శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -2

  శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -2

శ్రీ తత్త్వం విశ్వ మంతా వ్యాపించి ఉంది .ప్రతి మనిషి లలాటం లో శ్రీ తత్వాన్ని చూడ వచ్చు ‘’లోకానతేత్య లాలతే ,లలితా తేన సోచ్యతే ‘’అంటే అమ్మ వారికి లలిత అన్న పేరు ఆమె లోకానికి అతీత యై లోక లీలను లాలిస్తుంది .కనుక ప్రతి వ్యక్తీ లలాటం అ లీల దామమే .కావలసింది దాని పై ధ్యాస  మననం అవగాహనా మాత్రమె .దీనికే ఈ లలితా  సహస్ర నామాలు సాధనాలు అవుతాయి .అది పఠిస్తుంటే శ్రీ తత్త్వం బోధ పడుతుంది .ఉపాసకులు శ్రీ చక్ర పూజ చేస్తారు .ఇదొక విశిష్టమైన యంత్రం .ఇందులో బిందు ,త్రికోణ ,వలయ రేఖ ,దళాల వంటి చిహ్నాలుంటాయి ఇవి ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్టితి లయాలకు ప్రతీకలు .ఈ లక్షణాలన్ని మానవ శరీరం లోనే ఉన్నాయని మనం మర్చి పోతూంటాము .శరీరమే శ్రీ చక్రానికి ప్రతి రూపం అని తెలియాలి .ఇందులోని తొమ్మిది ఆవరణలే మన నవ రంధ్రాలు .అందులోని ఆనంద మయ బిందువే లలాటం మీద ఉన్న సహస్రార చక్రం .ఇదే అమ్మ వారి పవిత్ర నివాసం .శ్రీ చక్రం మన పుట్టుక తోనే వచ్చే పరమాత్మ సాధనం .

శ్రీ విద్య శ్రీ మాతను ప్రసన్నం చేయటానికి దోహద పడుతుంది .లలితా సహస్రనామ పఠనం ఈ మంత్రం ఫలాన్నిస్తుంది .దేవి కృప అంతర్ముఖమైన వారికే లభిస్తుందని మరువ రాదు .అంటే భావన చాలా ముఖ్యం అందుకే ‘’అంతర్ముఖ సమారాధ్యా –బహిర్ముఖ సుదుర్లభా ‘’అన్నారు భవానీ భావనా గమ్యా అనటం భావనే ముఖ్యమని .భావన అంతర్ముఖం అయితే పిండాండం లో బ్రహ్మాండ దర్శనం లభిస్తుంది .ఇదే శ్రీ దేవి ఆరాధనా పరమ లక్ష్యం .దీని శ్రీ సహస్రిక అమోఘమైన సాధనం .

శాస్త్ర దృష్టిలో చూసినా పదార్ధం శక్తి వీటి ప్రతి క్రియ వల్లనే ప్రపంచ సృష్టి జరుగుతుంది .ఈ రెంటికీ భేదం లేదు .ఆదార్ధం శక్తిగా శక్తి పదార్ధం గా మారుతుంది .శక్తి స్తూల రూపం పదార్ధం .ఈ పరార్ధమే పరమ శివుడు .శక్తియే పరమేశ్వరి .శివుడికి, శివానికి భేదం లేదు .ఒకే తత్వానికి వారిద్దరూ రెండు రూపాలని గ్రాహించాలి .శక్తి దేశాకాల ను బట్టి వివిధ రూపాలు ధరిస్తుంది ‘’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా –సాసా సర్వేశ్వరీ దేవీ శక్తిమంతో మహేశ్వరః ‘’

భండాసురుడిని సంహరించింది శ్రీ దేవి .భండాసురుడు అంటే జడత్వం అంటే బద్ధకానికి ప్రతీక .మనిషి హి స్వభావ సిద్ధం గా విశ్రాంతి కోరుకొంటాడు అవసరం వచ్చే దాకా రాయిలా ఉండి పోతాడు .లేక పోతే  యేపనీ లేకుండా దేశ ద్రిమ్మరి లా తిరుగు తాడు .న్యూటన్ జడత్వ సిద్ధాంతం కూడా దీన్ని సమర్ధించింది జడత్వం నశించే వరకు మనిషి తన లో ఉన్న శక్తిని గుర్తించలేదుఈ శక్తినే మనం శ్రీ దేవి అంటున్నాం .అందుకే ఆమె భండాసుర సంహారం చేసి తృప్తి చెందింది ..లోపల చైతన్యాన్ని   ఒక సారి మేలు కొలిపితే సాధనా మార్గం తేలికవుతుంది .అమ్మ మన చెయ్యి పట్టుకొని ఆనంద పరమా వదికి చేరుస్తుంది .

