మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26
హెగెల్
జార్జి విలియం ఫ్రెడరిక్ హెగెల్ 1770 లో ఆగస్ట్ ఇరవై ఏడు న జర్మని లోని స్తుడ్ గార్ట్ నగరం లో జన్మించాడు మిత్రుడు షెర్లింగ్ ,కవి హోల్దర్లిస్ ళ తో కలిసి ఈశ్వర మీమాంస శాస్త్రాధ్యయనం చేశాడు .ముగ్గురికి స్వేచ్చ అంటే మహా ఇష్టం .అదే వీరిని కలిపింది .గ్రీక్ సాంప్రదాయాన్ని అమితం గా వీళ్ళు ప్రేమించారు ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ కల్గించారు .
హెగెల్ కొంత కాలం ఒక సామంతుని ఇంట్లో ట్యూటర్ గా పని చేశాడు .తర్వాత ఒక వార్తాపత్రికకు సంపాదకుదయ్యాడు .తన విద్యా వ్యాసంగాన్ని ‘’యీనా‘’లో మొదలు పెట్టాడు .హైడల్ బర్గ్ లో కొద్ది కాలం లెక్చరర్ గా పని చేశాడు .తరువాత బెర్లిన్ విశ్వ విద్యాలయానికి ఆహ్వానం పొంది చని పోయే వరకు అక్కడే అధ్యాపక జీవితాన్ని గడిపాడు .1831 లో కలరా వ్యాధి సోకి మరణించాడు .
హెగెల్ జీవించి ఉండగానే ఆయన కీర్తి జర్మనీ దాటి వ్యాపించి పోయింది .క్లిష్టమైన భాష లో రాసే వాడు .దానితో అతని రచన ల పై వ్యతిరేక వ్యాఖ్యానాలోచ్చాయి .భావ కా ఠిన్యానికి ప్రసిద్ధి చెందిన వాడు హెగెల్ .తనను ఒక్కడే అర్ధం చేసుకోన్నాడని అతను కూడా అపార్ధం చేస్సుకోన్నాడని వాపోయాడు .హెగెల్ మరణానంతరం అతని ఉపన్యాసాలను మిత్రులు స్నేహితులు కలిసి గ్రంధస్తం చేశారు .
దార్శనిక వ్యవస్థా నిర్మాతగా హెగెల్ ప్రాచుర్యం పొందాడు .సాక్షాత్కార ప్రాబోదాన్ని అంగీకరించ లేదు .అపరోక్ష జ్ఞానానికి పూర్తీ వ్యతిరేకి .జాకోబి వ్యాప్తి చేసిన శ్రద్ధ అనే ఆదర్శాన్ని కూడా హెగెల్ ఒప్పుకోలేదు .జ్ఞానం యొక్క మహత్వం లో అపార నమ్మకం ఉన్న్న వాడు హెగెల్ .జ్ఞానం కంటే గోప్పదనేది లేదు అని బాగా విశ్వాసం గా ఉన్నాడు
షెర్లింగ్ చెప్పిన కేవల ఉదాసీనత భావంమీద కాని ,స్పినోజా చెప్పిన తటస్థ మూల ద్రవ్య భావం మీద కానిసత్యం యొక్క ఆవిష్కరణ జరగదని అన్నాడు .సత్యమే జ్ఞాత అంటే తెలుసుకో దగినది .జ్ఞానం కేవలం భావాత్మకం .సత్య భావం సత్యానికి పరకీయం కాదన్నాడు .సత్య సాధనకు ఇది బాహ్య సాధనం మాత్రం కాదు .. ఏ విషయం లో సత్యం తనను తాను వ్యక్తం చేసుకొంటుందో ఆ విషయమే భావం అన్నాడు .చైతన్య ము ,వాద తార్కిక పధం లో (దలలిక్తికల్లి ),భావాల విధి నిషేధ ప్రక్రియ ద్వారా తనను తానూ అభి వ్యక్తం చేసుకొంటుంది .భావాలు ఆలోచన యొక్క పదార్దాలే ,కాకుండా ,సత్యం యొక్క పదార్ధం కూడా అదే .
