మరుగున పడిన మతాలు –మతా చార్యులు-20
కియోర్క్ గార్డ్
కియోర్క్ గార్డ్ క్రీ శ.1813 లో డేనిష్ లోని కోపెన్ హాగెన్ లో జన్మించాడు .తండ్రి వ్యవసాయ దారుడే కాక ఉన్ని వర్తకుడు కూడా .సమాజం లో పేరు పొందిన వాడు .కొడుకు ను తీవ్ర క్రమ శిక్షణ తో విద్య నేర్పించాడు ఒక రోజు తండ్రి కొడుకును పిలిచి జీవితం లో తాను అపరాధం చేశానని ,ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నానని కొడుకును అందుకే అంత తీవ్ర క్రమ శిక్షణ తో పెంచుతున్నానని మనసు విప్పి చెప్పాడు .అతను చేసిన తప్పేమిటో కొడుక్కు చెప్పలేదు .ఈ విషయం తెలిసిన కొడుక్కి తండ్రి పై ఉన్న గౌరవం అంతా పోయింది .తండ్రి చేసిన తప్పుకు తాను కూడా పాలు పంచుకొంటున్నానని విచా రించాడు వ్యాకుల మనస్సు తో చాలా కాలం ఉండి పోయాడు .
Signature | ![]() |
---|
కియోర్క్ గార్డ్- యూని వర్సిటీ లో చేరి చదువుతున్నా మనస్సు నిలప లేక పోయాడు 1838 లో తండ్రి మరణం తర్వాత కొంత ఊరట చెందాడు .మరో రెండేళ్లలో యూని వర్సిటి విద్య పూర్తీ చేశాడు సవ్యం గా సాగి పోతున్న జీవితం లో మరో ఉపద్రవం ఏర్పడింది ‘’.రేజీన్ ఆల్ సెస్’’అనే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకొంటానని మాట కూడా ఇచ్చేశాడు .కాని తను వివాహానికి అర్హుడిని కాదేమో నన్న సందేహం పీడించింది .పెళ్లి చేసుకొంటే ఆమె కు కూడా తన తప్పులో భాగస్వామిని అవుతుందని పుట్టబోయే సంతానానికి ఇది వర్తిస్తుందని భావించి ఇక పెళ్లి ప్రస్తావన వదిలేసి మత ధర్మ విద్య లో జీవించాలని నిర్ణ యించాడుఈయనను సోరెన్ కీర్క్ గార్డ్ అనీ అంటారు
పుస్త కాలు రాయటం ప్రారంభించాడు .ఒక్క ఏడాది లోనే అనేక గ్రంధాలు రాసేశాడు .అనేక గ్రంధాలు రాసిన రచయిత గా గుర్తింపు పొందాడు కాని మళ్ళీ తీవ్ర నిరాశకు లోనయ్యాడు ఒక డేనిష్ పత్రికా రచయిత చేసిన తీవ్ర విమర్శకు ఉత్తేజం పొంది ,అతని తో వాదానికి దిగాడు .సత్యాన్ని కాపాడటానికి తన ప్రాణాల నైనా త్యజించాలని నిశ్చయించుకొన్నాడు .ఈ సందర్భం గా కొన్ని విషయాలు చెప్పాడు .’’సత్యం ఎప్పుడు కొద్ది మంది పక్షానే ఉంటుంది అయినా మిగిలిన వారి కంటే బల వత్తరం గా ఉంటుంది .ఎక్కువ మందిది మిద్యా బలం . స్వతంత్రం గా ఆలోచించ లేని జనం ఈ మేజారీటి పక్షాన ఉంటారు ..
