూర్తీ పేరు అబూ యూసఫ్ యాకూబ్ ఇషాక్ ఆల్ కిండీ .తండ్రి పాలిస్తున్న కూఫా నగరం లో జన్మించాడు .బాస్రా ,బాగ్దాద్ నగరాలలో విద్య నేర్చాడు .దర్శన ,విశ్వ ,ఖగోళ ,జ్యోతిష ,చాక్షుష గణిత వైద్య శాస్త్రాలపై270 గ్రంధాలు రాశాడు .మెటా నక్కీలు పాలించిన కాలం లో ఆయన గ్రంధాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకోందని తెలుస్తోంది .అందువల్ల 20 గ్రంధాలు మాత్రామే లభ్యమవుతున్నాయి సంఖ్యా శాస్త్రాన్ని ఆరబ్ క్రిస్టియన్ దర్శనాలలో ప్రవేశ పెట్టిన వాడు కిండీ తన కున్న గణిత వైద్య శాస్త్ర జ్ఞానం తో మందులకు పోటెన్సి ని కానీ పెట్టి ఉపయోగించాడు
అరిస్టాటిల్ గ్రంధాలను వ్యాఖ్యానం చేసిన వారిలో కిండీ ఒకడు .ఆరిస్టాటిల్ అను చరుడని దార్శనికు డని పేరొచ్చింది ఈయన పేరు ఆరబ్ దేశం లో మారు మొగి పోయింది . నవీన ప్లేటో సిద్ధాంతాల ,అరిస్టాటిల్ సిద్ధాంతాల మధ్య సమన్వం చేశాడు ఈశ్వరుని పరి శుద్ధ మైన నైతికత్వం ,నిర్వి శేష మైన యేకత్వాలను కిండీ పరిగనించాడు ఈశ్వరుని ప్రభావం మధ్య నున్న పదార్ధాల ద్వారా ప్రపంచం పై పడుతోంది అని చెప్పాడు డు ఈ పదార్దాలన్నిటి కంటే కింద ఉన్నది మాన వఆత్మ అని తేల్చాడు .అన్ని దర్శనాలను అధ్యయనం చేసి తనకు అనుకూలం గా ఉన్న వాటిని తీసుకొన్నాడు
మూల స్థానం నుండి ప్రపంచం అంతా వ్యాపించే దివ్య సత్యం యొక్క రూపాన్ని అన్ని చోట్లా కనుక్కొనే ప్రయత్నమే చేశాడు. కిండీ- గ్రీకులు చెప్పిన బుద్ధి (నౌస్ )కి కూడా ప్రాధాన్యత నిచ్చాడు .అన్ని ఆధ్యాత్మిక వస్తువులకు మొదటి స్థానం, స్వరూపమే ఈశ్వరుడు అని చెప్పాడు .ఖగోళం లో కనీ పించే దేవతలు బుద్ధి యొక్క రూపాలే .మానవాత్మ శక్తి అయిన బుద్ధియే .మానవాత్మ ప్రతి క్షణం తన ప్రయోజనం కోసం ప్రపంచం లో అవతరింప జేసే సహజ శక్తుల రూపమే .భావాల మధ్య అవసరమైన సంబంధాలను నిరూపించే ప్రవ్రుత్తి ఉన్నదే బుద్ధి ..అరిస్టాటిల్ అంగీకరించిన పదార్ధాల స్తానం బదులు ఆల్ కిండీ ద్రవ్యం ,ఆకారం ,చలనం ,కాలం అనే వాటిని ప్రవేశ పెట్టాడు కిండీ క్రీ శ 801లో జన్మించి72 వ ఏట 873లో మరణించి నట్లు తెలుస్తోంది కిందీ సిద్దాన్టలన్నీ ఆ తర్వాత కాలం లో ఆల్ ఫరాబీ సిద్ధాంతాలు కనుమరుగు చేశాయి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-13- ఉయ్యూరు