నెత్తురోడిన గాంధీ

మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలేమిటి? ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులెవ్వరు?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పుస్తకంలో మనకు లభ్యమవుతాయి. గాంధీ జీవితంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
“డర్బన్ సహజసిద్ధమైన నౌకాశ్రయం. అయితే అన్ని నౌకలను డర్బన్ నౌకాశ్రయంలోనికి రానిచ్చేవారు కారు. అంతే కాకుండా తెల్లవారికి మాత్రమే ఈ నౌకాశ్రయంలోకి ప్రవేశముండేది. భారతీయులను, నల్లవారిని ఈ నౌకాశ్రయంలో దిగనిచ్చేవారు కాదు. దీనిపై దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. దాంతో 1897, జనవరి 12వ తేదీన దక్షిణాఫ్రికా అధికారులు భారత్ నుంచి వచ్చే నౌకలను కూడా డర్బన్ నౌకాశ్రయంలోకి అనుమతిస్తామని.. భారతీయులు నౌకాశ్రయంలో దిగవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్లజాతివారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 13వ తేదీన దాదాపు ఐదు వేల మంది తెల్లజాతీయులు, 500 మంది నల్లజాతీయులు- భారతీయులకు అనుమతి ఇవ్వటానికి వ్యతిరేకంగా డర్బన్‌లో ఒక పెద్ద ప్రదర్శన జరిపారు. భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కర్రలు తిప్పుతూ డర్బన్‌లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.
ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నేటల్ (దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రం) అటార్నీ జనరల్ హారీ ఎస్కోంబ్ ప్రదర్శనకారుల దగ్గరకు వచ్చాడు. “భారత్ నుంచి వచ్చిన రెండు నౌకలలో అమాయకులైన ప్రజలు ఉన్నారు. నేటల్లో ఉన్న పరిస్థితివారికి తెలియదు. అలాంటి వారిపై ఆగ్రహం ప్రదర్శించటం సరికాదు. నేటల్ ఎప్పటికీ తెల్లవారిదే. వీలైనంత త్వరగా పార్లమెంట్‌ను సమావేశపరిచి ఈ మేరకు తగిన చట్టాలను చేస్తాం..” అంటూ ప్రదర్శనకారుల ఆగ్రహాన్ని చల్లార్చటానికి ప్రయత్నించాడు. ఎస్కోంబ్ ప్రయత్నం చాలా వరకూ ఫలించింది. ఆందోళనకారుల ఆవేశం తగ్గింది. వారు వెనక్కి తిరిగి వెళ్లిపోవటం మొదలుపెట్టారు..
13వ తేదీన భారత్ నుంచి ‘నదేరి’, ‘కోర్‌ల్యాండ్’ అనే రెండు నౌకలు డర్బన్‌కు వచ్చాయి. నదేరిలో గాంధీ, ఆయన కుటుంబం కూడా ఉంది. గాంధీ వస్తున్నారని తెలిసి ఆయన స్నేహితుడు, సహ న్యాయవాది లాఫ్టన్ నౌక దగ్గరకు వచ్చాడు. బయట ఉన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించాడు. దీనితో గాంధీ తన కుటుంబ సభ్యులను ముందుగా తీరానికి పంపేశాడు. తాను నౌకలోనే ఉండిపోయాడు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..చీకటి పడేదాకా డర్బన్‌కు రావద్దని, గాంధీకి అటార్నీ జనరల్ ఎస్కోంబ్ కబురు పంపాడు. అయితే లాఫ్టన్కు ఈ సలహా నచ్చలేదు. దొంగతనంగా గాంధీ డర్బన్‌కు రావటం లాఫ్టన్కు ఇష్టం లేదు. పైగా ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారని.. అటువంటప్పుడు గాంధీ బయటకు వచ్చినా ప్రమాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. దీనితో వారిద్దరూ డర్బన్‌కు బయలుదేరారు.
