మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

షోపెన్ హార్

జర్మని కి చెందిన షోఫెన్  హార్ డాన్జింగ్ నగరం లో 1788 లో ఫిబ్రవరి 22న జన్మించాడు .ధనిక కుటుంబానికి చెందిన ఈయన తల్లి సాహిత్య కళా రంగాలలో మంచి ఖ్యాతి పొందింది .తండ్రి చేసే వ్యాపారం లో కొంత కాలం పని చేశాడు నచ్చలేదు .1809 లో గోటేన్ నగరం చేరాడు ..అక్కడి విశ్వ విద్యాలయం లో వైద్య శాస్త్రం లో చేరాడు .

 

 

Schopenhauer.jpg

Arthur Schopenhauer Signature.svg

‘’పర్యాప్తతత్త్వం యొక్క నాలుగు మూలాలు ‘’అనే బృహత్ గ్రంధాన్ని రాసి జేనా విశ్వ విద్యాలయం నుంచి 1813 లో డాక్టరేట్ బిరుదు పొందాడు  డ్రెస్ డెన్ లో ప్రధాన గ్రంధమైన’’ భావ ,సంకల్ప రూపాలలో ప్రపంచం ‘’1878 లో రచించాడు .బెర్లిన్ విశ్వ విద్యాలయం లో  లెక్చరర్  అయ్యాడు .అప్పటికే ప్రఖ్యాతులైన హెగెల్ మొదలైన వారి‘’భావ వాదం ‘’పై తీవ్ర విమర్శలు చేశాడు హార్ .తన మనసులోని భావ ధారను ఉపన్యాసాలుగా వెలువరించాడు .అయితే మంచి ఉపన్యాసకుడి గా గుర్తింపు పొందలేక పోయాడు ..వినే వాళ్ళే కరువై పోయారు .కోపం వచ్చి ఈ ఉపన్యాస పరం పరకు స్వస్తి చెప్పాడు .1831 లో బెర్లిన్ లో కలరా తీవ్రం గా విజ్రుమ్భించిన కాలం లో అందరు నగరాన్ని వదిలి పెట్టి వెళ్లి పోతే ,షో పెన్  హార్ మాత్రం ఒక్కడే ఏకాకి గా బెర్లిన్ లో ఉండి  పోయాడు .1860 సెప్టెంబర్ 21న డెబ్భై రెండేళ్లకు మరణించాడు రిచార్డ్ వాగ్నర్ ,ఎడ్విన్ స్కోరింజేర్ ,ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,టాల్ స్టాయ్ ,ఫ్రాయిడ్ ,ముస్తఫా మొహమ్మద్ మొదలైన వారి పై హార ప్రభావం అధికం .వేదాల,ఉపనిషత్తుల  సారాన్ని బాగా గ్రహించాడు హార్.వేద ,ఉపనిషత్తుల పై  ఆయన శ్రేష్ట  అభిప్రాయాన్ని కింద చూడండి

If the reader has also received the benefit of the Vedas, the access to which by means of the Upanishads is in my eyes the greatest privilege which this still young century (1818) may claim before all previous centuries, if then the reader, I say, has received his initiation in primeval Indian wisdom, and received it with an open heart, he will be prepared in the very best way for hearing what I have to tell him. It will not sound to him strange, as to many others, much less disagreeable; for I might, if it did not sound conceited, contend that every one of the detached statements which constitute the Upanishads, may be deduced as a necessary result from the fundamental thoughts which I have to enunciate, though those deductions themselves are by no means to be found there.[90]

He summarised the influence of the Upanishads thus: “It has been the solace of my life, it will be the solace of my death!”

హార్ దర్శికుడే కాక కళా మర్మజ్ఞుడు కూడా .ఈయన దర్శన సిద్ధాంతాల మీద ప్లేటో కాంట్ లప్రభావం ఎక్కువ .ప్లేటో చెప్పిన ‘’రియాలిటి అండ్ అపియరెన్స్ ‘’సిద్ధాంతాన్ని కాంట్ ఒప్పుకొని వృద్ధి చేస్తే హాపర్ కూడా సమర్ధించాడు .హార్ దృష్టిలో దర్శన శాస్త్రానికి ,విజ్ఞాన శాస్త్రానికి ,శాస్త్రానికి ,కళ  కు బుద్ధికి ,సంకల్పానికి మధ్య భేదం ఉంది .బుద్ధి కంటే సంకల్పం గొప్పది మూలమైనది,ప్రధానమైంది . ..అన్నాడు షో షేన్.బుద్ధి హేతు  ద్వారాకనిపించే  ప్రపంచాన్ని నిర్మించుకొంటున్నది  కాని దాని వెనుక ఉన్న సత్యం యొక్క జ్ఞానాన్ని కలిగించదు .ఆంతరంగిక జ్ఞానం ద్వారానే సత్య జ్ఞానం లభిస్తుంది .అలాంటి లోపలి జ్ఞానం తోనే బుద్ధికి, కాలానికి, ప్రయోజనం  లేని సంకల్పం గోచరిస్తుంది .

