దసరాకి సరదాకి జీన్సూ నాన్సేన్సూ

    దసరాకి సరదాకి

జీన్సూ నాన్సేన్సూ

‘’అవతలి వాడంటే ఎలర్జీ ,కుళ్ళు .లోకం ప్రతిభను బతక నివ్వదు,ఏం ?నా అంత బాగా ఎవడైన కష్టపడి రాస్తాడా ,నాకు దీనికి నోబుల్ ప్రైజ్ వస్తుందంటే వేళాకోళం చేస్తారు వెర్రి నాయాళ్ళు ,అదేం పెద్ద గొప్పదా ,ఇచ్చిన వాళ్ళందరూ మహా గొప్ప రచయితలా కస్టపడి ఆరు నెలలు చెమటోడ్చి రాస్తే పట్టించుకొనే నాధుడే లేదు ‘’అంటూ ‘’అవును వాళ్ళిద్దరు ఇస్ట పడ్డారు సినిమా ‘’లో ఏం ఎస్.నారాయణ లాగా మా బామ్మర్ది బ్రహ్మ ‘’ఫైలాన్ పెను తుఫాను గాలిలా’’ వచ్చి కూర్చున్నాడు .ఆహా వీడేదో కలలో ఉన్నాడు కాసేపు గాలి తగ్గ నిద్దాం అని కామ్ గా మాట్లాడకుండా కూర్చుండి  పోయాను పేపర్ చదూ కొంటూ .పది నిమిషాలు మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది అదేదో నవలలో రచయిత్రి చెప్పినట్లు .అప్పటికి వాడు కుదుట పడ్డాడు ఇక లాభం లేడను కొన్నాడో ఏమో వాడే మాట్లాట్టం మొదలెట్టాడు .

‘’అది కాదు బావా !ఈ మధ్య నేను ఫ్రాయిడ్ మనస్తత్వ స్శాశాస్త్రాన్ని  ఔపోసన పట్టాను .తిరగేసి బోర్లేశాను .మనిషి ప్రవర్తనకు అనువంశ జీన్స్ కు ఉన్న సంబంధాన్ని స్టడీ చేసి పారేశా .నాకు తెలిసినదాన్ని ఈ నాటి సమాజం లో వ్యక్తుల ప్రవర్తనలకు అప్ప్లై చేసి వీళ్ళుఎందుకిలా  తలా తోకా లేకుండా ప్రవర్తిస్తున్నారా అని ఆర్నెల్లు కస్టపడి చిక్కి శల్యమై నా పరిశోధనా వ్యాసాన్ని తయారు చేశాను .ఇది చూస్తె నువ్వే ఒప్పుకొంటావ్ దీనికి సాహిత్యం లో నోబుల్ బహుమతి రావచ్చని .ఈ మాట ఎవరికి చెప్పినా నన్నో పురుగు కింద లేక్కేశారు నువ్వు చదివి ‘’ఓ.కే.’’చెబితే నోబుల్ వాళ్లకి పంపిస్తా .నా ప్రతిభ ఏమిటో నిరూపిస్తా .’’అన్నాడు ఆయాస పడుతూ .’’ఒరే !చది వేంత  తీరిక నా కెక్కడిది రా .నా రాత కోతలేవో నాకే సరి పోతున్నాయి .అయినా ఫర్లేదు అందులో ఉన్న సాలిఎంట్ పాయింట్లను కక్కు’’అన్నాను .వాడి ముఖం లో ఆనంద రేఖ తాండవించింది అదేదో నవలలో ఎవరో చెప్పినట్లు .’’ఇంతకూ ఏం రాశావ్ ?దేని మీద ?’’అడిగాను నేనే .’’ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇలా ఎందుకు ప్రవర్తించి ప్రజా సమస్యలను అర్ధం చేసుకోలేక పోతున్నారు ?/’’అని ఒక మౌలిక ప్రశ్న నా అంతట నేనే వేసుకొని దానికి నాకు దొరికిన సమాధానాలు రిసెర్చ్ లాగా రాశాను .’’సరేరా ఒక్కొక్క ముడీ విప్పు ‘’అని ఎంకరేజ్ చేశా .ఇక రెచ్చి పోయాడు బ్రాహ్మీ బామ్మర్ది