గాంధీ, లాఫ్టన్ల బోటు మధ్యాహ్నం డర్బన్ పోర్టుకు చేరుకుంది. బోటు తీరానికి చేరుకోగానే అక్కడే తిరుగుతున్న కొందరు తెల్లజాతీయులు గాంధీని చూశారు. గాంధీ వచ్చాడని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీనితో ప్రదర్శనకారులు మళ్లీ డర్బన్ పోర్టు దగ్గరకు చేరుకున్నారు. గాంధీ, లాఫ్‌టన్‌లు ఒక రిక్షాను పిలిచి దానిలోకి ఎక్కబోయే సమయానికి, ప్రదర్శనకారులు వారిని అడ్డుకున్నారు. ఆ రిక్షాను వదిలేసి మరొక రిక్షా ఎక్కబోయారు. దానిని కూడా అడ్డుకోవటంతో- తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ, లాఫ్‌టన్‌లు తమ వద్ద ఉన్న లగేజీని పట్టుకొని నడవటం మొదలుపెట్టారు. వారిని ప్రదర్శనకారులు వెంబడించటం మొదలుపెట్టారు. వారు షిప్ హోటల్ దగ్గరకు చేరుకొనేసరికి- వందల మంది ప్రదర్శనకారులు వారిని చుట్టుముట్టారు. కొందరు గాంధీ మీద కుళ్లిపోయిన చేపలు విసిరితే, మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొరడాతో గాంధీని గట్టిగా కొట్టాడు. అయినా గాంధీ పారిపోలేదు. పత్రికల్లో ప్రచురితమైన ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం- గాంధీ రక్తం ఓడుతూ అక్కడే నిలబడ్డాడు. గాంధీ మీద దాడి జరుగుతోందనే విషయాన్ని కొందరు భారతీయులు పోలీసు సూపరింటెండెంట్ ఆర్. సి. అలెగ్జాండర్ సతీమణి జేన్‌కు తెలియజేశారు. వెంటనే జేన్ కొందరు పోలీసులతో ఆ ప్రాంతానికి చేరుకుంది. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టి గాంధీని ఫీల్డ్స్ట్రీట్లో ఉన్న పార్శీ రుస్తుంజీ స్టోర్‌కు తీసుకువెళ్లారు.
ఈ విషయం తెలిసి అలెగ్జాండర్ పోలీసు బలగాలతో రుస్తుంజీ స్టోర్‌కు చేరుకున్నాడు. ఇంతలో నౌకాశ్రయం దగ్గర జరిగిన సంఘటన తెలుసుకున్న మరికొందరు- ఈ స్టోర్ దగ్గరకు కూడా వచ్చి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. “గాంధీని యాపిల్ చెట్టుకు ఉరితీస్తాం” అని పాటలు పాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అలెగ్జాండర్ గమనించారు. స్టోర్ లోపలికి వెళ్లి గాంధీని ప్యూన్ బట్టలు వేసుకొమ్మన్నాడు. మొహాన్ని మఫ్లర్‌తో కప్పేసాడు. కళ్ల చుట్టూ నల్లరంగు పూసి- స్టోర్ పక్కనే ఉన్న గోడౌన్ నుంచి బయటికి పంపేశాడు. గాంధీని పంపేసిన తర్వాత అలెగ్జాండర్ బయటకు వచ్చి గాంధీ స్టోర్‌లో లేడని ప్రకటించాడు. కావాలంటే ఒక బృందం వచ్చి గాంధీ ఉన్నాడా లేడా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చన్నాడు. దీనితో ప్రదర్శనకారుల నుంచి ముగ్గురు ముందుకు వచ్చి స్టోర్‌లోపలికి వెళ్లి గాంధీ లేడని నిర్ధారించుకున్నారు. ఈ లోపులో వాన పడటం మొదలయింది. ఒక వైపు చీకటిలో ఏమీ కనబడకపోవటం, మరో వైపు వాన పడటంతో ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారు..
ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత తన ప్రాణాలను కాపాడిన అలెగ్జాండర్ దంపతులకు కృతజ్ఞతలు చెబుతూ గాంధీ ఒక లేఖ రాశాడు. ఒక బహుమతి కూడా పంపాడు. దానికి అలెగ్జాండర్ దంపతులు- “మా దేశవాసులు మీపై చేసిన దాడికి సిగ్గుపడుతున్నాం. మీరు పంపిన బహుమతిని తిప్పి పంపాలనుకున్నాం. కాని బహుమతిని తిప్పిపంపటం మిమ్మల్ని మరింతగా అవమానించినట్లు అవుతుందని భావించాం..నా వద్ద ఎక్కువ మంది సిబ్బంది లేరు. అందువల్ల మిమ్మల్ని మారువేషంలో బయటకు పంపాల్సి వచ్చింది. ఇది మీ హోదాకు తగిన విషయం కాదని మాకు తెలుసు..” అని సమాధానమిచ్చారు….
