శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ

శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ

నిన్న అంటే 27-9-13 శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయ వాడ హోటల్ ఐలా పురం లో ప్రపంచ తెలుగు మహా సభల రూప శిల్పి శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి 16 వ వర్ధంతి సభ జరిగింది .సభకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు కుమారి వడాలి లక్ష్మి శ్రావ్యం గా ఆల పించిన మా తెనుగు తల్లికి గీతం తో సభ ప్రారంభ మైంది .సుబ్బారావు అధ్యక్షోపన్యాసం  చేస్తూ ఈ నెల లో జరగాల్సి ఉన్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలను రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్తితుల దృష్ట్యా తప్పని సరిగా వాయిదా వేయాల్సి వచ్చిందని డిసెంబర్ లో జరిపే ప్రయత్నం లో ఉన్నామని తెలిపారు వీటికోసం మారిషస్ ,అమెరికాల నుండి తెలుగు ప్రముఖులు  కొంత మంది వచ్చారని వారి ఉత్సుకతకు కృతజ్ఞతగా మండలి వారి వర్ధంతి లో వారిని పాల్గోనేట్లు చేశామని ,ఆ సభలలలో మారిషస్ లో ఏర్పాటు చేయ బోయే ‘’ఆంధ్రా –మారిషస్ తెలుగు వార సత్వ కళా నికేతన్ ‘’ను లాంచనం గా  ప్రపంచ సభల వేదిక పై ఆవిష్కరించాలని అనుకోన్నామని సభల వాయిదా వల్ల ఈరోజు వేదిక పై దాన్ని వారు ప్రారంభప్రటన చేస్తారని చెప్పారు .ముఖ్య కార్య దర్శి డా.జి.వి.పూర్ణ చంద్ సభా నిర్వహణ చేశారు .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