గార్డ్ రాసిన ‘’జీవిత పధ దశలు ‘’గ్రంధం లో సౌందర్యం ,నీతి ,మతం అనే మూడు దశలున్నాయని చెప్పాడు ఇవి ఒక దాని తర్వాతా ఒకటి పొందే దశలు కావు .ఒకే సమయం లో ఉండే మానసిక స్తితులే .ఒక్కో సారి వీటి మధ్య సంఘర్షణ జరగా వచ్చు .కియోర్క్ రచించిన ‘’కాని లేక ‘’పుస్తకం లో సౌందర్యం నీతి విషయాలను చర్చించాడు .సౌందర్య విషయిక జీవితం అంటే ఇంద్రియ తర్పణమే ..కాని నైతిక జీవిత విషయం లో మనిషి జీవిత భారాన్ని తనపైన వేసుకొంటాడు .నైతిక మార్గాన్ని కూడా దాటి మత మార్గం లో నడవాలి .’’భయం కంపం ‘’అనే గ్రంధం లో దేవుడి ఆజ్ఞ తో అబ్రహం తన కొడుకు ను బలి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించి భగ వంతుని ఆదేశమే చివరిదని దానిని అందరూ ఆచరించాలని తెలియ జేశాడు దేవుడి పై అచంచల విశ్వాసానికి అబ్రహాం గొప్ప ఉదాహరణ అని చెప్పాడు .
హెగెల్ చెప్పిన అభిప్రాయాలను గార్డ్ ఖండించాడు .ఈ విషయం లో తన కున్న అభిప్రాయాలను తెలియ జేయ టానికి మరో పుస్తాకం రాశాడు దీనికి‘’పర్యవసాన అవైజ్నిక అను బంధం ‘’అని పేరు పెట్టాడు .కష్టాలను ఎదిరించి జీవితాన్ని ఒక వ్యవస్థ గా చేసుకోవాలన్నాడు .వ్యక్తీ యొక్క స్వానుభావమే ‘’అస్తిత్వం ‘’అన్నాడు సత్య ద్రుష్టి ఉన్నవాడు పిచ్చి వాడి లా ప్రవర్తిస్తాడు .అతని మా టలెవారికి అర్ధం కావు .దేవుడేం చేస్తాడో మనిషికి తెలియదు .ధార్మిక విషయాల పై రాసిన దానిలో క్రైస్తవ నమ్మకాన్ని చర్చించాడు మత సత్యం ఎప్పుడూ దేవుని పై ఉన్న విశ్వాసం తో నే ఉంటుంది .ఇందులో ఆ త్మాను భవం ఉంటుంది .ఆత్మానుభవం అంటే నిత్యం తన నిర్ణయాలలో వ్యక్తం అయ్యే జీవిత అనుభవమే అన్నాడు,
మొదట్లో గార్డ్ ఉప దేశాలను ఎవ్వరూ లెక్క చెయ్య లేదు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, దార్శనిక పద్ధతులన్నీ నాశనం అయిన తర్వాత గార్డ్ సిద్ధాంతాల పై జనం ద్రుష్టి పడి విపరీతం గా వ్యాప్తి చెందాయి .ఇతని ‘’ఆంక్సై,టి ,డెసిషన్’’అంటే ఉత్కంఠ,నిశ్చయం మొదలైన ఆస్తిత్వ వాద సిద్ధాంతాలను’’ హై డేగ్గర్ ,యాస్పర్స్ ,మార్సెల్ ‘’మొదలైన దార్శనికులు తమ దర్శన శాస్త్రాలలో చొప్పించారు .అస్తిత్వ వాదానికి ఒక రకం గా ‘’కియోర్క్ గార్డ్ ఆద్యుడు ‘’అని పించుకొన్నాడు .ఇరవయ్యవ శతాబ్దపు దార్శనికుల పై పందొమ్మిద వ శాతాబ్దికి చెందిన కియోర్క్ గార్డ్ చూపినంత ప్రభావం ఏ దార్శనికుడు చూప లేక పోయాడు నిర్మాణం లో కొత్తదనాన్ని ,కొత్త దార్శనిక భావ ధోరణిని దర్శన శాస్త్రం లో ప్రవేశ పెట్టిన ఘనుడు కియోర్క్ గార్డ్ ..గార్డ్ తన నలభై రెండవయేట 1855 లో కీర్తి శేషుడయ్యాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-13 ఉయ్యూరు
.