ఈ సంఘటన జరగటానికి మూడేళ్ల క్రితం పీటర్‌మార్టిజ్‌బర్గ్ రైల్వే స్టేషన్లో గాంధీని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి గార్డు బయటకు తోసేశాడు. గాంధీ దక్షిణాఫ్రికా అనుభవం అనగానే చాలా మందికి ఈ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఈ సంఘటనను 1951లో లూయిస్ ఫిషర్ రాసిన “ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ” అనే పుస్తకంలో అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత రిచర్డ్ అటెన్‌బరో- గాంధీ సినిమాలో దీనిని అత్యంత ప్రధానమైన సంఘటనగా చూపించాడు. ఈ చిత్రం 1948లో గాంధీ హత్యతో ప్రారంభమవుతుంది. వెంటనే 1893లో గాంధీని రైలు నుంచి బయటకు నెట్టేసే సంఘటనకు వెళ్తుంది. దక్షిణాఫ్రికాలో ఆయనకు జరిగిన చేదుఅనుభవాలలో అది మొదటిదైనప్పటికీ ఆయన జీవితంలో డర్బన్ సంఘటన అంతకంటే ముఖ్యమైనదని చెప్పాలి. రైలు నుంచి గాంధీని నెట్టివేసినప్పుడు- ఆయనకు దెబ్బలు తగలలేదు. తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ డర్బన్ సంఘటనలో మాత్రం గాంధీ తెల్లవారి జాత్యహంకారం ఎలా ఉంటుందో రుచి చూశాడు. దక్షిణాఫ్రికాలో జాత్యంహంకార రాజకీయాలు ఎలా ఉంటాయో గాంధీకి ప్రత్యక్షంగా తెలిసింది అప్పుడే.
– See more at: http://ec2-54-200-67-22.us-west-2.compute.amazonaws.com/node/11265#sthas…
మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలేమిటి? ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులెవ్వరు?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పుస్తకంలో మనకు లభ్యమవుతాయి. గాంధీ జీవితంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
“డర్బన్ సహజసిద్ధమైన నౌకాశ్రయం. అయితే అన్ని నౌకలను డర్బన్ నౌకాశ్రయంలోనికి రానిచ్చేవారు కారు. అంతే కాకుండా తెల్లవారికి మాత్రమే ఈ నౌకాశ్రయంలోకి ప్రవేశముండేది. భారతీయులను, నల్లవారిని ఈ నౌకాశ్రయంలో దిగనిచ్చేవారు కాదు. దీనిపై దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. దాంతో 1897, జనవరి 12వ తేదీన దక్షిణాఫ్రికా అధికారులు భారత్ నుంచి వచ్చే నౌకలను కూడా డర్బన్ నౌకాశ్రయంలోకి అనుమతిస్తామని.. భారతీయులు నౌకాశ్రయంలో దిగవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్లజాతివారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 13వ తేదీన దాదాపు ఐదు వేల మంది తెల్లజాతీయులు, 500 మంది నల్లజాతీయులు- భారతీయులకు అనుమతి ఇవ్వటానికి వ్యతిరేకంగా డర్బన్‌లో ఒక పెద్ద ప్రదర్శన జరిపారు. భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కర్రలు తిప్పుతూ డర్బన్‌లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నేటల్ (దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రం) అటార్నీ జనరల్ హారీ ఎస్కోంబ్ ప్రదర్శనకారుల దగ్గరకు వచ్చాడు. “భారత్ నుంచి వచ్చిన రెండు నౌకలలో అమాయకులైన ప్రజలు ఉన్నారు. నేటల్లో ఉన్న పరిస్థితివారికి తెలియదు. అలాంటి వారిపై ఆగ్రహం ప్రదర్శించటం సరికాదు. నేటల్ ఎప్పటికీ తెల్లవారిదే. వీలైనంత త్వరగా పార్లమెంట్‌ను సమావేశపరిచి ఈ మేరకు తగిన చట్టాలను చేస్తాం..” అంటూ ప్రదర్శనకారుల ఆగ్రహాన్ని చల్లార్చటానికి ప్రయత్నించాడు. ఎస్కోంబ్ ప్రయత్నం చాలా వరకూ ఫలించింది. ఆందోళనకారుల ఆవేశం తగ్గింది. వారు వెనక్కి తిరిగి వెళ్లిపోవటం మొదలుపెట్టారు..