‘’ముందుగా కే.సి.ఆర్ .అందర్నీ ఎందుకు ‘’ముక్కు నేల కేసి రాస్తా ‘’అంటాడో దాని మీద రాశా ‘’అన్నాడు ‘’ఏం రాశావో చెప్పు ‘’అన్నా .’’చిన్నప్పుడు కే.సి.ఆర్ ఒక  వీధి బడిలో చదివే వాడని ,అక్కడ అతనికి స్నేహితులేవ్వరూ లేరని అందరు ఇతన్ని చీద రించుకొని ముక్కు నేలకేసి రాసే వారని అందుకే ముక్కు అంతగా వాచీ పోయిందని ,దాని వల్లే  చిన్నప్పటి ఆ బాధ మనసు లో ఉండి  పోయి సెలలేసి బాధిస్తోందని అందర్నీ ఇప్పుడు ముక్కు నేల కేసి రాయిస్తా అని అంటున్నాడని పాయింట్ లాగా ..నోబుల్ వస్తుందా బా /’’అన్నాడు .’’మరి ఆయన ఆంధ్రోల్లను చీదరిం చే దానికి కారణం ఏం రాశావు ‘’అడిగా .’’దానికీ లాగా .ఆయన బాబాయి  ఒకాయనవీళ్ళ నాన్నను మోసం చేసి ఆస్తి అంతా నా కేశాడట . అప్పటి నుంచి అందరూ అంతేననే భ్రమలో ఉండి పోయి చీద రించు కొంటున్నాడని రాశా ‘’అన్నాడు ‘’సరే .దీనికి ఎవిడెన్స్ ఉందా ?’’అడిగా .’’అదేం లేదు .సందర్భానికి తగిన ప్లాన్ చేసి రాశా .నోబుల్ గ్యారంటీనా బావా ?“’అని మళ్ళీ  కేక .నవ్వాలో ఏడవాలో తెలీక నవ్వి ఊరుకొన్నా మళ్ళీ ‘’చిదంబరం గురించీ రాశా‘’అన్నాడు ‘’వదులు అన్నా ‘’చిదంబరం క్లాస్ మేట్ ఒక తెలుగోడున్నాడు మద్రాస్ లో. వాడేప్పుడు ఈయన కంటే అన్నిట్లో ముందుండే వాడు .డి.ఏం.కే ప్రభుత్వం లో జయ లలిత పార్టీ ప్రభుత్వం లో కూడా హోమ్ మాంత్రి అ య్యాడు .ఇవన్నీ చిదంబరం కు ఈర్ష్య కల్గించాయి .అప్పటి నుండే ఆంధ్రా వాళ్ళు అంటే మండి పడతాడు .తన కంటే అతను తన రాష్ట్రం కంటే ఆంద్ర రాష్ట్రంఅన్నిటా ముందుందని పరాభవం దహించి ‘’ఇంటిలో ‘’చేరి చిచ్చు పెట్టాడు .’’ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ఇంత బాగా వాడుకొన్న వారెవరూ లేరు బావా వస్తుందా బావా నోబు ల్ ‘’అన్నాడు మళ్ళీ. ‘’ఫ్రాయిడ్ ఏమో కాని ‘’నీది ఫ్రాడ్ సిద్ధాంతం’’ అన్నాను కోపం తో

‘’అప్పుడే ఏమయింది బా  కోదండరాం ఎందుకు ప్రొఫెసర్ పదవి గాలికొదిలి ఉద్యమాల వెంట తిరుగు తున్నాడో కనీ పెట్టా’’అన్నాడు రోట్లో తల పెట్టి రోకలి పోటుకు వెరవడం దేనికని ‘’కానీ ‘’అన్నా ‘’’కోదండరాం యూని వర్సిటి లో చదివే రోజుల్లో ఒక ప్రొఫెసర్ ఏ రోజు క్లాస్ కు  రాకుండావిప్లవ ఉద్యమాల వెంట తిరిగే వాడట .పాపం ఈయనకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ అన్నీ స్వంతంగా చదివి తెలుసుకొని అత్తెసరు మార్కులతో గట్టేక్కాడ ట .అప్పటి నుంచి యూని వర్సిటి లోప్రొఫెసర్ ఉద్యోగం వస్తే చస్తే క్లాసుకెళ్ళి పాఠంచెప్పనని తనాకు ఆదర్శమైన ఆయన ప్రొఫెసర్ మీద పరోక్షం గా ఒట్టేసి హాయిగా జీతాలు తీసుకొంటూ ఉద్యమాలు నడుపు కొంటు తల తిక్కగా మాట్లాడుతూ ప్రొఫెసర్ అయినా గులాబీ పెద్దాయనకు ‘’నీ బాంచెన్ ‘’అంటూ కాల్మోక్కుతున్నాడు ‘’మరి ఇందులో ప్రూఫ్ ఉందా ‘’అడిగా ‘’ప్రూఫ్ ఎవరికి కావాలి బా . ఈ మధ్య పరిశోధనలన్నీ ఎత్తి పోతల పధకాలేగా వీటికి తీసి పోతుందా నా పరిశోధనా ?నోబుల్ గ్యారంటీ యేనా ?’’అని క్వేస్చిన్  రైజ్ చేసి నన్ను నిరుత్తరుడిని చేశాడు ..