‘’ జైతెలుగు తల్లి ‘’అని అందర్నీ ఆప్యాయం గా పలకరించిన మారిషస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ సంజీవ నర సింహ అప్పుడు సాంప్రదాయ వేష ధారణా తో నుదుట పొడవైన తిలకం తో ‘’స్టార్ అట్రాక్షన్ ‘’గా నిలిచారు .ఆయన ‘’నాలుగు వందల ఏళ్ళ క్రితం మారిషస్ ఏర్పడిందని మరీచి మహర్షి నివసించిన ప్రాంతం అవటం వల్ల  రామాయణం లో మారీచుని శ్రీ రాముడు బాణం తో కొడితే వాడొచ్చి ఈ ద్వీపం లో పడి తన శరీరం పడిన ప్రాంతం సంస్కృతీ విలసితం గా వర్ధిల్లాలని రాముడిని కోరుకోన్నాడని అందుకనే అతని పేరు మీద కూడా ఈ ద్వీపాన్ని పిలుస్తారని చెప్పారు .రెండు వందల ఏళ్ళ క్రితం ఆంద్ర దేశం లో అనేక ప్రాంతాల నుండి ముఖ్యం గా శ్రీ కాకుళం విజయనగరం విశాఖ పట్నం జిల్లాల నుండి తమ పూర్వీకులు మారిషస్ చెరుకు తోటలలో కూలీలుగా  పని చేయటానికి వలస వెళ్ళారని అక్కడే ఉండి పోయి తెలుగు భాషా సంస్కృతులను ఒంట బట్టించుకొని మరిచి పోకుండా కాపాడు కొంటుం=న్నామని తెలియ జేశారు .కాకినాడ దగ్గర ఉన్న ‘’కోరంగి‘’రేవు పట్నం నుండి ఆ నాడు తమ వారు ఓడల ద్వారా మారిషస్ చేరారని అందుకే తమల్ని ఆ దేశం లో ‘’కోరంగీలు ‘’అంటారని చెప్పారు .తమ కుటుంబాలలో అందరం తెలుగే మాట్లాడుతామని కట్టు బొట్టు అంతా తెలుగు వైభవమే నని ఇంతటి సంస్కృతిక వార సత్వానికి తాము వారసులం అయినందుకు గర్విస్తామని భావోద్వేగం తో అన్నారు సంక్రాంతి ,ఉగాది శ్రీ రామ నవమి ,పొట్టి శ్రీరాములు గారి జన్మ దినం ఆంద్ర రాష్ట్రావతర దినోత్సవాలను తమ మారిషస్ ప్రభుత్వం జాతీయ సెలవు దినాలుగా ప్రకటించి తమ కెంతో గౌరవం కలిగిస్తోందని కృతజ్ఞతా పూర్వకం గా తెలిపారు .తెలుగు పండుగలన్నిటిని శోభాయ మానం గా తామందరం  జరుపు కొంటా మన్నారు తమ దేశం లో ఒకటవ తరగతి నుండి విశ్వ విద్యాలయ కోర్సుల వరకు అంతా తెలుగు లోనే జరగటం తాము గర్వం గా చెప్పుకొంటామన్నారు .ఆ దేశం లో ‘’వరకట్నం ‘’అనే మాట లేదని హర్ష ధ్వానాల మధ్య తెలిపారు .ఈ దేశం వచ్చి నప్పుడల్లా  ఇక్కడి మట్టిని సేక రించి తీసుకొని వెళ్లి అక్కడ తమ ఇళ్ళల్లో పవిత్రం గా పూజా మందిరాలలో భద్ర పరచుకొంటామని ఆనందం తో తెలియ జేశారు .అక్కడ రేడియో లో తెలుగు కార్య క్రమాలు నిర్వహిస్తామని .మూడవ ప్రపంచ తెలుగు సభలను మారిషస్ లోనే నిర్వ హించిన ఘనత తమదని చెప్పారు .ఏకాదశి నాడు అఖండ  రామ నామ సంకీర్తనను రాత్రి ఆరు గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు వరకు చేస్తామని అందులో కేవలం భద్రాచల రామ దాసు కీర్తనలు మాత్రమె పాడుతామని అన్నారు /తమ వారసత్వాన్ని తెలియ జెప్ప టానికి ప్రముఖ సినీ దర్శకుడు ఆదిత్య దర్శ కత్వం లో ‘’కోరంగి టు మారిషస్ ‘’అనే సినిమా షూటింగ్ కోరంగి లో ఈ మధ్యనే తమ సమక్షం లో ప్రారంభ మైనదని ,చివరి సన్నీ వేశా లన్నీ మారిషస్ లో చిత్రీకరిస్తారని చప్పట్ల మధ్య తెలిపారు ‘’జై తెలుగు తల్లి ‘’తో ఉపన్యాసం ప్రారంభించి’’ జై తెలుగు తల్లి ‘’తో ముగించటం అప్పుడు గారి ప్రత్యేకత ఆ ప్రసంగం లో మచ్చుకైనా ఒక్క ఆంగ్ల పదం దొరల క పోవటం మరో గొప్ప విషయం అందరికి ఆదర్శం కూడా .ఈ సభా వేదిక మీద నుండి ‘’ఆంధ్రా –మారిషస్ తెలుగు వార సత్వ కళా నికేతన్ ‘’ను ప్రారంభిస్తున్నందుకు తమ కెంతో సంతోషం గా సంతృప్తికరం గా ఉందని హర్ష ధ్వానాల మధ్య ముగించారు .