13వ తేదీన భారత్ నుంచి ‘నదేరి’, ‘కోర్‌ల్యాండ్’ అనే రెండు నౌకలు డర్బన్‌కు వచ్చాయి. నదేరిలో గాంధీ, ఆయన కుటుంబం కూడా ఉంది. గాంధీ వస్తున్నారని తెలిసి ఆయన స్నేహితుడు, సహ న్యాయవాది లాఫ్టన్ నౌక దగ్గరకు వచ్చాడు. బయట ఉన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించాడు. దీనితో గాంధీ తన కుటుంబ సభ్యులను ముందుగా తీరానికి పంపేశాడు. తాను నౌకలోనే ఉండిపోయాడు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..చీకటి పడేదాకా డర్బన్‌కు రావద్దని, గాంధీకి అటార్నీ జనరల్ ఎస్కోంబ్ కబురు పంపాడు. అయితే లాఫ్టన్కు ఈ సలహా నచ్చలేదు. దొంగతనంగా గాంధీ డర్బన్‌కు రావటం లాఫ్టన్కు ఇష్టం లేదు. పైగా ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారని.. అటువంటప్పుడు గాంధీ బయటకు వచ్చినా ప్రమాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. దీనితో వారిద్దరూ డర్బన్‌కు బయలుదేరారు.
గాంధీ, లాఫ్టన్ల బోటు మధ్యాహ్నం డర్బన్ పోర్టుకు చేరుకుంది. బోటు తీరానికి చేరుకోగానే అక్కడే తిరుగుతున్న కొందరు తెల్లజాతీయులు గాంధీని చూశారు. గాంధీ వచ్చాడని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీనితో ప్రదర్శనకారులు మళ్లీ డర్బన్ పోర్టు దగ్గరకు చేరుకున్నారు. గాంధీ, లాఫ్‌టన్‌లు ఒక రిక్షాను పిలిచి దానిలోకి ఎక్కబోయే సమయానికి, ప్రదర్శనకారులు వారిని అడ్డుకున్నారు. ఆ రిక్షాను వదిలేసి మరొక రిక్షా ఎక్కబోయారు. దానిని కూడా అడ్డుకోవటంతో- తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ, లాఫ్‌టన్‌లు తమ వద్ద ఉన్న లగేజీని పట్టుకొని నడవటం మొదలుపెట్టారు. వారిని ప్రదర్శనకారులు వెంబడించటం మొదలుపెట్టారు. వారు షిప్ హోటల్ దగ్గరకు చేరుకొనేసరికి- వందల మంది ప్రదర్శనకారులు వారిని చుట్టుముట్టారు. కొందరు గాంధీ మీద కుళ్లిపోయిన చేపలు విసిరితే, మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొరడాతో గాంధీని గట్టిగా కొట్టాడు. అయినా గాంధీ పారిపోలేదు. పత్రికల్లో ప్రచురితమైన ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం- గాంధీ రక్తం ఓడుతూ అక్కడే నిలబడ్డాడు.
గాంధీ మీద దాడి జరుగుతోందనే విషయాన్ని కొందరు భారతీయులు పోలీసు సూపరింటెండెంట్ ఆర్. సి. అలెగ్జాండర్ సతీమణి జేన్‌కు తెలియజేశారు. వెంటనే జేన్ కొందరు పోలీసులతో ఆ ప్రాంతానికి చేరుకుంది. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టి గాంధీని ఫీల్డ్స్ట్రీట్లో ఉన్న పార్శీ రుస్తుంజీ స్టోర్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసి అలెగ్జాండర్ పోలీసు బలగాలతో రుస్తుంజీ స్టోర్‌కు చేరుకున్నాడు. ఇంతలో నౌకాశ్రయం దగ్గర జరిగిన సంఘటన తెలుసుకున్న మరికొందరు- ఈ స్టోర్ దగ్గరకు కూడా వచ్చి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. “గాంధీని యాపిల్ చెట్టుకు ఉరితీస్తాం” అని పాటలు పాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అలెగ్జాండర్ గమనించారు. స్టోర్ లోపలికి వెళ్లి గాంధీని ప్యూన్ బట్టలు వేసుకొమ్మన్నాడు. మొహాన్ని మఫ్లర్‌తో కప్పేసాడు. కళ్ల చుట్టూ నల్లరంగు పూసి- స్టోర్ పక్కనే ఉన్న గోడౌన్ నుంచి బయటికి పంపేశాడు. గాంధీని పంపేసిన తర్వాత అలెగ్జాండర్ బయటకు వచ్చి గాంధీ స్టోర్‌లో లేడని ప్రకటించాడు. కావాలంటే ఒక బృందం వచ్చి గాంధీ ఉన్నాడా లేడా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చన్నాడు. దీనితో ప్రదర్శనకారుల నుంచి ముగ్గురు ముందుకు వచ్చి స్టోర్‌లోపలికి వెళ్లి గాంధీ లేడని నిర్ధారించుకున్నారు. ఈ లోపులో వాన పడటం మొదలయింది. ఒక వైపు చీకటిలో ఏమీ కనబడకపోవటం, మరో వైపు వాన పడటంతో ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారు..