మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21
ఆగస్ట్ కొంటే
క్రీ శ.1798 లో 28 జనవరి లో ఫ్రాన్సు దేశం లో మౌంట్ పీల్యాలో కొం ట్ ఆగస్ట్ పుట్టాడు .ఫ్రాన్స్ దేశపు దార్శనికుడు గా ప్రసిద్ధి చెందాడు .విద్యార్ధి గా ఉండగానే ఆ నాటి దర్శనీయ సిద్ధాంతాల ను తీవ్రం గా వ్యతి రేకించాడు 1818 లో సెయింట్ సిమాన్ తో పరిచయం కలిగింది .సీమాన్ ప్రభావం ఆగస్ట్ మీద పడింది .
పోర్టో ఆల్గెరి లో పాజిటి విస్ట్ దేవాలయం
అన్ని విషయాల లాగానే రాజ కీయ విషయాలను కూడా సూత్రీకరించ వచ్చు అనే అభిప్రాయం ఆయనది .దర్శన శాస్త్రాలన్నీ సమాజానికి సంబంధించి ఉండాలని చెప్పే వాడు .నైతిక ,మత ,రాజ కీయ విధానాలను పునర్వవస్తీక రించటమే దర్శనానికి ముఖ్య విషయం అని చెప్పాడు సీమాన్ చెప్పిన వన్నీ తన సిద్ధాంతాలలో పొందు పరచాడు కౌంట్ .1843 లో దేశం లో రాజకీయ ప్రాధాన్యం ఉన్న కాలం లో కౌంట్ ‘’ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్య సమాజం (పాజిటివిస్ట్ సొసైటీ) అనే దాన్ని నెల కోల్పాడు .శిష్యులు చాలా మంది ఏర్పడ్డారుఆయన రాసిన పుస్తకమే రెలిజియన్ ఆఫ్ హ్యుమానితి
ఈ యన వాదం ఆయన మొదట కనీ పెట్టిన ‘’త్రిదశా నియమం ‘’(the law of the three )తో ప్రారంభించాడు .మొదటి దశలో మానవుడు ప్రపంచాన్ని మత ద్రుష్టి తో చూడాలి రెండవ దశ లో అతి భౌతిక దృష్టితో వీక్షించాలి మూడవ దశలో ప్రత్యక్షా నుభవం దృష్టితో చూడాలని చెప్పాడు .మొదటి రెండు దశలలో మనిషి సంఘటనలకు కారణం ,వాటి స్వరూపాన్ని అన్వేషిస్తాడన్నాడు .మూడవ దశలో నియమాల తో సంతృప్తి చెందుతాడు అని వివ రించాడు .సమాజానికి కావలసిన వాటిని ఈ మూడవ దశలో చెప్పటం వలన శాస్త్రీయ దృక్పధాన్ని ,పర్య వేక్షణ ను ఇందులో చేర్చాడు .ప్రత్యక్ష జ్ఞానానికి ప్రాధాన్యత నిచ్చాడు కొంట్ .
మూడవ దశలో సామాజిక సంఘటనలను చేర్చటం వల్ల భౌతిక శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయింది .సమాజం లోని భూతాలు వాటి అర్ధాలు పరిస్తితుల మధ్య సంబంధాన్ని గురించి చెప్పేదే ‘’సామాజిక భౌతిక శాస్త్రం ‘’అంటే కొంట్ ఆగస్ట్ ను మొదటి సామాజిక భౌతిక శాస్త్ర వేత్త గా భావించ వచ్చు
1859 సెప్టెంబర్ 21 న మరణించాడు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-13 ఉయ్యూరు