ఈ దృష్టిలో తర్క శాస్త్రం అతి భౌతిక శాస్త్రం రెండు ఒకటే. భావాలు వాద తార్కిక గతి లో స్తిర స్తానాలు కావు సత్యాన్ని తెలుసు కోవటానికి కొన్ని పరిస్తితులలో జ్ఞానానికి సాధ్యం .సంఘర్షణ ,విరుద్ధత అనేవి సత్య స్వభావం లోనే ఉన్నాయి ప్రతిజ్ఞా(ధీసిస్ ) ,ప్రతి ప్రతిజ్ఞా(యాంటి ధీసిస్ ) తో వ్యతిరేకించాడు .అందులోని వ్యతి రేకామ్శాన్ని తన లో ఇముడ్చు కొంటుంది .జ్ఞానం కేవలం పరోక్షం .భావాత్మకం జ్ఞాన రూప మైన దర్శన శాస్త్రం అన్నిటి కంటే ఉత్కృష్ట మైంది .మతం క,ళ జ్ఞానం యొక్క కింది దశలు మాత్రమె .దర్శనం ఉపాధి రాహిత సంగ్రాన్ని ఇస్తుంది .హేతు బద్ధమైన దంతా సత్యమే .చైతన్యం యొక్క ఆత్మా వికాసమే ప్రతిజ్ఞా ,ప్రతి ప్రతిజ్ఞా ,సంయోజనం అనే మూడు దశల ద్వారా జరిగి సర్వ సామాన్యసర్వ శూన్య అనే తర్కానికి ఆధారం .
విషయ ,విషయి రూపం లో రూపం లో ఉన్న చైతన్యానికి కేవల చైతన్యానికి గల భేదాన్ని హెగెల్ పూర్తిగా ఆవిష్కరించాడు .దేశం వ్యక్తీ సృష్టి కాదు విషయ చైతన్యం యొక్క స్వతంత్ర మూర్త రూపం .చైతన్య వికాసచివరి దశ కాదు చైతన్య వికాసం లో కల మతం ,విజ్ఞాన శాస్త్రం అనే తరువాతి దశలున్నాయి .రాష్ట్రం అనేది జాతీయ చైతన్యావతారం మాత్రమె .రాష్ట్ర స్తాపన తో ప్రపంచ చరిత్ర ప్రారంభిస్తుంది .చరిత్ర లో జాతులు కొంత కాలం ఉంది వాటి ప్రయోజనం పూర్తికాగానే శాశ్వతం గా అదృశ్య మవుతాయి .చరిత్ర లో పునరుక్తి లేదన్నాదాన్నాడు హెగెల్ .
హెగెల్ దర్శన శాస్త్రం లో మూడు మౌలిక శిక్ణలున్నాయి .సత్యం స్వరూపం భావం మూడు తర్క శాసత్రానికి చర్చా విషయాలు .విషయి లేక వ్యక్తీ చైతన్యం రెండవది శాసనం .నీటి ,రాష్ట్రం చరిత్ర వీటిలో చెప్ప బడిన సత్యం మూడవది కళ లో వ్యక్తమయ్యే అంతస్స్పురణం .ఉండవలసిన దానికి ఉన్న దానికి మధ్య అయన దర్శనానికి ఘర్షణ లేదు .నిజానికి దూరమైన ఆదర్శం విషాదం అన్నాడు .హెగెల్ చెప్పిన దాన్ని కొందరు భౌతిక వాద వ్యాఖ్యాన్ని కల్పించారు .కొంత మంది ఈశ్వర వాదం వైపు మళ్ళించారు 1831 నవంబర్ పద్నాలుగు న71 ఏళ్ళు జీవించి మరణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-13 ఉ-ఉయ్యూరు