‘’ సోనియా మనల్ని చీల్చటం వెనక ఏ కధ అల్లావ్ ?’’అడిగా నేనే ‘’అల్లటం, కధా  అంటూ’’లైట్ తీసుకొని పారేయ్యకు’’ బా .సోనియా ఇటలీ లో వాళ్ళ తాతగారింట్లో ఉన్నప్పుడు అక్కడ తెలుగు తెలిసిన మహా పండితుడోకాయన ఉండేవాడు ఆయన తెలుగు ను ఇటాలియన్ ఆఫ్ దిఈస్ట్ అనేవాడట తాత తో అది మండేది ఈమెకు అప్పటి నుండీ తెలుగు రాష్ట్రాన్ని ఎదక్కుండా చెయ్యాలనిశపథం తీసుకొందిట .అందుకే చంద్ర బాబు ముఖ్య మంత్రి అయి అన్ని రంగాల్లో అభి వృద్ధి చూపిస్తే ఏదో కుంటి  సాకు తో ఇక్కడి కొచ్చి మీటింగుల్లో విరుచుకు పడేది అదే రాజ శేఖరుడు సి.ఏ,అయినప్పుడు ఎన్ని అవినీతి ఆరోపణలోచ్చినా ,యెన్ని  ఉపద్రవాలు జరిగినా కన్నెత్తి చూడలేదు .ఇది పక్ష పాతం కాక మరేంటి బావా .ఈ ఏడు నోబుల్ ఖాయమేనా ‘’అన్నాడు ఆశ చావక  .’’దీనికి సాక్ష్యాధారాలు ‘’అడిగా మళ్ళీ ‘’ఊహించా .ఊహకు విలువ ఉందని ఎప్పుడూ నువ్వే అంటావుగా .ఇది అందమైన ఊహేగా తగినట్లే ఉందికదా నోబుల్ మాటేమిటి ?భేతాళ ప్రశ్న లా వదల్లేదు బ్రాహ్మీ .

‘’రాహుల్ నీ బయటికి లాగా .ఆయనవి వాళ్ల బాబాయి సంజయ్ బుద్ధులు వంశ పారం పర్యం గా సంక్రమించాయి .ఆయన యెంత మొండి వాడో’’ఎక్స్ట్రా గవర్నమెంట్ ఆక్టివిటీస్’’ యెట్లా చేశాడో  వాళ్ళ అమ్మ ఇందిరా కాలం లో అట్లానే’’ నాకుపదవి  వద్దు వద్దు’’ అంటూ ‘’అమీబా టెంటకిల్స్’’ లాగా అన్నిటిలో దూసుకెళ్ళుతున్నాడు .’’ప్రధానినే చెత్త బుట్ట లో కుక్కేసిన’’ గడుసు సంజయ స్వరూపం రాహుల్ ది  .’’అన్నాడు ‘’దీనికి వాలిడిటీ  ?’’అన్నాను ‘’.విషయం రాయటానికి వాలిడిటి అవసరం లేదు బావా మన రాజ కీయ నాయకులు మాట్లాడే చెత్తకంతటికి వాలిడిటి  ఉందా ?నోబుల్ పక్కా యేనా ?సూర్ ?లాక్ పెట్టనా ?’’అమితాబ్ రేంజ్ లో దబాయించాడు నన్ను .

ఇక లాభం లేదని ఇంతకీ నీకు నోబుల్ కావాలంటావ్ ?అన్నా ‘’కావా లి ఏంటి బా .రావాల్సిందే .నువ్వు ఊ అంటే రాక చస్తుందా .?’’వాడి ఆశకు అంతు లేదని పించింది .’ఇంకోటి విసురుతా ఇదే చివరిది .కేశవరావు ఎవరికీ  అర్ధం కాకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నాడ న్న దాని మీద కూపీ లాగా .ఆయన కు చిన్నప్పుడు పాఠంచెప్పిన .గురువు మాట్లాడుతుంటే ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదట .విద్యార్ధులంతా తననే ఆదర్శం గా తీసుకో వాలని ఆ గురు ఉవాచట అందుకే ఎవరికి అర్ధం కాకుండా చివరికి తను చెప్పేదేమిటో తనకే అర్ధం కాకుండా మాట్లాడి గురు ఋణం తీర్చుకొంటు న్నాడట .ఎలా ఉంది ఆర్గ్యుమెంటు .నోబుల్ నాదేనా ?/ఆశగా బామ్మర్ది బ్రహ్మం ఎన్నో సారో లెక్క లేకుండా అడిగాడు .ఇక ఉండలేక ‘’బామ్మర్దీ !బ్రహ్మం !ఈ ఏడు నోబుల్ బహుమతులివ్వటం పూర్తయి పోయింది వచ్చే ఏడాదికి ట్రైచెయ్యి ‘’అన్నాను తాపీగా ‘’భాలే ఓడివి బా! చావు కబురు చల్లగా చెప్పావు నాతో ఇంత వాగించి  నన్నో వెంగళ ప్ప ను చేశావ్ .అయినా వచ్చే ఏడాది మనదేగా నోబుల్? /అన్నాడు మళ్ళీ .ఇక లాభం లేదనుకొని నిర్వేదం గా ఇంట్లో కొచ్చి వాల్లక్కయ్యకు కనీ పించకుండా టిఫిన్ మెక్కి కాఫీ తాగకుండా నాకు ఆదా చేసి నెమ్మదిగా బాటసారి లో నాగేశ్వర లావు లా ద్రుష్టిఎక్కడో పెట్టి  నడుచు కొంటు నిష్క్రమించాడు బ్రాహ్మీ బామ్మర్ది

శ్రీ విజయ దశమి దసరా శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-13 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.