విషయ జ్ఞానం మీదే ప్రపంచం ఆధార పడి ఉందని, జ్ఞాన భావమే ప్రపంచ భావం అన్న భావ వాదాన్ని హార్ అంగీక రించాడు ..అయితే విషయి లోని భావాలన్నిటికీ సంకల్పమే ఆధారం అన్నాడు .ఈ సంకల్పమే వ్యక్తిలో ,విశ్వం లో, జడం లో, చైతన్యం లో వివిధ దశలలలో తనను తాను ఆవిష్కరించు కొంతుటుంది అన్నాడు .ఈ సంకల్పం సంగీతం లాంటి కళల లో కూడా ఆవిష్క్రార మవుతుంది  అన్నాడు .సంకల్పం వివేక రహిత మైనది .బుద్ధి దీనికి బానిస అన్నాడు హాపర్ .

శాస్త్రం వస్తువు యొక్క ఉపాధి ని మాత్రమె తెలియ జేస్తుంది .కాని దాని యదార్ధ స్వరూపాన్ని చెప్ప లేదు అలాంటి వస్తు యదార్ధ స్వరూపం శాస్త్రానికి అందదు  కళలు మాత్రమె వ్యక్తం చేస్తాయి .విజ్ఞానం  అంటే తార్కిక ప్రక్రియ ..సాధన వల్ల  దీన్ని గ్రహించ వచ్చు .దార్శనిక సత్యాన్ని తన లాంటి మేధావులు మాత్రమె గ్రహించ గలరు అన్నాడు .అలాంటి సత్య గ్రహణానికి మూలం వ్యక్తీ లో ఉండే దార్శనిక శక్తి అని హార్ అభిప్రాయ పడ్డాడు .

సంకల్పం అనే భావనలో అన్ని కోరికలు ,ప్రయత్నాలు ,ప్రేరణలు ,పరిణామ ప్రవృత్తులు ఉన్నాయి .వీటి వైరుధ్యం వల్లనే అసంతృప్తి, బాధ కలుగుతాయి .మానవ జీవితం బాధా మయం అంటాడు షో షెన్..అందుకని హార్ ను ‘’నిరాశా వాది ‘’అన్నారు సుఖం అనేది వ్యతి రేక భావమే .మన బాధలకు, కోరికలకు అది తాత్కాలిక ఉపశమనమే .సంకల్పం హేతు రహిత మైంది. దాని వల్ల  వచ్చే సంఘర్షణ కూడా నిత్య మైనది ఇలాంటి సంకల్పానికి పర్య వసానం నిరాశే అంటాడు .మనం చూసేదంతా నిరుపయోగం అనే భావన వస్తే అదేవిముక్తి మార్గం చూపిస్తుంది .కోరికలను అణచుకొంటే కాని శాంతి రాదు. .కాలాను భూతి లో సంకల్పం నిషేధించ బడుతుంది .దీని వల్ల  కోరికలూ ఉండవు .కాని లభించే ఉపశాంతి మాత్రం తాత్కాలికం గానే ఉంటుంది అన్నాడు షో ఫెన్ హార్ .

సంకల్ప విమోచనం నీతి ద్వారానే సాధ్యం .ఒకే ఒక్క పరమార్ధమైన సంకల్పం యొక్క రూపాలైన వ్యక్తులు పరస్పరం భిన్నాలు కారు .దీని కంటే గొప్పది సంకల్పాన్ని నిషేధించట మే .సంకల్పాన్ని నిషేధిస్తే బాధ ఉండదు .ఏ మతం ప్రతి పాదించినా ఇదే నంటాడు .

దేశం, కాలం, కారణాలు భ్రాంతి మాత్రమె .అందుకని మానవ ప్రయత్నం వృధా .పురోగతి ఉండదు అన్నాడు హార్ .అహంకారమే రాజ వ్యవస్థకు కారణం .పేదరికం ,బానిసత్వం నిరుద్యోగం ,యుద్ధాలు కొద్ది మంది భో గాన్ని అనుభ వించటం వల్లనే వస్తున్నాయన్న రాజ కీయ మర్మజ్ఞుడు హాపర్. .కాని ఈ భోగమే లేక పోతే సంస్కృతీ ,మానవ వికాసం ఉండవు అనీ చెప్పాడు .ఎక్కువ మంది ప్రజలు బుద్ధి హీనులు ..వీరిని  బుద్ధి మంతులైన వారు నాయకులై ముందుకు నడిపించాలి .స్త్రీలు బుద్ధిలోను  ,నైతికం గాను మగ వారి కంటే తక్కువ వారు అన్నాడు షో ఫెన్ హార్

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-13 ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.