అమెరికా కు చేరిన తోలి తరం తెలుగు వారిలో డాక్టర్ యెన్ రాఘ వెంద్ర ప్రసాద్ తమ ప్రసంగం లో తాము అమెరికా కు చేతిలో ఎనిమిది డాలర్ల తో నలభై ఏళ్ళ క్రితం చేరారామని  కాకర్ల సుబ్బారావు రక్త విరోచనాలకు మందు కానీ పెట్టినడాక్టర్  యల్లా ప్రగడ సుబ్బారావు వంటి వారందరూ కలిసి తానా సభలను ప్రారంభించామని అది ఈ నాడు ఏంతో  అభి వృద్ధి చెందిందని తాను దాని అధ్యక్షుడి గా పని చేశానని చెప్పారు .అమెరికా లో ఉన్న మంచిని సమయ పాలన క్రమశిక్షణ వంటివి ఇక్కడి వారు నేర్వాలని సూచించారు అక్కడి ఎన్నికల విధానం లో ధన ప్రభావం లేదని పాలసీల మధ్య పోరాటం చర్చలలో ప్రసంగాల తో ప్రచారం జరుగుతుందని ఇక్కడి విధానాన్ని చూస్తె తమకు సిగ్గుగా ఉందని చెప్పారు ఇప్పుడు అమెరికా అంతా భారతీయులు విస్తరించారని కొన్నేళ్లలో అమెరికా అధ్యక్షుడు గా ఒక భారతీయుడు ఎన్నిక అయ్యే శుభ దినాలు రానున్నాయని ఆయన ఏంతో సంతోషం గా చెప్పగా హర్ష ధ్వానాలు మిన్నంటాయి .తామక్కడ భాషా సంస్కృతులను చక్కగా కాపాడుకొంటున్నామని తమ వారసులు కూడా అదే దారి లో ఉండటం తమకు గర్వం అనీ చెప్పారు కాని దీనికి భిన్నం గా ఇండియా ఉండటం బాధా కరం అన్నారు .ఆంద్ర దేశం లో సారా వల్ల  ప్రభుత్వానికి వచ్చే పది వేల కోట్లే నని ఇక్కడి అద్భుత మైన టూరిస్ట్ ప్రదేశాలున్నాయని వాటిని అభి వృద్ధి చేస్తే లక్ష కోట్ల ఆదాయం వస్తుందని దీని పై ఎందుకు శ్రద్ధ చూపటం లేదో తమకు ఆశ్చర్యం గా ఉందని బాధ పడ్డారు .’’ఇండియా ఇన్ 2020 ‘’అనే పుస్తకాన్ని తానూ రాస్తున్నాని దాని లో ఎలాంటి భారత్ యేర్పడ బోతోందో తెలియ జేస్స్తున్నానని అన్నారు .

శ్రీ యెన్ .తులసి రెడ్డి తెలుగు వైభవాన్ని అనర్గళం గా చెప్పారు శ్రీ ఐలా పురం వెంకయ్య మండలి కృష్ణా రావు గారు చేసిన కార్య క్రమాలను ప్రస్తుతించారు .

 

సిలికానాంధ్ర వ్యవస్తాపక అధ్యక్షుడు శ్రీ కూచి భొట్ల ఆనంద్ సాంప్రదాయ వేష ధారణా లో అందరిని ఆకర్షించారు  తన ప్రసంగం లోకాలి ఫోర్నియా లో ‘’అంతర్జాతీయ లలిత  కళా విశ్వ విద్యాలయం ‘’ను జూన్ లో ప్రారంభించామని వచ్చే జూలై లో తెలుగు ,కూచి పూడి,  చిత్ర కళ  కోర్సుల లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యనూ  ప్రారంభిస్తున్నామని  హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు దీనికి ఇక్కడి అందరి ఆశీర్వాదాలు తాము కోరుటున్నామని చెప్పారు