లలితా సహస్ర నామాలలో మొదటి పంక్తి ‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీ శ్రీ మాట్చిమ్హాసనే శ్వరి ‘’,చిట్ట చివరిది ‘’శ్రీ శివా శివ శాక్త్యైక్య రూపిణీ లలితాంబికా ‘మొదటి మాటలలో శ్రీ మాత గా ,మహా రాణి గా ,ఈశ్వరి గా కనీ పించే   పరమేశ్వరి చివరికి పరమ శివుని తో తాదాత్మ్యం చెంది జగదంబిక ,లలిత రూపం గా దర్శన మిస్తుంది ఇదీ వరుస క్రమం .ఒక్కొక్క సారి మహా లావణ్య నిధి రూపం లో ,ఆరో చోట పరమేశ్వరి ప్రతాప ,పరాక్రమాలు ప్రాణులకు ప్రేరణ నిస్తాయి .ఒక చోట ఆత్మానందాన సంధాయి .మరో చోట మూలాధారం నుండి సహస్రారం దాకా చక్రాలను దాటి అమృతత్వ సంధాయినీ గా దర్శన మిస్తుంది .ఒక చోట బ్రహ్మ విష్ణు రుద్రాగ్రంధి విచ్చేదనం చేసి శివ శక్తుల అభేదాన్ని చూపించి మహా శక్తి రూపం గా ఉంటుంది .విశ్వం సమస్తానికి కర్త్రి ,ధాత్రి ,సంహాద్రి గా ఉంటుంది మన కన్నులలోనే ఉంది మనల్ని కాపాడుతుంది .ఆమెయే శివుడు ఆమె శక్తి ,ఆమెయే పురుషుడు ఆమె ఏ శక్తి  .ప్రక్రుతి ఆమె జీవుడూ ఆమె.ఆమెయే బ్రాహ్మ ఆమె పదార్ధ సహక్తుల సమ్మెలన రూపం

ఇది లలితా సహస్రమే అయినా ఆమె దివ్య విభూతి సందర్శనమే .మొదటి నామం శ్రీ మాత చివరిది లలితాంబిక మధ్యలో కామాక్షి ,బాలా ,భవానీ ,శాంకరీ ,శివకరీ,దుర్గా ,మహా దేవి ,ఆహా లక్ష్మి ,మహా త్రిపుర సుందరి ,పార్వతి ,నారాయణి ,కల్యాణి ,కాత్యాయని ,రామా ,ఉమా ,గౌరీ బ్రాహ్మి ,రాజరాజేశ్వరి ఆయత్రి ,సరస్వతి ,మహా కాలి ,చండికా ,అపర్ణా ,త్ర్యంబిక ,బ్రాహ్మణి ,వైష్ణవి ,శివా మొదలైన నామాలు వస్తాయి ఈ సహస్రం లో లలిత  పేరు ఒక్క సారే వస్తుందని గ్రహించాలి .ఏ రూపం ఎవరికి ఇష్టమో అది ఇందులో ఉంటుంది ‘’సహస్ర పరమా దేవి శతమూలా శాతాంకురా ‘’అన్ని సూక్తం ఇందు లో ఉంది .ఇందులో ఏ నామమూ రెండో సారి రాక పోవటం ప్రత్యేకత .నిర్మల మనసు ,నిశ్చల హృదయం ,స్తిర భావనా లతో ఈ నామాలు ఉచ్చరిస్తే అన్ని రహస్యాలు క్షణం లో అర్ధమవుతాయి .శ్రీ చక్రం లో అధిష్టాన దేవత శ్రీ మాత అక్షర ఆకృతి  లో దర్శన మిస్తుంది .ఒక చోట డకారం లో మరో చోట రకారం లో ,మరో చోట లకారం లో ,వేరే చోట కకారం లో మరో సారి సకారం లో దర్శన భాగ్యం కలిగిస్తుంది .మనలో ఉన్న ఆత్మ మన దేవత .అది ప్రపంచమంతా వ్యాపించి ఉండనే భావన ముఖ్యం ఇక్కడ లలిత అన్నారు అంటే ఆత్మకే మరో పేరు లలిత అని గుర్తించాలి

రేపటి నుంచి భండాసుర వధ లోని అంతరార్ధాన్ని తెలుసు కొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-13 ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -2

  1. SATYANARAYANA అంటున్నారు:

    CHALA CHALA BAGUNNADI. WITH MEANINGS TO DHANYAVADAMULU

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.