శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -4
‘’చక్ర రాజ రాదారూఢ సర్వాయుధ పరిస్మ్రుతా –గేయ చక్ర రధా రూఢా మంత్రిణీ పరి సేవితా ‘’
శ్రీ దేవి రధ చక్రాలు అన్నిటి కంటే పెద్దవి ఆ చక్రాల గొప్ప తనాన్ని వర్ణిస్తూ మంత్రిణుల రధ గేయ చక్రాలు కదులుతున్నాయి .ఈ గేయ గానం అమ్మ వారి రాగిణీస్వరాన్ని ముఖరితం చేసే సంగీత చక్రాలుగా ఉన్నాయి .ఈ గేయ చక్రాలు వాక్య రామణీ యకం గా ,మదురిమ లతో కూడి ఉన్నాయి ఇది దేవి తీజో రూప వర్ణనం .జ్ఞాన ,జ్ఞేయ ,జ్ఞాతలవివేకం అంతా ఈ భూమిక లో కనిపిస్తుంది .సత్ ,అసత్ ల మధ్య ఉండే తేడాను మంత్రిణీ మాత స్పస్టపరుస్తోంది అని భావం .అంటే మంత్రిణులగేయ చక్రాల సహకారం తో శ్రీ మాత శ్రీ చక్ర సాక్షాత్కారం సాధ్యమవుతుంది ..కాని గేయ చక్రం కూడా అందరికి అందేది కాదు .నిర్మల ,నిశ్చల మైన వాక్కున్న వారికే అది సుసంపన్నమవుతుంది .దీని తర్వాత కిరి చక్ర వర్ణన ఉంటుంది
‘’కిరి చక్ర రధా రూఢదండ నాధ పురస్క్రుతా –జ్వాలా మాలిని కాక్లిస్ట వహ్ని ప్రాకార మధ్యగా ‘’
చావు ,పుట్ట్టుక ల చక్ర భ్రమణం లో ఇరుక్కు పోయిన జీవితాలకు జరా మరణాలు లేని శాశ్వత లోకాన్ని అందించేఆచరణ రూపం లో ఉన్నది శ్రీ చక్రంమాత్రమె . ఆమె దండ నాదు రాలై కూర్చునేది కిరి చక్రం లోనే .’’కుర్వాన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ –శతం సమః ‘’అని ఈశోపనిషత్తు అంటుంది .అంటే మనిషి జీవిత కాలం లో విధ్యుక్త నిర్వహణ చేస్తూ నూరేళ్ళు ఆచరణ లో హాయిగా ఆనందం గా జీవిస్తాడని అర్ధం .ఇదే మానవుడి అమరత్వ రహస్యం అంది ఉపనిషత్ .దీని ఆధారం గా దండనాయకి కిరి చక్రం ధర్మ రాగం లో కర్మ గీతం విని పిస్తోందని భావం .కిరి చక్రం కర్మ చక్రమైతే ,గేయ చక్రం జ్ఞాన చక్రం గా అర్ధం చేసుకోవాలి .శ్రీ చక్రం అమ్మ వారి పరమ పావన భక్తీ భావనకు ప్రతినిధి అయిన కైవల్య చక్రం అని అర్ధమవుతుంది .మంత్రిణులు అమ్మ వారికి నాల్గు దిక్కులా కాపలా కాస్తూ ఉంటె ఆమె భక్తులను రక్షిస్తూ మార్గాన్ని శుభ్రం చేస్తూ ముందుకు సాగి పోతోంది .
శ్రీ మాత అగ్ని గుండం మధ్య ప్రతిష్టిత మై ఉంటుంది .ఆమెను అగ్ని ఏమీ చేయలేదు .అగ్ని సమాన పవిత్రురాలు, ఉజ్వల తేజస్‌కు రాలు .మనం బొట్టు పెట్టుకొనే చోట మూడో కన్ను ఉంటుందని అందరికి తెలిసిన విషయమే .అది జ్ఞాన, తేజస్సు ,జ్వాల లప్రతీక గా ఉంది లోపలే జ్వలిస్తూ ఉంటుంది .ఈ జ్వాల ఎవరిలో బాగా ఉజ్వలం గా ఉంటుందో వారు ఆ పరమేశ్వరి కి దగ్గర వారవుతారు .అంటే అమ్మ కృప వారి పై చాలా ఎక్కువన్న మాట .దేవీ కృప, మనలోని అంతర్జ్వాల ఒక దాని పై ఒకటి ఆధార పడి ఉంటాయి . దేవి కృప వల్ల మన జ్ఞాన జ్వాలజ్వలిస్తుంది .ఈ జ్ఞాన కాంతి వల్లే శ్రీ దేవి సాక్షాత్కారం లభిస్తుందని గ్రహించాలి .దీన్ని విశ్లేషణ చేసి చెప్పలేం .దైవ సంయోగం, ఇచ్చ మీద ఆధార పడి ఉంటుంది .ఆమె జ్వాలా వలయాల మధ్య ఉంటుంది కనుక ఆమె వద్దకు ఎవరు వెళ్ళ లేరు .ఆ పరం జ్యోతి సాక్షాత్కారం ఉంటె జ్వాలా వలయం లోకి ప్రవేశించే అధికార యోగ్యత లభిస్తుంది ఇది సాధన వల్లనే సాధ్యం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 8-10-13 ఉయ్యూరు