చివరగా శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ ఈ నాటి ఆంద్ర దేశ సంక్షోభం పై గొప్ప స్పందన కలిగించే ఉపన్యాసం ఇచ్చి అందర్నీ అలరించారు చెన్నా రెడ్డి ప్రత్యెక తెలంగాణా గురించి తీవ్ర ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధి ఒక రోజు అర్ధ రాత్రి  విమానం లో ఎవరికి తెలియ కుండా హైదరా బాద్ విమానాశ్రయానికి చేరి ఆ నాటి హోమ్ మినిస్టర్ జలగం వెంగల రావు ను పిలి పించి అర్జంట్ గా చెన్నా రెడ్డి ని ఇక్కడికి వచ్చేట్లు చేయ మని చెప్పిందని ఆయన వెంటనే రెడ్డిని ఆమె యెదుట నిల బెట్టాడని అప్పుడు ఇందిర ‘’రెడ్డీ !భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్ర దేశం ఏర్పడి ఆంద్ర ప్రదేశ గ అభి వృద్ధి చెందింది దీన్ని చీల్చటా నికి కాదు మా నాన్న ఇచ్చింది కలిసి ఉండటానికే . నీవేషాలు సాగవ్ ‘’అని తీవ్ర స్వరం తో అయిదేఅయిదు నిమిషాలు మాట్లాడి పంపించిందని చెప్పారు .అలాగే నరసింహా రావు ముఖ్య మంత్రిగా ఉండగా ప్రత్యేకాంధ్ర ఉద్యమం వస్తే పేద చెవిని పెట్టి సమిక్యాన్ధ్రను కాపాడింది ఇందిరా అని ఆనాడు మండలి కృష్ణా రావు భాట్టం శ్రీ రామ మూర్తి గారాలే సమిక్యానికి కట్టు బడిన వారని తెలిపారు హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి సంజీవ రెడ్డి అన్ని పదవులు అనుభ వించి రిటైర్ అయి అనంత పురం లో ఉంటె విభజన ఉద్య మాల గురించి స్పందించమని అడిగితే కాఫీ ని సాసర్ లో పోసుకొని తాగుతామని అది ఒక వేళ ప్రమాద వశాత్తు జారి పడితే ఎన్ని ముక్క ముక్క లవుతుందో చెప్పలేమని అలాగే రాష్ట్ర విభజన కూడా  నని చెప్పారని  శర్మ గారన్నారు అలాగే ఏదీ శీలా శాసనం కాదన్నారు ప్రకాశం గారు  ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క విశాఖ లోనే విశ్వా విద్యాలయం ఉండేదని రెండోది ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించి తిరుపతి లో ఉపముఖ్య మంత్రి తో  సమావెశం ఏర్పాటు చేయించి ఆనాటి తిరు మల తిరు పతి  దేవ స్తానం పాలనా దికారి శ్రీ చెలికాని అన్నా రావు ని పిలిపించి దేవస్తానం సొమ్ములో మూడు కోట్లు తిరుపతి లో విశ్వ విద్యాలయానికి మళ్ళించే  తీర్మానం చేయ మని చెప్పారని ఆయన ఒప్పుకోలేదని రూల్స్ లేవని అంటే ‘’ఎరా ! రూల్స్ వేంకటేశ్వరుడు రాశాడా ?మనం రాసుకోన్నాం ప్రాజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత దేవాలయాల పై ఉంది అవి శీలా శాసనాలు కావు ‘’అని చెప్పి తానూ డిక్టేట్ చేసి చెప్పి తీర్మానం రాయించి తిరుపతి లో ఆ మూడు కోట్ల తో శ్రీ వెంకటేశ్వ ర విశ్వ విద్యాలయాన్ని  ఏర్పాటు చేశారని తెలియ జేశారు. కనుక ప్రజా వాక్యం  ముందు ఏదీ నిలువ లేదని ఇవాళ ఢిల్లీ పెద్దలు ఏక వాక్య తీర్మానం, శిలా శాసనం అని గగ్గోలు పెడుతున్నారని ఇది విజ్ఞత త కాదని ఆంద్ర రాష్ట్రం సమైక్యం గా ఉండాలని మారు మోగే చప్పట్ల మధ్య తమ ప్రసంగాన్ని ముగించారు శర్మ గారు .అప్పుడు గారి తర్వాతా మరొక స్టార్ స్పీకర్ అయ్యారు శర్మాజీ .

కృష్ణా జిల్లాN.r.i.అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరాం అమెరికా లో కృష్ణా జిల్లా ఫోరం ఏర్పాటు చేశామని  , మండలి  వారి పురస్కారాన్ని అంద జేస్తున్నామని తెలిపారు .గుత్తికొండ- ఇక్కడ తాము ప్రతి ఏడాది ఆ పురస్కారంసంఘం తరఫున పది వేల రూ పాయలుగా ఇస్తున్నామన్నారు అప్పుడు దివికుమార్ గారు తాను ఒక పది వేలు ఇస్తానని వాగ్దానం చేయగా శ్రీ రాం గారు ముప్ఫై వేలు ఇస్తామన్నారు మొత్తం ఆ పురస్కారం క్రింద యాభై వేల రూపాయలు ఇచ్చే అవకాశం కలిగింది  అందరు కృతజ్ఞతలను ఆ దాతలకు తెలియ జేశారు

వక్త లందరూ శ్రీ మండలి కృష్ణా రావు గారి సేవా నిరతిని ప్రస్తుతించారు వారికి వారసులు గా నిలిచిన శ్రీ బుద్ధ ప్రసాద్ ను అభి నందించారు

అతిదులందరికి ఐలాపురం వెంకయ్య గారు దుశ్శాలువ తో సత్కరించగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురించిన తెలుగు పున్నమి పుస్తకాలను కానుకగా అందించారు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-13 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.